Author Topic: సీఎం కిరణ్ ఏం చేస్తరో ?  (Read 268 times)

charan fan

 • Guest
సీఎం కిరణ్ ఏం చేస్తరో ?
« on: December 05, 2013, 07:29:16 AM »
రచ్చబండ వేదికలుగా సీఎం కిరణ్ సమైక్య గళం పెంచడంలో ఆంతర్యమేమిటి..? విభజన కథ క్లయిమాక్స్ కు చేరడంతో సీఎం తెగువపెంచారా..? కిరణ్ రాజకీయ మతలబేమిటి..? విభజన ప్రక్రియ ఆగకపోయినా అసెంబ్లీలోనే రాజీనామా చేసిన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టిస్తాడా..? విభజన ప్రక్రియలో ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత వరుసగా ధిక్కార స్వరం వినిపిస్తున్న సీఎం కిరణ్..రోజుకో రీతిలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. కిరణ్ తొలినుంచీ విభజనను అడ్డుకుని తీరతానని చెబుతూనే ఉన్నారు. సమయం చిక్కినప్పుడల్లా విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం షరా మామూలైంది. ఇప్పుడు మరో అడుగుముందుకేసి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ సమైక్య గళం వినిపించడం వివాదాస్పదమైంది. రచ్చబండ వేదికలపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా కిరణ్ ధిక్కార స్వరం వినిపించడం సీమాంధ్ర నేతల్ని గందరగోళపరుస్తోంది. తెలంగాణ కథ క్లయిమాక్స్ కు చేరడంతో కిరణ్ స్పీడ్ పెంచారా? అందుకే అధికార కార్యక్రమాల్లోనూ అదే మాట చెబుతున్నారా? ఈ ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. ఇక అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోనున్నారని ఓ వర్గం నేతలు అంటుండగా..కిరణ్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటా హైకమాండ్ లైన్ లోనే ఉందని మరికొందరు సమర్థిస్తున్నారు.
రాష్ర్టం విభజన ముంగిట్లో ఉన్న నేపథ్యంలో, అతి త్వరలో బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు, సమైక్యవాదులు ‘స్టార్ బ్యాట్స్‌మెన్’గా అభివర్ణిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన సమైక్యవాదాన్ని బలంగా వినిపించడం అధిష్టానం వ్యూహంలో భాగమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన అడుగు ఎటు పడుతుందనేదే ఉత్కంఠ కలిగిస్తోంది.
అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం కిరణ్ వైఖరిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. నాయకత్వ మార్పు ఉంటుందన్న ఊహాగానాలే కిరణ్ గళం పెంచడానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఎలాగూ తనను తప్పిస్తారనే యోచనతో ఉన్న సీఎం కిరణ్ హైకమాండ్ తో అమీతుమీకి సిద్ధమయ్యారా? లేక హైకమాండ్ డైరెక్షన్ లోనే అంతా కథ నడిపిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని ఆకట్టుకుంటూ సమైక్య ఛాంపియన్ గా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారా? జీవోఎం ముందు కూడా సీఎం సమైక్యగళం వినిపించినా ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నలు పలు ఊహాగాహానాలకు తావిస్తున్నాయి. సీఎం వైఖరిపై ఎవరివాదన వారిదే అవుతోంది.
కొందరు విభజనకు బాహాటంగా మద్దతు పలికారు. రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. విభజనను అడ్డుకొని తీరుతామని బీరాలు పలుకుతున్నారు. రోజుకో మాట చెబుతున్నారు. పూటకో పాట పాడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై ఉండి కూడా కిరణ్‌కుమార్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి సమయం సందర్భం లేకుండా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు. తమ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదంటూనే కీలక సమస్యలకు పరిష్కారాలు చూపకుండా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదని హెచ్చరిక స్వరంతోనే చెప్పాడు. అధినేత్రి సోనియా గాంధీని పల్లెత్తు మాట అనకుండానే అధిష్టానం పట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు. కిరణ్ వైఖరి చూస్తుంటే ఆయన అధిష్టానానికి విధేయుడా? తిరుగుబాటు దారుడా? అర్ధం కాకుండా ఉంది.

సంచలనచర్యతోచివరిముఖ్యమంత్రిగా..

ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ కుమార్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి అనడంలో సందేహం లేదు. ఆయన పైకి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నా , అధిష్టానంతో ఏం చెబుతున్నాడో తెలియడంలేదు. అయితే తెలంగాణ బిల్లు లేదా తీర్మానం అసెంబ్లీ వస్తుందా? లేదా అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై ఢిల్లీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకవేళ విభజనపై బిల్లు లేదా తీర్మానం అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రే సభలో ప్రతిపాదించాలి. ఈ సమయంలోనే కిరణ్ సంచలన్మాతకంగా వ్యవహరించవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి.
అసెంబ్లీలో తీర్మానాన్ని ఆయనే ప్రతిపాదించి, సభ్యుల అభిప్రాయాల తరువాత దానిపై సుదీర్ఘంగా, ఘాటుగా ప్రసంగించి, అక్కడే రాజీనామా ప్రకటన చేసి, నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి మంత్రివర్గ రాజీనామా సమర్పించి వెళ్లిపోతారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండరని, ఈ చర్య ద్వారా కేంద్రం ఇరుకున పడుతుందని, రాజ్యాంగ సంక్షోభం వస్తుందని కొందరు చెబుతున్నారు. దీనిపై కిరణ్ తన సన్నిహితులతో చర్చలు జరిపాడని, అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నాడని అంటున్నారు. కిరణ్ ఇంతకాలం రాజీనామా చేయకుండా వేచి ఉన్నది ఇందుకోసమేనని, కాంగ్రెసు నుంచి కూడా బయటకొచ్చి కొత్త పార్టీ స్థాపనతో కాంగ్రెసును ఢీ కొంటాడని అనుకుంటున్నారు.
టీజీ వెంకటేష్ వంటి మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా ఇలాంటి ఊహాగానాలకు తావిస్తున్నాయి. ముఖ్యమంత్రి సంచలన చర్య ద్వారా విభజన ప్రక్రియ ఆగకపోయినా అసెంబ్లీలోనే రాజీనామా చేసిన ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టిస్తాడని చెబుతున్నారు. మరి కిరణ్ కుమార్ ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
సీఎం కిరణ్ ఏం చేస్తరో ?
« Reply #1 on: December 05, 2013, 10:34:33 AM »
Ippudunna stitilo congress mukyamantri ni maarche saahasam cheyyadu. Need to see things going to happen. But if he starts political outfit also then it will merge into congress after elections again.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
సీఎం కిరణ్ ఏం చేస్తరో ?
« Reply #2 on: December 05, 2013, 10:35:36 AM »
My friends who are close to some MLA's revealed that Kiran is opposite to formation of Telangana.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
సీఎం కిరణ్ ఏం చేస్తరో ?
« Reply #3 on: December 05, 2013, 10:37:33 AM »
Raastrapthi bill eppudu pamputaado choodali. CM has every chance to dissolve the assembly since elections are with in 5 months. If he does this then bill won't go further