Author Topic: 10 జిల్లాల తెలంగాణకు సై అన్న కేంద్ర కేబినేట్  (Read 379 times)

charan fan

  • Guest
ప్రధాని నివాసంలో ఈ రోజు జరుగుతున్న కేంద్ర కేబినేట్ భేటి ముగిసింది. ఈ సమావేశం దాదాపు మూడుగంటల పాటు సమావేశం జరిగింది. కానీ సమవేశం జరుగుతుండగానే కావూరి సాంబశివరావు, పల్లంరాజు వెళ్ళిపోవడం జరిగింది. టేబుల్ ఐటమ్ గా కేబినేట్ ముందుకు రాష్ట్ర విభజన బిల్లు వచ్చింది. అయితే భేటి అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు కేబినేట్ ఆమోదం తెలిపినట్టు తెలియజేశారు. మొత్తం 18000 మెయిల్స్ ను పరిశీలించమని, అలాగే మంత్రులను అందరిని సంప్రదించి కేంద్ర కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి షిండే తెలియజేశారు.
షిండే చెప్పిన వివరాలు :
10 జిల్లలో కూడిన తెలంగాణ
10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
మిగిలిన 13 జిల్లాలతో ఆంద్ర ప్రదేశ్
పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా
కొత్త రాజధానికోసం నిపుణులు కమిటీ
45 రోజుల్లో కొత్త రాజధానిపై నిర్ణయం
గవర్నర్ పర్యవేక్షణలో హైదరాబాద్ జీహెచ్ఎంసి పర్యవేక్షణ
రెండు రాష్ట్రాలలో 371డి అమలులో వుంటుంది.
కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ కృష్ణ, గోదావరి జలాలు
రెండు రోజుల్లో రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు
ఆతరువాత అసెంబ్లీకి
తరువాత పార్లమెంట్ కి వస్తుంది.

charan fan

  • Guest
కేంద్రం గేమ్ ప్లాన్ ఎందుకు మార్చింది..?

కేంద్రం గేమ్ ప్లాన్ చివరి నిమిషంలో మారింది? అప్పటి వరకూ రాయలతెలంగాణ కేబినెట్ లో చర్చ.. బిల్లులోనూ మార్పులు చేర్పులూ అంటూ సాగిన ఊహాగానాలు హఠాత్తుగా ఎందుకు మారిపోయాయ్? అసలు ఐదు రాష్ట్రాల ఫలితాలకూ రాష్ట్ర విభజనకూ లింక్ ఎక్కడ కలుస్తోంది? ఐదు రాష్ట్రాల ఫలితాలకూ రాష్ట్ర విభజనకూ లింక్ ఉన్నట్టే కనిపిస్తోంది. అందుకే ఆదివారం ఫలితాలకు ముందే కాంగ్రెస్ అప్రమత్తం అయింది. రాయల తెలంగాణపై వ్యూహం మార్చింది.
కలిసిరాని కాలంలో రాజకీయ వ్యూహమే పాశమై పతనాన్ని శాసిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే భయపెడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే పతనం అంచులు ఇప్పటికే కనిపిస్తున్న సమయంలో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. సెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుగాలి ఖాయమని తెలుస్తున్న టైంలో వ్యూహాత్మకంగా తెలంగాణలో అడుగులు వేసింది. రాయలతెలంగాణ అంటూ కొత్త గందరగోళానికి తెర తీద్దామనుకున్న ప్రయత్నాలు కూడా చివరి నిమిషంలో అనూహ్యంగా మారడానికి ఇదే కారణమన్న మాట ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోందిప్పుడు.
కాంగ్రెస్ ఎందుకు భయపడింది?
ఏపీ విభజనపై బీజేపీ ఏమనుకుంటోంది ?
ఐదు రాష్ట్రాల ఫలితాలకీ విభజనకీ లింకేంటి ?
అసలు మెలిక ఇక్కడే ఉంది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ ఖాతాలో పడిపోతే.. కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పాతాళానికి పడిపోయి రాజకీయ ఈక్వేషన్స్ మారిపోతాయ్. చిన్న పార్టీలకి ఇక పెద్దదిక్కు బీజేపీనే అవుతుంది. అపుడు రాష్ట్రంలో కూడా సీన్ మారిపోతుంది. కాంగ్రెస్ గోల్ మాల్ చేస్తోందంటూ టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఎదురు తిరగడానికి అస్త్రం చిక్కినట్టు అవుతుంది. అదే ఖాయమైతే… బిల్లుకి ముందు లెక్కలు మారొచ్చు. ఎన్నికలకేమో ఇంకా ఐదు నెలల టైముంది. ఈలోగానే అంచనాలు తారుమారు అయితే… వస్తుందనుకున్న రాయకీయ లాభం రాకుండా పోతుంది. చేజేతులా బీజేపీకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే కాంగ్రెస్ గేమ్ మార్చిందని అంటున్నారు.
”ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత బీజేపీ వ్యూహంలో మార్పు”
”బిల్లు నాటికి కొత్త రాజకీయం!”
”రాయలతెలంగాణతో రాజకీయ చిక్కులని కాంగ్రెస్ లెక్క!”
ఇలాంటి మాట ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. ఎదురుగాలి వీస్తున్న సమయంలో కాంగ్రెస్ కొద్దోగొప్పో ఆశలు పెట్టుకోగల ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. విభజన జరిగితే అమాంతం సీట్లు వచ్చిపడతాయని అనుకుంటున్న సమయంలో రాయల లాంటి లింకులు పెట్టుకొని పరిస్థితిని వ్యతిరేకంగా మార్చుకోవడం ఎందుకు.. ఎదురు తిరిగేందుకు బీజేపీకి ఓ దారి చూపించడం ఎందుకని కాంగ్రెస్ ఆచితూచి అడుగేస్తోందంటున్నారు.
బిల్లు నాటికి మరికొన్ని కొత్త ఈక్వేషన్స్ పెట్టే అవకాశాలున్నాయి. పరిస్థితుల్ని బట్టీ వ్యూహాలు మార్చుతూ బిల్లు దశలో ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది కాంగ్రెస్. ప్రత్యర్థులు పుంజుకోకుండా.. ఆశించిన ఫలితాలు అడుగంటిపోకుండా హైకమాండ్ జాగ్రత్తపడే ప్రయత్నా చేస్తోంది. అందుకే అంచనాలు తారుమారు అయ్యాయి. ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురొస్తున్నాయ్. మరి కాంగ్రెస్ నాయకత్వం ముందు ముందు ఇంకెలాంటి ఎత్తుగడలకి తెరతీస్తుందో చూడాలి!


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,670
Oka sambar raajakeeyam tho south india lo pedda raastranni 2 tunakalu chesaaru. Ippudu TG, Kerala kanna chinnadi MP seats vishayam lo. Residual AP Karnataka kanna chinnadi aipoindi.


Residual AP ki chippa ichindi bhaaratha prabutvam. Samikya raastramlone nillaku dikku ledu. Ika eguvana vachina kotta raastram tho kachitam gaa ikkada samsyalu vastaayi. Avi span of 10 years nunde prabaavam choopatam start chestaayi. Seemandhra vaallu sepearate country kosam vudyamaalu chese rojulu ento dooram lo levu. Idi kachitam gaa jarigi teerutaayi.