Author Topic: MAhesh-one ultimate records  (Read 677 times)

Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
MAhesh-one ultimate records
« on: January 22, 2014, 12:56:34 AM »
వసూళ్ళ పరంగా మహేష్ బాబు వన్ నేనొక్కడినే పూర్తిగా నెమ్మదించినా కొన్ని విషయాల్లో మాత్రం ఎవరూ తుడిచి పెట్టలేని రికార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఈ రికార్డులు ఏ మహేష్ బాబుకో, దర్శకుడు సుకుమారుకో అయితే అందరం ఆనందించేవారిమే. కానీ ఇవి నిర్మాతలు 14 రీల్స్ సంస్థకు, అనిల్ సుంకరకు చెందిన రికార్డులు. వరసగా చెప్పుకుంటూపోతే ఇవన్ని మూవీ మార్కెటింగ్ సంబందించినవే అయినా వేటికవే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినవే.

1. ప్రీ రిలీజ్ బిజినెస్: ఎరోస్ సంస్థకు 72 కోట్ల అత్యధిక మొత్తానికి సినిమాను అమ్మేసినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం. విషయం ఏమిటంటే ఇంతవరకు నిర్మాతల దగ్గరి నుండి దీనిపై ఒక్కసారి కూడా అఫీషియల్ ప్రెస్ నోట్ రాకపోవడం. వస్తే గనక ఆదాయ పన్ను శాఖ వారు ఊరుకుంటారా చెప్పండి. మరి ఇంతకీ ఈ డీల్ జరిగిందా లేదా?
2. యూ ట్యూబు దెబ్బ: సినిమా ట్రైలరుకు మూకుమ్మడిగా వచ్చిన వ్యూస్, హిట్స్ చూసి యూ ట్యూబు వర్గాలు కూడా విస్తుపోయి ఏకంగా ట్రైలరు మొత్తాన్నే ఫ్రాడ్ కింద లెక్క కట్టి ఊడ్చి పారేశారు. ఇదీ ఓ ప్రమోషన్ స్టంట్.
3. ఆడియో రిలీజు టిక్కెట్: మొట్టమొదటి సారిగా అభిమానుల పేరు మీద వన్ పాటల పండగను సినిమా హాళ్ళలో లైవ్ టెలికాస్ట్ చేసి అందులోను డబ్బులు వసూల్ చేసారు. అలాగే టీషర్ట్స్, కీ చైన్స్ లాంటి అపారెల్, మొబైల్ యాప్ వంటి వాటి మీద హైప్ బిల్డప్ చేసారు.
4. వెబ్ సైట్ రేటింగ్స్: అత్యధిక శాతం వెబ్ సైట్, క్రిటిక్ రేటింగ్స్ సినిమాను తక్కువ చేసి మాట్లాడినా (టెక్నికల్ పరంగా కాదు), కొన్ని టాప్ వెబ్ సైట్స్ పుణ్యమాని సమీక్షల్లో (పెయిడ్ రివ్యూస్ అని కొందరు అంటే వినబడింది) డిస్టింక్షన్ మార్కులు వేయించు“కొన్నారు.”
5. హాలివుడ్ హంగామా: అర్థం కాని కంటెంట్ ఉంటె అది హాలివుడ్ సినిమా అని, జుట్టు పీక్కొనే లాజిక్ ఉంటె అది స్క్రీన్ ప్లే మహత్యం అనీ మనాళ్ళు ఎప్పటి నుండో చెప్పడానికి రెడీగా ఉంటారు. ఆ రకంగా వన్ సినిమా ఈజీగా హాలివుడ్ సినిమాల సరసన చేరిపోయిన టాలివుడ్ సినిమాగా వార్తలకెక్కింది.
6. ఆమీర్ ఖానును వదలలేదు: టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే, జాతీయ స్థాయిలో చెప్పుకో దగ్గ పేరు ఆమిర్ ఖాన్. అందునా మన సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఈజీగా ఆమిర్ ఖాన్ ఈ సినిమా హిందీలో చేస్తున్నాడన్న ట్రిక్ ప్లే చేసారు సదరు నిర్మాతలు. ఆమిర్ ఖాన్ నిజంగా వన్ చూసాడా లేదా అన్నది ఆయన నోటితో వింటేనే మజా. కానీ అదీ జరగలేదు.
7. IMDB: ఆఖరుగా ఇంటర్ నేషనల్ మూవీ స్టాండర్డ్ రేటింగ్స్, ర్యాంకింగ్స్ కోసం వాడే IMDBని తెలుగు సినిమా వ్యాపార నిమిత్తం వాడుకోవడం మొదటిసారిగా నేనొక్కడినేకె చెల్లింది. ఈ సైట్ లోటుపాట్లు తెలిసిన కొందరు ఇక్కడ రేటింగ్ మ్యానిపులేట్ చేయడం పెద్ద విషయం కాకపోయినా 14 రీల్స్ వారు చేసిన మాయాజాలానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇన్ని పబ్లిసిటీ రికార్డుల, జిమ్మిక్కుల, ట్రిక్కులతో దూసుకుపోయిన వన్ నేనొక్కడినే వసూళ్ళలో మాత్రం వెనకంజ ఎందుకు వేసింది అంటే మన తెలుగు వారికి సినిమాలు చూడడం అస్సలు రాదని మాత్రం చెప్పకండే, ఎందుకంటే తెలుగు సినిమా విశ్లేషణకు వీరే ఫైనల్ జడ్జీలు, హాలివుడ్ జనాలు కాదు. అవకాశం ఉంటె అనిల్ సుంకర ఈ మార్కెటింగ్ ట్రిక్స్ అన్నింటినీ ఓ బుక్కులా అచ్చేస్తే అద్భుతంగా అమ్ముడవుతాయేమో.

charan fan

 • Guest
MAhesh-one ultimate records
« Reply #1 on: January 22, 2014, 08:04:56 AM »
*Its not just my track record, it's all time record*

1Nenokkadine yesterday Kakinada main theatre ₹8600 deficit.

#1Nenokkadine 12th day Krishna dist share is ₹0.00

Offline mega007

 • Jr. Member
 • **
 • Posts: 118
 • BIG FAN OF MEGA FAMILY
MAhesh-one ultimate records
« Reply #2 on: January 22, 2014, 09:23:55 AM »
Correct Bhayaa...,Aa fuckesh gaade edi antha venukala vundi cheyistunaadu.
Today aa tupaki website 1 cinema decen hit tho saripetukundi ani rassadu..............Veela pichi peaks lo vundi.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
MAhesh-one ultimate records
« Reply #3 on: January 22, 2014, 09:27:15 AM »
1-Nenokkadine 12th day Krishna district share is ₹0.00 *Its not just my track record, it's all time record*

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
MAhesh-one ultimate records
« Reply #4 on: January 22, 2014, 09:28:00 AM »
1-Nenokkadine yesterday Kakinada main theatre ₹8600 deficit. *Its not just my track record, it's all time record*

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
MAhesh-one ultimate records
« Reply #5 on: January 22, 2014, 03:03:13 PM »
Since there is no comedy in the movie, they are doing comedy in this way.....
what a publi'p(c)ity'....!


 

Related Topics

  Subject / Started by Replies Views Last post
3 Replies 566 Views Last post August 12, 2015, 08:32:45 AM
by sagar