Author Topic: Nelson Mandela no more  (Read 492 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Nelson Mandela no more
« on: December 06, 2013, 05:11:34 AM »
South African Gandhi Nelson Mandela no more. He died in Johansberg of South Africa. He was facing issues with lungs from past few years. He born on July 18,1918 at mevijo of kevin province. He fights for the rights of blackies and was in jail for 27 years for this cause. He served as president for South Africa from 1994 to 1999. Mandela survived with 6 kids. In 1993 he got Noble peace price. He got 250 awards from various institutes in his life time.




RIP to the soul of Nelson Mandela. The true Gandheyan follower.

charan fan

  • Guest
Nelson Mandela no more
« Reply #1 on: December 06, 2013, 05:46:01 AM »
RIP to his soul...

charan fan

  • Guest
Nelson Mandela no more
« Reply #2 on: December 06, 2013, 06:26:42 AM »
నెల్సన్ మండేలా కన్నుమూత

జోహన్నస్ బర్గ్: తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహన్నస్ బర్గ్ లోని స్వగృహంలో గురువారం రాత్రి 8.50 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఆయన తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. దేశం గొప్ప నాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు జాతిపితను పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అధికార లాంఛనాలతో మండేలా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయాలని జుమా ఆదేశించారని బీబీసీ తెలిపింది.

భారత జాతి పిత మహాత్మ గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పే మండేలా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నారు. కేప్ ప్రాంతంలోని తెంబు వంశానికి చెందిన కుటుంబంలో ఆయన 1918 జూలై 18న జన్మించారు. విద్యార్ధిదశలోనే వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై తన జాతి విముక్తి కోసం అంకితమయ్యాడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అవార్డులు, రివార్డులు పొందారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను నెహ్రూ శాంతి బహుమతితో సత్కరించింది.

నెల్సన్ మండేలాకు ఆరుగురు సంతానం. ఆయన మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్కీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మేస్ అనే మహిళతో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. వీరు వివాహమైన 13 సంవత్సరాల తరువాత 1957లో అభిప్రాయ భేదాలతో విడిపోయారు. మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా. వీరికి ఇద్దరు కుమార్తెలు. 1992లో వారు విడాకులు తీసుకొన్నారు. 1998లో తన 80వ జన్మదినం సందర్భంగా నెల్సన్ మండేలా మూడవసారి గ్రాచా మాచెల్ను పెళ్లి చేసుకొన్నారు.

నెల్సన్ మండేలా మరణం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. మండేలా నుంచి  స్ఫూర్తి పొందిన వారిలో తాను ఒకడినని తెలిపారు. మండేలా లాంటి నాయకున్ని ప్రపంచం మళ్లీ చూడబోదని సంతాప సందేశంలో ఒబామా పేర్కొన్నారు.

mega_star_fan

  • Guest
Nelson Mandela no more
« Reply #3 on: December 06, 2013, 08:47:59 AM »
we lost a great leader RIP to his soul

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Nelson Mandela no more
« Reply #4 on: December 06, 2013, 02:45:30 PM »
RIP...........

Offline rajaram

  • Hero Member
  • *****
  • Posts: 2,964
Nelson Mandela no more
« Reply #5 on: December 06, 2013, 08:59:28 PM »
RIP

charan fan

  • Guest
Nelson Mandela no more
« Reply #6 on: December 07, 2013, 07:06:28 PM »
cherry posted in his fb
Ram Charan

The greatest man of our time has passed away.. He is now at Peace - Nelson Mandela

charan fan

  • Guest
Nelson Mandela no more
« Reply #7 on: December 11, 2013, 09:39:24 AM »
నెల్సన్ మండేలాకు నివాళర్పించిన ప్రముఖులు
జొహన్నెస్ బర్గ్ లో మంగళవారం రోజు జరగుతున్న నెల్సన్ మండేలా అత్యక్రియలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరైయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఆరుగురికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది వారిలో మన దేశ రాష్ట్రపతి ఒకరు. అయితే ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వారిలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఐరాస ప్రధానాకార్యదర్శి బాన్ కి మూన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా కీలక్యోపన్యాసాలు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, చైనా, బ్రెజిల్ నమీబియా దేశాలనేతలు ఇక్కడ ప్రసంగించారు.