Author Topic: 100 మంది ప్రొఫెసర్ల రాజీనామా  (Read 284 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
- ఓయూలో ముదిరిన వివాదం
- విద్యార్థుల దాడిపై గవర్నర్‌కు ఫిర్యాదు

సాక్షి-హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ప్రొఫెసర్లకు మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి అధ్యాపకుల రాజీనామాలకు దారితీసింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే భావనతో ఆవేశానికి లోనైన విద్యార్థులు జర్నలిజం విభాగం అధ్యాపకునిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ.. రెండు రోజులుగా వర్సిటీలో ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు బుధవారం తమ పదవుల(బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, హెచ్‌ఓడీలు, ఇతర విభాగాధిపతులు)కు రాజీనామా చేశారు. దాదాపు వందమంది తమ రాజీనామా పత్రాలను వర్సిటీ రిజిస్ట్రార్‌కు అందజేశారు. అంతేగాక దాడి అంశాన్ని పలువురు ప్రొఫెసర్లు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గవర్నర్ కార్యాలయ వర్గాలు ఆరా తీసినట్టు సమాచారం. కాగా వివాదానికి కారణమైన పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియను గురువారం నుంచి పూర్తిగా నిలిపివేయనున్నట్లు వర్సిటీ అధ్యాపకుల సంఘం(ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ ప్రకటించారు. విద్యార్థులు ఆరోపిస్తున్నట్లుగా పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగి ఉంటే, వాటిపై ఓ రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి, నిజానిజాలు వెలుగులోకి తెచ్చాకే ఆ ప్రక్రియను చేపడతామని స్పష్టంచేశారు. తాము గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రాజీనామా చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.

భద్రత అంశంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మినహా, ఇతర పనులేవీ చేయబోమన్నారు. మరోవైపు అధ్యాపకులమీద దాడికి పాల్పడినవారిపై చర్య తీసుకోవాలని, పీహెచ్‌డీ అడ్మిషన్ల కేటాయింపునకు సంబంధించిన జాబితాను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ నుంచి వీసీ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన మాదిగ విద్యార్థి సంఘం ఓయూ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వివాదానికి కారణమిదీ..: ఇటీవలే పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలైనా అడ్మిషన్ల జాబితా ఇంకా విడుదల కాలేదు. జర్నలిజం విభాగంలో మొత్తం ఏడు పీహెచ్‌డీ సీట్లుండగా, వీటిలో మూడు పీఎస్‌టీయూ, మూడు సెంట్రల్ వర్సిటీ, ఇప్పటికే వేరే సబ్జెక్టులో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థికి అడ్మిషన్ ఇచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు గత సోమవారం ఆ విభాగానికి చేరుకున్నారు. ఇక్కడ చదువుకున్న వారికిగాక ఇతరులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారంటూ అధ్యాపకులపై మండిపడ్డారు. అనంతరం వీసీ వద్దే తేల్చుకుందామంటూవారిని బలవంతంగా వీసీ భవనానికి తీసుకెళ్లారు. వీసీ సత్యనారాయణ సర్ది చెబుతుండగానే, మాదిగ విద్యార్థి సంఘం ఓయూ విభాగం అధ్యక్షుడు అలెగ్జాండర్.. జర్నలిజం విభాగం ప్రొఫెసర్ నరేందర్‌పై చేయి చేసుకున్నట్టు ఔటా ఆరోపించింది.
Sakshi

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
ఉన్నత విద్యలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ‘న్యాక్’ వర్సిటికి ‘ఎ’ గ్రేడ్ ఫైవ్‌స్టార్ గుర్తింపు ఇచ్చింది. ఇటీవల ‘ఇండియాటుడే- నీల్సన్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో వర్సిటీకి దేశంలోనే ఆరోస్థానం లభించింది.


ప్రస్తుత నాగరికత ప్రపంచంలో మానవ సంబంధాలకు బొత్తిగా విలువలేకుండా పోతుందనే వాదనకు ఇటీవల కొన్ని సంఘటనలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. పవిత్రమైన గురుశిష్యుల బంధాలు, విద్యార్థి, అధ్యాపకుల సంబంధాలు పతనమవుతున్న తీరు పలువురిని ఆవేదనకు గురి చేస్తోంది. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న సంఘటన విద్యారంగంలో అడుగంటుతున్న విలువలకు తార్కాణమని పలువురు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యపకులపై దాడులు అప్పుడప్పుడు జరుగుతున్నా.. బయటి ప్రపంచానికి తెలియకుండానే వివాదాలు ముగిసిపోయాయి. అయితే గత కొద్దికాలంగా ఉస్మానియాను అనేక వివాదాలు చుట్టుముట్టడం విద్యావంతులను, మేధావులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే కుదుటు పడుతున్న ఉస్మానియా వాతావరణానికి తాజాగా పీహెచ్‌డీ అడ్మిషన్ల కేటాయింపు అంశం విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య చిచ్చు రేపింది.

జర్నలిజం విభాగంలో మొత్తం ఏడు పీహెచ్‌డీ సీట్లు ఉండగా, వీటిలో మూడు పీఎస్‌టీయూ, మూడు సెంట్రల్ యూనివర్సిటీ, ఇప్పటికే వేరే సబ్జెక్టులో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థికి అడ్మిషన్ ఇచ్చేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు సోమవారం ఉదయం ఆ విభాగానికి చేరుకున్నారు. ఇక్కడ చదువుకున్న వారికి కాకుండా ఇతరులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారంటూ అధ్యపకులను నిలదీశారు. ఈ వివాదం వైస్ చాన్సలర్ (వీసీ) వద్దకు చేరుకుంది. ఇరు వర్గాలకు ఓ వైపు వీసీ సత్యనారాయణ సర్థి చెప్పుతుండగా, మరో వైపు మాదిగ విద్యార్థి సంఘం ఓయూ విభాగం అధ్యక్షుడు అలెగ్జాండర్ ఆవేశంతో ఊగిపోతూ...వీసీ సహా అక్కడికి వచ్చిన అధ్యపకులంతా చూస్తుండగా జర్నలిజం విభాగం ప్రొఫెసర్ నరేంద్రర్‌పై చేయి చేసుకోవడం ఆధ్యాపకుల ఆగ్రహానికి కారణమైంది.

తన కళ్లముందే ఇంత జరుగుతున్నా వీసీ నిశ్చే ష్ఠుడిలా ఉండిపోవడాన్ని ఆ విభాగం అధ్యపకులు జీర్ణించుకోలేక పోయారు. ప్రొఫెసర్ నరేందర్‌తో పాటు తోటి అధ్యపకులంతా తీవ్రమనస్తాపానికి గురైయ్యారు. ‘తమ సమస్యలేమైనా ఉంటే, తామంతా తమపై అధికారైనా వీసీకి చెప్పుకుంటామని, స్వయంగా ఆయన సమక్షంలోనే ఓ అధ్యపకుడిపై దాడీ జరిగినా కనీసం పట్టించుకోకపోగా, దాడీకి పాల్పడిన వారికి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు వర్సిటీ చాన్సలరైన రాష్ట్ర గవర్నర్‌కు కాకుంటే ఇంకెవరికి చెప్పుకుంటాం’ అని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ సత్యనారాయణ ఆవేదనవ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తమ పదవులకు రాజీనామా చేసి, రిజిస్ట్రార్‌కు అందజేశారు.

విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు పీహెచ్‌డీ అడ్మిషన్లలో ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే, వాటిపై ఓ రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి, నిజానిజాలు వెలుగులోకి తెచ్చి న తర్వాతే ఆ ప్రక్రియను చేపడుతామని వీసీ స్పష్టం చేశారు. దాడి అంశంపై ఇప్పటికే పలువురు ప్రొఫెసర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే గవర్నర్ కార్యాలయ వర్గాలు ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు మంగళవారం ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై అధ్యపకులు బుధవారం సాయంత్రం ఉస్మానియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్‌పై దాడీకి పాల్పడిన మాదిగ విద్యార్థి సంఘం ఓయూ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ను అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. అధ్యాపకుడిపై దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని, పీహెచ్ డీ అడ్మిషన్ల కేటాయింపుకు సంబంధించిన జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ నుంచి వీసీ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించి, రిజిస్ట్రార్‌ను ఘెరావ్ చేశారు.

ఉన్నత విద్యలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ‘న్యాక్’ వర్సిటికి ‘ఎ’ గ్రేడ్ ఫైవ్‌స్టార్ గుర్తింపు ఇచ్చింది. ఇటీవల ‘ఇండియాటుడే- నీల్సన్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో వర్సిటీకి దేశంలోనే ఆరోస్థానం లభించింది. ప్రతిష్టాత్మాక ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఇటు ప్రొఫెసర్లకు అటు విద్యార్థులకు మధ్య ప చ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇతరులకు మార్గదర్శకంగా నిలువాల్సిన పలువురు గురువులు కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తుంటే...గురువుల పట్ల విధేతయ చూపాల్సిన పలు విద్యార్థి సంఘాల నేతలు విచక్షణ మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతూ, చివరకు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. హాజరుశాతం తగ్గినా...తక్కువ మార్కులు వచ్చినా...చివరకు పరీక్షలో పాస్ కాక పోయినా..., దీనంతటికీ తమకు చదువు చెప్పిన గురువుదే తప్పు అంటూ చిత్రీకరిస్తున్నారు. చిన్నచిన్న అంశాలకే దాడులకు పాల్పడుతూ వర్సిటీ పరువురును బజారుకీడుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.