Author Topic: FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on  (Read 686 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది.సీబీఐ తాజా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును నిందితుడిగా చేర్చింది. బొగ్గు స్కాం కేసులో ఇప్పటికే దాసరి సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని దాసరి నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ వ్యవహారంలో దాసరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎఫ్ఐఆర్ నమోదు నేపథ్యంలో హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా సహా 19 చోట్ల సీబీఐ సోదాలు జరుపుతోంది. దాసరి కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా బొగ్గు కేటాయింపులు జరిగాయని, ఈ స్కాంలో దాసరికి భారీగా ముడుపులు అందాయని సీబీఐ భావిస్తోంది. తాజా ఎఫ్ఐఆర్‌లో కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌ను కూడా సీబీఐ నిందితుడిగా చేర్చింది.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #1 on: June 11, 2013, 02:44:12 PM »
ప్రముఖ దర్శక,నిర్మాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి డాక్టర్ దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి అంటుకుంది. ఆయన మెడకు కోల్గేట్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా యుపిఏను కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన కూడా ఓ నిందితునిగా చేరిపోయారు. ఈ కుంభకోణం పార్లమెంటు ఉభయ సభలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇదే కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు నివేదికను తెప్పించుకుని మార్పులు చేర్పులు చేసినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్‌ తన పదవిని కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వేగవంతం చేసింది. విచారణలో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కొత్తగా కాంగ్రెస్ నేతలు పలువురు తెరపైకి వస్తున్నారు. లక్షా 86 వేల కోట్ల రూపాయల ఈ కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. హర్యానాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపి నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో నవీన్‌ జిందాల్‌ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వాస్తవానికి గత ఏడాదే బొగ్గు కుంభకోణం సెగ దాసరిని తాకింది. 2006 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులను దృష్టిలోపెట్టుకొని సిబిఐ అధికారులు విచారణలు, సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. ఈ కాలంలోనే ఆయన కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే బొగ్గు గనుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని కాగ్‌ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్లో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సిబిఐ దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్‌, ధన్‌బాద్‌, నాగపూర్‌లతో పాటు 10 నగరాలలో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలోనే హైదరాబాద్లో దాసరిని విచారించినట్లు, ఆయన ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే అప్పట్లో తనను సిబిఐ విచారించలేదని, తన ఇంట్లో తనిఖీలు జరగలేదని ఆయన ఖండించారు.

ఎఫ్ఐఆర్లో దాసరి, మాజీ మంత్రి నవీన్ జిందాల్ పేర్లను చేర్చిన సిబిఐ బృందాలుగా విడిపోయి ఈ రోజు(11.06.2013) ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లోని 19 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా దాసరి నివాసంలో కూడా సోదాలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ గ్రూపు కంపెనీలకు భారీగా కోల్‌ బ్లాక్‌లు కేటాయించినందుకు ప్రతిఫలంగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపణ. దాసరికి చెందిన కంపెనీ షేర్లను మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అధికంగా జిందాల్‌ గ్రూపుతో అనుబంధం ఉన్న కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు, టీవీ సీరియళ్లు తీసే సౌభాగ్య మీడియా మన రాష్ట్రానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ. ఇది బాంబే స్టాక్‌ ఎక్ఛ్సేంజ్లో లిస్ట్‌ అయింది. దీంట్లో సిరి మీడియా అనే కంపెనీకి 59.6 శాతం వాటా ఉంది. తెలుగు సినిమా దిగ్గజం, కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరికి చెందినదే ఈ సిరి మీడియా. అంటే సౌభాగ్య మీడియాలో మెజార్టీ వాటా దాసరిదే. ఈ సౌభాగ్యలో జిందాల్‌తో అనుబంధం ఉన్న న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ అనే కంపెనీ 2 కోట్ల 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది. 2008 డిసెంబరు 8న ఈ పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో సౌభాగ్య షేరు ధర 27 రూపాయలు. మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఒక్కో షేరు 112 రూపాయల 50 పైసలకు న్యూఢిల్లీ ఎగ్జిమ్‌ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో వాటా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. అందుకే సౌభాగ్య మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిపింది. దాసరి నారాయణరావును ఏ క్షణంలో అయినా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #2 on: June 11, 2013, 03:04:08 PM »
super amma time start ayindi..

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #3 on: June 11, 2013, 04:42:02 PM »
The former Union Minister of State for Coal, Mr.Dasari Narayana Rao's house was raided by the officials of CBI on 11th June,2013. He was, in fact, grilled by the CBI some days ago in connection with the nation wide coal scam's case. His name was incorporated in FIR by the CBI yesterday. As per the reports, the CBI searched his house for 9 hours and received some important documents and left his house. Dasari rendered his services as a union minister from 2004 to 2008. He was gossiped to have received Rs.2.25 crores as a loan without assurance from Navin Jindal for having sanctioned five coal mines for the latter's company.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,674
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #4 on: June 11, 2013, 04:52:09 PM »
న్యూఢిల్లీ, జూన్ 11 : బొగ్గు కుంభకోణం కేసు దాసరి నారాయణరావు మెడకు చుట్టుకుంటుంది. మంగళవారం దాసరి నివాసంలో, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో సీబీఐ జరిపిన సోదాలు ముగిసాయి. అయితే సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. వెళుతూ ఓ కవరును తీసుకువెళ్లినట్లు సమాచారం. నవీన్ జిందాల్ కంపెనీ నుంచి దాసరి కంపెనీకి రూ. 2.25 కోట్లు హామీ లేని రుణం ఇచ్చినట్లుగా దర్యాప్తులో తేలినట్లు తెలియవచ్చింది.

నవీన్ జిందల్ కంపెనీకి మొత్తం ఏడు బొగ్గు గనులు కేటాయించగా, దాసరి నారాయణరావు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న సమయంలో జిందాల్‌కు ఐదు బొగ్గు గనులు కేటాయింపులు జరిగాయని, భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ దర్యాప్లులో తేలినట్లు సమాచారం. ఢిల్లీలోని నాలుగు పైవ్రేటు కంపెనీలు, హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.

దాసరి నారాయణరావు, జిందాల్ డైరెక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దాసరిపై మూడు సెక్షన్లు నమోదయ్యాయి. ఒకటి 120 బి (నేరపూరిత కుట్ర) రెండు : 420 (మోసం), మూడు :13అండ్ డి ( అవినీతి). మొత్తం 15 మంది సీబిఐ అధికారులు బృందాలుగగా విడిపోయి సోదాలు జరిపారు. ఈ వ్యవహారంలో దాసరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు భావించినా, అలాంటిదేమీ జరగలేదు.

Offline vkakani

  • Hero Member
  • *****
  • Posts: 4,960
  • [email protected]
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #5 on: June 11, 2013, 05:35:22 PM »
kummeyalu ko*ukuni

Offline manikumar18

  • Hero Member
  • *****
  • Posts: 3,043
  • KONIDELA VEERABHI"MANI"
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #6 on: June 11, 2013, 05:42:00 PM »
dasari dasa tiringindi

Offline Attitude

  • Administrator
  • Hero Member
  • *****
  • Posts: 2,500
    • Chiranjeeviblog
FIR filed on Dasari in COAL Scam. Raids are currently going on
« Reply #7 on: June 14, 2013, 10:39:57 PM »
Boggula Puli dasari should go to jail forever

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
RmaCharan counter to Dasari

Started by charan fan Ram Charan

4 Replies 384 Views Last post March 19, 2015, 11:07:29 PM
by Pa1Kalyan
1 Replies 424 Views Last post March 31, 2015, 11:00:45 PM
by siva
2 Replies 250 Views Last post March 04, 2016, 12:12:57 PM
by Pa1Kalyan