Author Topic: భారత కోకిల 135వ జయంతి  (Read 331 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,672
భారత కోకిల 135వ జయంతి
« on: February 13, 2014, 03:17:32 PM »
నేటికి సరిగ్గా 135 సంవత్సరాల క్రితం భారత కోకిల సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 గురువారం హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులు వరదసుందరీ దేవి. అఘోరనాధ చటోపాధ్యాయ.  శాస్త్రవేత్త మరియు తత్వవేత్త. తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి. సరోజినీ ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, పర్షియన్ మరియు బెంగాలీ భాషలు మాట్లాడేది. ఈమెకు పీ.బీ.షెల్లీ కవిత్వము అంటే చాలా ఇష్టం.నాటి బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన తండ్రి నిజాం కాలేజీ స్థాపకుడై హైదరాబాద్ సంస్థానంలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. హైదరాబాద్‌లో నిజాం కాలేజీ ని స్థాపించి, ప్రిన్స్‌పాల్‌గా చాలా కాలం పనిచేశారు.

ఆడవారు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే కూడా సవాలక్ష అడ్డంకులు, ఆంక్షలు, నిషేధాలు అమలులో ఉన్న రోజుల్లో సరోజిని తల్లిదండ్రులు ఆమెను పై చదువులు చదివించడానికి ముందుకొచ్చారు. వారి ప్రోత్సాహంతో ముందడుగేసిన సరోజిని 1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రథమ స్థానం సంపాదించారు. అయితే అప్పటి హైదరాబాదులో స్త్రీల చదువుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన ఆమె మద్రాసులో చదువుకున్నది. మెట్రిక్ పరీక్షలో ఆమె ప్రతిభకు ముగ్ధుడైన నిజాం నవాబు ఆమెకు విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నారు. ఆమె తల్లిదండ్రులను ఇందుకు ఒప్పించారు కూడా. నిజాం ప్రోత్సాహంతో 1898 వరకు ఇటలీ, స్విట్జర్లాండ్‌‌లో చదువుకున్న సరోజిని అపారమైన విజ్ఞానాన్ని సంపాదించారు.
భారత కోకిల
విదేశాల్లో విద్యార్జన చేస్తున్నప్పుడు సరోజిని ఎందరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయితల కవిత్వాలు, గ్రంధాలు చదివారు. ఎన్నో కవితలను రాసి విదేశీయుల ప్రసంశలను అందుకున్నారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. ఇంగ్లీషులో కవిత్వం రాశారు. సరోజినీ నాయుడు నివసించిన ఇంటికి ఆమె రాసిన మొదటి కవితా సంపుటి గోల్డెన్‌ థ్రెషోల్డ్‌‌గా పేరు పెట్టి, హైదరాబాద్‌ యూనివర్సిటీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. నేటికీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమై ఉంది. ఇక్కడ హైదరాబాద్‌ పర్యటనకు గుర్తుగా నాడు గాంధీజీ నాటిన చెట్టు ఉంటుంది. కవిత్వంతో మాధుర్యాన్ని కురిపించి ' నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా' గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు.
కులాంతర వివాహం
15 సంవత్సరాల వయసులో ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడును కలిసి ప్రేమించింది. చదువు పూర్తయి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత 19 సంవత్సరాల వయసులో 1898 డిసెంబర్‌ 2న ఆయనను కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహాలకు సమాజం తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టం (1872) ప్రకారము 1898 డిసెంబర్ 2న మద్రాసులో పెళ్ళి చేసుకున్నారు. వీరి వివాహాన్ని నాటి ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు దగ్గరుండి జరిపించారు. ఆమె తీసుకున్న సాహసోపేత చర్య ఎందరినో ఆగ్రహానికి గురి చేసినా సరోజిని వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలిచారు.
రాజకీయరంగం
ఆమె 1912లో ఆమె గోపాలకృష్ణ గోఖలేని కలిశారు. గోఖలేతో మాట్లాడినప్పుడు ఎంతో ఉత్తేజం పొందారు. హిందూ ముస్లింల సఖ్యత గురించి ఆయన అభిప్రాయాలను తెలుసుకొని ఎంతో సంతోషించి, తన శేష జీవితాన్ని ఆ అద్భుత కార్యాన్ని నెరవేర్చటం కొరకు అంకితం చేయాలని ఆక్షణంలోనే నిర్ణయించుకున్నారు. అదే సంవత్సరం మార్చి నెల 22న లక్నోలోనే జరిగిన ముస్లింలీగ్ మహాసభలో పాల్గొనడానికి వెళ్ళారు. ఆనాటి సభలో సరోజినీ నాయుడు చేసిన ప్రసంగం అన్ని మతాల వారిని ఉర్రూతలూగించింది.

"సోదర సోదరీ మణులారా! ఒక గడ్డపై పుట్టిన మన మధ్యలో మతం అనే అడ్డు గోడ మన ఐక్యమత్యానికి అడ్డువస్తుంది. మన ఆచారవ్యవహారాలు ఒకటే, మనందరి రక్తం ఒకటే, మనం మొదట భారతీయులం. అది అందరూ గుర్తించాలి, అలాగే భగవంతుడనేవాడూ ఒక్కడే ఉంటాడు. అది వారి విశ్వాసాలను బట్టి వుంటుంది. కొందరు "రామ" కొందరు "రహీం" కొందరు "జీసస్" అంటారు. ఇలా పలురకాలుగా ప్రార్థిస్తుంటారు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. ఒక మతం వారు మరొక మతం వారిని విమర్శించడానికి ఏమాత్రమూ హక్కులేదు, అది అధర్మం మన మందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉందాం, మనపై అధికారం చెలాయిస్తున్న ఆంగ్లేయ రాక్షసులను తిప్పికొడదాం. రండి ఏకం కండి హిందూ ముస్లిం భాయి భాయి" అంటూ అనర్గళంగా ప్రసంగించిన ఆమె వాగ్ధాటికి ముగ్ధులై శ్రోతలు "హిందూ ముస్లిం భాయి భాయి" అనే నినాదం మిన్నంటేలా చేశారు. ఆ సమావేశంలో ఆ ప్రసంగం గొప్ప మార్పు తీసుకువచ్చింది. మహమ్మదీయులు ఆనాటి సభలో హిందువులతో కలసి జీవించడానికి, ఆంగ్లేయులను దేశమునుంచి పంపివేయడానికి గట్టినిర్ణయం తీసుకున్నారు.

ఆ నాటి నుంచి స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె నిర్విరామంగా కృషి చేశారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రకటించటం తోటే, సరోజిని దానిలో పాల్గొన్నారు. సరోజిని నాయుడు 1925లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు. స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా గవర్నరుగా పనిచేసిన ఆమె రాజకీయాల్లో మహిళలకు అత్యున్నతస్థానం సాధ్యమే అని నిరూపించారు.

మహిళా విద్యకోసం, హిందూ ముస్లింల మధ్య సోదరభావం కోసం పనిచేసిన సరోజినీనాయుడు భారతీయ మహిళలకు చెరగని స్పూర్తి ప్రదాతగా నిలిచే ఉంటారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,672
భారత కోకిల 135వ జయంతి
« Reply #1 on: February 13, 2014, 03:18:35 PM »
Gandhiji ki atyanta sannihitullo okaru alane mana telugu gadda tho sambandam vunna vyakti