Author Topic: ప్రేమ ఇష్క్ కాదల్ review  (Read 228 times)

charan fan

  • Guest
ప్రేమ ఇష్క్ కాదల్ review
« on: December 06, 2013, 02:52:25 PM »apheraldRating :  2.5/5

ప్రేమ ఇష్క్ కాదల్ - చిత్ర కథ

ప్రేమ ఇష్క్ కాదల్ అనే చిత్రం మూడు జంటల ప్రేమ కథల సమ్మేళనం. ర్యాండి (హర్ష వర్ధన్ రాణే) ఒక రాక్ స్టార్ అతనికి మ్యూజిక్ అంటే ప్రాణం మ్యూజిక్ తో పాటు తను ఒక కాఫీ షాప్ ని నడుపుతూ ఉంటాడు. సరయు (వితిక షేరు) కాలేజీ అమ్మాయి రాక్ స్టార్ ని ఇష్టపడి తన వెంట పడుతుంటుంది. ఇక రాయల్ రాజు (విష్ణు వర్ధన్), మహనామా (సత్యం రాజేష్ ) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటారు అదే చిత్రానికి కాస్ట్యుం డిజైనర్ గా పని చేస్తున్న సమీర (రీతు వర్మ) తో ప్రేమలో పడతాడు. ఇక చివరి కథ అర్.జె అర్జున్ (హరీష్) ఒక ప్లే బాయ్ అతను శాంతి (శ్రీముఖి) కి ఆకర్షితుడవుతాడు. వీరి ముగ్గురి ప్రేమ కథలలో ఎదురయిన ఆటంకాలు మరియు వాటిని వీరు పరిష్కరించుకున్న విధానమే మిగిలిన కథ......

ప్రేమ ఇష్క్ కాదల్ - నటీనటుల ప్రతిభ

తకిట తకిట ఫేం హర్ష వర్ధన్ రాణే ఈ పాత్రలో జీవించాడు "రాక్ స్టార్" గా అతని ప్రదర్శన చాలా బాగుంది అతని కోసమే ఈ పాత్రను రచించినట్టు అనిపిస్తుంది అతని నటన. హర్ష వర్ధన్ కాకుండా మిగిలిన నటులందరు కొత్తవారు అయినా కూడా అందరు నటనలో చాలా పరిపఖ్వత ప్రదర్శించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మంది తారలతో పోలిస్తే వీరి నటన చాలా మెరుగ్గా అనిపించింది. హరీష్ తన పాత్రలో చాలా బాగా నటించారు. అమాయకపు పల్లెటూరి యువకుడి పాత్రలో విష్ణు వర్ధన్ చాలా బాగా నటించారు. ఇక రితు వర్మ మరియు శ్రీ ముఖి ఇలా ప్రతి ఒక్క్కరు వారి స్థాయిని మించి ప్రదర్శన కనబరిచారు. ఇక సత్యం రాజేష్, జోష్ రవి ల కామెడి చాలా బాగా పండింది.

ప్రేమ ఇష్క్ కాదల్ - సాంకేతికవర్గం పనితీరు

ఈ చిత్ర కథ చాలా సింపుల్ గా ఉంటుంది. కాని కృష్ణ చైతన్య మరియు పవన్ సాదినేని ఈ చిత్రం కథనం మీద చాలా శ్రద్ద తీసుకున్నారు. పాత్రలను పరిచయం చేసిన విధానం వాటిని కలిపిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ చిత్రాన్ని చాలా రిచ్ గా చూపించారు చిన్న చిత్రాలలో ఇటువంటి సినిమాటోగ్రఫీ చూడటం చాలా అరుదు. శ్రవణ్ అందించిన సంగీతం చాలా బాగుంది ఇక నేపధ్య సంగీతం విషయంలో అయన చాలా కృషి చేశారు ప్రతి సన్నివేశానికి ప్రాణం పోశారు. డైలాగ్స్ కూడా కథ కి తగ్గట్టుగానే ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి కాని 75 లక్షలతో ఇటువంటి అవుట్ పుట్ రాబట్టడం నిజంగా వారి గొప్పతనం .

ప్రేమ ఇష్క్ కాదల్ - చిత్ర విశ్లేషణ

తక్కువ బడ్జెట్ చిత్రాలతో హిట్ కోటలంటే ఇప్పుడు అందరికి తెలిసిన ఏకైక సూత్రం :బూతు" నిజానికి ఈ ఫార్ములా ఫాలో అయ్యి సక్సెస్ అయిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఒక యూత్ ఫుల్ చిత్రం బూతు లేకుండా చెయ్యాలనుకోవడం నిజంగా కాస్త ధైర్యంతో కూడిన విషయమే ఈ విషయంలో దర్శకుడు విజయం సాదించాడు బూతు అన్న పదాన్ని పక్కన పెట్టి "హెల్తీ కామెడి"తో చిత్రాన్ని నడిపించాడు అందులోనూ దర్శకుడు పవన్ నటీనటుల నుండి రాబట్టిన నటన అయితే అద్భుతం అని చెప్పుకోవాల్సిందే.
ఈ చిత్రం లో రెండవ అర్ధ భాగం బాగా నెమ్మదించింది అంతే కాకుండా కాస్త ఊహాజనితంగా ఉంటుంది . చిత్రం కాస్త షార్ట్ ఫిలిం ఫీల్ తో ఉంటుంది . ఇప్పటికే చాలా లఘు చిత్రాలను తీసిన పవన్ సాదినేని ఇది తన మొదటి చిత్రం అన్నట్టు ఎక్కడ కనపడనివ్వాడు అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని హేండిల్ చేశాడు. ఈ చిత్రాన్ని ఇంత ఫ్రెష్ ఫీల్ తో తెరకెక్కించడంలోనే అతనిలోని నైపుణ్యం తెలిసిపోతుంది . శ్రవణ్ అందించిన సంగీతం మరియు సినిమాటోగ్రఫీ చిన్న చిత్రాలలో ఇటువంటి సాంకేతికత అందులోనూ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇటువంటి సాంకేతికత రాబటడం నిజంగా గొప్ప విషయం. ఈ ఏడాది విడుదలయిన యూత్ ఫుల్ చిత్రాలలో బెస్ట్ చిత్రం ఇది కాని బి సి సెంటర్ లలో ఈ చిత్రం ఎటువంటి ప్రదర్శన కనబరుస్తుందో వేచి చూడాల్సిందే .. ఇప్పటికయితే మీకు దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్లి ఈ చిత్రాన్ని చూసేయండి ...Offline rajaram

  • Hero Member
  • *****
  • Posts: 2,964
ప్రేమ ఇష్క్ కాదల్ review
« Reply #1 on: December 06, 2013, 09:01:49 PM »


jeevi has given 3/5

how is this movie ? anyone watched it ?