Author Topic: దేశానికి వేకప్ కాల్ వచ్చేసింది...ఇదే రైట్ టైమ్! - నాగార్జున  (Read 504 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
పడ్డాక లేపేవాడు సామాన్యుడు.
పడబోతున్న సంగతిని కనిపెట్టి హెచ్చరించేవాడు దార్శనికుడు.
నాగార్జునలో ఈ దార్శనికత ఉందనిపిస్తోంది.
ఇండియా ఈజ్ షైనింగ్... అని ఎవరో అన్నారు.
కానీ- నాగార్జున మాత్రం ఇది అగాధంలోకి జారిపోతున్న దేశం అంటున్నారు.
ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు అని కూడా అంటున్నారు.
మన ఇంటి బూజును మనమే దులుపుకోవాలి.
మన ముంగిలిని మనమే సాఫు చేయాలి. మన దేశంలో ఉన్న పాముల్ని మనమే సంచిలో పట్టి దూరంగా విసిరేయాలి.
ఈ చైతన్యం పాస్ కావడం గురించే నాగార్జున మాట్లాడుతున్నారు.
బుర్ర పెట్టాల్సిన సమయం ఇది. మరోవైపు చూడాల్సిన సమయం.
నాగార్జునతో కలిసి అటువైపు నడవాల్సిన సమయం.ఎప్పుడూ హుషారుగా కనిపిస్తారు... ఇవాళేంటి... డల్‌గా కనిపిస్తున్నారు?
నాగ్: హెవీ ఫీవర్. అందుకే ‘లవ్‌స్టోరీ’ షూటింగ్ ఉంటే క్యాన్సిల్ చేయించా.

హాస్పిటల్‌కు వెళ్లారా?
నాగ్: దేనికీ? జ్వరానికీ జలుబుక్కూడా హాస్పిటల్‌కు వెళ్ళాలా? మీకో విషయం తెలుసా? నేనసలు ట్యాబ్లెట్సే వాడను.

అవునా? మరి జ్వరమెలా తగ్గుతుంది?
నాగ్: దానికో చిట్కా ఉంది.

మాక్కూడా చెప్పొచ్చుగా?
నాగ్(నవ్వేస్తూ) జ్వరం వస్తే నేను ఫుడ్ తినను. ఓన్లీ ఫ్రూట్స్, అంతే. ఈ టేబుల్ మీద బౌల్స్ అన్నింట్లో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిని తిని బాడీకి రెస్ట్ ఇస్తే చాలు, తగ్గిపోతుంది. (తను తింటూ) మీరూ తీస్కోండి.

ఆశ్చర్యంగా ఉంది... ఫ్రూట్స్ తింటే జ్వరం మాయమైపోతుందా?
నాగ్: మిగతావాళ్ల సంగతి తెలీదు. నాకైతే ఫ్రూట్సే గొప్ప మెడిసిన్. అందుకే వేరే మెడిసిన్లు వాడను. ఫ్రూట్స్‌లో మన శరీరానిక్కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయ్. మన శరీరంలో ఏదైనా మినరల్ తక్కువైతే మనకే ఫలానా ఫ్రూట్ తినాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మన ఇంట్లో పెరిగే పెట్స్ చూడండి. అప్పుడప్పుడూ గోడలకున్న సున్నాన్ని నాకుతుంటాయి. వాటికప్పుడు కాల్షియమ్ కావాల్సొచ్చిందన్నమాట.

ఓకే. కానీ టాబ్లెట్ల కంటే ఫ్రూట్సే కాస్ట్‌లీ అయిపోయాయి కదా. అందుకే జనం టాబ్లెట్లు వాడుతున్నట్టున్నారు... ఒక ఆపిల్ ఖరీదు ముప్పయ్ రూపాయలు...
నాగ్: ఇది మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. రేటు పక్కన పెట్టండి. ఫస్ట్ గ్రేడ్ ఆహారం మనకు అందుతోందంటారా? మంచి మామిడిపండ్లు బయటకెళ్లిపోతాయి. మనం నాసివి తినాలి. మంచి రొయ్యలు ఎక్కడికో వెళ్లిపోతాయి. మనం పిచ్చివి తినాలి. ఏ దేశ వనరులైనా ముందు ఆ దేశ ప్రజలకు అందాలి. ఆ తర్వాతే ఇతరులకు. ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ అంటుంటారు. ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ తినే హక్కు మనకు లేదా? ఒకప్పుడు హైద్రాబాద్ అరటిపండ్లకు ఫేమస్. చాలా తియ్యటి మంచి అరటిపండ్లు దొరికేవి. డాట్స్‌తో...

చుక్క అరటిపండ్లా...
నాగ్: ఎస్... చుక్క అరటిపండ్లు. ఇప్పుడవి కనిపించడం లేదు. అవనే ఏముంది... మనం ఇప్పుడు తింటున్న చాలా పండ్లు తమ నేచురల్ టేస్ట్‌ను ఎప్పుడో పోగొట్టుకున్నాయి. జనాభా పెరిగిందని అవైలబిలిటీ పెంచారు. కానీ టేస్ట్‌ని నాశనం చేశారు. ద్రాక్ష కూడా... ఇప్పుడు హైద్రాబాద్‌లో ద్రాక్ష ఎంత పండుతోందో మనందరికీ తెలుసు.

ఒక పౌరుడిగా మన దేశం, మన రాష్ట్రం, మన ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నారు?
నాగ్: ఈ రెండేళ్లలో కొన్ని ఎదురుదెబ్బలు మినహా మన దేశం కొన్ని రంగాల్లో శక్తిమంతంగా తయారైంది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. అయితే ఇంకా కరెంట్ కష్టాలు, నీళ్ల కష్టాలు, ముఖ్యంగా చాలామందికి టాయిలెట్స్ కూడా లేని దుస్థితి చూస్తుంటే ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంది. పిల్లల్ని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే స్కూల్స్‌లో టాయిలెట్స్ కరువవ్వడం చాలా బ్యాడ్. లగ్జరీస్ లేకపోయినా పర్లేదుకానీ, బేసిక్ కంఫర్ట్ ఉండాలి కదా. మనవాళ్లకి ఫ్యూచర్‌విజన్ లేదు. ఎవరికి వాళ్లు షార్ట్‌టర్మ్ ప్లానింగ్సే కానీ లాంగ్‌టర్మ్ గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. మనదేశంలో ఉన్నన్ని నదులు ఇంకెక్కడా లేవు. ఆ నదులన్నింటినీ అనుసంధానం చేసుకుని ఉంటే ఈ నీళ్ల కష్టాలు, కరువులు, సముద్రంలోకి నీళ్లు వృథాగా కలిసిపోవడాలు ఉండవు. వర్తమాన భారతదేశమైనా, భవిష్యత్ భారతదేశమైనా ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది రోటీ కప్‌డా అవుర్ మకాన్ మీద. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అందరికీ అవి దక్కకపోవడం ఏమిటో అర్థం కావడంలేదు. ఆ మూడూ సక్రమంగా అందరికీ లభిస్తే మన దేశం ఎక్కడికో వెళ్లిపోతుంది. కుటుంబంలో ఒక్కరైనా బాగా చదువుకుంటే చాలా సమస్యలు తొలగిపోతాయి. ఆ విద్యలో కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు కనబడ్డం లేదు. ఇండియాకు వేకప్ కాల్ వచ్చేసింది. ఇప్పుడు కనుక మారకపోతే మనదేశం కూడా ఆఫ్రికా దేశాల స్థాయికి దిగజారిపోతుంది. అలాగే కొంచెం బుర్రున్న వాళ్లంతా ఉపాధి, గుర్తింపు వెతుక్కుంటూ వేరే చోటకు వెళ్లిపోతారు. అది ఇంతకుముందు జరిగింది. ప్రస్తుతం జరుగుతోంది.

అవినీతి కూడా మన వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది కదా...
నాగ్: అవినీతి అనేది మన సమాజంలో, మన జీవితంలో ఒక భాగమైనందుకు చాలా సిగ్గుపడుతున్నా. అవినీతి ఇప్పుడు కొండ చిలువ కాదు. పెద్ద అనకొండ. దాని మూలాలెక్కడున్నాయో కూడా కనుక్కోలేనంతగా తయారైంది. ఎవరికి వాళ్లలో మార్పు రావాలి. అమెరికాలో కూడా అవినీతి ఉంది కానీ, అది కొంతవరకే. మనకు మాత్రం పొరలు పొరలుగా కిందిస్థాయి వరకూ అల్లుకుపోయింది. అన్నిచోట్లా లంచం విశ్వరూపం కనబడు తోంది. ప్రైవేట్ సెక్టార్స్‌లోనూ అవినీతే. చివరకు మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అవినీతి ఉంది. అలాగని నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు. ప్రతి పౌరుడు దీనికి శిక్ష అనుభవిస్తున్నాడు.

అందరిలోనూ మీలాంటి ఫీలింగ్సే ఉన్నట్టున్నాయి... వాటిని చానలైజ్ చేసే శక్తి కావాలి...
నాగ్: అలా చానలైజ్ చేయగలిగేవాళ్లు కూడా మనకున్నారు. కానీ మన సంగతి ఏమిటంటే ఒకరు ముందుకు వస్తే వందమంది వెనక్కు లాగుతారు. అన్నా హజారే టీమ్‌లో స్పర్థలు చూశాం కదా. ఐ థింక్... మన పొలిటీషియన్లు మరీ దుర్మార్గులు కారు. జనం కోసం జెన్యూన్‌గా పని చేద్దాం అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. సిస్టమ్ సపోర్ట్ చేస్తే వాళ్లు చాలా పనులు చేయగలరు. కానీ లీడర్ అనుకుంటే బ్యూరోక్రాట్లు అడ్డం... బ్యూరోక్రాట్లు అనుకుంటే ఇంకేవో రూల్స్ అడ్డం.... మతాలు కులాలు ఓట్ల లెక్కలు... వీటిల్లోనే తెల్లారిపోతున్నట్టుంది.

ఈ గంభీరమైన విషయాలలో దిగితే లోతు తెలియదు. కొంచెం తేలిక ప్రశ్నల్లోకి వెళదాం. మీ డైలీ రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది?
నాగ్: ఉదయం 6 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర లేస్తా. బాగా దూరంగా షూటింగ్ ఉంటే 5 గంటలకు లేస్తా. కాలకృత్యాలు పూర్తయ్యాక ఒక గంట జిమ్ చేస్తా.

ఈ మధ్య అందరూ యోగా చేస్తున్నారు. మీరు చేయడం లేదా?
నాగ్: యోగాలో కొన్ని ఆసనాల వరకూ వేస్తా. యోగా అనేది ఓ పెద్ద సైన్స్. ఫుల్ యోగా అయితే చాలా అంకితభావంతో చేయాలి కానీ, అల్లాటప్పాగా కాదు. ఫుడ్ విషయంలోనూ, టైమ్ విషయంలోనూ చాలా క్రమశిక్షణగా ఉండాలి.

మీ బ్రేక్‌ఫాస్ట్ డిటైల్స్ చెప్పండి?
నాగ్: నాకు రెండు బ్రేక్‌ఫాస్ట్‌లుంటాయి. జిమ్ నుంచి రాగానే బాగా ఆకలి వేస్తుంది. అందుకే ఎగ్‌వైట్స్, బ్రెడ్ తీసుకుంటా. మళ్లీ 11 గంటలకు ఇడ్లీ, పొంగల్, దోశ, పెసరట్టు... ఇలా ఏదో ఒక టిఫిన్ తింటా. మధ్య మధ్యలో ఫ్రూట్స్ తీసుకుంటా.

మరి లంచ్?
నాగ్: రైస్... నాలుగైదు వెజిటబుల్ కర్రీస్. ఇదే నా లంచ్ మెనూ. ఈ మధ్య చాలామంది రైస్, రోటీ మానేస్తున్నారు. వాటిల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మన బాడీకి, బ్రెయిన్‌కి చాలా అవసరం. అవి తగ్గిపోతే మనకు ఎప్పుడూ కోపం వస్తూ ఉంటుంది. అందుకే లంచ్ వరకూ బాగా తింటా. తర్వాత పెద్దగా ఏమీ తినను. ముఖ్యంగా ఫ్రూట్స్ అస్సలు తీసుకోను. ఆరెంజ్ జ్యూసుల్లాంటివి యాసిడ్ క్రియేట్ చేస్తాయి.

డిన్నర్?
నాగ్: చాలా తక్కువ. గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ తింటా. అలాగే బాయిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్స్ తీస్కుంటా. అది కూడా రాత్రి ఏడు లోపే తినేస్తా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మన మెటబాలిజమ్ మంచి స్వింగ్‌లో ఉంటుంది. ఆ టైమ్‌లో మనం ఎంత తిన్నా అరాయించుకోగలం. ఒంటికి పట్టింది ఖర్చు చేయగలం. ఈవినింగ్ వచ్చేసరికి మెటబాలిజమ్ చాలా స్లో అయిపోతుంది. రాత్రుళ్లయితే మెటబాలిజమ్ అస్సలు ఉండదు. అందుకే ఆ టైమ్‌లో తింటే అరక్క నిద్ర కూడా పట్టదు. వంటికి పట్టింది అలాగే ఉండిపోతుంది.

మరి సండే మీ మెనూలో మార్పు ఏమైనా ఉంటుందా?
నాగ్: సండే ఫుల్ ఫ్రీ. అంతా నా ఇష్టం. ఏం తినాలనుకుంటే అది తినేస్తా. మొన్న హలీమ్ తినాలనుకున్నా. సండే వెళ్లి తినేశొచ్చా. సుమారు 15 ఏళ్లుగా నేను ఈ పద్ధతే ఫాలో అవుతున్నా.

రాత్రుళ్లు అలస్యంగా నిద్రపోతారా?
నాగ్: అదేం లేదు. 10 గంటలకల్లా నిద్రపోతా. అలా అలవాటైపోయింది.

మధ్యాహ్నం నిద్రపోయే అలవాటుందా?
నాగ్: ఉంది. లంచ్ తర్వాత ఓ పావుగంట కునుకు తీస్తే మళ్లీ రీచార్జ్ అయిపోతాం. అంతకుమించి ఎక్కువ నిద్రపోకూడదు.

ఈవినింగ్ టైమ్ ఎలా స్పెండ్ చేస్తారు?
నాగ్: షూటింగ్ ఎర్లీగా అయిపోతే గోల్ఫ్ ఆడతా. సమ్మర్‌లో అయితే స్విమ్మింగ్ చేసేవాడ్ని.

మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్?
నాగ్: కొత్త ఆవకాయ పచ్చడి వచ్చిందంటే ఆ పదిహేను రోజులూ నాకు పండగే. వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడి, నెయ్యి కలుపుకుని తింటుంటే ఆ మజానే మజా. మామిడిపళ్లు కూడా ఇష్టమే. ముఖ్యంగా కొత్తపల్లి కొబ్బరి మామిడి అంటే చాలా ఇష్టం. నేను తెలుగువారి ఫుడ్‌నే ఎక్కువ ఇష్టపడతా. నార్త్ డిష్‌లు అంత నచ్చవు.

కేఎఫ్‌సీ చికెన్, బర్గర్లు, పిజ్జాలు లాంటివి తింటారా?
నాగ్: కేఎఫ్‌సీ ఫుడ్ ఎప్పుడూ నచ్చదు. ఎందుకో చిన్నప్పటినుంచీ నాకు ఆయిల్‌ఫుడ్ అంటే అయిష్టం. స్వీట్స్ అస్సలు నచ్చవు. ఐస్‌క్రీమ్స్ కూడా. వీటికి దూరంగా ఉండడమే నాకు పెద్ద అదృష్టం. నేనిలా స్లిమ్‌గా, గ్లామర్‌గా కనపడ్డానికి ఆ హ్యాబిట్స్, ఇష్టాయిష్టాలు హెల్ప్ అయ్యాయి.

మీకు వంట వచ్చా?
నాగ్: బాగా వచ్చు. అమెరికాలో ఉన్నప్పుడు నేర్చుకున్నా. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు వంట చేస్తే చాలా రిలాక్స్ అయిపోవచ్చు. నేనెప్పుడూ అదే చేస్తా. వంట చేస్తూ ఉంటే అదో రిలాక్సేషన్, మెడిటేషన్. ఆ వంటను అందరూ తింటూ మెచ్చుకుంటే మనలో కొత్త ఎనర్జీ ప్రవేశిస్తుంది. వెజ్, నాన్‌వెజ్ అన్ని ఐటమ్స్ వండుతా. తెలీకపోతే తెలుసుకుని మరీ వండుతా. హైదరాబాద్ బిర్యానీ బాగా వచ్చు.

{పయాణాలు చేయడం ఇష్టమేనా?
నాగ్: చాలా చాలా ఇష్టం. అయితే ఎవరన్నా కంపెనీ ఉండాలి. అలా కారులో వెళ్తూ వెళ్తూ ఉంటే భలే మజాగా ఉంటుంది. రాత్రిళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కారులో ట్రావెల్ చేయను.

మీరు చాలా దేశాలు తిరిగొచ్చారు కదా. వాటిల్లో ఏ దేశం మీకు నచ్చింది?
నాగ్: ‘సంతోషం’ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లా. ఆ దేశం కన్నా, ఆ దేశ ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాకు బాగా నచ్చింది. కొద్ది మాసాలే అక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. మిగతా టైమంతా విపరీతమైన మంచు. భరించలేం.

శిరిడి ఎప్పుడైనా వెళ్లారా?
నాగ్: ఆ మధ్య ఎందుకో వెళ్లాలనిపించి వెళ్లాను. ఎందుకొచ్చిందో కానీ ఆ ఆలోచన, అంతా ఓ మిరకిల్‌లా అయిపోయింది. నా ఫ్రెండ్స్ చాలామంది అంతకుముందు ఎన్నోసార్లు శిరిడీ రమ్మని అడిగారు. షూటింగ్స్‌లో బిజీగా ఉండి వెళ్లలేకపోయాను. అలాంటిది అప్పుడెందుకో ఇంట్లో ఖాళీగా ఉండి వెళ్లాను. మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్దామంటే నేను కాదనను. శిరిడీ నుంచి వచ్చిన వారం రోజుల తర్వాత రాఘవేంద్రరావుగారు ‘శిరిడి సాయి’ సినిమా గురించి చెప్పారు.

మరి, తిరుపతి వెళ్తుంటారా?
నాగ్: చిన్నప్పుడు అమ్మతో కలిసి రెండు మూడుసార్లు వెళ్లా. ‘అన్నమయ్య’ సినిమా తర్వాత మాత్రం తరచుగా వెళ్తున్నా. ఈ మధ్య కూడా వెళ్లి దర్శనం చేసుకొచ్చా.

ఇంకేం పుణ్యక్షేత్రాలకు వెళ్లారు?
నాగ్: శ్రీశైలం, భద్రాచలం, విజయవాడ, గురువాయుర్, కాశీ... ఇలా చాలా పుణ్యక్షేత్రాలు దర్శించా. మా షూటింగ్స్ ఆ సమీపంలో జరిగితే తప్పనిసరిగా వెళ్తా. ‘ఖుదాగవా’ షూటింగ్ టైమ్‌లో ముక్తినాథ్ కూడా చూసొచ్చా.

దేవుడి గురించి మీ అభిప్రాయం?
నాగ్: ఇందు గలడు అందు లేనడని సందేహం వలదు అన్నట్టుగా దేవుడు ప్రతిచోటా ఉన్నాడు. ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తోంది. గ్రహాలన్నీ సక్రమంగా ఉన్నాయంటే, ఈ ప్రకృతి ఇలా ఉందంటే అదంతా ఆ శక్తి మహిమే. అంతెందుకు, మన శరీరమే గొప్ప అద్భుతం. అలాంటి అద్భుతాలెన్నో ఈ సృష్టిలో ఉన్నాయి.

దేవుడు ప్రత్యక్ష్యమై వరం కోరుకోమంటే, మళ్లీ నాగార్జునగానే పుట్టాలని కోరుకుంటారా?
నాగ్: (నవ్వుతూ) నాకెందుకో మళ్లీ జన్మ ఉంటుందనే అనిపిస్తుంది. ఇన్నేళ్లు బతికి, ఇన్ని అనుభవాలు గడించి ఓ రూపం సంతరించుకున్న శక్తికి చావుతో ఫుల్‌స్టాప్ పడదు. చావు అనేది కేవలం కామా మాత్రమే. ఈ శక్తి అంతా వేరే రూపంలోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఒక ఆపిల్ తింటాం. దాన్నుంచి శక్తి వస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ఏ మెటీరియల్ కూడా వృథాగా మాయం అయిపోదు. అలాగే మన ఆత్మ కూడా వృథా కాదు. మన పురాణాలు, శాస్త్రాలు ఊరికే చెప్పవు కదా.

జ్యోతిష్యాన్ని నమ్ముతారా?
నాగ్: నేను జ్యోతిష్యాన్ని ఫాలో కాను. గతం గురించి చెప్తారు కానీ, భవిష్యత్తుని ఎవ్వరూ పూర్తి స్థాయిలో చెప్పరు. జ్యోతిష్యం కూడా ఓ సైన్సు. కరెక్ట్ పీపుల్ ఉంటే దాన్ని నమ్మొచ్చు.

ఇంట్లోంచి బయటకు వెళ్లేముందు దేవుడికి దణ్ణం పెట్టుకోవడం, ఎవరైనా ఎదురు రావడం... ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా?
నాగ్: అస్సల్లేవు. అప్పుడప్పుడూ అమ్మ మాత్రం దిష్టి తీసేది. ఎందుకమ్మా అనడిగితే అందరి కళ్లూ మంచివి కాదురా అనేది. కాశీతాళ్లు లాంటివి చిన్నప్పుడు చేతికి కట్టుకునేవాడ్ని. ఇప్పుడా అవకాశం లేదు. ఇక గొలుసులు, నగలు లాంటివి ఎప్పుడూ అలవాటు లేదు.

గాడ్జెట్స్‌పై ఆసక్తి ఉందా?
నాగ్: గాడ్జెట్స్ చాలా ఇష్టం. కానీ వాటికి ఎడిక్ట్ అయ్యామా గంటలు గంటలు ఇట్టే కరిగిపోతాయి. ఈ మధ్య షూటింగ్ గ్యాప్స్‌లో ఎవరికివాళ్లు దూరంగా వెళ్లిపోయి మొబైల్‌తోనో, ఐపాడ్‌తోనో గడుపుతున్నారు. నేనైతే గాడ్జెట్స్‌పై గడపడం బాగా తగ్గించేశా.

ఫేస్‌బుక్, ట్విట్టర్ ఫాలో అవుతారా?
నాగ్: ట్విట్టర్‌లో ఉన్నా కానీ రెగ్యులర్‌గా ట్వీట్ చేయను. ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటేనే ట్వీట్ చేస్తా. నో పర్సనల్స్. ఓన్లీ మూవీస్ గురించే. ప్రతిరోజూ ఈవినింగ్ మాత్రం ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటా.

మీరు థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తారా? లేక ఇంట్లోనేనా?
నాగ్: ఏదైనా సినిమా బావుందంటే సినీమ్యాక్స్‌కు వెళ్లి చూస్తా. ఈ మధ్య హిందీ సినిమాలు ఎక్కువ చూశా. విక్కీ డోనర్, దబాంగ్, సింగం... ఇంకా చాలా చూశా. ‘ఈగ’ చూసి ట్విట్టర్‌లో కామెంట్ కూడా పెట్టా. ‘గబ్బర్‌సింగ్’ బాగా ఎంజాయ్ చేశా. పవన్‌కల్యాణ్ మళ్లీ ఫామ్‌లోకొచ్చినందుకు హ్యాపీ. ఆ సినిమా కేవలం పవన్ వల్లనే ఆడింది.

రాజకీయాలు ఫాలో అవుతుంటారా?
నాగ్: నేనే కాదు అందరూ ఫాలో కావాలి. ముఖ్యంగా యూత్. ఊరికే ఫిర్యాదులు ఇవ్వడం కాకుండా, మనవంతు బాధ్యతగా ఓటెయ్యాలి. మనం ఓటేస్తేనే కదా వాళ్లను ప్రశ్నించే అధికారం వస్తుంది. నేనెప్పుడూ ఓటు వేయడం మానలేదు. నాగచైతన్యతో కూడా వేయిస్తున్నా. అఖిల్‌కి ఇంకా ఓటేసే వయసు రాలేదు.

రాజకీయాల్లోకి రమ్మని మిమ్మల్ని ఏ పార్టీ వారైనా ఆహ్వానిస్తే?
నాగ్: నాకస్సలు ఆసక్తి లేదు. ఈ లైఫ్ హాయిగా ఉంది. ఎందుకు అనవసర వివాదాల్లో తలదూర్చడం. ఈ సినిమా ప్రపంచమే నాకిష్టం.

సచిన్ టెండూల్కర్ తరహాలో మిమ్మల్ని కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తానంటే?
నాగ్: పాలిటిక్స్‌కు నో చాన్స్.

మీ ఫ్యూచర్ సినిమా ప్లానింగ్స్?
నాగ్: ‘అదర్‌సైడ్’ ఫీచర్‌లో సినిమా టాపిక్స్‌కు నో చాన్స్.

వర్తమాన భారతదేశమైనా, భవిష్యత్ భారతదేశమైనా ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది రోటీ కప్‌డా అవుర్ మకాన్ మీద. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అందరికీ అవి దక్కకపోవడం ఏమిటో అర్థం కావడంలేదు. ఆ మూడూ సక్రమంగా అందరికీ లభిస్తే మన దేశం ఎక్కడికో వెళ్లిపోతుంది.

ఇన్నేళ్లు బతికి, ఇన్ని అనుభవాలు గడించి ఓ రూపం సంతరించుకున్న శక్తికి చావుతో ఫుల్‌స్టాప్ పడదు. చావు అనేది కేవలం కామా మాత్రమే. ఈ శక్తి అంతా వేరే రూపంలోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఒక ఆపిల్ తింటాం. దాన్నుంచి శక్తి వస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ఏ మెటీరియల్ కూడా వృథాగా మాయం అయిపోదు.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
veede oka pedda paamu.. hyd sagam dochesadu.. binami perlato..

first veedine pettali sanchilo..
neetulu baaga chebutaru mike dirikite..
yegaaliki aa chaapa yette rakam.. :021:

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 266 Views Last post October 18, 2014, 07:25:36 AM
by siva