Author Topic: నంబర్ 1 లక్ష్యం లేకపోతే పనిచేయడమే వృథా  (Read 367 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
తానే ఓ శిల్పి. తన శరీరమే ఓ శిల. సినిమా సినిమాకీ ఓ కొత్త రూపు. దటీజ్ అల్లు అర్జున్. ‘ఇద్దరమ్మాయిలతో’ కలిసి ఇప్పుడు న్యూలుక్‌తో కనిపిస్తున్నారాయన. ఓ వైపు గిటార్ ప్లేయర్‌గా రొమాన్స్ పలికిస్తూ... మరో వైపు యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా వెండితెరపై గర్జించబోతున్నారు. ఈ సినిమా ఓ ‘బ్లాక్ బస్టర్’ అని ఇప్పటికే ఫిక్సయిపోయారు బన్నీ. సోమవారం హైదరాబాద్‌లో బన్నీ మీడియాతో చెప్పిన ముచ్చట్లు.

*** సినిమా పేరేమో సాఫ్ట్‌గా ఉంది. మీరేమో... కత్తితో విలన్లను చీరేస్తున్నారు. కన్వే అవ్వడం లేదే?
మీకు ఆ సందేహం రావాలనే అలా చేశాం. సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రోమోలకు ఇంత స్పందన రావడం ఈ సినిమాకే. దానికి తోడు దేవిశ్రీప్రసాద్ సంగీతం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే పాటలు. దాంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

*** దానికి తగ్గట్టే సినిమా ఉంటుందంటారా?
ఈ సినిమా విషయంలో నేను ఒక్కటే చెబుతా. నా కెరీర్‌లో హిట్లు ఎన్ని ఉన్నా... ‘ఆర్య’ ఓ మలుపు. ‘దేశముదురు’ మరో మలుపు. అలా ఈ సినిమా కూడా నా కెరీర్‌లో ఓ మలుపు అవుతుంది. నా కెరీర్‌లో బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాలోదే అవుతుంది.

*** అసలు ఈ కథలో మీకు నచ్చిందేంటి?
ఆ విషయం చెప్పను కానీ... ఒకటి మాత్రం చెబుతా. రెండేళ్ల క్రితం పూరి జగన్నాథ్ ఈ పాయింట్ చెప్పారు. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ‘దీన్ని ఇక్కడ లాక్ చేసేయ్. మళ్లీ మనిద్దరం సినిమా తీస్తే.. కచ్చితంగా ఈ కథతోనే తీయాలి’ అని చెప్పాను. తను కూడా ఈ కథ నేను తప్ప వేరొకరు చేస్తే న్యాయం జరగదని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ‘దేశముదురు’ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పూరితో పనిచేసే ఛాన్స్ వచ్చింది. దాంతో దాచి పెట్టిన కథను బయటకు తీసి, దానికి కావాల్సినంత సొబగులద్ది సెట్స్‌కి తీసుకొచ్చారు పూరి.

*** ఇద్దరమ్మాయిల్లో ఎవరికి ఎక్కువ మార్కులేస్తారు?
ఇద్దరూ ఇద్దరే. అమలాపాల్ మంచి నటి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. కేథరిన్... తొలి సినిమా అయినా అమలకు ఏ మాత్రం తక్కువ కాకుండా చేసింది. సో... ఇద్దరూ సూపరే.

*** ‘దేశముదురు’ తర్వాత పూరిజగన్నాథ్‌తో చేశారు. ఆయనలో ఏమైనా తేడా కనిపించిందా?
ఆయనలో కాదు నాలో కనిపించింది. కాస్త ఇంప్రూవ్ అయ్యానేమో అనిపించింది. పూరీ గత చిత్రాల్లా ఈ సినిమా ఉండదు. ఆయన సినిమాల్లో కథకంటే డైలాగులకు, స్క్రీన్‌ప్లేకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. ఈ సినిమాలో మాత్రం కథకే ప్రాధాన్యత.

*** ఇందులో ఏమైనా రిస్కీ షాట్స్ చేశారా?
ఇంత టెక్నాలజీని పెట్టుకొని రిస్కీ షాట్స్ చేయడం ఫూలిష్‌నెస్ అవుతుంది. ఇప్పటి హీరోలు అంత రిస్క్ చేయనవసరం లేదని నా అభిప్రాయం.

*** ఇప్పుడున్న హీరోల్లో డాన్సుల్లో మీకు పోటీ ఎవరనుకుంటున్నారు?
నాకా...? పోటీనా...? నాకు నేనే పోటీ. అంటే మిగిలిన వాళ్లకు అంత లేదని కాదు. నాకు నేనే పోటీ అంటే... ఎప్పటికప్పుడు నా డాన్సుల్లో బలహీనతలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా డాన్స్ ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే అలా అన్నా. నిజానికి ఇప్పుడు అందరూ మంచి డాన్సర్లే. తారక్, చరణ్, ప్రభాస్, నితిన్, రామ్... ఇలా అందరూ.

*** అప్పట్లో డాన్సుల్లో నంబర్‌వన్ మెగాస్టార్. ఇప్పట్లో బన్నీ అని కొందరి అభిప్రాయం?
మెగాస్టార్ డాన్సుల్లోనే కాదు, అన్నిట్లోనూ నంబర్ వన్నే. ఓవరాల్‌గా ఆయన నంబర్‌వన్. అలాగే నేను కూడా అన్ని విషయాల్లో బెస్ట్ అనిపించుకోవాలనుంది.

*** అంటే నంబర్‌వన్ అవ్వడం మీ గోలా?
ఆ లక్ష్యం ఉండాలండీ.. లేకపోతే పనిచేయడమే వేస్ట్. నాకే కాదు... ఎవరి లక్ష్యం అయినా అదే.

*** కారుకు బ్లాక్ ఫిల్మ్ తీసేయడం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా?
మామూలుగా కాదండీ బాబు... విపరీతంగా. కార్లో నేను కనిపిస్తుండటంతో నన్ను చూడటానికి కారును ఓవర్ టేక్ చేసేస్తున్నారు అభిమానులు. మొన్నామధ్య కొంతమంది అమ్మాయిలైతే... నన్ను ఎక్కువ సేపు చూడొచ్చని తాము స్లోగా వెళుతూ కారును కూడా ముందుకు వెళ్లనీయలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. మా లాంటి సినిమా వాళ్లను ఈ విషయంలో మినహాయిస్తే మంచిదని నా అభిప్రాయం. పైగా కారును స్పీడ్‌గా నడపడం నాకు ఇష్టం ఉండదు. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదుటిమనిషిని దృష్టిలో పెట్టుకొని నడుపుతాన్నేను.

Offline vkakani

 • Hero Member
 • *****
 • Posts: 4,960
 • [email protected]

Offline RamSharan

 • Power Member
 • ******
 • Posts: 8,299
 • Die Hard Fan Of Chiru From Childhood

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 266 Views Last post October 18, 2014, 07:25:36 AM
by siva