Author Topic: కంచి కేసు కొట్టేశారు  (Read 341 times)

Offline lokesh

 • Full Member
 • ****
 • Posts: 2,118
కంచి కేసు కొట్టేశారు
« on: November 28, 2013, 10:15:46 PM »


పుదుచ్చేరి, నవంబర్ 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర రామన్ హత్యకు సంబంధించి కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిపై పెట్టిన కేసును ఇక్కడి ప్రత్యేక కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవన్న కారణంపై బుధవారం కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్షుల్లో సగానికి పైగా సాక్షులు ఎదురు తిరగడం విశేషం. ఎదురుతిరిగిన సాక్షుల్లో మృతుడు శంకర్ రామన్ కుటుంబ సభ్యులతో పాటు, అప్రూవర్‌గా మారిన ఒక సాక్షి కూడా ఉన్నారు. నిందితులకు వ్యతిరేకంగా నిరూపించదగ్గ సాక్ష్యమేదీ లేనందున 24 మంది నిందితుల్లో 23 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు గట్టి భద్రత మధ్య క్రిక్కిరిసిన కోర్టు హాలులో ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి సిఎస్ మురుగన్ ప్రకటించారు. మరో నిందితుడు కదివరన్ ఈ ఏడాది మార్చిలో చెన్నైలో హత్యకు గురయ్యాడు. 2004 సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం కాంచీపురంలోని వరద రాజ స్వామి ఆలయంలో మేనేజర్‌గా పని చేస్తున్న ఎ శంకర రామన్‌ను దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. శంకర రామన్ హత్యకు కుట్ర పన్నిన వారిలో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి, ఆయన వారసుడు విజయేంద్ర సరస్వతి కూడా ఉన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే ప్రాసిక్యూషన్ వాదనను శంకరరామన్ భార్య పద్మ, ఆయన కుమారుడు ఆనంద్ శర్మ ఇద్దరు కూడా సమర్థించలేదని, అందువల్ల హత్య చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం రుజువుకాలేదని జడ్జి పేర్కొన్నారు.
అప్పటి కాంచీపురం జిల్లా ఎస్పీ ప్రేమ్ కుమార్ కేసు దర్యాప్తులో అవసరానికి మించిన ఆసక్తి కనబర్చడంతో పాటుగా చురుగ్గా పాల్గొన్న విషయాన్ని జడ్జి తన తీర్పులో ప్రధానంగా ప్రస్తావించారు. జయేంద్ర సరస్వతికి బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. దర్యాప్తు సమయంలో పోలీసు అధికారి చర్య చట్టం ప్రకారం అవసరమైనదానికన్నా ఎంతో ఎక్కువగా ఉందని జడ్జి తీర్పులో వ్యాఖ్యానించారు. ప్రేమ్‌కుమార్ జోక్యం కారణంగా ముఖ్య దర్యాప్తు అధికారి సక్రమమైన దర్యాప్తు నిర్వహించలేక పోయారని కూడా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసు అధికారుల చర్యను జడ్జి దాదాపుగా అభిశంసిస్తూ, తాము రికార్డు చేసిన స్టేట్‌మెంట్లకు ఆమోదం తెలిపేందుకు కొంతమంది సాక్షులను బెదిరించారని, మరి కొంతమందిని అక్రమ నిర్బంధంలో ఉంచారని కూడా వ్యాఖ్యానించారు.
జడ్జి తీర్పును ప్రకటించే సమయంలో నిందితులందరు కూడా కోర్టులో ఉన్నారు. జయేంద్ర సరస్వతి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ సెనే్సషన్ కేసును 2005లో పుదుచ్చేరికి బదిలీ చేసింది. జడ్జి తీర్పుపై శంకర రామన్ కుమారుడు ఆనంద్ శర్మ స్పందిస్తూ, తీర్పు తమకు దిగ్భ్రాంతి కలిగించడమే కాక నమ్మశక్యం కావడం లేదని అన్నారు. తన తండ్రిని ఎవరు హత్య చేసారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తీర్పును పరిశీలించిన అనంతరం తమ కుటుంబం పైకోర్టులో అపీలు చేయాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తీర్పుపై వ్యాఖ్యానించమని కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో చేరిన మీడియా ప్రతినిధులు జయేంద్ర సరస్వతిని అడగ్గా, ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తూ తిరుపతి వెళ్లేందుకు కారెక్కి వెళ్లిపోయారు. కాగా, ఇది చాలా మంచి తీర్పని నిందితుల తరఫు న్యాయవాది కెఎం సుబ్రహ్మణ్యం అన్నారు. ఇది కేవలం కంచి మఠానికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఊరట కలిగించిందని ఆయన అన్నారు. జయలలిత గత ప్రభుత్వ హయాంలో 2004 దీపావళి రోజున జయేంద్ర సరస్వతిని ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేయగా, విజయేంద్ర సరస్వతిని ఆ తర్వాత అరెస్టు చేసారు.

Offline lokesh

 • Full Member
 • ****
 • Posts: 2,118
కంచి కేసు కొట్టేశారు
« Reply #1 on: November 28, 2013, 10:17:11 PM »
Chivaraki nyaayam gelichindi. Oka pedda mataadipatini avamanakaram gaa treat chesindi appati Jaya prabutvam. Ippudu ade Jaya prabutvam lo nirdoshi gaa swamy raavatam entainaa harshaneeyamu

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,670
కంచి కేసు కొట్టేశారు
« Reply #2 on: November 29, 2013, 03:18:46 PM »
Idi direct gaa hindu matam meeda jarigina daadi ani cheppavachu. Atlast it is big relief for the hindu society

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,670

గెస్ట్ కాలమ్:ఎస్ గురుమూర్తి

కంచి శంకరాచార్యులు జయేంద్ర సరస్వతికి , విజయేంద్ర సరస్వతి‌కి మరికొంత మందికి, శంకరరామన్ హత్యతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారిస్తూ బుధవారం (నవంబర్ 27న) పుదుచ్చేరి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత,   నవంబర్ 2004లో శంకరాచార్యను అరెస్టు చేసిన నాటి సంఘటనలు,  నా మనసు‌లో ఒక్కసారిగా మెదిలాయి.

ద్రావిడ జాతి పరిరక్షకులమని  చెప్పుకునే కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు, లౌకిక వాదానికి కట్టుబడినట్టు చాటుకునే ఒక వర్గం మీడియా, "ఆధునిక"  మేధావి వర్గం - అందరూ కలిసికట్టుగా,  కనీవినీ ఎరుగని రీతిలో, శంకరాచార్యకు వ్యతిరేకంగా ఒక విషపూరిత వాతావరణం సృష్టించారు. కంచి మఠాన్ని అవమానించారు; శంకరాచార్య దోషి అన్నారు; మాటలతో చెప్పలేని విధంగా ఆయన పైనా,  మఠం పైనా ఆరోపణలు గుప్పించారు. శాంతికి, ఆధ్యాత్మికతకు ఆనవాలైన కోట్లాదిమంది మఠభక్తుల మనోభావాలను గాయపరిచారు.  ఓదార్చే నాధుడు లేక, మౌనంగా రోదించడం తప్ప వారు ఏమి చేయలేక పోయారు . శంకరాచార్యపైనా, సనాతన సంస్థ అయిన కంచిమఠంపైనా జరిగిన ఈ విషపూరితమైన, బాధాకరమైన దుష్ప్రచారం గురించీ,  ఫలితంగా భక్తులు అనుభవించిన అనేక రకాల అవమానాలు, బాధలు గురించీ మాట్లాడితే తప్ప
మొన్నటి "కోర్టు తీర్పు"  గురించి పూర్తిగా మాట్లాడలేం.  లౌకిక శక్తులు, మానవ హక్కుల పరిరక్షకులు, ప్రజాస్వామ్య వాదులూ చేతులు కలిపి, మఠాన్ని, శంకరాచార్యను దోషులంటూ మైకులు పట్టుకుని ఊదరగొడుతూ వారిని సర్వ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సమయంలో ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఒక్కటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగింది.  కంచిమఠం పైనా, శంకరాచార్య పైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారనీ, ఈ కేసు నిరూపణకు నిలవదని ఆనాడే చెప్పింది. ఆచార్య పైనా మిగతా వారిపైనా చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఇప్పుడు న్యాయస్థానం నిర్దారించడంతో అసలు ఈ కేసే "తప్పుడు" కేసన్నది తేటతెల్లమయింది.

 2004 దీపావళి రోజున ఆచార్యను అరెస్టు చేసిన తర్వాత ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన పరిశోధనల ఆధారంగా వరసగా అయిదు వ్యాసాలు  ప్రచురించింది. ఆయన్ను  అరెస్టు చేసిన పన్నెండు రోజులకు, అంటే 2004 నవంబర్ 24‌న ప్రచురించిన మూడో వ్యాసం - "ఈ కేసు చచ్చిపోయింది. దీని దహన సంస్కారాలు ఎవరు, ఎప్పుడు చేస్తారు?" అన్న హెడ్‌లైన్‌తో ఇలా ప్రారంభమవుతుంది : " శంకరాచార్య మీద వేసిన కేసు నిలవకపోవడమే గాక అందులో ఇసుమంత నిజం కూడా లేదు. అంతే కాదు - ఆచార్య‌ను ఇరికించడానికి కొన్ని కల్పిత విషయాలు కూడా చొప్పించారు. పోలీసులు తమది పైచేయి కావాలని ప్రయత్నిస్తున్నారు. వారు అంత సులభంగా వదిలి పెట్టరు . చచ్చిపోయిన ఈ కేసుకు ఆక్సిజన్ పెట్టి బతికించడానికి మరి కొన్ని ఆరోపణలు జోడిస్తారు. అయితే ఈ కేసు గెలిపించడానికి వీలు లేనంతగా  ఓడిపోయిందనడం ముమ్మాటికి నిజం."

కాంచీపురం మేజిస్ట్రేట్ కోర్ట్‌లో బుధవారం ఈ కేసు నాటకీయంగా మలుపు తిరిగింది. శంకారాచార్య దోషి అని సాక్ష్యం చెప్పడానికి పోలీసులు తీసుకొచ్చిన ఇద్దరు నేరగాళ్ళు అనూహ్యంగా అసలు ఈ కేసుకంతటికి పోలీసులే సూత్రధారులని చెప్పారు. కోర్టు తన తీర్పులో కూడా చివరికి ఇదే చెప్పింది .
శంకారాచార్య కేసు మీద  ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’‌లో నా పేరు మీద మరో నాలుగు వ్యాసాలూ వచ్చాయి. " అపర అభిమన్యుడు ఈ శంకరాచార్యుడు" అన్న శీర్షికతో 2004 నవంబర్ 23న వెలువడిన వ్యాసంలో - అత్యంత హేయమైన ఆరోపణలను ఎదుర్కొంటూ నిస్సహాయంగా, నిశ్చేష్టుడై నిలబడ్డ ఆచార్యను ద్రావిడ రాజకీయ రంగం, సెక్యులర్ మీడియా వెంటాడి వేధిస్తున్న వైనం వివరించాను.   

 పోలీసులు ఎప్పటికప్పుడు అందించిన తప్పుడు కథనాలను, సెక్యులర్ మీడియా,  ద్రావిడ రాజకీయ ప్రచారకులు అర్రులు చాస్తూ అందుకుని ఆచార్య పరువు ప్రతిష్టలను ధ్వంసం చేయడానికి పూనుకోవడం వల్లే అతనికి ఎక్కువ నష్టం జరిగింది. "కేసును పునఃపరిశోధిస్తే తప్ప న్యాయం జరగదు" అన్న శీర్షికతో 26. 11. 2004న ప్రచురించిన మరో వ్యాసంలో - కరడు గట్టిన నేరస్తుల నుంచి సేకరించిన సాక్ష్యాలను ఆధారం చేసుకుని శంకరాచార్య‌ను మించిన నేరగాడు లేడని  రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఏ విధంగా నమ్మించ ప్రయత్నిస్తున్నదో వివరించాను. 3. 2. 2004న ప్రచురించిన వ్యాసంలో - ఈ కేసు మొత్తంగా ఒక నేరపరిశోధన అంశంగా గాక ఆచార్య వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించే విష ప్రచారంగా మారిన వైనాన్ని వివరించాను. ఈ వ్యాసం ముగింపులో ఇలా రాశాను : "చివరికి నా వాదన తప్పని తేలవచ్చు. అయినా ఈ కేసు పరిశోధనలో ధ్వంసం అవుతున్న అనేక విలువల పట్ల ప్రజలను అధికారులను అప్రమత్తం చేసే బాధ్యతను నేను విస్మరించలేను.  ఈ పరిశోధన క్రమంగా నోరులేని (నోరు ఎత్తనీయని ) కంచి మఠానికీ,  పోలీసులు, వారికి వత్తాసు పలుకుతున్న మీడియాకు మధ్య యుద్ధంగా మారుతోంది . ఇప్పుడిది నేర పరిశోధన కాదు - మఠాన్ని అప్రతిష్ట పాలు చేసే పెద్ద కుట్రగా పరిణమిస్తోంది.   నా ఆఖరి వ్యాసం "జస్టిస్ రెడ్డి హెచ్చరిక సెక్యులర్ మీడియా చెవి కెక్కుతుందా?" అన్న శీర్షికతో జనవరి 14, 2005‌న ప్రచురించాను. (శంకరాచార్యను అరెస్టు చేసిన మిల్లు ప్రాంగణం‪లో అంతకు ఆరేళ్ళ ముందు జరిగిన కొన్ని హత్యలకు కూడా శంకరాచార్య కారణమంటూ కొన్ని పత్రికలు రాసిన వార్తల ఆధారంగా ఒక కార్మిక సంఘం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో రిట్ వేయగా జస్టిస్ నరసింహారెడ్డి వెలువరించిన తీర్పుపై రాసిన వ్యాసం). రిట్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అన్న మాటలు ఇవి : "సుమారు 2500 ఏళ్ళ చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన , ప్రతిష్టాత్మకమైన, విలువైన సంస్థగా పేరుపొందిన కంచిమఠం ప్రతిష్టను గతంలో ఎన్నడూ జరగని విధంగా కాలరాయడానికి మీడియాలో జరుగుతున్న ప్రయత్నాలకు ఉత్తేజితుడై, తాను మాత్రం ఎందుకు వెనకబడాలన్న ఉద్దేశంతో పిటిషనర్ ఈ రిట్ వేసినట్టు ఉంది.  ఒక స్వతంత్ర దేశంలో, ఇంత  వైభవం కలిగిన ఒక సంస్థను  ఒక పథకం ప్రకారం ఉద్దేశ పూర్వకంగా కొందరు వ్యక్తులే గాక ప్రభుత్వం, పత్రికా రంగాలకు చెందిన ఒక వర్గం కూడా పనిగట్టుకుని కాలరాయడానికి ప్రయత్నించడం విచారకరం. మానవ హక్కులు, సమన్యాయం కోసం పోరాడే వారు, వ్యక్తులకు సంస్థలకు గౌరవం విలువా ఉండాలని కోరుకునే వారు కూడా శంకరాచార్య కేసు విషయంలో మౌనంగా ఉండిపోయారు . అంతేకాదు,  మఠంపై జరుగుతున్న ఈ దాష్టికాన్ని కొన్ని శక్తులు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోవడమే గాక లోలోన  సంతోషిస్తున్నాయి కూడ .  శ్రీ జయేంద్ర సరస్వతిపై చేసిన ఆరోపణలు, వేసిన నిందలు, చేసిన అవమానాలు గతంలో ఎవరికీ  జరగలేదు. ఇది కౌరవసభలో ద్రౌపదికి జరిగిన పరాభవం లాంటిది ."శంకరాచార్య మీద జరిగిన విష ప్రచారాన్ని ఎదిరించడానికి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిజాన్ని నిర్భయంగా భుజానికి ఎత్తుకున్నప్పుడు శంకరాచార్య, కంచి మఠం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది.

 ఈ వ్యాసాలు  రాసినందుకు నాకు అందిన బహుమానం అరెస్ట్ వారెంట్ జారి కావడం.  ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆఫీసు మీద దాదాపు సోదా లాంటిది జరిగింది. నా ఇంగ్లీషు వ్యాసాలను  తమిళంలో ప్రచురించిన ‘తుగ్లక్’ పత్రిక మీద కూడా సోదాలు జరిగాయి.  ఎప్పటిలా న్యాయస్థానం మాకు అండగా నిలిచి మమ్మల్ని వేధించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది. శంకరాచార్య కేసు దర్యాప్తు చేస్తున్న  పోలీస్ సూపరింటెండెంట్ నన్ను కూడా విచారించాడు. అసలు శంకరాచార్య ఈ నేరం చేశారని ఎందుకు అనుకుంటున్నారని  ఎస్‍పిని అడిగాను. హత్యకు గురైన శంకరరామన్ శంకరాచార్య‌కు అత్యంత అభ్యంతర కరమైన రీతిలో ఉత్తరాలు రాసేవాడని అందుకే ఆచార్య అతడిని హత్య చేసి ఉండవచ్చని ఎస్‍పి చెప్పాడు. ఆచార్య అంటే గిట్టని వారెవరైనా ఈ హత్య చేసి ఆచార్య మీదకు నేరం నెట్టవచ్చు కదా అని అడగ్గా ఎస్‍పి వద్ద దానికి సమాధానం లేదు. నేర పరిశోధనలో అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నాకే నిందారోపణ చేయాలని ఎస్‍పితో అన్నాను . శంకర్రామన్ హత్య కేసులో పోలీసులు ఇది  చేయలేదు. ఫలితంగా ఒక పెద్ద తప్పు  జరిగిపోయింది. ఒక గొప్ప సంస్థకు,  శాంతి-సహనవంతులైన  భక్తులకు తీరని అన్యాయం జరిగింది. శంకరాచార్య కేసు అందరికీ ఒక గుణపాఠం. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం, మీడియా, ప్రజాస్వామ్య వాదులు - అందరూ శంకరాచార్యకు వ్యతిరేకంగా పోలీసులతో చేతులు కలిపారు. ఇప్పుడు వీరంతా ఆత్మ  పరిశీలన చేసుకుంటారా?Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,670
కంచి కేసు కొట్టేశారు
« Reply #4 on: December 02, 2013, 12:56:15 AM »
Aa time lo government tega try chesindi kanchi swamy ni doshi gaa nilabettalani. Kaani chivaraku nyaayam gelichindi. Hindu mata vyatireka shaktulu, Konni Dravida parties/papers swamy ni doshi gaa nilabettalani try chesaaru. Kaani Mabbulu vadilina sooridu la bayataku vahcaru.