Author Topic: 'పర్యాటకం' పవర్‌ఫుల్ ఆర్థికాభివృద్ధి,ఉపాధి రంగాలకు ఇది ఎంతో కీలకం ప్రపంచ పర్యాటక సదస్సు ప్రారంభోత్సవ  (Read 627 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
సంస్కృతి, మత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు 'పర్యాటక రంగం' శక్తిమంతమైన ఆయుధం అని కేంద్ర పర్యాటక మంత్రి కె. చిరంజీవి అన్నారు. ఆర్థికాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక సమ్మిళితం వంటి అంశాల్లో పర్యాటక రంగం ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. శుక్రవారం నాడిక్కడ మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పర్యాటక సదస్సును చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (పాటా) సీఈవో మార్టిన్ క్రెయిగ్స్, ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సదస్సు (యూఎన్‌డబ్ల్యుటీవో) సెక్రటరీ జనరల్ తలేబ్ రిఫాయి, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి పర్వేజ్ దీవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో విస్తృతంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంవత్సరాల్లో అధిక వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకాభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకె ళ్లేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వాలు, స్థానిక యువతను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసిన దేశాల్లో భారత్ ముందుందని తెలిపారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పర్యాటకాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్ చారిత్రక నగరమని, ఇక్కడ విస్తృత పెట్టుబడి అవకాశాలు, ఆదునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ సదస్సుకు 24 దేశాలకు చెందిన 97 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

సదస్సుల రాజధానిగా హైదరాబాద్: సీఎం
హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సుల రాజధానిగా అభివృద్ధి చెందిందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక సదస్సుకు కూడా హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. ఈ సదస్సులో జరిగే చర్చలు దేశంతోపాటు రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికి కూడా తోడ్పడతాయన్నారు. వివిధ దేశాల నుంచి తొలిసారి నగరానికి వచ్చిన అతిథులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యాని రుచి చూడాలని, ఇక్కడి అందాలను వీక్షించాలని అన్నారు.

పర్యాటక రంగం అభివృద్ధికి వీలుగా రాష్ట్రంలో మౌలిక సదుపా యాలను అభివృద్ధిపర్చాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో కూడా మౌలికసదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించటంలో ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. అతిథులను తాము దేవుళ్లతో సమానంగా గౌరవిస్తామని...ఈ సదస్సుకు హాజరైన వారంతా తమకు దేవుళ్లలాంటివారేనని మంత్రి వట్టి వసంతకుమార్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ 'నవ్వుల నగరం': రిఫాయి
హైదరాబాద్‌ను 'నవ్వుల నగరం'గా యూఎన్‌డబ్ల్యుటీవో సెక్రటరీ జనరల్ తాలెబ్ రిఫాయి అభివర్ణించారు. పర్యాటక రంగానికి సంబంధించి 2013 చారిత్రక సంవత్సరం అని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం వృద్ధి రేటు 3.5 నుంచి 4 శాతం ఉంటుందని... అదే ఆసియా ప్రాంతంలో మాత్రం 5 నుంచి 6 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. పాటా సీఈవో మార్టిన్ క్రెయిగ్స్ పర్యాటక రంగాభివృద్ధికి యూఎన్‌డబ్ల్యుటీవో ఎనలేని కృషి చేస్తోందని ప్రశంసించారు. హేతుబద్ధమైన నియమ, నిబంధనలను పెట్టడంతోపాటు... అవకాశాల కల్పనలో ప్రైవేట్ రంగానికి పెద్ద పీట వేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.


Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
:పర్యాటక రంగంలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, పర్యాటక ప్రదేశాల్లో సుస్ధిరతతో కూడిన అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఐక్యరాజ్యసమతి ప్రపంచ వాణిజ్య సంస్ధల కమిషన్ 25వ మూడు రోజుల ఉమ్మడి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, యుఎన్‌డబ్ల్యుటివో సెక్రటరీ జనరల్ డాక్టర్ టలీబ్ రిఫైయ్, పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ సిఇవో మార్టిన్ క్రాగ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి పర్యావరణాన్ని, ప్రాచీన పర్యాటక ప్రదేశాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, లేని పక్షంలో భవిష్యత్ తరాలు క్షమించవని అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంతో పాటు వౌలిక సదుపాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో స్ధానిక ప్రజలు, యువతకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. హిమాలయ ప్రాంతం లడక్‌లో ప్రజలు తమ ఆదాయంలో 10 శాతం గ్రామ పర్యాటక రంగం అభివృద్ధికి కేటాయిస్తారన్నారు. దీని వల్ల మంచు పర్వతాల అందాలు, పర్యావరణాన్ని కాపాడుకుంటున్నారన్నారు.కేరళలో కుమరకోమ్, తమిళనాడులో కరైకుడి, ఆంధ్రప్రదేశ్‌లో మారేడుమిల్లి, మధ్య ప్రదేశ్‌లో చోగమ్, గుజరాత్‌లో హోడ్కా ప్రాంతాలు సుస్ధిరతతో కూడిన పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి అంకితమయ్యాయన్నారు. పర్యాటక రంగం శాంతిని ప్రసాదిస్తుందని, వివధ వర్గాల మధ్య సామరస్యతను పెంపొందిస్తుందని, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశమన్నారు. భవిష్యత్తులో పసిఫిక్, ఆసియా ప్రాంతాలు పర్యాటక రంగంలో కనీవినీ ఎరుగని అభివృద్ధిని నమోదు చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు హైదరాబాద్ నగరం ఉత్తమమైనదన్నారు. వరంగల్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో వౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందని, 2011లో 153 మిలియన్ల మంది పర్యాటకులు, 0.26 మిలియన్ల విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారన్నారు. 2010 సంవత్సరంలో కేంద్ర మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌ను ఉత్తమ హెరిటేజ్ సిటీగా ఎంపిక చేసిందన్నారు. గత ఏడాది 174 దేశాలకు చెందిన 9 వేల మంది ప్రతినిధులు, 20 మంది దేశాధినేతలు 19 రోజుల పాటు జీవ వైవిధ్య సదస్సుకు హాజరయ్యారని, ఈ సదస్సు వల్ల హైదరాబాద్ నగరం ఖ్యాతి ఇనుమడించిందన్నారు. లేపాక్షి, అరకు, కాకతీయ, ఫ్లెమింగో, కాకినాడ బీచ్ వాంటి అనేక ఉత్సవాలను నిర్వహించామన్నారు. యుఎన్‌డబ్ల్యుటివో సెక్రటరీ జనరల్ తలీబ్ రిఫైయ్ మాట్లాడుతూ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 1035 మిలియన్ల ప్రజలు అంతర్జాతీయ సరిహద్దులు దాటారన్నారు. ఆసియా ప్రాంతంలో 4 శాతంపైన అభివృద్ధి పర్యాటక రంగంలో నమోదైందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే పర్యాటక రంగం మనుగడ ఉంటుందన్నారు. పర్యావరణం విధ్వంసం వల్ల మొదటి బాధితురాలు పర్యాటక రంగం అవుతుందని, దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పసిఫిక్ ఆసియా ట్రావెలర్స్ అసోసియేషన్ సిఇవో మార్టిన్ క్రైగ్స్ మాట్లాడుతూ 2050 నాటికి 16 బిలియన్ల మంది అంతర్జాతీయ సరిహద్దులు దాటి పర్యాటక రంగంలో పాల్గొంటారన్నారు. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి పర్వేజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.
..........................................
Andhrabhoomi

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 261 Views Last post April 11, 2016, 11:54:29 AM
by MbcMen