Author Topic: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద మృతి  (Read 374 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఢిల్లీలోని లీలా హోటల్ లో సునంద మృతదేహం లభ్యమయింది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. సునంద మృతి విషయాన్ని శశిథరూర్కు పోలీసులు తెలిపారు.[/size]2010లో వివాహం చేసుకున్న శశి థరూర్, సునంద మధ్య గతకొద్ది రోజులుగా విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో ట్విట్టర్‌లో నిన్న జరిగిన మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జరిగిన ఒక్క రోజులోపే సునంద మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది.తన భర్తను  వలలో వేసుకునేందుకు మెహర్ ప్రయత్నించిందని ట్విటర్లో సునంద పోస్ట్ చేశారు. ఈ వివాదంతో విసిగిపోయానని, థరూర్‌కు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో థరూర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తమ ట్విట్టర్ ఖాతాలను ఎవరో హ్యాక్ చేశారంటూ థరూర్ దంపతులు గురువారం మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ట్విటర్లో జరిగిన మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు సునందా పుష్కర్ ప్రాణం తీసింది. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌, కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మధ్య జరిగిన ట్వీట్ల సమరం విషాదానికి దారి తీసింది. ఈ వివాదం ముగిసిందని అందరూ అనుకుంటున్న తరుణంలోనే దారుణం జరిగింది.

సునందా పుష్కర్(52) అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో శవమై కనిపించారు. లీలా హోటల్లోని  345 నంబర్ రూములో ఆమె మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కనుగొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే 345 నంబర్ రూములో ఏం జరిగిందనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్తతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
ఇస్లామాబాద్: కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్(45) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సునంద మరణించినట్టు వార్తలు వెలవడటంతో ఒక్కసారిగా తాను షాక్ కు గురయ్యానట్టు ఆమె ట్విట్టర్లో పేర్కొంది. ఈ ఘటనపై తాను ఎలా స్పందించాలో తెలియటలేదని, తన నోటివెంట మాటలు రావడంలేదని మెహర్ తెలిపింది. అంతేకాకుండా సునందా ఆత్మకు శాంతి చేకురాలని తాను కోరుకుంటున్నట్టు మెహర్ మరో ట్విట్లో పేర్కొంది.

కాగా, పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌, కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్(52) మధ్య జరిగి ట్వీట్ల సమరం విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ముగిసిందని అందరూ అనుకుంటున్న తరుణంలోనే ఈ దారుణం జరిగింది. సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో శవమై కనిపించారు. లీలా హోటల్లోని  345 నంబర్ రూములో ఆమె మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కనుగొన్నారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి ఢిల్లీలో కలకలం రేపింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఓ సీనియర్ మహిళా జర్నలిస్ట్కు మెసేజ్ పంపినట్టు సమాచారం. చాలా మాట్లాడాల్సింవుందని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.

అయితే ఆ మహిళా పాత్రికేయురాలు ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. మహిళా జర్నలిస్ట్తో సునంద ఏం చెప్పాలను కున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది. శశి థరూర్ ప్రవర్తనతో విసిగిపోయి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264

charan fan

  • Guest

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Shashi Tharoor vyavahara shaili modatinundi vivadaspadame. Ippudu idi. Chivariki tana baarya praanalu teesukune paristi

Kamaal R Khan - KRK [email protected] 7h
It's sad but true - Once Tharoor Ji lost external affairs because of Sunanda Ji n today he has lost sunanda Ji because of external affairs.

charan fan

  • Guest
కాశ్మీరీ వనిత సునంద...



సునందపుష్కర్ స్వస్థలం.. కాశ్మీర్ లోయలోని బోమై గ్రామం. సోపోర్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీరిది భూస్వాముల కుటుంబం. సునంద తండ్రి పుష్కర్దాస్ భారత సైన్యం నుంచి 1983లో లెఫ్టినెంట్ కల్నల్గా రిటైరయ్యారు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. ఒకరు బ్యాంకు ఉద్యోగి కాగా.. మరొకరు సైనికోద్యోగి. 1990లో వీరి ఇంటిని ఉగ్రవాదులు తగులబెట్టారు. దీంతో పుష్కర్ కుటుంబం శ్రీనగర్కు వలసవచ్చింది.  శ్రీనగర్లోని మహిళా కాలేజీలో సునంద డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా కోర్సు చేశారు.

ఢిల్లీలో ఒక హోటల్లో పనిచేసే సంజయ్రైనా అనే కాశ్మీరీని వివాహం చేసుకున్నారు. ఆ బంధం విడాకులతో తెగిపోయింది. తర్వాత సునంద దుబాయ్ వెళ్లారు. అక్కడ ఈవెంట్ మేనేజర్, అగ్నిమాపక పరికరాల డీలర్ సుజిత్మీనన్ అనే కేరళీయుడిని పెళ్లాడారు. ఈ దంపతులకు శివ్మీనన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ 1997లో ఢిల్లీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సుజిత్మీనన్ చనిపోయారు. శశిథరూర్తో వివాహం జరిగేనాటికి సునంద కుమారుడి వయసు 17 ఏళ్లు. ఆమె అప్పుడు దుబాయ్లో టెకాం అనే రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ డెరైక్టర్గా పనిచేస్తున్నారు.

శశిథరూర్తో వివాహం...

కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేసిన అనంతరం శశిథరూర్.. తన స్నేహితురాలు సునందపుష్కర్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతకుముందు చిన్ననాటి స్నేహితురాలైన తిలోత్తమా ముఖర్జీతో వివాహమైంది. రెండోసారి కెనడా మహిళ క్రిస్టీగైల్స్ను థరూర్ పెళ్లిచేసుకున్నారు. సునందతో వివాహానికి కొంత కాలం ముందటే ఆమెకు విడాకులు ఇచ్చారు. 2010 ఆగస్టులో కేరళలోని శశిథరూర్ పూర్వీకుల గ్రామం ఎలవంచెరీలో బంధుమిత్రుల నడుమ నాయర్ల సంప్రదాయం ప్రకారం సునందపుష్కర్ను పెళ్లిచేసుకున్నారు. ఈ పెళ్లి జరిగే సమయానికి థరూర్ వయసు 54 సంవత్సరాలు కాగా.. సునంద వయసు 48 ఏళ్లు.
 
కొచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటా వివాదం

2010లో అప్పటి విదేశాంగ సహాయమంత్రిగా ఉన్న శశిథరూర్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో సునందపుష్కర్ వార్తల్లోకి ఎక్కారు. ఆమెను థరూర్ పెళ్లాడనున్నారనే వార్తలతో పాటు.. ఐపీఎల్ కొచ్చి ఫ్రాంచైజీలో సునందకు వాటా ఉన్నట్లూ అప్పట్లోనే వెల్లడైంది. కొచ్చి టీమ్ను రెండెవూ స్పోర్ట్స్ వరల్డ్ నేతృత్వంలోని కన్సార్షియంకు దక్కేలా శశిథరూర్ కృషిచేశారని.. అందుకు ప్రతిఫలంగా రెండెవూ సంస్థలో.. శశిథరూర్ బినామీ అయిన సునందకు రూ. 70 కోట్లు విలువైన వాటా ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై మీడియాలో దుమారం రేగటంతో.. సునంద ఒక మీడియా ప్రకటన ఇచ్చారు. అంతర్జాతీయ వ్యాపార రంగంలో తనకున్న అనుభవాన్ని గుర్తించి రెండెవూ సంస్థ తనను కన్సల్టెంట్గా ఆహ్వానించిందని, జీతం బదులుగా వాటా ఇవ్వాలని కోరగా ఆమేరకు వాటా ఇచ్చారని చెప్పారు. ఐపీఎల్ కుంభకోణంపై ఆరోపణలు తీవ్రమవటంతో.. సునంద తనను వాటాను వదులుకోవటంతో పాటు, శశిథరూర్ కూడా అప్పుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.


charan fan

  • Guest
సునందా పుష్కర్ ది ఆత్మహత్య కాదా?

న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కేంద్ర మంత్రి శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ ది ఆత్మహత్య కాదా? ఆమె ఏ కారణం వల్ల మరణించారు? పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పే విషయాలను చూస్తే ఈ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సునందా పుష్కర్ మృతదేహానికి ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తయింది.

ఆమె విషం తీసుకోలేదని పోస్టుమార్టం చేసిన వైద్య నిపుణులు నిర్ధారించారు. అలాగే, ఆమె శరీరంపై ఉన్న గాయాల కారణంగానే మరణించారని కూడా చెప్పలేమని అన్నారు. రెండు మూడు రోజుల తర్వాత మాత్రమే ఆమె మృతికి గల కారణాలపై ఓ అంచనాకు రాగలమని తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకత కోసం వీడియో తీశారు.
కాగా సునదా పుష్కర్ శరీరంపై కొన్ని గాయాలున్నాయని, అవి కొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ సుధీర్ గుప్తా తెలిపారు. పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
7 Replies 461 Views Last post October 02, 2014, 12:11:27 PM
by charan fan