Author Topic: ‘సెమీస్’ తీర్పు నేడే  (Read 809 times)

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« on: December 08, 2013, 09:45:15 AM »
 ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 10.30 గంటలకు ఢిల్లీ ఫలితాలు రానున్నాయి.  వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్నఈ ఎన్నికల ఫలితాలపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మిజోరంలో మాత్రం ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ శక్తిసామర్థ్యాలకు ఈ ఫలితాలు గీటురాయిగా నిలవనున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ అరంగేట్రంతో త్రిముఖ పోరు నెలకొంది.
 
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా రాజస్థాన్లో 200 సీట్లు (199 సీట్లకే పోలింగ్ జరిగింది), మధ్యప్రదేశ్లో 230 సీట్లు, ఛత్తీస్గఢ్లో 90 సీట్లు, మిజోరంలో 40 సీట్లు ఉన్నాయి. ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు రాజస్థాన్లో కాంగ్రెస్ను గద్దె దించే అవకాశం ఉందని, ఢిల్లీలో మాత్రం హంగ్ ఫలితాలు రావొచ్చని అంచనా వేశాయి. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి సంకీర్ణ సర్కారును నడిపే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఈ అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ తన దృష్టిని లోక్సభ ఎన్నికలవైపు మళ్లించేందుకు సమాయత్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకవేళ నిజమైనా వాటి ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉండదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి షకీల్ అహ్మద్ చెప్పుకొచ్చారు.1999లో తమ పార్టీ ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలైందని గుర్తుచేశారు. అలాగే 2003లో బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో గెలుపొందినా 2004 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మిజోరంలో మాత్రం ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ శక్తిసామర్థ్యాలకు ఈ ఫలితాలు గీటురాయిగా నిలవనున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ అరంగేట్రంతో త్రిముఖ పోరు నెలకొంది.
 
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా రాజస్థాన్లో 200 సీట్లు (199 సీట్లకే పోలింగ్ జరిగింది), మధ్యప్రదేశ్లో 230 సీట్లు, ఛత్తీస్గఢ్లో 90 సీట్లు, మిజోరంలో 40 సీట్లు ఉన్నాయి. ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు రాజస్థాన్లో కాంగ్రెస్ను గద్దె దించే అవకాశం ఉందని, ఢిల్లీలో మాత్రం హంగ్ ఫలితాలు రావొచ్చని అంచనా వేశాయి. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి సంకీర్ణ సర్కారును నడిపే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ తన దృష్టిని లోక్సభ ఎన్నికలవైపు మళ్లించేందుకు సమాయత్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకవేళ నిజమైనా వాటి ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉండదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి షకీల్ అహ్మద్ చెప్పుకొచ్చారు. 1999లో తమ పార్టీ ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలైందని గుర్తుచేశారు. అలాగే 2003లో బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో గెలుపొందినా 2004 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #1 on: December 08, 2013, 09:47:24 AM »
న్యూఢిల్లీలో బీజేపీ, ఆప్ ల మధ్య పోటాపోటీ

న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.15 మంది బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో ఉండగా, ఆప్ పార్టీ అభ్యర్థులు 13 మంది విజయపథంలో దూసుకుపోతున్నారు.  కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ కూడా కృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా విజయం వైపు దూసుకుపోతున్నారు.
 
అయితే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలా దీక్షిత్ సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కంటే అధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు అధిక్యంలో ఉన్నారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #2 on: December 08, 2013, 11:42:31 AM »
ఢిల్లీ అసెంబ్లీ: మేజిక్ మార్కుకు కొద్ది దూరంలో బీజేపీ


  దేశ రాజధాని నగరంలో కాంగ్రెస్ కోట బద్దలవుతోంది. సర్వేలు చెప్పిన మాటలు నిజమేనని తేలింది. తొలుత షీలా దీక్షిత్ మాత్రం ముందంజలో ఉన్నా.. మళ్లీ ఆమె మీద పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ 2,700 ఓట్ల ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఇక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీ ఇప్పటికే 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అవినీతి నిరోధం, ధరల నియంత్రణ నినాదాలతో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూసుకొచ్చింది. పదిహేనేళ్ల పాటు వరుసగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది.

ఢిల్లీ (70 సీట్లు)
పార్టీ                2003                       2008                 2013 (ఆధిక్యం)
బీజేపీ                 20                           23                        34
కాంగ్రెస్               48                           43                         07
ఆమ్ ఆద్మీ           00                           00                          26

బీజేపీ ఇప్పటికే 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లోను, కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. మరో మూడు చోట్ల ఇతరులు ఆధిక్యత కనబరుస్తున్నారు. కనీసం 36 స్థానాల్లో గెలిస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. బీజేపీ కేవలం మరో రెండు స్థానాలలో దూసుకొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఆధిక్యాలు మాత్రమే. ఇంకా ఒక్క చోట కూడా ఫలితాలు విడుదల కాలేదు. పూర్తి స్థాయి ఫలితాలు వస్తే తప్ప అధికారం కమలానికి అందుతుందా లేదా అనే విషయం చెప్పలేం. అయినా కూడా అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా పిలుస్తారు కాబట్టి, ఆ కోణంలో కూడా బీజేపీ హస్తినలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #3 on: December 08, 2013, 11:43:20 AM »
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదివారం బాగా కలిసొచ్చింది. దేశ రాజధాని నగరంలో తాము స్వయంగా అధికారంలోకి రాలేకపోయినా, కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టగలుగుతున్నామన్న ఆనందం ఆ పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్ధానాలుండగా 25 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. కొడితే నేరుగా కొండనే ఢీకొట్టాలి అన్నట్లు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ నెల ఒకటో తేదీన ఎన్నికలు జరిగాయి. సర్వేలలో ఏబీపీ - నీల్సన్ సంస్థ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 15 స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. ఇండియాటుడే-ఓఆర్ జీ, టైమ్స్ నౌ- సీ ఓటర్ మాత్రం 06, 11 స్థానాలు వస్తాయన్నాయి. వీటిని దాటుకుంటూ మరింత ముందుకెళ్లింది ఈ పార్టీ.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #4 on: December 08, 2013, 11:44:14 AM »
రాజస్థాన్ లో బీజేపీ సంబరాలు

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పయనిస్తోంది. బీజేపీకి అధిక స్థానాలు దక్కనున్నాయని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు బీటలు వారనున్నాయని వార్తలు వస్తుండడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణా సంచా కాల్చారు.

జైపూర్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట నృత్యాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోనూ కాషాయ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్ లో 199 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ జరిగింది. ఝూలావర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరా రాజే గెలుపుదిశగా పయనిస్తున్నారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #5 on: December 08, 2013, 11:44:55 AM »
మధ్యప్రదేశ్ లో మరోసారి వికసిస్తున్న కమలం

మధ్యప్రదేశ్ లో ముచ్చటగా మూడోసారి బారతీయ జనతా పార్టీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభలోని మొత్తం 290 అసెంబ్లీ స్థానాలకుగాను 102 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయపథంలో దూసుకుపోతున్నారు. చంబల్ లోయలో ఆ పార్టీ తన హావా కొనసాగిస్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 51 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అధివారం ఉదయం ప్రారంభమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇతరులు 9 మంది అధిక్యంలో దూసుకుపోతున్నారు. మధ్యప్రదేశ్ శాసనసభకు నవంబర్ 25న ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 75 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

•   బుధ్ని, విదిశ నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముందంజలో  కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి శశాంక్ భార్గవ కంటే 1168 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
•   మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కుమారుడు జై వర్దన్ సింగ్ అధిక్యంలో ఉన్నారు. ఆయన రాఘవ్ గఢ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
శివపూరి శాసనసభ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన  సింధియా వంశానికి చెందిన కోడలు యశోధర రాజ్ సింధియా అధిక్యంలో కొనసాగుతున్నారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #6 on: December 08, 2013, 05:10:56 PM »
ఇది ప్రజావిజయం, ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్

ఢిల్లీలో ప్రజలు తమకు అందించిన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నారు. ఇది ప్రజా విజయమని, ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. కనాట్ ప్లేస్లోని హనుమాన్ రోడ్డులో గల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ నృత్యాలు చేస్తుండగా వారికి చేతులు ఊపుతూ అభివాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఆయన తమ పార్టీ కార్యాలయం మొదటి అంతస్థు నుంచే అభివాదాలు తెలిపారు.

ఆయన మద్దతుదారులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపురు కట్టలను చూపిస్తూ హర్షధ్వానాలు చేశారు. తమ పార్టీ విజయం పట్ల తనకు ఎప్పుడూ విశ్వాసం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్పై ఆయన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పక్కనే నిలబడిన ఆప్ నాయకుడు కుమార్ విశ్వాస్ మైకు తీసుకుని, గట్టిగా, 'భారత్ మాతాకీ జై', 'ఆమ్ ఆద్మీ హై హమ్, హమ్ ఆమ్ ఆద్మీ హై' అంటూ నినదించారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #7 on: December 08, 2013, 05:12:37 PM »
రాజస్థాన్లో హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు

రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా హస్తం పార్టీ అడ్రస్ గల్లంతయింది. మధ్యాహ్నం రెండు 2 గంటలకు ప్రకటించిన ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం విపక్ష హోదా అవకాశాలు కూడా లేవని స్పష్టమవుతోంది.12 స్థానాల్లో జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకలేకపోయింది.

జైపూర్ నగరంలోని 19 స్థానాల్లో 10 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పరిస్థితి ఎంత దీనంగా ఉందో.  జ్యోతిరాదిత్య సింధియా యువ మంత్రం రాజస్థాన్లో పనిచేయలేదు. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే తన సొంత నియోజకవర్గంలో విజయబావుటా ఎగుర వేశారు. సర్దార్పూరలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ గెలుపు బాటలో పయనిస్తున్నారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #8 on: December 08, 2013, 06:25:52 PM »
ఓటమికి ఎన్నో కారణాలు.. మాకో హెచ్చరిక: సోనియా

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర నిరాశను కలగించాయని, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఈ ఫలితాలు తమకు హెచ్చరికలాంటివని అన్నారు. ఆదివారం సాయంత్రం సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను విశ్వేషించాల్సివుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందని సోనియా చెప్పారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి స్థానిక పరిస్థితులతో పాటు ధరల పెరుగుదల కారణమని పేర్కొన్నారు. ఓటమికి గల కారణాలను పరిశీలించి విధానాలను సమీక్షిస్తామని తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు.
ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సివుందని రాహుల్ అన్నారు. ప్రజల అభిప్రాయాలకనుగుణంగా పనిచేసే సత్తా కాంగ్రెస్కుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు తగువిధంగా పనిచేయలేదని రాహుల్ వ్యాఖ్యానించారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #9 on: December 08, 2013, 06:30:25 PM »
We will not take any support from any other party: Arvind Kejriwalcharan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #10 on: December 08, 2013, 06:39:43 PM »
chipuru ni patti avinitini thudiche party AP lo enni years ki vastunddo

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #11 on: December 08, 2013, 07:49:03 PM »
ELECTION RESULTSchattisgarh

bjp     49
cong   39
bsp     1

rajasthan

bjp    162
cong  21
bsp     3
rjp      4
oth     9

delhi

bjp      32
aap     28
cong   8
oth      2

madyapradesh

bjp     165
con     58
Bsp     4
Oth     3
charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #12 on: December 08, 2013, 07:56:41 PM »
2 seats short for BJP to form GOVT in delhi.
lets see what are the options have to form govt...
1) can others(2 seats) support bjp to form govt?
2) can BJP buy some of MLA's in AAP or CONGRESS?
3) apart from above can leftenient governor calls to bjp ?
     because no one ready to form GOVt. and BJP is second largest party in delhi

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #13 on: December 08, 2013, 07:59:34 PM »
ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు గుణపాఠం : రాహుల్ గాంధీ

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు గుణపాఠం లాంటివని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఫలితాలపై స్పందించిన ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్ధులు చాలా కష్టపడ్డారని, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ కూడా కష్టపడ్డారని అయినా ఓటమిపాలయ్యామని అన్నారు.
ఓటమిని సమీక్షించుకుంటామని, కాంగ్రెస్‌కు తనను తాను సంస్కరించుకునే శక్తి ఉందని, ప్రజల అంచనాలను అందుకుంటామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమ్ అద్మీ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంమని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రధాన పార్టీల సంప్రదాయక విధానంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన వారికి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు.

charan fan

 • Guest
‘సెమీస్’ తీర్పు నేడే
« Reply #14 on: December 08, 2013, 08:05:04 PM »
ఢిల్లీ: హంగ్ అసెంబ్లీ.. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ

దేశ రాజధాని నగరంలో కాంగ్రెస్ కోట బద్దలైంది. సర్వేలు వెల్లడించినట్టుగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీ అదిపెద్ద పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ రెండో స్థానంలో నిలవగా, ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ సింగిల్ డిజిట్ తో మూడో స్థానానికి పడిపోయింది.
అతిపెద్ద పార్టీగా ఏర్పడిన బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఆమ్ ఆద్మీ 27 సీట్లు కైవసం చేసుకోగా, మరో చోట ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు మూడు స్థానాలు గెలిచారు. కనీసం 36 స్థానాల్లో గెలిస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా పిలుస్తారు కాబట్టి, ఆ కోణంలో బీజేపీ హస్తినలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎవరికీ మద్దతు ఇవ్వమని, తీసుకోబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ అవసరమైన మద్దతు కూడగడుతుందా అన్నది వేచిచూడాలి. కాంగ్రెస్ ఎలాగూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వదు.
ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించారు.  ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో షీలాపై 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీలో అవినీతి నిరోధం, ధరల నియంత్రణ నినాదాలతో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొచ్చింది. పదిహేనేళ్ల పాటు వరుసగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది.