Author Topic: కప్ప నోట్లో త్రాచుపాము, మింగేందుకు ప్రయత్నాలు  (Read 603 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
ఖమ్మం: ఓ కప్ప త్రాచుపామును మింగిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. జిల్లాలోని విఆర్‌ పురం మండలం ఒడ్డుగూడెం కాలనీలో బుధవారం ఈ అరుదైన సంఘటన జరిగింది. సాయిబాబా గుడి వద్ద గల డ్రైనేజీలో ఓ పెద్ద కప్ప ఓ త్రాచుపామును మెడ వరకు మింగి ఇంకా మింగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ పాము కాస్తంత పక్కకు జరిగి పడగ విప్పి కాటేస్తున్న సంఘటన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంది. ఈ వింతను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజల అలికిడికి భయపడిన కప్ప డ్రైజేజీ లోపలికి వెళ్లిపోయింది.