Author Topic: charan interview..  (Read 366 times)

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
charan interview..
« on: March 26, 2013, 11:30:54 AM »
అలాంటి కథలతో వస్తే పారితోషికం తగ్గించుకుంటాను

మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా వుండే రామ్‌చరణ్ ‘ఎవడు’ షూటింగ్ విరామంలో పాత్రికేయులతో సంభాషించారు. సినిమా మొదలుకొని వ్యక్తిగత విషయాలపై ఆయన ముక్కుగా తన మనసులోని భావాల్ని వ్యక్తపరిచారు. భయపడితే ఏ పనులు చేయలేమని..నటుడన్నాక ప్రయోగాలకు సిద్ధంగా వుండాలని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. గాసిప్స్ అంటే తనకు ఇష్టమని, అయితే అవి ఆరోగ్యకరంగా వుండాలని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి నట వారుసుడిగా తిరుగులేని అభిమానగణంతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారా� �న. ‘ఈ ఏడాది ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ రంగవూపవేశం చేస్తున్నారు. ఆయన నటించిన ‘జంజీర్’ (తెలుగులో ‘తుఫాన్’), ‘ఎవడు’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానున్నాయ� �. ఈ నెల 27న రామ్‌చరణ్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాత్రికేయులతో ఆయన పంచుకున్న మనోభావాలివి...

‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్ సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్� �ారు. అసలు ఈ సినిమాకు అంకురార్పణ ఎలా జరిగింది?

‘నాయక్’ మొదలుపెట్టిన సమయంలోనే ‘జంజీర్’ రీమేక్‌లో నటించే అవకాశం వచ్చింది. కథ విన్నాక సినిమాను ఓకే చేయడానికి ఎనిమిది నెలల సమయం తీసుకున్నాను. హిందీ సినీరంగం మహా సముద్రం. అక్కడి వాళ్లకి అదనంగా మరో హీరో అవసరమా? అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకోవాలి? అనిపించింది. అయితే నా శ్రేయోభిలాషుల సలహా మేరకు కథ మొత్తం కాకుండా సింగిల్‌లైన్ విందామనుకున్నాను. అదే సమయంలో నాన్నగారిని కలిసి ఆయన సలహా అడిగాను. ‘సినిమాను సినిమాగానే చూడాలి. అవకాశం ఒక్కసారే వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలుగులో మార్కెట్ వుంది కాబట్టి బాలీవుడ్ ఛాన్స్ వద్దనడం తప్పు’ అని చెప్పారాయన. కొంత ఆత్మవిమర్శ తర్వాత నేను కూడా...‘నటుడన్నాక ప్రయోగాలు చేయాలి. భయంతో ఏ అవకాశాన్ని తిరస్కరించకూడదు. ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనులూ జరగవు’ అన్న అభిప్రాయానికి వచ్చాను.

‘జంజీర్’ చిత్రంలో అమితాబ్‌గారు అతిధి పాత్రలో నటించబోతున్నారని తెలిసింది?

సినిమాలో చిన్న అతిధి పాత్రలో నటించడానికి అమితాబ్‌గారు అంగీకరించారు. రెండురోజులు డేట్స్ కేటాయించారు. ఏప్రిల్‌లో ఆయన చిత్రీకరణలో పాల్గొంటారు. అమితాబ్‌గారితో కలిసి నటించబోతుండటం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇక ‘జంజీర్’లో నేను యంగ్ పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్ పాత్రను చేస్తున్నాను. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా వుంటుందీ చిత్రం.

మీకంటే సీనియర్ అయిన ప్రియాంకచోవూపాతో కలిసి నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

ప్రియాంక నాకంటే చాలా సీనియర్. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి. అయినా ఆమెలో కించిత్ గర్వం కనిపించదు. తను సీనియర్ అన్న అహంకారం ఎప్పుడూ ప్రదర్శించలేదు. షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశం గురించి మేము ముందుగానే చర్చించుకునేవాళ్� �ం. ఒకవేళ ఆమె షూటింగ్‌కు ఆలస్యంగా వస్తే నాకు, దర్శకుడికి సారీ చెప్పేది. ‘జంజీర్’ తెలుగు వెర్షన్ ‘తుఫాన్’కు తనే డబ్బింగ్ చెబుతోంది. నాకు హిందీ నేర్పించే విషయంలో ప్రియాంక చాలా సహాయం చేసింది. ఆమెకు తెలుగు నేర్పించడంలో నేనూ అంతే సహాయం చేశాను (నవ్వుతూ).

తెలుగు సినీరంగంతో పోల్చుకుంటే హిందీ పరిక్షిశమ పనితీరు ఎలా వుంది?

హిందీలో ప్రొఫెషనలిజమ్ వుండదు అనే మాట తప్పు. ఇప్పుడు బాలీవుడ్ పరిక్షిశమ చాలా మారిపోయింది. మనలాగే వారు కూడా వృత్తిపరంగా చక్కటి క్రమశిక్షణతో వుంటున్నారు. ప్రతీ పనిని మంచి ప్రణాళికతో పూర్తిచేయడం వారికి అలవాటు. ఒకరకంగా ఆలోచిస్తే మనమే వాళ్లకంటే కొంచెం వెనకబడ్డాం అనిపిస్తుంది. నాన్నగారి టైమ్‌లో 70రోజుల్లో షూటింగ్‌లు పూర్తయ్యేవి. ప్రస్తుతం తెలుగులో అలాంటి పరిస్థితులు లేవు. పాటలు, ఫైట్స్‌తో సహా ‘జంజీర్’ షూటింగ్‌ను 75రోజుల్లో పూర్తిచేశాం.


మేమిద్దరం సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ‘అగ్నిపథ్’ తెలుగు రీమేక్ చేద్దామని కరణ్‌జోహార్ నన్ను సంప్రదించారు. అలాంటి ప్రతీకార నేపథ్య కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. అందుకే ఆ సినిమా వద్దన్నాను. మంచి కథ కుదిరితే భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసే ఆలోచన వుంది.

పెళ్లయ్యాక మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

అసలు పెళ్లయినట్లే తెలియడం లేదు. ఎందుకంటే పెళ్లయిన దగ్గరినుంచి ‘నాయక్’ ‘జంజీర్’...ఇప్పుడు ‘ఎవడు’ షూటింగ్‌లతో తీరికలేకుండా గడుపుతున్నాను. రిలాక్స్‌గా ఇంటిపట్టున వుండే సమయమే చిక్కడం లేదు. అందుకే ‘ఎవడు’ షూటింగ్ పూర్తయ్యాక రెండు నెలల విరామం తీసుకోబోతున్నాను.

నాన్నగారి ‘అభిలాష’ ఈ మధ్యనే 30 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆ సినిమా రీమేక్‌లో మీరు హీరోగా నటిస్తే బాగుంటుందని నిర్మాత కె.యస్.రామారావుగారు అన్నారు...?

కె.యస్.రామారావుగారు ఈ విషయాన్ని నాతో నేరుగా ప్రస్తావించలేదు. ‘అభిలాష’ ‘రువూదవీణ’ చిత్రాలు సామాజిక సమస్యల్ని చర్చిస్తూ తెరకెక్కాయి. అలాంటి కథలతో ఎవరైనా ముందుకొస్తే నా పారితోషికాన్ని తగ్గించుకొని ఆ సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నాను.

మీ నాన్నగారి చిత్రాల్లోని హిట్‌సాంగ్స్‌ను మీ సినిమాల్లో రీమేక్ చేస్తున్నారు...‘ఎవడు’లో రీమేక్ సాంగ్స్ ఏమైనా వున్నాయా?

‘ఎవడు’లో రీమేక్ సాంగ్స్ చేయడం లేదు. కొద్దిరోజుల పాటు రీమేక్ పాటలకు దూరంగా వుందామనుకుంటున్న� �ను.

హాలీవుడ్ చిత్రం ‘ఫేస్‌ఆఫ్’ కథ ఆధారంగా ‘ఎవడు’ సినిమా తీస్తున్నారని తెలిసింది?

‘ఫేస్‌ఆఫ్’ చిత్రంలోని ఒకరి ముఖాన్ని మరొకరికి అమర్చడం అనే చిన్న ఐడియా ‘ఎవడు’ సినిమాలో వుంటుంది. ఆ ఒక్క పాయింట్ తప్ప ‘ఎవడు’ కథకు ‘ఫేస్‌ఆఫ్’కు ఎటువంటి సంబంధం లేదు. సినిమాలో 15 నిమిషాల పాటు కనిపించే కీలక పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు.

హీరోల సిక్స్‌ప్యాక్ ట్రెండ్ గురించి మీరేమంటారు?

ఒకప్పుడు అది ట్రెండ్‌సెట్టర్‌� �ా వుండేది. ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రస్తుతం సిక్స్‌ప్యాక్ చేయడం ప్రత్యేకత అనిపించుకోదు.

3డి సినిమా చేసే ఆలోచన ఏమైనా వుందా?

తెలుగులో కల్యాణ్‌రామ్ త్రీడీ సినిమా చేస్తున్నారు. త్రీడీ సినిమా చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. సాంకేతికంగా చాలా శ్రమించాల్సివుంట� �ంది. కల్యాణ్‌రామ్ ‘ఓం’ చిత్రంతో తెలుగులో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. ఆయన సినిమా ఫలితం ఎలా వుంటుందో చూసి త్రీడీ సినిమా చేసే విషయమై ఆలోచిస్తాను.

‘నాయక్’ ఆడియో వేడుకలో మీడియా వెంట్రుకతో సమానమని వ్యాఖ్యానించారు. ఆ మాటల వెనకున్న భావోద్వేగాలేమిటి?

గత మూడేళ్లుగా నేను అనుభవించిన మానసిక సంఘర్షణ తాలూకు ప్రతిస్పందన అది. ఎలక్షన్స్ పూర్తయిన దగ్గరినుంచి ఓ పత్రిక మా కుటుంబంపై అసత్య కథనాలు రాయడం మొదలుపెట్టింది. అబద్ధాల్ని పదే పదే చెబుతూ వాటినే నిజమని నమ్మింపజేసే ప్రయత్నం జరిగింది. ఓ మంచి వ్యక్తిని చూపించి ‘ఇతనే దొంగ...’ అని పదే పదే చెబితే సమాజం నిజంగా అతన్ని దొంగ అనుకుంటుంది. మనపై వస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేకపోతే జనాలు వాటిని నిజమని నమ్మే ప్రమాదముంది. కల్యాణ్ బాబాయ్ కూడా అలాంటి వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనేవారు. అయితే మన పనిలో మనం వుంటే..విమర్శకులు వాళ్ల పనిలో వాళ్లుంటున్నారు. అందుకే నేను వాస్తవమేమిటో స్పష్టం చేయదలచుకున్నాను. ఏది నిజమో చెప్పాలనకున్నాను. అందుకే ‘నాయక్’ ఆడియో వేడుకలో అలా మాట్లాడాల్సి వచ్చింది. అయితే అవి మొత్తం మీడియాను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు కావు. అలాంటి కథనాలు రాసిన వ్యక్తికి మాత్రమే ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి.

‘ఆంజ్’ సినిమా వైఫల్యం మీకు ఎలాంటి పాఠాల్ని నేర్పించింది?

ఆ సినిమా వైఫల్యంతో చాలా విషయాల్ని తెలుసుకున్నాను. దాని అపజయానికి చాలా కారణాలున్నాయి. అంతమావూతాన భవిష్యత్తులో ప్రేమకథలు చేయనని చెప్పను. మున్ముందు మాస్ సినిమాలతో పాటు ప్రేమకథలు కూడా చేస్తాను. నా భార్య ఉపాసన యష్‌చోప్రా సినిమాలకు పెద్ద ఫ్యాన్. పెళ్లయ్యాకే ఆమె యాక్షన్ సినిమాలు చూడటం మొదలుపెట్టింది. ఉపాసన కోసం ఓ ప్రేమకథ చేయాలని వుంది.

మీపై వచ్చే గాసిప్స్‌ను ఎలా స్వీకరిస్తారు?

‘చరణ్ సత్యహరిశ్చంవూదుడ� �లా వుంటాడురా...’ అని ఎవరైనా అన్నా బోర్ కొడుతుంది (నవ్వుతూ). గాసిప్స్ వస్తే ఫర్వాలేదు. అయితే అవి ఆరోగ్యకరంగా వుండాలి. ప్రామాణిక సమాచారం లేకుండా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించ వద్దు. రాసిన వారిని మనం ప్రశ్నించకుండా వుండాలి. గాసిప్స్‌లో నిజం వుంటే మనం కూడా భయపడతాం. వాస్తవాలు రాస్తే నేను కూడా ఏమీ అనలేను కదా!

అంటే ఎలాంటి గాసిప్స్ రాస్తే ఫర్వాలేదంటారు?

నేను షూటింగ్‌లకు ఓ అరగంట లేటుగా వస్తాను!..ఇది రాసుకోవచ్చు..ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే జిమ్ చేయడం నాకు అలవాటు. అందువల్ల ఉదయాన్నే షూటింగ్ వుంటే కొద్దిగా ఆలస్యంగా వస్తాను. అలోపు మిగతా తారగణంపై సీన్స్ ఏమైనా వుంటే తీసుకోమని చెబుతాను.

బాలీవుడ్‌కు 100కోట్లు...తెలుగు పరిక్షిశమకు 50కోట్ల కలెక్షన్స్ ఓ మైలురాయిలా మారాయి. ఆ మార్కును చేరుకుంటే హిట్ చిత్రాలుగా పరిగణిస్తున్నారు. ఈ ట్రెండ్‌పై మీరేమంటారు?

ఆ తరహా ట్రెండ్‌పై నాకు నమ్మకం లేదు. సినిమా బాగాఆడి నిర్మాతకు డబ్బులు వస్తే సంతోషపడతాను. సినిమా ఫలానా మార్క్ చేరుకోవాలన్న అంశాన్ని నమ్మను.

సినిమాల్లో నెం.1 స్థానం గురించి మీరేమంటారు?

ఈ నెంబర్‌గేమ్ పరిక్షిశమలో అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తుంది. ఈతరం హీరోలు ఒకరికొరకు కలుసుకున్నప్పుడు వారి మధ్య ఇలాంటి చర్చలు రావు. బాలీవుడ్‌లో ఇదే విషయంలో షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ గొడవలు పడే స్థాయికి వచ్చారు. సినిమా అనేది సమిష్టి కృషి. ఇక్కడ విజయం ఏ ఒక్కరి క్రెడిట్ కాదని నా ఆభివూపాయం.

ఎన్టీఆర్ ‘బాద్‌షా’ ప్రారంభోత్సవానిక� � అతిధిగా వచ్చారు. ఆయనతో మీకున్న స్నేహబంధం గురించి?

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ నాకు మిత్రుడయ్యారు. స్నేహం విషయంలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. అప్పుడే మంచి బాంధవ్యాలు ఏర్పడుతాయి. గత దీపావళికి ఎన్టీఆర్‌ను మా ఇంటికి డిన్నర్‌కు పిలిచాను. అతను కూడా ఈ మధ్యే నన్ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. ‘మగధీర’ సినిమా విడుదలైనప్పుడు మహేష్‌బాబు ఫోన్ చేసి బాగా చేశానని ప్రశంసించారు. ఇలా మా మధ్య ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణం వుంది.

చిరంజీవిగారి 150 సినిమాను మీరే నిర్మించబోతున్నా� �ని ప్రకటించారు. ఆ సినిమా ఎప్పుడు వుంటుంది?

నాన్న తప్పకుండా 150 సినిమా చేస్తారు. ఆ సినిమా కోసం రెగ్యులర్‌గా కథలు వింటున్నాను. ఇప్పటికే నాలుగు కథల్ని సిద్ధం చేసి వుంచాం.

మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా వున్నాయా?

పిరియాడిక్ సినిమాలు చేయాలన్నది నా డ్రీమ్. 1900 నుంచి 1947సం॥ స్వాతంవూతోద్యమ సమయంలోని కథాంశాల్ని తీసుకొని సినిమా చేయాలన్నది నా కల. అలాంటి వాతావరణంలోని సినిమాలంటే నాకు చాలా ఇష్టం.

ఇటీవల ‘బాద్‌షా’ ఆడియో వేడుకలో ఓ అభిమాని దుర్మరణం పాలయ్యారు. మీ దృష్టిలో ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహించాలి?

జీవితాంతం మన నడిచే అభిమానుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడియో వేడుకల నిర్వహణలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో ఇలాంటి ఆడియో వేడుకలు ఎన్నో జరిగాయి. ఎప్పుడూ అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. హోలోక్షిగామ్స్ ముద్రించి వేదిక సామర్థాన్ని బట్టి పాస్‌లు అందివ్వాలి. ఈ విషయంలో అభిమానుల్ని, నిర్మాతల్ని తప్పుబట్టలేం. ‘బాద్‌షా’ ఆడియో వేడుకలో జరిగిన సంఘటన దురదృష్టకరమైనది. నా ఉద్దేశ్యంలో ఆడియో వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజర్స్ ఆ సంఘటనకు బాధ్యత వహించాలి.

‘ఎవడు’, ‘జంజీర్’ చిత్రాల్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు?

ఈ రెండు చిత్రాలు వేసవిలోనే విడుదలవుతాయి. ఒక్కోసినిమాకు నాలుగు వారాల వ్యవధి వుంటుంది. రెండింటిలో ఏది ముందు విడుదలవుతుందో చెప్పలేను. ఎందుకంటే ‘జంజీర్’ను హిందీ, తెలుగు భాషల్లో ఓకే రోజు విడుదల చేయాలన్నది మా ఆలోచన. అందుకు సరైన డేట్స్ కోసం చూస్తున్నాను

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
charan interview..
« Reply #1 on: March 26, 2013, 11:40:59 AM »
namaste telangana interview..

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 298 Views Last post August 22, 2014, 02:37:27 PM
by siva
2 Replies 435 Views Last post December 02, 2015, 01:53:01 PM
by MbcMen
0 Replies 148 Views Last post October 20, 2015, 09:56:48 PM
by itsmesandyr