Author Topic: Vamsi Paidipally exclusive interview on Yevadu  (Read 343 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,672
Vamsi Paidipally exclusive interview on Yevadu
« on: January 11, 2014, 03:10:43 PM »
www.youtube.com/watch?feature=player_embedded&v=rVzf0WtCKE0

charan fan

  • Guest
Vamsi Paidipally exclusive interview on Yevadu
« Reply #1 on: January 11, 2014, 04:20:11 PM »
చరణ్‌తో గొడవలే ఉంటే ‘ఎవడు’ ఇలా ఉండేది కాదు

మొదటి సినిమానే ప్రభాస్‌తో. అది కూడా ఛత్రపతి తర్వాత. వచ్చిన అవకాశాన్ని విజయంగా మలచుకోలేకపోయాడు కానీ దర్శకుడిగా మున్నాతో ముద్ర అయితే వేయగలిగాడు. అదే అతనికి బృందావనం తెచ్చిపెట్టింది. రెండో అవకాశాన్ని వృధా చేసుకోలేదు. ఎన్టీఆర్‌తో మంచి హిట్టిచ్చాడు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌తో ‘ఎవడు’ తలపెట్టాడు. అప్పట్నుంచీ ఈ సినిమా ముందుకి కదలడానికీ, పూర్తి కావడానికీ... చివరకు విడుదల కావడానికీ కూడా చాలా చాలా టైమ్‌ తీసుకుంది. ఎన్నో ఇబ్బందులు ఫేస్‌ చేసింది. దర్శకుడిగా ఇది కూడా ఒక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న వంశీ పైడిపల్లి... తన సినిమా ఇంత లేట్‌ అయినా కానీ తప్పకుండా లేటెస్ట్‌గా అనిపిస్తుందని, ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుందని చెప్తున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎంతో ఆలస్యం జరిగిపోయినా... ఎవడులో ఎవరినైనా మెప్పించే అంశాలున్నాయని, ప్రేక్షకులని చేరడం ఆలస్యమైందనే బాధ తప్ప, సినిమాపై నమ్మకం కాస్త కూడా సడలిపోలేదని అంటున్న వంశీ పైడిపల్లితో ‘గ్రేట్‌ఆంధ్ర’ చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

2007 నుంచి 2014...   

(ప్రశ్న అర్థమైంది అన్నట్టుగా నవ్వేస్తూ...) యస్‌, యస్‌... 2007 నుంచి 2014, కేవలం మూడు సినిమాలే చేసాను. ఏ డైరెక్టర్‌కి అయినా ఇది చాలా తక్కువ నంబర్‌. అదీ కెరీర్‌ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు. అది నేను ఒప్పుకుంటాను. బట్‌... నేను లేట్‌ చేయడం వల్ల సినిమాలు లేటవడం కాదు, నా సినిమాల విషయంలో అలా జరిగిపోయింది. ఐ కుడిరట్‌ హెల్ప్‌ ఇట్‌. ‘మున్నా’ సినిమా ఫెయిలవడంతో నేను చాలా డిస్టర్బ్‌ అయ్యాను. అంత పెద్ద సినిమా చేయలేకపోయానే అని ఒక విధమైన లూప్‌లోకి వెళ్లిపోయాను. ఒకటిన్నర సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయాను. ఆ టైమ్‌లో నాకు కొంత మంచి కూడా జరిగింది. ఆ టైమ్‌లోనే నా పెళ్లి అయింది. ఆ తర్వాత నన్ను నేనే నెక్స్‌ట్‌ ఏంటి అని క్వశ్చన్‌ చేసుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఎవరిని వాళ్లే ప్రోత్సహించుకుని, ఎవరి భుజం వాళ్లే తట్టుకుని నిలబడాలి. ఎవరో వచ్చి మనల్ని నడిపిస్తారని చూడకూడదు. ఎవరి పనులు వాళ్లకుంటాయి. అలా నన్ను నేను నిలబెట్టుకోవాలి, నిరూపించుకోవాలి అనే తపనలో బృందావనం కథ చేసాను. ఆ సినిమా ఓకే అయిన తర్వాత ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్‌ కావడం వల్ల కొంత డిలే అయింది. బృందావనం రిలీజ్‌ అయిన ఆరు నెలలకే ఎవడు స్టోరీ రెడీ అయిపోయింది. చరణ్‌కి, చిరంజీవిగారికి నెరేట్‌ చేయడం, వారు ఓకే చేయడం అయిపోయాయి. కానీ అప్పటికే తను రచ్చ, నాయక్‌ సినిమాలకి కమిట్‌ అయి ఉండడం వల్ల, తర్వాత తన పెళ్లి జరగడం వల్ల ఎవడు స్టార్ట్‌ అవడం లేట్‌ అయింది. సినిమా పూర్తయి రిలీజ్‌ కావడానికి రెడీ అయిన తర్వాత ఏమైందో కూడా మీకు తెలుసు. ఎప్పుడో జులై ఎండ్‌లో రిలీజ్‌ కావాల్సిన సినిమా అప్పుడు కాకపోవడం వల్ల మంచి టైమ్‌ కోసం వెయిట్‌ చేసి, చేసి.. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్‌ అవుతోంది. నాకు తెలిసి ఇంతకుముందు ఏ పెద్ద సినిమాకీ ఇలా జరగలేదు. ఫైనాన్షియల్‌ రీజన్స్‌ వల్ల, షూటింగ్‌ మధ్యలో ఆగిపోవడం వల్ల కొన్ని సినిమాలు లేట్‌ అవుతాయి. కానీ మొత్తం పూర్తి చేసుకుని, అన్నీ ఉన్న సినిమా ఇంత లేట్‌ అవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అనుకుంటున్నాను. ఎనీవే... ఈ జింక్స్‌ ఏదైతే ఉందో అది నా మూడో సినిమాతో బ్రేక్‌ అయిపోయిందని, ఇకపై స్పీడ్‌గా సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను.

సినిమా రిలీజ్‌ ఎలాగో లేట్‌ అవుతోంది కాబట్టి ఏవైనా బెటర్‌మెంట్స్‌ చేద్దామని అనుకున్నారా?

లేదండీ. అస్సలు ఎప్పుడూ అలా అనుకోలేదు. ఎందుకంటే మేము పక్కా స్క్రిప్ట్‌తో స్టార్ట్‌ చేసాం. చిరంజీవిగారికి, చరణ్‌కి కథ చెప్పినప్పుడే 100% కథ ఓకే అయిపోయింది. ఒక్క చిన్న ఛేంజ్‌ కూడా చెప్పలేదు. స్క్రిప్ట్‌ స్టేజ్‌లోనే ఎంతో బ్రెయిన్‌ స్టార్మింగ్‌ చేసిన తర్వాతే షూట్‌కి వెళ్లాం. షూటింగ్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా, ఎలాంటి డౌట్స్‌ లేకుండా క్లారిటీతో చేసాం. ఇక కొత్తగా దీనిని బెటర్‌మెంట్‌ చేయడానికి, ఇంకేదైనా మార్పులు చేయడానికి ఇక అసలు స్కోప్‌ లేదు. వీ డిడ్‌ అవర్‌ బెస్ట్‌ అన్నమాట. కానీ మీడియాలో రీషూట్స్‌ చేస్తున్నారని, ప్రోమో సాంగ్‌ షూట్‌ చేస్తున్నారని స్కూప్స్‌ వచ్చాయి. ఈ సినిమా ప్రోమో సాంగ్స్‌ చేసే టైప్‌ కాదు. అలాంటివి దీనికి సెట్‌ కావు. సో... మేమెప్పుడూ అలాంటివి చేద్దామని అనుకోలేదు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ చూసినా జులైలో ఇచ్చిన సర్టిఫికెట్టే ఉంటుంది. మేం తర్వాత ఏదైనా చేసి ఉంటే రీసెన్సార్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఏదైనా మార్పు చేయాలనే ఆలోచనే మాకు రాలేదెప్పుడూ.

సెన్సార్‌ జరిగిపోయి, రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ అయిన తర్వాత చివర్లో ఆపాల్సి వచ్చిన ఈ చిత్రం ఇంత లేట్‌ అవుతుంటే, దీనిపై ఉండే క్రేజ్‌ తగ్గిపోతుందని, సినిమా స్టేల్‌ అయిపోతుందని అనిపించలేదా?

ఖచ్చితంగా అండీ. ఇన్‌ఫాక్ట్‌ చాలా రోజులు అదే భయం పట్టుకుంది నాకు. ఫైవ్‌ మంత్స్‌ పైగా సినిమా రిలీజ్‌ చేయకుండా ఆపేసి ఉంచాం. స్టేల్‌ అయిపోతుందేమో, ఇప్పుడు రిలీజ్‌ చేసినా ముందున్న క్రేజ్‌ వస్తుందో రాదో అనే భయం నాలో పెరుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే జనవరి 1న టీజర్‌, ఆ తర్వాత థియేట్రికల్‌ ట్రెయిలర్‌ రిలీజ్‌ చేసామో... మళ్లీ దీనిపై పాజిటివ్‌ బజ్‌ స్టార్ట్‌ అయింది. సెకండ్‌ థియేట్రికల్‌ ట్రెయిలర్‌ కట్‌ చేయడం చాలా కష్టపెట్టింది. ఎందుకంటే ఏ సినిమాకి అయినా ఒక థియేట్రికల్‌ ట్రెయిలర్‌ రిలీజ్‌ చేస్తారు. ఫస్ట్‌ ట్రెయిలర్‌కే చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ట్రెయిలర్‌ కట్‌ చేయడమంటే ఇందులో కథ గురించి ఎక్కువ ఇన్‌ఫర్మేషన్‌ ఉండకూడదు. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ ఫస్ట్‌ ట్రెయిలర్‌తో సమానంగా ఉందని అనిపించాలి. ఇలాంటివి ఆలోచించి బాగా కష్టపడ్డాం. థాంక్‌ గాడ్‌... అంతా బాగా జరిగింది. ఇప్పుడు మళ్లీ సినిమాకి హైప్‌ వచ్చింది.

మీరు చెప్పినదానిని బట్టి ఇది మూడేళ్ల క్రితం రాసుకున్న కథ. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ టైమ్‌లో స్టోరీ వైజ్‌ కానీ, ఎగ్జిక్యూషన్‌ వైజ్‌ కానీ ఏదైనా అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం కనిపించిందా?

ఈ కథ అప్పటికే కాదండీ... ఇప్పటికి కూడా అడ్వాన్స్‌డ్‌గానే అనిపిస్తుంది. సో... స్టోరీ ఐడియా స్టేల్‌ అవుతుందనే క్వశ్చనే లేదు. ఇక టెక్నికల్‌గా, ఎగ్జిక్యూషన్‌ పరంగా కూడా రీసెంట్‌గా తీసిన సినిమాలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ చేసింది జనవరి 2013 నుంచే. అంతకుముందు ఒక నలభై రోజులు షూటింగ్‌ చేసాం కానీ సినిమాలో ఎక్కువ భాగం తీసిందంతా జనవరి తర్వాతే. సినిమా విడుదలవ్వాల్సిన దానికంటే అయిదు నెలలు ఆలస్యంగా వస్తోంది కానీ, అంతా అప్‌ టు డేట్‌ ఉంటుంది. సినిమా చూస్తుంటే రీసెంట్‌గా కంప్లీట్‌ అయి, రిలీజ్‌ అయిన సినిమాలానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా పాతబడిపోయిందనే ఫీల్‌ రాదు.

‘ఎవడు’ ఐడియా చాలా కొత్తగా ఉంటుందని మీరంటున్నారు. కానీ ఇది ‘ఫేస్‌ ఆఫ్‌’ మూవీ నుంచి లిఫ్ట్‌ చేసారనే టాక్‌ బయట వినిపిస్తోంది.

యా... అది నేనూ విన్నాను. ఇది ఫేస్‌ ఆఫ్‌ రిప్‌ ఆఫ్‌ అని రాస్తున్నారు. కానీ ఆ సినిమాకీ, దీనికీ పొంతనే లేదు. ఒక్క సీన్‌ కూడా మ్యాచ్‌ అవదు. ఇది ఎంటయిర్లీ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, డిఫరెంట్‌ థీమ్‌ ఉన్న ఫిలిం. అండ్‌ బేసిగ్గా నేను హాలీవుడ్‌ సినిమాలని చూసి ఇన్‌స్పయిర్‌ అవను. నేను పెద్ద తెలుగు సినిమా ఫాన్‌. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. నేను పుట్టకముందే మా నాన్నగారు ఒక సినిమా థియేటర్‌ కొన్నారు. సో.. నేను ఆ థియేటర్లో ఎన్నో తెలుగు సినిమాలు చూసాను. హాలీవుడ్‌ మూవీ ఏదైనా మంచి టాక్‌ వచ్చి, చాలా బాగుంది అంటే తప్ప చూసేవాడిని కాదు. నాకు తెలుగు సినిమాల్లో ఉండే హీరోయిజం అన్నా, ఆ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నా చాలా ఇష్టం. కాబట్టి నా సినిమాల్లో అలాంటి ఎమోషన్స్‌, హీరోయిజం ఉంటుందే తప్ప నా సినిమాలు హాలీవుడ్‌ మూవీస్‌ స్టయిల్‌లో అస్సలుండవు. ఎవడు కూడా తెలుగు సినిమా ప్రేక్షకులకి కావాల్సినట్టుగా ఉంటుంది. కాకపోతే ఒక కొత్త పద్ధతిలో, ఇంతకుముందు చూడని యాంగిల్‌లో స్క్రీన్‌ప్లే రన్‌ అవుతుంది.

‘ఎవడు’ కథ విన్నప్పుడు చరణ్‌ ఎలా రియాక్ట్‌ అయ్యాడు?

నేను ఈ కథని చరణ్‌కి, చిరంజీవిగారికి కలిపి ఒకేసారి నెరేట్‌ చేసాను. నేను చిరంజీవిగారికి పెద్ద ఫాన్‌. లైఫ్‌లో ఆయనని కలవలేదు. అదే ఫస్ట్‌ టైమ్‌ ఆయనని కలవడం... డైరెక్ట్‌గా కథ చెప్పడానికి వెళ్లాను. ఒక పది నిముషాలు బెరుగ్గా అనిపించింది కానీ తర్వాత కుదురుకుని కథ మొత్తం నెరేట్‌ చేసాను. ఆయన కథ విన్నాక ఇంకేం మాట్లాడలేదు... ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని ఒకటే మాట అన్నారు. చరణ్‌ లేచి నన్ను హగ్‌ చేసుకున్నాడు. చిరంజీవి గారి రియాక్షన్‌, చరణ్‌ ఎక్సయిట్‌మెంట్‌... ఇట్‌ వాజ్‌ ఏన్‌ అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. బృందావనం తర్వాత నేను చరణ్‌కి వేరే కథ వినిపించాను. కానీ తనకి అది అంతగా నచ్చలేదు. ‘లేదు వంశీ... నీనుంచి నేను ఇంకా ఏదో ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను’ అన్నాడు. ‘ఎవడు’ కథ చెప్పాక ‘ఇదే నేను ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంది’ అని తను చెప్పలేదు కానీ, తన రియాక్షన్‌ని బట్టి అర్థమైంది. అండ్‌ చరణ్‌తో నాకు పరిచయం గురించి చెప్పాల్సి వస్తే... ‘మున్నా’ సాంగ్స్‌ చూసి నాకు కాల్‌ చేసాడు. తను చిరుత షూటింగ్‌ కోసం బ్యాంకాక్‌ వెళుతున్నాడు. అప్పుడోసారి మున్నా సాంగ్స్‌ చూసాడంట. చూడగానే నాకు కాల్‌ చేసి చాలా బాగా తీసావ్‌ సాంగ్స్‌ అని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. తర్వాత మున్నా ఫెయిల్‌ అయి నేను కొంచెం డిస్టర్బ్‌డ్‌గా ఉన్న టైమ్‌లో చరణ్‌ని నేను ఓ కాఫీ షాప్‌లో అనుకోకుండా కలిసాను. మున్నా రిజల్ట్‌ ఏమైనా కానీ హీరోని బాగా ప్రెజెంట్‌ చేసావ్‌. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పు, మనం తప్పకుండా చేద్దామని అన్నాడు. ఆ టైమ్‌లో తన మాటలు నన్ను చాలా ఎంకరేజ్‌ చేసాయి. తనతో ఇప్పుడు ఎవడులాంటి సినిమా తీయడం హ్యాపీగా ఉంది.

చరణ్‌ వల్లే ‘ఎవడు’ డిలే అవుతుందని మీరు అతని విషయంలో డిజప్పాయింట్‌ అయ్యారని, ఇద్దరి మధ్య టర్మ్స్‌ చెడ్డాయని కొన్ని రూమర్స్‌ వినిపించాయి...

ఒక మూవీ డిలే అవుతున్నప్పుడు మీడియాలో ఇలాంటి రూమర్స్‌ వినిపిస్తూ ఉంటాయండీ. డెఫినెట్‌గా ఒక సినిమా షూటింగ్‌ జరుగుతున్నపుడు ఏదో ఒక సందర్భంలో ఇద్దరు ఇండివిడ్యువల్స్‌ మధ్య ఏదైనా విషయంలో డిఫరెంట్‌ ఓపీనియన్స్‌ ఉండొచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఏ సినిమా విషయంలో అయినా మామూలే. ఎవడు విషయంలో వచ్చే సరికి ఎప్పుడో అయిపోవాల్సిన సినిమా బాగా లేట్‌ అయింది. డైరెక్టర్‌గా నేను కొంచెం ప్రెజర్‌ ఫీలయిన మాట నిజమే. కానీ ఎట్‌ ది సేమ్‌ టైమ్‌... సినిమాని హోల్డ్‌ చేసి పెట్టాలంటే నా కంపోజర్‌ ఎక్కడా నేను కోల్పోకూడదు. నేను అలా డిస్టర్బ్‌ అయ్యానంటే సినిమా ఎఫెక్ట్‌ అవుతుంది. ఎవడు సినిమా చూస్తే ఇది కంప్లీట్‌ టీమ్‌ వర్క్‌ అనిపిస్తుంది. అందరి మధ్య మంచి అండర్‌స్టాండిరగ్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌ ఉంటేనే ఇలాంటి సినిమా ఇలా రావడం జరుగుతుంది. అదే మేమిద్దరం జెల్‌ అవలేకపోయి ఉంటే కనుక ‘ఎవడు’ ఇలాంటి షేప్‌ తీసుకునేది కాదు. ఒక డైరెక్టర్‌కి, హీరోకి ఉన్న సింక్‌ తెలియాలంటే సినిమా చూడాలి. వాళ్లిద్దరి మధ్య సింక్‌ లేకపోతే స్క్రీన్‌ మీద కనిపించిపోతుంది. మీకు రేపు సినిమా చూస్తే మేమిద్దరం ఎంత బాగా సింక్‌ అయ్యామో... నేను అనుకున్నది తనకి నేను ఎలా కన్వే చేయగలిగానో, నాకు కావాల్సింది తను ఎంత బాగా ఇవ్వగలిగాడో క్లియర్‌గా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి రూమర్స్‌కి ఎవడు సినిమానే ఆన్సర్‌ ఇస్తుంది.

ఎవడు ఎలాగో డిలే అవుతుంది కాబట్టి ఈలోగా ఇంకో సినిమా ఏదైనా స్టార్ట్‌ చేద్దామని అనుకోలేదా?

కొత్త సినిమా స్టార్ట్‌ చేద్దామనే కంటే... ఎవడు ఎప్పుడు బయటకి వస్తుందా అని ఎక్కువ ఆలోచించానండీ. ఎందుకంటే ఈ సినిమా నాకు చాలా చాలా ఇంపార్టెంట్‌. ఇది కేవలం నా మూడో సినిమా. దీనికి ముందు నా కెరియర్‌లో ఒకటే హిట్‌ ఇచ్చాను. ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే... ఎనీ డైరెక్టర్‌ ఈజ్‌ యాజ్‌ గుడ్‌ యాజ్‌ హిజ్‌ లాస్ట్‌ ఫిలిం. ఒక డైరెక్టర్‌ అంతకుముందు ఏం చేసాడు, దానికంటే ముందు ఏం చేసాడు అని చూడరు. తన లాస్ట్‌ సినిమాకి ఏం చేసాడు అనేదే చూస్తారు. బృందావనం హిట్టే. అది అయిపోయింది. తర్వాత వంశీ ఏం చేసాడని చూస్తే... ఏమి చేసాను? ఎవడు ఒక్కటే కదా? మరి దీని రిజల్ట్‌ ఏంటి? వంశీ ఈ సినిమా ఎలా తీసాడు అని చూస్తారు. బృందావనం తర్వాత మళ్లీ ఈ సినిమా కూడా అలాగే తీసాడా ఏమైనా డిఫరెన్స్‌ చూపించాడా? అని అబ్జర్వ్‌ చేస్తుంటారు. నేను నా సినిమాల మధ్య చాలా డిఫరెన్స్‌ ఉండాలని అనుకుంటాను. బృందావనం తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయకూడదని ముందే అనుకున్నాను. అందుకే కంప్లీట్‌ కాంట్రాస్ట్‌గా ఉన్న ఎవడు చేసాను. రేపు అలాగే దీనికి ఏమాత్రం సంబంధం లేని సినిమా చేస్తాను. బట్‌ నేను ఇప్పుడు ఏం చేసానో తెలియాలంటే ఈ సినిమా బయటకి రావాలి కదా. నేను బాగానే చేసాననే కాన్ఫిడెన్స్‌ నాకుంది. కానీ ఇది ఆడియన్స్‌కి చూపించాలని, వారి రియాక్షన్‌ తెలుసుకోవాలని ఇంకా బలంగా ఉంది. ఆ రోజు కోసమే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఫైనల్లీ జనవరి 12న ఎవడుని ఆడియన్స్‌ చూడబోతున్నారు. వారు ఎలా రియాక్ట్‌ అవుతారనే దాని గురించి ఎక్సయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను.

ఆడియన్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో మరో రెండు రోజుల్లో తెలుసుకోబోతున్నామనగా... వాయిదా పడిరదిగా. అంటే మీరు ఈ ఎక్సయిట్‌మెంట్‌ని కూడా రెండోసారి ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నట్టున్నారు.

నిజమండీ. డ్యూ డేట్‌ ఇచ్చేసి, లేబర్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి కాసేపట్లో డెలివరీ అయిపోతుంది అనగా... ‘లేదమ్మా... మీ బిడ్డ ఇప్పుడు డెలివరీ కావడం లేదు. డెలివరీ నిరవధికంగా వాయిదా వేస్తున్నాం’ అంటే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది. నేను అప్పుడు అలా ఫీలయ్యానండీ. సినిమా తీయడమంటే ప్రసవ వేదనలు పడడమని అంటూ ఉంటారు. ఆ ప్రసవ వేదనలు ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. నేననే కాదు... ఈ అయిదు నెలలుగా రాజుగారు, చరణ్‌, బన్నీ... ఇలా అందరం కూడా చాలా అనుభవించాం. ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూసాం.

ఫినిష్డ్‌ ప్రోడక్ట్‌ చేతిలో పెట్టుకుని రిలీజ్‌ చేసే అవకాశం ఉండి కూడా వాయిదా వేస్తూ వచ్చారు కదా. దసరా, దీపావళి, క్రిస్మస్‌... ఇలా అన్ని సీజన్స్‌ వదిలేసారుగా. ఎందుకలా?

కావాలని మేము వెనక్కి నెడుతూ రాలేదండీ. ఆ డిలే అలా జరుగుతూ వచ్చింది. ప్రతిసారీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ అవుతున్నపుడు ఫాన్స్‌కి ఎలా అనిపించిందో కానీ నాకు మాత్రం చాలా ఎక్సయిటింగ్‌గా ఉండేది. మన సినిమా వచ్చేస్తుంది అనుకునేంతలో పోస్ట్‌పోన్‌ అయిందంటే నీరసపడిపోయే వాడిని. నేను డెస్టినీని నమ్ముతాను. బహుశా ఎవడు జనవరి 12, 2014న రిలీజ్‌ కావాలని రాసిపెట్టి ఉందేమో... అందుకే మేము ఎంత ట్రై చేసినా లాస్ట్‌ ఇయర్‌ రిలీజ్‌ చేయలేకపోయామేమో (నవ్వుతూ). సినిమా మీద నమ్మకం లేకనో, రిజల్ట్‌ ఏమవుతుందో అనే భయంతోనో ఎప్పుడూ లేము. సినిమా తీసిన నేను, చేసిన చరణ్‌, బన్నీ, డబ్బులు పెట్టిన రాజుగారు, శిరీష్‌, లక్ష్మణ్‌.. అందరూ కూడా హ్యాపీ. అందరం సినిమా బాగా ఆడుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా ఎప్పుడొచ్చినా డెఫినెట్‌గా బాగా ఆడుతుంది. కానీ ఎప్పుడొస్తుంది అన్నది తెలియక కొంచెం డిజప్పాయింట్‌ అయ్యాం. సినిమాకి పని చేసిన వారు, కథ విని అప్రూవ్‌ చేసిన చిరంజీవిగారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఎవరికోసమైతే సినిమా తీసామో వాళ్లు (ప్రేక్షకులు) చూడట్లేదనేదే బాధ. దానికంటే పెద్ద పెయిన్‌ ఏదీ ఒక క్రియేటర్‌కి ఉండదు.

కానీ ఇంతకాలం ఎదురు చూసీ, చూసీ... ఫైనల్‌గా ‘1 నేనొక్కడినే’తో పోటీగా రిలీజ్‌ చేస్తున్నారు. ఆ సినిమా ఎఫెక్ట్‌ దీనిపై పడదంటారా?

రెండూ డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలండీ. లాస్ట్‌ ఇయర్‌ చూసినట్టయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్‌ సంక్రాంతికి రిలీజ్‌ అయ్యాయి. రెండూ చాలా బాగా ఆడాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ రెండూ కంప్లీట్‌గా డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు కాబట్టి, రెండిటినీ ఆడియన్స్‌ ఆదరిస్తారని నమ్ముతున్నాను. సంక్రాంతి టైమ్‌లో రెండు పెద్ద సినిమాలకి స్పేస్‌ ఉంటుంది. అందుకే రెండూ రిలీజ్‌ అవుతున్నాయి. అదే వేరే టైమ్‌ అయి ఉంటే ఏదో ఒక సినిమా వెనక్కి వెళ్లి కొంచెం గ్యాప్‌ తీసుకునేవాళ్లం. 1 ట్రెయిలర్‌ చూసాను. మైండ్‌ బ్లోయింగ్‌ విజువల్స్‌. ఒక డైరెక్టర్‌గా నాకు తెలుసు... అలాంటివి తీయడం ఎంత కష్టమో. ఆ సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

అంత క్రేజ్‌ ఉన్న సినిమాతో పోటీ పడుతున్నామనే టెన్షన్‌ లేదంటారయితే?

టెన్షనేం ఉండదండీ. వాళ్లకీ ఉండదు. మాకూ ఉండదు. వాళ్లయినా, మేమయినా మా సినిమాపై నమ్మకంతో చేస్తాం. నమ్మకం లేకుండా ఏదీ చేయలేం. మన ప్రోడక్ట్‌ని మనమే నమ్మకపోతే ఇంత ఖర్చు పెట్టలేం, పెట్టించలేం. అయినా ఒకదానిని మరొకటి ఎఫెక్ట్‌ చేసుకోవడానికి ఇవేమీ ఒకే టైప్‌ మూవీస్‌ కాదు. రెండిటి యాడ్స్‌ చూస్తే మీకు డిఫరెన్స్‌ తెలిసిపోతుంది.

డిఫరెంట్‌ అని మీరంటున్నారు. కానీ మహేష్‌, చరణ్‌ ఇద్దరూ కూడా ఎవరినో వెతుక్కుంటూ వెళుతున్నారని మాకు అనిపిస్తోంది...

(బిగ్గరగా నవ్వుతూ) అయితే మా సినిమాల మధ్య ఏమైనా సిమిలారిటీస్‌ ఉన్నాయేమో మీరు వెతకాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఇవి రెండూ డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఉన్న సినిమాలు. కాబట్టి రెండూ ఎంటయిర్లీ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయని అనుకుంటున్నాను.

మహేష్‌కి కథ చెప్పారని న్యూస్‌ వచ్చింది...

యా చెప్పానండీ. ఆయనకి కూడా లైన్‌ నచ్చింది. వర్క్‌ చేయాలి. చూడాలి ఎలా షేప్‌ తీసుకుంటుందో. మహేష్‌బాబు ఒక ఎక్సలెంట్‌ యాక్టర్‌. ఆయన మెర్క్యురీలాంటి వారు. ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో బాటిల్‌ షేప్స్‌లో ఉంటారని అనుకుంటే... ఏ డైరెక్టర్‌తో పని చేస్తే ఆ డైరెక్టర్‌కి తగ్గట్టు ఆ బాటిల్‌ షేప్‌ మహేష్‌ తీసుకుంటారు. ఆయనని ఇంతవరకు ఒక్కొక్కరూ ఒకలా చూపించారు. నేను కూడా నా శైలిలో మరోలా చూపించాలని అనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడ్డానికి ఇంకా టైమ్‌ ఉంది... నౌ లెట్స్‌ గెట్‌ బ్యాక్‌ టు ఎవడు (నవ్వుతూ).

ఎవడులో ఐటెమ్‌ సాంగ్‌ ఎప్పుడో లీక్‌ అయిపోయింది కదా. అయినా మార్చకుండా ఉంచేసారేంటి?

చిన్న చిన్న ఎడిట్‌ డిఫరెన్సెస్‌ అవీ చేసి అలాగే ఉంచేసాం. ఎందుకంటే దానిపై అప్పటికే చాలా ఖర్చు పెట్టేసాం. పైగా అది కథలో భాగంగా వచ్చే పాట. అందుకే దానిని తీసేయడానికి కూడా వీల్లేదు.

సమంతని ఎందుకు రీప్లేస్‌ చేయాల్సి వచ్చింది?

తనకి అప్పట్లో ఏవో హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తే డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడానికి ట్రబుల్‌ పడిరది. అప్పటికే మా సినిమా డిలే అయింది. అందరి డేట్స్‌ బల్క్‌గా తీసుకుని మేజర్‌ షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకున్నాం. అప్పుడు మళ్లీ తన డేట్స్‌ కోసం కొత్తగా డిలే జరగకూడదని అనుకుని... శృతిహాసన్‌ని తీసుకున్నాం.

అంత చిన్న క్యారెక్టర్‌ చేయడానికి అల్లు అర్జున్‌ని ఎలా కన్విన్స్‌ చేసారు?

ముహూర్తం రోజున చరణ్‌ చెప్పినట్టు అల్లు అర్జున్‌ లేకపోతే ఎవడు లేదు. ఈ సినిమాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ తనది. హీ డిడ్‌ ఏ గ్రేట్‌ జాబ్‌. ఈ సినిమాకోసం తను పన్నెండు రోజులు పని చేసాడు. కానీ ఆ పన్నెండు రోజులు కంప్లీట్‌గా క్యారెక్టర్‌కి డెడికేట్‌ అయిపోయాడు. ఈ సినిమాలో మనది మెయిన్‌ రోల్‌ కాదు కదా... ఏదో చేసేసి వెళ్లిపోదాంలే అన్నట్టు ఒక్కసారి కూడా కనిపించలేదు. చిన్న చిన్న గల్లీల్లో, కష్టమైన లొకేషన్లలో తీసాం. హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెట్టాడు. చాలా ప్రొఫెషనల్‌ యాక్టర్‌. తనతో వర్క్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేసాను.

చరణ్‌ ఇంతకుముందు రచ్చ, నాయక్‌లాంటి మాస్‌ ఎంటర్‌టైనర్స్‌ చేసాడు. ఇందులో కూడా తన క్యారెక్టర్‌ సిమిలర్‌ షేడ్స్‌లో ఉంటుందనిపిస్తోంది.

లేదండీ. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌ ఫిలిం. చరణ్‌ ఇంతవరకు చేయని క్యారెక్టర్‌. రాజుగారు డబ్బులు ఎక్కువ పెట్టేసారని ఆలోచిస్తున్నాను కానీ... లేదంటే ఈ ఎక్సయిట్‌మెంట్‌లో మీకు కథ కూడా చెప్పేసేవాడిని (నవ్వుతూ). ఒక డైరెక్టర్‌గా నేను అనుకునేదేంటంటే... నా హీరో ఇంతవరకు కనిపించని విధంగా నా సినిమాలో కనిపించాలని. ప్రతి దర్శకుడికీ ఒక మార్క్‌ ఉంటుంది. అలాగే నా సినిమాలకి ఇది యుఎస్‌పి అవ్వాలని అనుకుంటున్నాను. హీరోని ఇంతకుముందు చూడని విధంగా చూపించాలని అనుకుంటాను. మున్నాలో ప్రభాస్‌, బృందావనంలో ఎన్టీఆర్‌ ఎలా అయితే అంతకుముందు చేసిన సినిమాలకంటే డిఫరెంట్‌గా కనిపించారో, ఇందులో చరణ్‌ కూడా చాలా కొత్తగా, డిఫరెంట్‌గా కనిపిస్తాడు. యు విల్‌ సీ ది బెస్ట్‌ చరణ్‌ టిల్‌ డేట్‌ ఇన్‌ ‘ఎవడు’. అదైతే ప్రామిస్‌ చేయగలను.

అందరు డైరెక్టర్లు చరణ్‌తో చిరంజీవి సాంగ్‌ రీమిక్స్‌ చేయాలని చూస్తుంటే మీరెందుకు వద్దనుకున్నారు?

నేను అలాంటి సాంగ్‌ పెడదామని అనుకోలేదు. అలాగే చరణ్‌ కూడా ఇందులో అలాంటివేమీ వద్దని ముందే చెప్పాడు. కమర్షియల్‌ ఫార్మాట్‌కి స్టిక్‌ అవ్వవద్దు... స్టోరీకి తగ్గట్టుగా చేద్దామని అన్నాడు. ఈ సినిమా చూస్తే... హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌, ఫైట్‌... ఇలా ఉండదు. టోటల్‌గా స్టోరీ డ్రివెన్‌ ఫిలిం. ఇది యునీక్‌ ఫిలింగా ఉండాలని చరణ్‌ అన్నాడు. నేను కూడా ఈ సినిమాని అలాగే ప్లాన్‌ చేసుకున్నాను.

ఎంత కమర్షియల్‌ ఫార్మేట్‌ వద్దనుకున్నా, చిరంజీవి రీమిక్స్‌ పెట్టవద్దని డిసైడ్‌ అయినా చరణ్‌ సినిమా అంటే  డాన్స్‌లు ఉండాల్సిందే కదా?

అయ్యో... అవి లేకుండా ఎలాగండీ. ఫ్రీడమ్‌ సాంగ్‌ చూస్తే గ్యాంగ్‌లీడర్‌ రోజుల్లో చిరంజీవిగారు గుర్తొస్తారు. దట్‌ సాంగ్‌ ఈజ్‌ గోయింగ్‌ టూ ర్‌ర్‌ర్‌ర్రాక్క్‌!!! యు విల్‌ సీ (నవ్వుతూ).

అన్ని సినిమాలు దిల్‌ రాజు బ్యానర్‌లోనే చేస్తున్నారు?

అడిగారా? ఈ క్వశ్చన్‌ కోసమే వెయిట్‌ చేస్తున్నా... ఇంకా అడగలేదేంటా అని (నవ్వుతూ). ఈ క్వశ్చన్‌ యాక్చువల్‌గా మీరు దిల్‌ రాజుగారిని అడగాలి. ఏ డైరెక్టర్‌తోను ఆయన ఇంతవరకు మూడు సినిమాలు తియ్యలేదు. నాతో మాత్రం అప్పుడే మూడో సినిమా తీసేసి రిలీజ్‌ చేస్తున్నారు. ఎందుకో ఆయన్ని మీరు అడగాలి. మా ఇద్దరి మధ్య చాలా మంచి రిలేషన్‌ ఉందండీ. ఇన్ని సినిమాలు చేయడం వల్ల, ఎన్నో రోజులు కలిసి ట్రావెల్‌ చేయడం వల్ల ఇప్పుడు మా మధ్య బంధం పెరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం బ్రదర్స్‌లా అయిపోయాం. ఒక సినిమా విషయంలో తిట్టుకుంటాం... అలుగుతాం... అది అలా కాదు, ఇలా ఉండాలి, ఇది అలా చేయాలి అంటూ ఆర్గ్యూ చేసుకుంటాం. అందరు నిర్మాతలలానే సినిమా బాగా రావాలి అనుకోవడంతో పాటు ఆయనలో ఉండే రేరెస్ట్‌ క్వాలిటీ ఏంటంటే... సినిమాయే లోకంగా బతుకుతారండీ. ఆయనకి సినిమా తప్ప మరో ప్రపంచం తెలీదు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు సినిమా... సినిమా... సినిమా. ఒక ప్రొడ్యూసర్‌ తన సినిమాల విషయంలో అంత ఇన్‌వాల్వ్‌ కానక్కర్లేదు. కానీ ఆయన మాత్రం సినిమాయే అన్నీ అన్నట్టు ఉంటారు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో పాటు నమ్మకం ఉంది. ఆయన నన్ను నమ్మి నాకు కావాల్సింది ఇస్తారు. నేను ఆయనకి ప్రామిస్‌ చేసిన ప్రోడక్ట్‌ తీసి ఇస్తాను. మా బంధం ఇప్పుడు కాదండీ... ఎప్పుడో నా కాలేజ్‌ డేస్‌లోనే స్టార్ట్‌ అయింది. ఖుషీ సినిమా టైమ్‌లో ఆయన ఆఫీస్‌కి వెళ్లి టికెట్స్‌ తెచ్చుకునేవాడిని. లక్ష్మణ్‌గారితో నాకు కొంచెం పరిచయం ఉంది. మా థియేటర్‌ లీజ్‌కి తీసుకోవడం వల్ల ఉన్న పరిచయంతో సినిమా టికెట్స్‌ కోసం డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీస్‌కి వెళ్లేవాడిని. అప్పుడే రాజుగారిని చూసేవాడిని. అప్పుడు అనుకోలేదు... ఈయన బ్యానర్‌లో వరుసగా మూడు సినిమాలు చేస్తానని. చెప్పాను కదా... నేను డెస్టినీని నమ్ముతానని. ఐ థింక్‌.. ఆ డెస్టినీయే టికెట్స్‌ కోసం ఆ ఆఫీస్‌లో నుంచున్న కాలేజ్‌ స్టూడెంట్‌ని ఇప్పుడదే ఆఫీస్‌లో డైరెక్టర్‌ని చేసింది. 

చాలామంది డైరెక్టర్లు తమ టెక్నికల్‌ టీమ్‌ని కంటిన్యూ చేస్తుంటారు. మీరెందుకు ప్రతి సినిమాకీ టీమ్‌ మార్చేస్తున్నారు?

ఎప్పటికప్పుడు మనం వర్క్‌ చేసే టీమ్‌ మారుతుంటే మననుంచి వచ్చే అవుట్‌పుట్‌ కూడా మారుతుందని, ఇంకా కొత్త కొత్తగా రావడానికి స్కోప్‌ ఉంటుందని నేను పర్సనల్‌గా నమ్ముతాను. ఇప్పటివరకు అయితే రిపీట్‌ చేయలేదు. అలా అని ఒకసారి వర్క్‌ చేసిన టీమ్‌తో మళ్లీ చేయనని కాదు.

పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారని విన్నాం

ఆయనని ఒకసారి కలిసాను కానీ ఇంకా ఏమీ మెటీరియలైజ్‌ కాలేదు.

నెక్స్‌ట్‌ కూడా దిల్‌ రాజు బ్యానర్‌లోనే చేస్తున్నారా?

ఇంకా ఏమీ అనుకోలేదు. కానీ ఆయన బ్యానర్లోనే ఉండొచ్చు. ఎవరితో, ఏంటి అనేది డిసైడ్‌ అయ్యాక చెప్తాం... అంటూ ఇంటర్వ్యూకి ముగింపు పలికారు వంశీ పైడిపల్లి.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
2 Replies 477 Views Last post September 25, 2014, 12:52:24 PM
by charan fan
0 Replies 145 Views Last post August 22, 2015, 04:58:45 AM
by siva
0 Replies 141 Views Last post August 22, 2015, 05:00:07 AM
by siva
3 Replies 228 Views Last post September 26, 2015, 05:19:28 PM
by MbcMen
1 Replies 175 Views Last post September 26, 2015, 05:18:37 PM
by MbcMen