Author Topic: టోనీ గ్రెగ్ మృతి  (Read 427 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
టోనీ గ్రెగ్ మృతి
« on: December 29, 2012, 08:20:30 PM »
సిడ్నీ: ఇంగ్లాండు క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత టోనీ గ్రెగ్ (66) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఆయన మరణించారు. అనారోగ్యంతో ఆయన ఆస్ట్రేలియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతని మృతికి క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఇంగ్లాండు జట్టు తరఫున ఆయన 58 టెస్టు మ్యాచులు ఆడి 3,599 పరుగులు చేశాడు. ఆయన 1980 నుంచి ఆస్ట్రేలియాలోని నైన్ నెట్‌వర్క్ క్రికెట్ వ్యాఖ్యాతల బృందంలో సభ్యునిగా కొనసాగుతున్నారు. అతని మృతికి మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో రాశారు. క్రికెట్ ప్రపంచంపై టోనీ గ్రెగ్ తన అడుగుజాడలు వేసి వెళ్లారని వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా వ్యాఖ్యానించారు. గ్రెగ్ మృతి నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఇప్పుడు తాను గ్రెగ్ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నానని గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నారు. గ్రెగ్ మృతి చెందారనే వార్తను నమ్మలేకపోతున్నానని బ్రెట్‌లీ అన్నారు. అత్యంత విషాదకరమైన సమాచారమని, గ్రెగ్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని గ్రేమ్ స్మిత్ అన్నారు. గ్రెగ్ మృతిని అత్యంత విషాదకరమైన వార్తగా జాక్విస్ కలిస్ వ్యాఖ్యానించారు. బిషన్ సింగ్ బేడీ విచారం వ్యక్తం చేశారు.


Offline RamSharan

  • Power Member
  • ******
  • Posts: 8,299
  • Die Hard Fan Of Chiru From Childhood
టోనీ గ్రెగ్ మృతి
« Reply #1 on: December 29, 2012, 09:41:26 PM »
RIP fr Legend

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
టోనీ గ్రెగ్ మృతి
« Reply #2 on: December 30, 2012, 11:12:55 PM »
I love his commentary

Offline sunil3584

  • Full Member
  • ****
  • Posts: 1,074
టోనీ గ్రెగ్ మృతి
« Reply #3 on: December 31, 2012, 12:46:08 PM »
He was the BEST Commentator...

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
7 Replies 434 Views Last post October 02, 2014, 12:11:27 PM
by charan fan