Author Topic: మెగా కుటుంబం నుంచి మరో హీరో  (Read 302 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో చిత్రరంగ ప్రవేశం చేయనున్నాడు. టాలీవుడ్లో ఇప్పుడు ప్రధానంగా చర్చించుకునే అంశం ఇదే. మెగాస్టార్ కుటుంబం నుంచి ఇప్పటికే నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్‌చరణ్ - అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ చిత్ర రంగంలో ఉన్నారు. చిరంజీవి మేనల్లుడు ధర్మతేజ, అరవింద్ మరో కుమారుడు అల్లు శిరీష్ కూడా ఇప్పుడు నటిస్తున్నారు. ఈ ఏడాది నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. దాదాపు నాలుగేళ్ల నుంచి వరుణ్ తేజ తెరంగేట్రం చేస్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. వివిధ కారణాల వల్ల తేజ వెండితెరకు పరిచయం కాలేకపోయాడు. ఇప్పుడు సమయం వచ్చేసింది. ఈ ఏడాది తేజ తప్పనిసరిగా హీరోగా నటించే అవకాశం ఉంది.

వరుణ్ తేజ ఎత్తుకు ఎత్తు ఉన్నాడు. మంచి రంగు, అందానికి అందం ఉంది. మెగా కుటుంబం. నటనలో, భాష ఉచ్ఛారణలో శిక్షణ పొందుతున్నాడు. మెగా అభిమానులు ఎటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సినిమా రంగంలోకి ప్రవేశించడమే తరువాయి. తేజ హీరోగా నటించడం ఖాయం. అయితే ఆ చిత్రం ఏ బేనర్‌పై నిర్మిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? హీరోయిన్ ఎవరు? చిత్రం పేరేమిటి?.... ఇలాంటి చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. వాస్తవానికి నాగబాబు తమ సొంత బేనర్ అంజనా ప్రొడక్షన్పైనే తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారు. అయితే ఆరంజ్ చిత్రం తరువాత ఆ ప్రొడక్షన్‌పై చిత్రం నిర్మించడానికి ఆయన వెనకాడుతున్నారు. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్‌పై నిర్మిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. తేజని హీరోని చేయాలని పవన్ కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి కథను ఎంపిక చేయడం కోసం చాలా కథలు కూడా వింటున్నారు. పవన్ కళ్యాణే కొత్తగా 'పవన్ క్రియేటివ్ వర్క్స్' బేనర్ ఏర్పాటు చేసి, తేజని హీరోగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కాకుండా వాళ్లకు కలిసివచ్చే బేనర్ గీతాఆర్ట్స్ ఉండనే ఉంది. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్పైనే తేజని పరిచయం చేసే అవకాశం కూడాలేకపోలేదు. ఆ బేనర్‌పైనే తన కుమారుడిని పరిచయం చేయడానికి నాగబాబు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక దర్శకుడు విషయానికి వస్తే విజయవంతమైన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'కు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల పేరు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. చిత్రం పేరు 'గొల్లభామ' అని కూడా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తేజను పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్దాల మంచి కథ రూపొందించారని, ప్రస్తుతం ఆయన ఆ కథకు మెరుగులు దిద్దే పనిలోనే ఉన్నారని కూడా తెలుస్తోంది. నాగబాబు కూడా తన కుమారుడిని శ్రీకాంత్ దర్శకత్వంలో పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. శ్రీకాంత్ తరువాత చిత్రం ఇదేనని టాలీవుడ్లో ప్రచారం. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మొదట్లో కాజల్ పేరు వినపడింది. ఇప్పుడు మహానటుడు కమల్‌హాసన్ రెండవ కూమార్తె అక్షర, ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ పేర్లు వినవస్తున్నాయి. తేజ మెగా కుటుంబానికి చెందిన వాడైనందున వారు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరకు తేజకు జంటగా అక్షర అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు అక్షర పేరు ఎక్కువగా వినవస్తోంది.

వరుణ్ తేజను ఈ ఏడాది వెండితెరకు పరిచయం చేస్తున్నట్లు నాగబాబే స్వయంగా చెప్పారు. కథా చర్చలు జరుగుతున్నట్లు, శ్రీకాంత్ కథను తయారు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో వరుణ్ తేజను ఏ బేనర్లో పరిచయం చేసేది, దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Sakshi

 

Related Topics