Author Topic: చిరు ఫ్యాన్‌కు వన్ మ్యాన్ ఆర్మీ అవార్డు  (Read 671 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678

తన రచనావ్యాసంగం, ఫొటోగ్రఫీ ద్వారా సామాన్యులకు తగిన గుర్తింపు, గౌరవం తేవడంలో తమదైన రీతీలో కృషి చేస్తున్న సామాన్యశాస్త్రం మిత్రులు మెగాస్టార్ చిరంజీవి అభిమాని నూర్ మహ్మద్ సేవానిరతిని గుర్తించి ఆయనకు ఈ ఏడాది వన్ మ్యాన్ ఆర్మీ పురస్కరాన్ని ప్రకటించారు. సామాన్యశాస్త్రం పురస్కార కమిటీ అధ్యక్షుడు కొలచల చంద్రశేఖర్ చెప్పారు. పది వేల రూపాయల నగదుతో పాటు ఈ పురస్కారాన్ని ఈ నెల 7వ తేదీ ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఐఎఎస్ అధికారి రమణాచారి చేతుల మీదుగా అందిస్తున్టన్లు రచయిత, జర్నలిస్టు కందుకూరి రమేష్‌బాబు చెప్పారు.
నూర్ మహ్మద్ హైదరాబాదులోని మోండా మార్కెట్‌లో చెరుకురసం, తమలపాకులు అమ్ముకునే మామూలు మనిషి. మనిషి సమాజంలో ధీరోదాత్తుడైన ఒక హీరో ఉండాలని, అటువంటి హీరోల కొరత ఉన్నందువల్లనే తాను చిరంజీవి అభిమానిగా మారినట్లు ఆయన చెబుతారు. సికింద్రాబాద్ ప్రాంతంలో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ సామాన్యుల సహాయసహకారాలతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు రక్తదాన, అన్నదానం వంటివే కాకుండా వరదలు, తుఫానుల వచ్చినప్పుడు పేదల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారే ఈ సంవత్సరం సామాన్యశాస్త్రం హీరో అని నిర్వహకులు చెప్పారు.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలాగే ఎంతో మంది సామాన్యుల జీవితాలను తాము చక్కదిద్దుకుంటూనే తోటివారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారని, ఇలా మంచి కోసం, మార్పు కోసం ఒకరే ఒక సైన్యంగా కృషి చేస్తున్నవాళ్లు మన దేశంలో చాలా మందే ఉన్నారని సామాన్యశాస్త్ర పురస్కార కమిటీ అధ్యక్షుడు కొలచల చంద్రశేఖర్ అన్నారు. అలాంటి వాళ్లలో జీవిత కథనాలను ప్రతి యేటా ఒక గ్రంథంగా తెస్తామని, అందులో ఒకరికి పది వేల రూపాయల నగదు బహుమతి ఇస్తామని వివరించారు.
సామాన్యశాస్త్రం ఒక స్వచ్ఛంద సంస్థ కాదని, ఇందులో మిత్రులు వృత్తిరీత్యా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించుకుంటూనే సామాన్యుల ఉన్నతిని చాటే పని మీద ఏడాదికి రెండు సార్లు సామాజిక బాధ్యతగా ఇలాంటి పనిచేస్తున్నట్లు కందుకూరి రమేష్ బాబు చెప్పారు.
thatstelugu

Offline wings

 • Sr. Member
 • ***
 • Posts: 908

Offline manikumar18

 • Hero Member
 • *****
 • Posts: 3,043
 • KONIDELA VEERABHI"MANI"

Offline READANDHRA

 • Newbie
 • *
 • Posts: 22
చిరంజీవి కే కాదు చిరంజీవి అభిమానులకు కూడా అవార్డులు రావడం సంతోషాన్ని కలిగించే వార్త. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే చిరు అభిమానులు భావిష్యతులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సమాజానికి చేయాలి...

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]
చిరంజీవి కే కాదు చిరంజీవి అభిమానులకు కూడా అవార్డులు రావడం సంతోషాన్ని కలిగించే వార్త. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే చిరు అభిమానులు భావిష్యతులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సమాజానికి చేయాలి...

welcome readandhra ..

 

Related Topics