Author Topic: దబాంగ్ చిత్రానికి ప్రిక్వెల్: సల్మాన్  (Read 263 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
ముంబై: బాలీవుడ్ కనకవర్షం కురిపించిన దబాంగ్ చిత్రానికి ప్రీక్వెల్ తీయనున్నట్టు సల్మాన్ ఖాన్ తెలిపారు. డిసెంబర్ 21 తేదిన విడుదలకు సిద్ధమవుతున్న దబాంగ్-2 చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. దబాంగ్-2 చిత్రం విజయం సాధిస్తే.. దబాంగ్-3 సీక్వెల్ ఉంటుదన్నారు. అయితే దబాంగ్ ప్రిక్వెల్ నిర్మాణానికి కథ సిద్ధమైందని సల్మాన్ తెలిపారు. చుల్ బుల్ పాండేగా ఎలా మారాడానే విషయాన్ని దబాంగ్ ప్రిక్వెల్ లో చూపిస్తామని సల్మాన్ తెలిపారు. దబాంగ్ చిత్రంలో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటించిన సంగతి తెలిసిందే.