Author Topic: రూ. 10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న రామ్ చరణ్?  (Read 394 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,670
హైదరాబాద్: మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా నిర్మాత అశ్వినీదత్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అశ్వినీదత్ రామ్ చరణ్‌కు ఫుల్ పేమెంట్ రూ. 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఏదో ఒక సినిమా తన బేనర్లో చేయాలనే కమిట్‌మెంటు తోనే ఈ మొత్తం ముట్టజెప్పినట్లు సమాచారం.
అశ్వినీదత్ గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. అతని చివరి చిత్రం ‘శక్తి' భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మళ్లీ హిట్ చిత్రాలతో తన ఎంట్రీని చాటు కోవాలని చూస్తున్నాడు ఈ భారీ నిర్మాత. ఇందులో కొన్ని చిత్రాలకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు శ్రీను వైట్లకు రూ. 5 కోట్ల అడ్వాన్స్ అందినట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించనున్నారు.
మరో వైపు కొన్ని రోజుల క్రితమే అశ్వినీదత్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్లు వెల్లడించారు. రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని అంటున్నా ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం అశ్వినీదత్ తన వై జయంతి మూవీస్ బేనర్‌పై రవితేజ హీరోగా ‘సార్ వస్తారా' చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు మహేష్, క్రిష్ కాంబినేషన్లో కూడా అశ్వినీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు.

Offline haribabu015

  • Mega Member
  • *******
  • Posts: 11,625

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 280 Views Last post September 19, 2014, 11:41:09 PM
by siva
4 Replies 597 Views Last post October 26, 2014, 07:41:20 AM
by siva
0 Replies 247 Views Last post October 24, 2014, 11:11:05 PM
by siva
2 Replies 306 Views Last post November 26, 2014, 11:21:52 AM
by charan fan
12 Replies 831 Views Last post March 16, 2015, 12:18:25 PM
by charan fan