Author Topic: జూ. ఎన్టీఆర్ కారుకు ఇంకా తొలగించని సన్ ఫిల్మ్  (Read 442 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
ఈ ఫోటోను చూడగానే మనకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'బాద్‌షా' సినిమానే గుర్తుకు వస్తుంది. వినూత్న హెయిర్ స్టయిల్, సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో మన 'సింహాద్రి' తన కొత్త చిత్రంలో ప్రేక్షకులను అలరించనున్నాడని తెలుస్తోంది. సరే.. ఇదంతా అటుంచి ఈ ఫోటోలో ఉన్న 'యమ దొంగ'ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఏమైనా తేడాగా అనిపిస్తోందా..?

సరే.. నేరుగా విషయానికి వచ్చేద్దాం..! ఈ ఫోటోలో ఉన్న మన హీరో వెనుక కారును గమనించండి. ఈ కారుకు ఇంకా 'టింటెడ్ గ్లాస్' తొలగించలేదు చూశారా..? రోడ్డుపై సంచరించే అన్ని నాలుగు చక్రాల వాహనాలకు సన్ ఫిల్ములు (కార్ల అద్దాలపై ఉపయోగించే నల్లటి ప్లాస్టిక్ కాగితం) వాడకంపై దేశపు అత్యున్నత న్యాయస్థానం గడచిన మే నెల నుంచి నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.

ఈ నిబంధను ఎవరైనా ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు మొదటి రెండు తప్పులకు జరిమానాను విధిస్తారు. మూడవసారి కూడా ఇదే తప్పుకు పాల్పడినట్లయితే, డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాల్సిందిగా సంబంధిత ఆర్టీఏకు వారు సిఫారసు చేస్తారు. సన్ ఫిల్ముల వాడకంపై నిషేధం అమలు అందరికీ వర్తిస్తుంది (సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ), ఇందుకు ఎవ్వరూ అతీతులు కాదు.

అయితే, సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్‌లో తమ ముఖాలను బయట పెట్టడానికి పెద్దగా ఇష్టపడరు. అభిమానులు గుంపుగా చేరి ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలు అంటూ వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు కాబట్టి సెలబ్రిటీలు తప్పనిసరై తమ వాహనాలకు టింటెడ్ గ్లాస్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ, మోటార్ వాహన చట్టంలో తాజాగా చేసిన సవరణ ప్రకారం, ఈ నిబంధను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

అయితే, ఇందుకు ఓ పరిష్కారం ఉంది. సెలబ్రిటీలు తమ కార్లకు టింటెడ్ గ్లాస్‌లను ఉపయోగించడానికి బదులు రోలింగ్ సన్ స్క్రీన్స్ (షట్టర్స్ మాదిరిగా పనిచేసే నల్లటి కర్టెన్లు)ను వాడుకోవచ్చు. మరి ఇలా అనేక మంది సెలబ్రిటీల వాహనాలు టింటెడ్ గ్లాస్‌లతో రోడ్లపై తిరుగుతుంటే మన ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

దుండగులు వాహనాలకు నల్లటి ఫిల్ములు కలిగిన అద్దాలను ఉపయోగించి తద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ముల ఉపయోన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, వాహనాల అద్దాలకు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా ఆన్‌-ది-స్పాట్‌లోనే సన్‌ఫిల్మ్‌లను తొలగించడం జరుగుతుంది.

"మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి". సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 213 Views Last post October 19, 2014, 09:37:11 AM
by siva
2 Replies 81 Views Last post May 24, 2016, 11:38:16 AM
by MbcMen