Author Topic: Happy BirthDay to Rajini sir from Mega Fans........  (Read 856 times)

Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« on: December 12, 2012, 12:40:36 AM »


Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #1 on: December 12, 2012, 12:43:29 AM »

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #2 on: December 12, 2012, 01:42:57 AM »
Happy Birthday to you sir.

Offline wings

 • Sr. Member
 • ***
 • Posts: 908
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #3 on: December 12, 2012, 02:09:43 AM »
Many More Birthday wishes to People's Star

Offline lokesh

 • Full Member
 • ****
 • Posts: 2,118
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #4 on: December 12, 2012, 12:54:52 PM »
Rajinikanth waves to fans on his birthday at his residence

www.youtube.com/watch?feature=player_embedded&v=dPvTg8DQ0yw Small | Large

Offline lokesh

 • Full Member
 • ****
 • Posts: 2,118
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #5 on: December 12, 2012, 12:55:45 PM »
www.youtube.com/watch?feature=player_embedded&v=Sf8DIoZF0Cs Small | Large

Offline lokesh

 • Full Member
 • ****
 • Posts: 2,118
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #6 on: December 12, 2012, 06:01:02 PM »
రజనీకాంత్‌ జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాలు
ప్రతి హోలీ పండుగకు తన గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'నాకు రజనీకాంత్‌ అని పేరు పెట్టింది హోలీ రోజునే సార్‌!'అన్నారట.
రజనీకాంత్‌ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు.
రజనీకాంత్‌ ఇష్ట దైవం వినాయకుడు.
తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్‌ వివాహం జరిగింది.
రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ. పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట.
ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్‌ మేకప్‌రూమ్‌ నెం.10
చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది.
తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేశారు.
మెరీనాలో విక్రయించే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం.
'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది.
రజనీకాంత్‌ మాట్లాడిన తొలి పంచ్‌ డైలాగ్‌ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?)
రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు.
తన చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్‌ అలవాటు. ఆ మొత్తం కనీసం రూ.50 వేలు.
తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
అత్యధికంగా ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు.
హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి.
తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్‌ చేసి వారిని అభినందిస్తారు.
పోయస్‌ గార్డెన్‌ నివాసంలో ఉంటే రజనీకాంత్‌ నిద్రపోయేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది.
తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్‌ చేస్తుంటారట.
తనకు ఎంత ఆప్తులైనా వారికోసం సిఫారసు మాత్రం చేయరు.
సిగరెట్‌ తాగటం చాలా ఇష్టం. అయితే ఇప్పుడా అలవాటు మానుకున్నారు.
స్నేహితుల స్కూటర్‌ను నడపటమంటే చాలా సరదా.
రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఇళయరాజాను 'స్వామి' అంటూ మర్యాదగా సంబోధిస్తారు.
పర్సు, క్రెడిట్‌ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్‌ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తారు.
అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారిని ఉత్సాహ పరుస్తుంటారు.
తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్‌ అలవాటు.
పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటి పేరు 'బృందావన్‌'. ఇది ఆయనే పెట్టుకున్నారు. దానిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో లిఖించారు.
విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్‌ మొగ్గుచూపుతారు.
కె.బాలచందర్‌పై రజనీకి అపార గౌరవం. ఆయన ఎప్పుడు ఫోన్‌ చేసినా లేచి నిలబడే మాట్లాడతారు. అదీ ఆయన గురుభక్తి.
ఫిలిం ఛాంబర్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో చాలా సందర్భాల్లో ఫీజు కూడా కట్టలేకపోయేవారట. ప్రిన్సినల్‌ రాజారామ్‌దాస్‌సహాయం చేశారట.
తనను కలిసేందుకు ఎవరు వచ్చినా, వయస్సులో చిన్నవారైనా లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తారు. వారు కూర్చున్నాకే తాను కూర్చుంటారు.
రజనీకాంత్‌ ఏ కారులో వస్తారనే విషయాన్ని ఎవరూ ముందే ఊహించలేరు. ఖరీదైన కార్లకు దూరంగా ఉండే సూపర్‌స్టార్‌ అంబాసిడర్‌, క్వాలీస్‌లో మాత్రమే ప్రయాణిస్తుంటారు.
బూట్లు ధరించటాన్ని ఇష్టపడరు. షూటింగ్‌ సందర్భంలో కూడా అవసరం మేరకే. చెప్పులు ధరించటమే ఇష్టం.
రోజూ రెండు చిత్రాలను చూడటం అలవాటు. వాటిలో ఒకటి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది.
ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందించటం రజనీ అలవాటు.
తొలినాళ్లలో నలుపు వస్త్రాలను ఇష్టపడే రజనీకాంత్‌ ప్రస్తుతం తెలుపునకు మారారు.
రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్‌ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది. అక్కడా అభిమానులను సంపాందించిపెట్టింది.
'నేను ఆధ్యాత్మికవేత్తనే. అయితే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్నంత కాదు. అలాంటి పద్ధతి నాకు ఇష్టం లేద'ని ఓసారి వ్యాఖ్యానించారు.
తన వద్ద 25 ఏళ్లుగా విధులు నిర్వహించి విరమణ పొందిన వ్యక్తిగత సహాయకుడు జయరామన్‌కు నేటికీ వేతనం అందిస్తూనే ఉన్నారు.
విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్‌ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు.
అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్‌ కానుకగా ఇస్తుంటారు.
'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.
తమిళ చిత్రాలు ప్రస్తుతం రష్యా భాషలోకి అనువాదం అవుతున్నాయి. వీటిలో తొలి చిత్రం రజనీకాంత్‌ నటించిన 'చంద్రముఖి'.
ఆభరణాలను రజనీ ఇష్టపడరు. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా వెళ్లింది.
ఆధ్యాత్మికం కాకుండా ప్రపంచ రాజకీయ నేతల జీవిత చరిత్రల పుస్తకాలను చదవటం రజనీకి చాలా ఇష్టం.
రూ.50 కోట్లతో రజనీకాంత్‌ తిరువళ్లువర్‌గా నటించే చిత్రాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.
ఎంజీఆర్‌, శివాజీలంటే మహా ఇష్టం. ఎంజీఆర్‌ తమిళ సినిమా మార్గదర్శి, శివాజీ గణేశన్‌ ఓ నిఘంటువు.. అని అభివర్ణిస్తుంటారు రజనీ.

Offline wings

 • Sr. Member
 • ***
 • Posts: 908
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #7 on: December 12, 2012, 09:05:15 PM »
very good info Bro!

Offline lokesh

 • Full Member
 • ****
 • Posts: 2,118
Happy BirthDay to Rajini sir from Mega Fans........
« Reply #8 on: December 13, 2012, 12:52:54 PM »
Thanks bro

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
3 Replies 442 Views Last post September 01, 2014, 02:48:34 PM
by charan fan
2 Replies 338 Views Last post October 23, 2014, 08:39:24 PM
by Pa1Kalyan
3 Replies 499 Views Last post December 14, 2014, 12:32:35 AM
by yugandhar
3 Replies 377 Views Last post January 20, 2015, 09:37:20 AM
by charan fan