Author Topic: If Sardar Patel was the first Prime Minster of this country?  (Read 419 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
If Sardar Patel was the first Prime Minster of this country?
« on: November 16, 2013, 09:03:10 AM »
- ఎస్.కె. సిన్హా

చిన్నతనంలో గాంధీజీని గురుతుల్యుడిగా భావించగా, నెహ్రూ అంటే అత్యంత గౌరవభావం ఉండేది. ఇదే సమయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను శ్లాఘించేవాడిని. స్వాతంత్య్రం మరో మూడేళ్ళకు వస్తుందనగా సైన్యంలో చేరాను. అటు తర్వాత పైముగ్గురు మహనీయులపై గౌరవభావం మరింతగా పెరిగింది. సైన్యంలో చేరకముందు ఈ ముగ్గురు నాయకులను దూరంనుంచి మాత్రమే వీక్షించగలిగాను. అయితే సైన్యంలో చేరిన తర్వాత ఆ మహామహులను సన్నిహితంగా చూడగలగడం నా అదృష్టం. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్ల సందర్భంగా, ఒక జూనియర్ అధికారిగా సైనిక కేంద్ర కార్యాలయంలో అంతర్గత భద్రత బాధ్యతను నాకప్పగించారు. అప్పట్లో కలకత్తాలో జరిగిన అల్లర్ల సందర్భంగా మహాత్మాగాంధీ ఒంటి చేత్తో అక్కడి పరిస్థితులను చాలావరకు సానుకూలం చేయగలిగారు. మరి అదే పంజాబ్‌లో జరిగిన అల్లర్లను 50వేల పంజాబ్ సరిహద్దు దళం నివారించలేకపోయింది!

మేజర్ జనరల్ కరియప్ప తోపాటు నేను ఒక హరిజన కాలనీకి వెళ్లాను. అప్పుడు కరియప్ప...శ్రీనగర్‌ను భారత సైన్యం ఏవిధంగా రక్షించగలిగిందో మహాత్ముడికి వివరించి చెప్పారు. నెహ్రూను ఆయన కార్యాలయంలో నేను రెండుసార్లు చూడటం తటస్థించింది. 1948 నవంబర్‌లో జొజిలాపాస్‌ను స్వాధీనం చేసుకున్న విధానాన్ని నాటి లెఫ్ట్‌నెంట్ జనరల్ మరియ మన సైనిక కమాండర్ అయిన కరియప్ప నెహ్రూకు వివరించారు. అప్పుడు నేను కరియప్ప పక్కనే ఉన్నాను. అంతేకాదు కార్గిల్ వైపునకు, ముట్టడికి గురైన లేహ్ ప్రాంతాన్ని దాటి ముందుకు ఏవిధంగా మనసైన్యం చొచ్చుకొని వెళ్లిందీ కరియప్ప, నెహ్రూకు వివరించారు. కాశ్మీర్ వద్ద కాల్పుల విరమణ రేఖను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి సదస్సుకు, నేను మన ప్రతినిధి బృందంలో కార్యదర్శిగా హాజరయ్యాను. నాకు సర్దార్ పటేల్‌తో పరిచయం చాలా తక్కువ. ఆయన రోజూ లోడీ గార్డెన్స్‌లో కొంతమందితో కలిసి ఉదయపునడక సాగించేవారు. మరి ఇదే సమయంలో నేను ఉదయం పరుగెత్తడంకోసం వెళ్ళేవాడిని. ఎప్పుడైతే పటేల్ ఎదురుపడతారో అప్పుడు నేను నా పరుగును ఆపి ఆయనకు ‘ప్రణా మం’ చేసేవాడిని. ఆయన కూడా అందుకు స్పందనగా తల వూపేవారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన నేను ‘ప్రణామం’ చేసినప్పుడు చిరునవ్వు నవ్వేవారు. 1948 సెప్టెంబర్‌లో, హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్య గురించి చర్చించేందుకు కరియప్పను, పటేల్ పిలిపించారు. నేను, పటేల్ పిఎతో కలిసి వరండాలో కూర్చున్నాను.

నెహ్రూ, పటేల్‌లు...మహాత్ముడికి రెండు చేతుల మాదిరిగా పనిచేసేవారు. వీరి మధ్య ఎన్ని విభేదాలున్నప్పటికీ, మహాత్ముడిపట్ల వినయ భావంలో మాత్రం ఇద్దరిదీ ఏకాభిప్రాయమే! గాంధీజీకి, నెహ్రూపై పితృవాత్సల్యం ఉండేది. ఇదే సమయంలో పటేల్‌లోని వాస్తవిక దృక్కోణం, కార్యాలను సమర్ధవంతంగా అమలు జరిపే సామర్ధ్యాన్ని గాంధీజీ ఎప్పు డూ మెచ్చుకుంటూ ఉండేవారు. బార్డోలీ సత్యాగ్రహం తర్వాత ఆయన, పటేల్‌కు సర్దార్ బిరుదునిచ్చారు. పటేల్ సంస్థాగతంగా మెలగడమే కాకుండా పార్టీని పూర్తిగా నియంత్రించేవారు.

నెహ్రూ ఆదర్శవాది, మంచి దార్శనికుడు. ఆయనలో ఎంతటి చరిష్మా ఉండేదంటే, యువకులంతా ఆయన్ను ఎంతగానో అభిమానించేవారు. మరోమాటలో చెప్పాలంటే ఆయన యువతకు ఒక చిహ్నంగా మిగిలిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మొత్తం, పటేల్ ప్రధానిగా ఉండాలని ముక్తకంఠంతో ఆమోదం తెలిపినా, మహాత్ముడు పార్టీ అభిప్రాయాన్ని పక్కనబెట్టి మరీ ఆ పదవికి నెహ్రూను ఎంపిక చేశారు. ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా, పటేల్ ఏవిధమైన అసంతృప్తిని వ్యక్తం చేయకుండా, బాపూజీ నిర్ణయాన్ని శిరసావహించారు. నెహ్రూ కింద ఉప ప్రధానిగా పనిచేయడానికి అంగీకరించారు. మరి నెహ్రూ, పటేల్ కంటే 14 ఏళ్ళు చిన్న! స్వతంత్ర భారత దేశానికి పటేల్ చేసిన సేవలు నిరుపమానం. 500 సంస్థానాలను ఆయన ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారు. అంతేకాదు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, ఐసిఎస్, ఐపి వ్యవస్థలను ఆల్ ఇండియా సర్వీసులను-ఐఎఎస్, ఐపిఎస్- కొనసాగించడంలో కృతకృత్యులయ్యారు.

1948, జనవరిలో నెహ్రూ-పటేల్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అప్పుడు పటేల్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాత్ముడు మళ్ళీ కలుగజేసుకొని, వీరిద్దరిని పిలిచి విభేదాలు విడనాడి, కలిసి పనిచేసుకోవాల్సిందిగా ఒప్పించారు. కేవలం వీరిద్దరి మధ్య సఖ్యత కుదర్చడంకోసం చేసిన యత్నం కారణంగానే మొట్టమొదటిసారి ఆయన తన రోజువారీ ప్రార్థనకు వెళ్ళడం ఐదు నిముషాలు ఆలస్యమైంది. సరీగ్గా అప్పుడే బాపూజీ హత్యకు గురయ్యారు. అటు తర్వాత కూడా పటేల్ ఎన్నడూ తాను మహాత్ముడికిచ్చిన మాటను జవదాటలేదు. తాను జీవించి ఉన్నంతవరకు నెహ్రూకు విధేయుడిగానే పనిచేశారు.
మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఒక లెజెండరీ అనే చెప్పాలి. మన ప్రజాస్వామ్య రాజకీయాలను ఆయన సువ్యవస్థాపితం చేశారు. 17 సంవత్సరాలపాటు అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగారు. నాడే ఆయన విద్య, సైన్స్ ప్రాధాన్యతలను గుర్తించి అమలు చేసిన విధానాలు, నేడు ఈ రంగాల్లో దేశం సాధించిన ప్రగతికి పునాదులు! నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానం, నైతిక సూత్రాలపై ఆధారపడింది. నేడు అంతర్జాతీయంగా దేశం ఒక స్థాయికి చేరుకోవడానికి ఆయన విధానాలు చోదకశక్తులుగా ఉపయోగపడ్డాయి. 1962లో చైనాయుద్ధంలో మనం దారుణంగా ఓడిపోవడానికి, కాశ్మీర్ రావణకాష్టం కావడానికి వ్యూహాత్మకంగా ఆయన హ్రస్వదృష్టి కారణమని చెప్పడానికి పెద్దగా సంకోచించాల్సిన అవసరం లేదు.

దున్‌క్రిక్ ప్రాంతలో బ్రిటష్ సైన్యంలో పదిశాతం తుడిచిపెట్టుకుపోయింది. ఇక బ్రిటన్‌కు సహచర దేశాలంటూ ఏవీ మిగల్లేదు. ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలు లొంగిపోయాయి. ఏడాది తర్వాత యుఎస్‌ఎస్‌ఆర్ తన వ్యవహారశైలి మార్చుకుంది. రెండేళ్ళ తర్వాత అమెరికా యుద్ధంలో భాగస్వామ్యమైంది. ఇక బ్రిటన్‌లోకి జర్మనీ సైన్యాలు ప్రవేశించడమే తరువాయి. అయినప్పటికీ చర్చిల్ భయపడలేదు. ఒకరకంగా చెప్పాలంటే నాటి బ్రిటన్‌తో పోలిస్తే, 1962 చైనా యుద్ధం సమయంలో భారత్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నదనే చెప్పాలి. పెద్ద సంఖ్యలో భారత సైన్యం చెక్కు చెదరలేదు. హిమాలయాల్లో మార్గాలు విపరీతమైన మంచు కారణంగా మూసుకుపోయాయి. ఫలితంగా మైదాన ప్రాంతాల్లో చైనీయులు దాడి జరిపే సామర్ధ్యం పరిమితస్థాయికి కుదించుకుపోయింది. అంతేకాదు మనకు అత్యంత శక్తివంతమైన అమెరికా, ఇతర దేశాల మద్దతు ఉన్నది. ఇన్ని రకాల సానుకూలతలు ఉన్నప్పటికీ, నెహ్రూ అప్ప ట్లో దేశప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగిస్తూ..తన హృదయం అస్సాం ప్రజలకోసం తపించిపోతున్నదన్నారు. ఇదే సమయంలో తీవ్ర నైరాశ్యానికి గురైన ఆయన, సహాయం కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడికి లేఖలు రాసారు. చివరకు అత్యంత అవమానకరమైన రీతిలో ఏకపక్ష కాల్పుల విరమణను అంగీకరించారు.

ప్రజాస్వామ్యం పట్ల నెహ్రూ ఎంతో నిబద్ధత కలిగివున్నప్పటికీ..తన కుమార్తెకే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు! అంతేకాదు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అప్రజాస్వామ్య రీతిలో రద్దు చేశారు!! నెహ్రూ, తన కుమార్తె ఇందిరను రాజకీయాల్లో రాణించడానికి ఎంతగానో ప్రోత్సహించారు. ఈ క్రమంలో అత్యంత సీనియర్లయిన తన సహచరులను కూడా పక్కన పెట్టడానికి వెనుకాడలేదు. ఆయన తర్వాతి కాలంలో వరుసగా అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ, తదితరులు దేశానికి గతిశీలక పాలనను అందించారు. ఇవన్నీ కూడా నెహ్రూకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతను మసకబార్చేవే. పటేల్‌లోని విచక్షణా జ్ఞానం, వ్యూహాత్మక దృక్కోణం..ఆయన 1950 డిసెంబర్ 17న రాసిన లేఖను చదివితే అర్ధమవుతాయి. కొద్దివారాల్లో మరణిస్తాడనగా ఆయన రాసిన లేఖ ఇది. అందులో ఆయన చైనా వల్ల రానున్న ప్రమాదంపై హెచ్చరించారు.
మనదేశ తొలి ప్రధానిగా సర్దార్ పటేల్ వ్యవహరించి ఉన్నట్లయితే పరిస్థితి భిన్నంగా ఉండేదని, అందువల్ల పటేల్ మరణానంతరమే నెహ్రూ ప్రధాని పదవిని చేపట్టి ఉండాల్సిందని చాలామంది దృఢ అభిప్రాయం. ఇవన్నీ నరేంద్రమోడి పుట్టి పెరిగి టీస్టాల్‌లో పనిచేస్తున్న కాలానికి ముందే జరిగిన సంఘటనలు. పటేల్ మరణానంతరం, నెహ్రూ కుటుంబానికి వీర విధేయులు, కుహనా సెక్యులరిస్టులు, పటేల్ దేశానికి చేసిన మేలును తక్కువ చేసి చూపడానికి యత్నించారు. అంతేకాదు ఆయన్ను మతతత్వవాదిగా ముద్ర వేయడానికి కూడా వారు వెనుకాడలేదు. నెహ్రూ, పటేల్..ఇద్దరూ సెక్యూలరిస్టులే. కానీ మార్గాలు వేరు. మైనారిటీల పట్ల నెహ్రూ చాలా ఉదారంగా వ్యవహరించారు. వారికి వెసులుబాటు కల్పించడమే ఆయన ధ్యేయం. మైనారిటీల పట్ల మంచిగా వ్యవహరిస్తామని, ఒకపక్క హామీ ఇస్తూనే.. వారు రెండు పడవలపై కాలు పెట్టరాదని మరోపక్క పటేల్ వారిని హెచ్చరించారు. అందుకనే మహాత్ముడు పటేల్ గురించి వ్యాఖ్యానిస్తూ...ఆయన సెక్యూలరిస్టే..కానీ ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాటాడటాన్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది, అని అంటూండేవారు.

1954లో భారతరత్న అవార్డును దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. మరి ఆ అవార్డు తొలిసారి దక్కవలసిన వ్యక్తి సర్దార్ పటేల్. కానీ ఆయన మరణించిన 40 ఏళ్ళ తర్వాత అంటే 1990లో పటేల్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. అదికూడా ఒక కాంగ్రెస్సేతర ప్రభుత్వ హయాంలో! ఇప్పటికీ ఢిల్లీలో అరడజను స్మారక చిహ్నాలున్నప్పటికీ, అందులో ఒక్కటి కూడా పటేల్‌కు చెందినది లేదు. అనేక ప్రభుత్వ ప్రాజెక్టులకు నెహ్రూ కుటుంబ సభ్యుల పేర్లే ఉన్నాయి. కానీ సర్దార్ పటేల్ పేరుమీద ఒక్కటీ లేదు. భారత్‌కు చెందినంతవరకు గొప్ప ‘సర్దార్’ను కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం నరేంద్రమోడి పటేల్ ఇమేజ్‌ను దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తృత పరచేందుకు కృషి చేస్తున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెస్ ఆలస్యంగా మేల్కొని పటేల్‌ను గౌరవించడం మొదలుపెట్టింది. ఏది ఏమైనా నెహ్రూ, పటేల్‌లు లెజెండరీ నాయకులనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు మన జాతి జిహ్నాలు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
If Sardar Patel was the first Prime Minster of this country?
« Reply #1 on: November 16, 2013, 09:29:55 AM »
In this generation maximum people don't know history correctly. My father used to tell me the situations before independence and after independence situations. To my father, my grand father used to tell about the things at that time since my father born at 1946.  My father told that Gandhiji likes patel and Nehru. Nehru wants PM, then Gandhiji convinced Patel. But actually Gandhiji wants Patel as PM.

Jinnah who is the main person to form pakistan initially supports Hindu Muslim unity until 1916. He was there in Indian Nation Congress. He also part of Indina Home Rule league. He proposed 14 laws for the welfare of Muslims. But due to disagreements with other Muslim League leaders he left to London and stayed until 1934. Later Muslim Leaders urged Jinnah to come back here. After arrival to India, he made a declaration for separate country for Muslims in Lahore. This is infamously known as Lahore Declaration. In 1946 elections his party won seats in good number. He went into trap of British rule- Divide and Rule. At the same time Congress opposed this. Due to this lot of people lost their lives. Congress and Muslim League taken different roots for ruling the country. In the same time British Government takes this opportunity and declares independence to India and Pakistan

In tough situations Leaders like Gandhi also lost hold on these issues. This leads to partition of India. Even Indian Government gave 90 crores to Paksitan government. Most fertile lands in Punjab went to Pakistan.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
447 Replies 23375 Views Last post April 27, 2016, 05:16:04 PM
by MbcMen
0 Replies 200 Views Last post March 14, 2015, 09:52:19 PM
by PSPA1
Sardar first image

Started by charan fan Pawan Kalyan

3 Replies 470 Views Last post August 07, 2015, 04:57:59 AM
by rajaram
6 Replies 781 Views Last post October 07, 2015, 03:54:09 PM
by MbcMen
2 Replies 350 Views Last post September 03, 2015, 05:14:25 PM
by MbcMen