Author Topic: ఢిల్లీ పీఠం ఎవరికో?  (Read 369 times)

charan fan

 • Guest
ఢిల్లీ పీఠం ఎవరికో?
« on: December 04, 2013, 06:43:35 PM »
హస్తిన అసెంబ్లీకి నేడే పోలింగ్
కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య ముక్కోణపు పోటీ
బరిలో 810 మంది అభ్యర్థులు
హంగ్ ఏర్పడుతుందంటున్న ప్రీపోల్ సర్వేలు
8న ఓట్ల లెక్కింపు
 
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఘట్టానికి తెరలేచింది. మొత్తం 70 స్థానాలున్న హస్తిన అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఈసారి ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్‌నే మళ్లీ అందలం ఎక్కిస్తారా లేక నరేంద్ర మోడీ ప్రభావంతో కాస్త పుంజుకున్న బీజేపీని బలపరుస్తారా లేదంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అవకాశం ఇస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ద్విముఖ పోటీకే పరిమితమైన ఢిల్లీ పీఠం.. ఆప్ రాకతో సీన్ మారిపోయింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఆప్ నిలబడడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు చెమటోడ్చి ప్రచారం చేశాయి. వరుసగా నాలుగోసారి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది
 
. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, మోడీ, అరుణ్‌జై ట్లీ, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కారీ తదితరులు ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఇక ఈ ఎన్నికలతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆప్.. వినూత్న ప్రచారంతో జనాల్లోకి దూసుకె ళ్లింది. ఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పలు రోడ్‌షోల ద్వారా ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా హస్తినలో ప్రచారం చేశారు. అన్ని పార్టీలూ ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. మహిళా భద్రత, అవినీతి, ధరల పెరుగుదల, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా వాటి హామీలపర్వం కొనసాగింది. విజయంపై ప్రధాన పార్టీలు వేటికి అవే ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. సీఎం అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, బీజేపీ నుంచి డాక్టర్ హర్షవర్ధన్, ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్‌లు బరిలో ఉన్నారు. షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్‌లు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండగా, అక్కడ బీజేపీ తన అభ్యర్థిగా పార్టీ ఢిల్లీ విభాగం మాజీ చీప్ విజేంద్ర గుప్తాను రంగంలోకి దించింది.
 
దీంతో అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లు మొత్తం 70 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టగా.. బీఎస్పీ(69), బీజేపీ(68), ఎన్సీపీ(9), సీపీఎం(3), శిరోమణి అకాలీదళ్ నుంచి ఇద్దరు, ఇతరులు 509 మంది పోటీలో నిలిచారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్ దేవ్ వెల్లడించారు. 32,801 మంది ఢిల్లీ పోలీసులతోపాటు 107 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించినట్టు చెప్పారు.
 
 పార్టీల ప్రధాన హామీలు ఇవే...
 కాంగ్రెస్: షీలాదీక్షిత్
     ఢిల్లీలోని 73 లక్షల మంది ప్రజలకు ఆహార భద్రత చట్టం కింద సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందజేస్తాం
     గృహ వినియోగదారులకు 40 లీటర్ల వరకు సబ్సిడీపై నీళ్లు సరఫరా చేస్తాం. మూడు కొత్త వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం
     {పస్తుతం ఉన్న మరికివాడల స్థానంలో హౌసింగ్ యూనిట్లు నిర్మిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నాలుగు లక్షల ఫ్లాట్లు ఇస్తాం
 
 బీజేపీ: డాక్టర్ హర్షవర్ధన్
     విద్యుత్ చార్జీలు 30 శాతం మేర తగ్గిస్తాం. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోగా కూరగాయల ధరలు తగ్గిస్తాం. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 12కి పెంచుతాం
     మహిళా భద్రత కోసం సీఎం పర్యవేక్షణలో ప్రత్యేక దళంతోపాటు 24 గంటల కాల్‌సెంటర్లు ఏర్పాటుచేస్తాం. మహిళలపై జరిగిన నేరాల కేసులను త్వరితగతిన విచారించేందుకు మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తాం
     ఢిల్లీలో సైకిల్ సంస్కృతిని ప్రోత్సహిస్తాం. ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడానికి వీలుగా కేంద్రీకృత ట్రాఫిక్ ప్రణాళిక రూపొందిస్తాం.
 
 ఆమ్ ఆద్మీ పార్టీ: అరవింద్ కేజ్రీవాల్
     విద్యుత్ చార్జీలను 50 శాతం మేర తగ్గిస్తాం.
     రోజుకు ఒక్కో గృహానికి 700 లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తాం
     మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో త్వరితగతిన న్యాయం అందేలా చూస్తాం.
     అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తాం.

ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రం
 మొత్తం సీట్లు: 70
 పోలింగ్ బూత్‌లు: 11,763
 మొత్తం ఓటర్లు: 1.19 కోట్లు
 బరిలో ఉన్న అభ్యర్థులు: 810
 ఎక్కవ మంది అభ్యర్థులు ఉన్న స్థానం: బురారీ(23 మంది)
 తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గం: పటేల్‌నగర్(నలుగురు)
 ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం: వికాస్పురి (2,82,632)

charan fan

 • Guest
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #1 on: December 04, 2013, 06:44:41 PM »
ఢిల్లీలో రికార్డు స్థాయిలో పోలింగ్
న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఢిల్లీ చరిత్రలో అత్యధికంగా 74 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

1993లో తొలిసారి ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 61.75 శాతం ఓటింగ్ నమోదైంది. 2008 ఎన్నికల వరకు ఇదే అత్యధికం. తాజా ఎన్నికల్లో ఆ రికార్డు బద్దలైంది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.

charan fan

 • Guest
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #2 on: December 04, 2013, 06:54:21 PM »
ఈవీఎం మొరాయింపు.. అబ్దుల్ కలాంకూ తప్పని నిరీక్షణ
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కనీసం గంట సేపు ఎదురు చూడాల్సివచ్చింది. కలాం ఓటు వేసేందుకు బుధవారం కె.కామరాజ్ మార్గ్ పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలో ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన గంట సేపు ఎదురు చూసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు ఈవీఎంను మార్చడటంతో కలాం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది చాలా సుదీర్ఘ సమయమని, ఈవీఎంను మార్చేందుకు పట్టిన సమయానికి కలాం ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చుండేవారని ఓ అధికారి చెప్పారు.

ఈ పోలింగ్ కేంద్రంలో కలాంతో పాటు చాలామంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆర్మీ, నేవీ దళాల అధిపతులు ఓటు వేశారు. 'ఈవీఎం మొరాయించే సమయానికి 412 ఓట్లు పోలయ్యాయి. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్, నేవీ చీఫ్ డీకే జోషీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఓటు వేశారు' అని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 112 ఈవీఎంలు మార్చినట్టు చెప్పారు. సాంకేతిక సమస్యలే కారణమని ఆయన వెల్లడించారు.

charan fan

 • Guest
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #3 on: December 04, 2013, 08:21:10 PM »
బీజేపీ వెలిగిపోతోంది... నాలుగు రాష్ట్రాల్లో కమలానిదే అధికారం'

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న తాజా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీ లబ్ది పొందుతుందని చెబుతున్నాయి. బీజేపీ మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ విజయదుందుబి మోగిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈ లెక్కన కాంగ్రెస్ ఢిల్లీ, రాజస్థాన్ లో అధికారం కోల్పోవడంతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో మరో విడత ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని జోస్యం చెబుతున్నాయి. ఈ ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో బుధవారం ఎన్నికలు ముగిసిన అనంతరం టైమ్స్ నౌ-సి ఓటర్, టుడేస్-చాణక్య, నీల్సన్ ఏబీపీ సర్వేలు ఫలితాలను వెల్లడించాయి.

90 శాసనసభ స్థానాలున్న చత్తీస్ గఢ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలూ వెల్లడించాయి. సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పాయి. బీజేపీ ప్రభుత్వానికి రమణ్ సింగ్ సారథ్యం వహిస్తున్నారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో హంగ్ ఏర్పడుతుందని టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే పేర్కొంది. తాజా ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బీజేపీ 29, కాంగ్రెస్ 21, ఏఏపీ 16, ఇతరులు నాలుగు అసెంబ్లీ స్థానాలు సాధిస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో ఏఏపీ ఎవరికి మద్దతిస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంటుంది. నీల్సన్ ఏబీపీ సర్వే బీజేపీకి 32 సీట్లు వస్తాయని తెలిపింది.

రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు పేర్కొన్నాయి. అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని వెల్లడించాయి. రాజస్థాన్ లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని టుడేస్-చాణక్య జోస్యం చెప్పింది. 130 నుంచి 150 స్థానాలు వరకు అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని తెలియజేసింది. సీ ఓటర్ సర్వే కూడా దాదాపు ఇలాగే ఉంది.

మధ్యప్రదేశ్ లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం నిలబెట్టుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని పేర్కొన్నాయి.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #4 on: December 04, 2013, 10:56:14 PM »
Congress cremation started with this I believe

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #5 on: December 04, 2013, 11:02:45 PM »
Hastaaniki Rikta Hastame ee saari., Lagadapati survey lo aithe Congress aba daba jabbe. I think 89 parliament seats are there in these states. Modi moves one step ahead to form next government in center. If Modi forms the government then congress won't come to power in mere future.


Oka jaati mottanni kshobinchetatlu chesindi(Konta mandiki aa decision nachindi, kaani max oppose chestunnaru). Aa shaapam nundi ippatlo terukodani naa gut feeling. Results madam gandhi puttina roju ku mundu roju vastunnayi. Aameku teepi kaburo leka chedu gurtho 8 na telustaadi.

charan fan

 • Guest
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #6 on: December 05, 2013, 07:19:42 AM »
ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలివే..!

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో అధికారం చేజారుతుందని, మధ్యప్రదేశ్ లో పవర్ దక్కే ఛాన్సే లేదని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గఢ్ లో కూడా బీజేపీ గెలుపు ఖాయమని, ఢిల్లీలో హంగ్ తప్పకపోయినా… అధికారానికి అడుగు దూరంలో బీజేపీ నిలుస్తుందని సర్వేల్లో వెల్లడైంది.
వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం తప్పదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీగా లబ్ది పొందుతుందని వెల్లడిస్తున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ సత్తా చాటుతుందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి.
ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ 161 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ప్రస్తుత శాసనసభలో బీజేపీ బలం 143 సీట్లే కాగా… ఇది మరో 18 స్థానాలకు పెరగనుందని సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 62 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అంటే ప్రస్తుతం ఉన్న 71 మంది సభ్యుల బలం… 61కి పడిపోతుందని సీ ఓటర్ సర్వే పేర్కొంది.
మధ్యప్రదేశ్ ప్రజల్లో చౌహాన్ కు ఉన్న ఆదరణే ఆ రాష్ట్రంలో బీజేపీకి కొండంత అండగా నిలిచింది. రెండు సార్లుగా చౌహాన్ అందించిన మంచి పాలన, అభివృద్ధి కూడా బీజేపీకి లాభించిందనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ… అది ప్రభుత్వాన్ని మార్చేంతగా లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో అదే వెల్లడైంది. ఈ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సైతం ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అయితే అవేమీ పనిచేయలేదని… మంచి పాలనకు, అభివృద్ధికే ఓటర్లు మొగ్గు చూపారనే విషయం సీ ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు నిజమైతే.. హ్యాట్రిక్ హీరోగా చౌహాన్ కూడా మోడీ సరసన నిలుస్తారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ కు శృంగభంగం తప్పదని టుడేస్-చాణక్య జోస్యం చెప్పింది. బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు పేర్కొన్నాయి. రాజస్థాన్ లో బీజేపీకి 130 నుంచి 150 స్థానాలు వరకు సీట్లు వస్తాయని సర్వేల్లో వెల్లడైంది. సీ ఓటర్ సర్వే కూడా దాదాపు ఇలాగే ఉంది.
అభివృద్ధికి మద్దతు ఇవ్వండి అనే నినాదంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రచారం చేశారు. అయితే… అధిక ధరలు, అవినీతి, మహిళలపై పెరిగిన అత్యాచారాలు గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల అధిక ప్రభావం చూపించాయని తెలుస్తోంది. ఉల్లిపాయల నుంచి ఉప్పు వరకూ ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగిపోయిందని… దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమనే భావన రాజస్థాన్‌లో అత్యధికుల్లో బలంగా నాటుకుపోయింది. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన కొద్ది శాతం మంది మార్పు కోసం కూడా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
వీటికి తోడు మోడీ ఫ్యాక్టర్ కూడా ఎన్నికల్లో బాగా పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవడం సహజమే అయినా… మోడీ ఫ్యాక్టర్… ఆ వ్యతిరేకతను వీలైనంతగా పెంచిందని తెలుస్తోంది.
కుల సమీకరణలు కూడా రాజస్థాన్ ఎన్నికలను ప్రభావితం చేశాయనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లయిన జాట్ లలో చాలా మంది బీజేపీ వైపు ముగ్గు చూపారని తెలుస్తోంది. దాదాపు 60 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం బలంగా ఉంది. తమ కులం పట్ల అంతగా సుముఖత లేని గెహ్లాట్ ను మరోసారి గెలిపించడం వీరిలో చాలా మందికి ఇష్టం లేదు. ఆ వ్యతిరేకతే బీజేపీ పట్ల సానుకూలతగా మారిందనేది విశ్లేషకుల అంచనా. ఇక ఎప్పుడూ బీజేపీ పక్షాన నిలిచే రాజ్ పుట్ ఓట్లు…. కమలనాథులకు మరింత మేలు చేసి ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక వ్యక్తుల పరంగా చూస్తే రాజస్థాన్ లో అత్యధికులు గెహ్లాట్ కన్నా వసుంధర రాజేనే సీఎం కావాలని కోరుకుంటున్నారని సర్వేల్లో వెల్లడైంది. అదే ఎన్నికల ఫలితాలలోనూ వెల్లడయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
ఢిల్లీ పీఠం ఎవరికో?
« Reply #7 on: December 05, 2013, 10:32:49 AM »
Sonta raastranni chakkabettukoleni Diggi ikkada kooda party ni permanant gaa naasanam chesaadu. Ituvanti chetakaani daddamalu bhavisyatu nirnetalu gaa migalatam jaati duradrustakaram