Author Topic: రాష్ట్ర విభజనతో రాయలసీమకు రిక్తహస్తం  (Read 390 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,670


హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: రాష్టర్రాజకీయ చరిత్రలో రాయలసీమ మరోసారి దగాపడింది. దేశంలోనే అత్యల్ప వర్షపాత ప్రాంతంగా నిత్యకరువులతో డొక్కలెండబెట్టుకుంటన్న సీమ ప్రజలపాలిట రాష్టవ్రిభజన పిడుగుపాటులా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందన్న వార్తలకంటే రాయలసీమ అవసరాలు తీర్చి సీమ అభివృద్దికి సంభందించి ఏవిధమైన ప్రకటనలు లేకుండానే బిల్లును ఆమోదించటాన్ని సీమ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రం రెండుగా విభజించాలన్న బిల్లు ఆమోదంతో రాయలసీమపై శాశ్వితంగా కోలుకోలేనంతటి దెబ్బపడింది. ఎంతోమందిని తమ భుజాలపై మోసి రాష్టన్రేతలుగా ఎదిగించిన రాయలసీమకు ఆదే నేతలు తీరనిద్రోహం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్టమ్రుఖ్యమంత్రి పీఠంపై ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్టవ్రిభజనను అపడంలో విఫలమయ్యారు.

రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన రాయలసీ మ ప్రజలకు రాష్టవ్రిభజనవల్ల జరిగే అన్యాయాన్ని కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాకు వివరించి ఆమెను వప్పిం చటంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధు లు తమ అసమర్ధతను నిరూపించుకుని అధిష్టానం ముందు మూగజీవులుగా మిగిలిపోయారు. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్టవ్రిభజనవల్ల రాయలసీమకు జరిగే అన్యాయా లను పోకస్‌ చేయలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తధ్యం అన్న సంకేతాలు వస్తున్నప్పటికీ మేల్కోలేకపోయా రంటున్నారు. విభజన బిల్లు చట్టసభలకు వచ్చినపుడయినా కనీసం రాయలసీమ అవసరాలు అభివృద్దికి చెందిన ప్యాకేజిలను రాబట్టలేక పోయారంటున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకొవటంలో విఫలమయ్యారు. రాష్ట్రంనుంచి సీపిఐ పార్టీ అధిపతిగా చక్రం తిప్పుతున్న నారాయణ కూడా రాయలసీమకు చెందిన వారే అయినా రాష్టవ్రిభజనకు ఏకంగా తనవంతు మద్దతు ప్రకటించి పార్టీనిర్ణయానికి బద్దుడననిపించుకున్నారే తప్ప సీమ ప్రజల మనోభావాలను గుర్తెరగలేకపోయారు. రాష్టస్థ్రాయి రాజకీయాల్లో ప్రధాన పార్టీల సారధులుగానే కాకుండా రాజకీయరంగంలో ప్రముఖస్ధానాల్లో ఉన్న కిరణ్‌ , చంద్రబాబు, జగన్‌ , నారాయణ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే అయినా రాష్టవ్రిభజవల్ల రాయలసీమకు జరిగే అన్యాయాన్ని అడ్డుకొలేకపోయారని రాయలసీమ సంయక్త కార్యాచరణ సమితి నేతలు అందోళన వెలిబుచ్చారు. రాయలసీమ బతికి బట్టకట్టాలంటే సీమ డిమాండ్లను తక్షణం తీర్చేలా అన్నిపార్టీల నేతలు ఇకనైనా పట్టుపట్టాలంటున్నారు.

రాయలసీమ కరువు పరిస్థితు లనుంచి బయటపడాలంటే కృష్ణానదిలొ రెండు వందల టీఎంసీల నికర జలాలు కేటాయించాలని సీమ ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నారు. రాయల సీమలో కర్నూలు కేంద్రంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.రాయలసీమలో ఉద్యోగ ఉపాధి పెంచేందుకు ఉక్కు పరిశ్రమతోపాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని కోరుతున్నారు. చెనై్న - కర్నూలు, బెంగూళూరు- కడప మద్య ఇండస్ట్రియల్‌ కారిడార్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అంతర్జాతీయ స్ధాయిలో సెంట్రల్‌ యూనివర్శిటి, నంద్యాల కేంద్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అధునాతన వైద్యసదుపాయాలకోసం రాయలసీమకేంద్రంగా ఎయిమ్స్‌ , ఐఐటి, ఐఐఎం వంటి కేంద్రాలు, రెడ్‌శాండల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాయలసీమకు ప్రత్యేకంగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది.

గుంటూరు-గుంటకల్‌, బెంగుళూరు-హైదరాబాద్‌లమద్య రైల్వేలైన్ల డబ్లింగ్‌, వంటివాటిని చేపట్టి వేంగంగా పూర్తిచేయాలని కోరుతున్నారు. కృష్ణానది వరద నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నింపుకునేందుకు రాయలసీమలో అదనంగా జలాశయాలు నిర్మించాలని కోరుతున్నారు. రాయలసీమకు కేంద్రం నుంచి ప్రేత్యేక రాయితీలు ప్యాకేజిలు కల్పించి మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ది చెందేలా అన్నిరాజకీయపార్టీలు కేంద్రంపై వత్తిడి తేవాలని రాయలసీమ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,670
Mottam state ne ruling chesina ee prantam ippudu nissahaya stitloki nettabadindi. 2 CMs, oka mukya party adinetha ee prantaaniki chendinappatiki emi cheyyaleka poyaaru.

Tana adikaara yaava kosam YSR maruguna padina Telangana samasyanu munduku techaru. Aaa tarvata CBN kooda deenni sariga deal cheyyaleka poyaru. Rastranni ravana kastam ga marcharu. Prati okka nayakudi swarta chintane ippati paristitulaku kaaranam

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,670
BJP aithe ninda munchindi seemandhra prantaanni

charan fan

 • Guest
తెలంగాణపోటు తమ తలకు చుట్టుకొంటుందనే ఈ సైలెంట్?!

రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ రాజకీయాలకు ముకుతాడు వేస్తుందని అనుకొన్న బీజేపీ ఆఖరి నిమిషంలో ఎందుకు ప్లేటు ఫిరాయించింది? రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్ర ప్రయోజనాల గురించి పోరాడతాను, సీమాంధ్రకు అన్యాయం జరిగితే సహించం అని చెబుతూ వచ్చిన బీజేపీ చివరకు తెలంగాణకే ఎందుకు అనుకూలంగా నిలబడింది? సవరణలు అంటూ చెప్పి చివరకు తెలంగాణకు అనుకూలంగా ఎందుకు ఓటేసింది? సీమాంధ్రలో ఆ పార్టీ ఇమేజ్ పెరిగే అవకాశం ఉన్నా... బీజేపీ తెలంగాణకే ఎందుకు అనుకూలంగా నిలబడింది? అంటే.. ఇది భవిష్యత్తులో వచ్చే తలపోటును తగ్గించుకోవడానికే నని చెప్పొచ్చు! ఒకవేళ ఇప్పుడు తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ అడ్డం తిరిగి ఉండి ఉంటే విభజన ఆగిపోయేది. రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్ర ప్రయోజనాల గురించి మాట్లాడి ఉంటే మొత్తం ప్రక్రియ ఆగిపోయేది. అయితే దాని వల్ల తెలంగాణలో బీజేపీకి కొంత నష్టం జరిగేది, సీమాంధ్రలో మాత్రం లాభపడేది! అలాంటి పరిస్థితుల మధ్యే ఎన్నికలు జరిగేవి. అయితే కొన్ని సీట్ల కోసం బీజేపీ చూసుకొని ఉంటే.. వచ్చే ఎన్నికల అనంతరం ఏర్పడే వారి ప్రభుత్వానికి ముప్పుతిప్పలు తప్పేవి కాదు! రేపు ఎన్నికల తర్వాత మళ్లీ సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు అలాగే ఉండేవి. విభజన రగడ కేంద్ర ప్రభుత్వాన్ని వణికించేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులుపడుతోందో... రేపు ఎన్నికల తర్వాత బీజేపీకి కూడా అనే కష్టాలు ఉండేవి. అందుకే ఈ వివాదానికి ఇంతటితో ముగింపును ఇద్దామని బీజేపీ భావించిందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు మద్దతు పలికింది. దీని వల్ల సీమాంధ్రలో నష్టమే ఉంటుంది. అయితే ఎలాగూ అక్కడ పార్టీ ఉనికిలో ఉన్న దాఖలాలు లేవు! కాబట్టి కొత్తగా జరిగే తీవ్రనష్టం లేదు! అందుకే.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా నిలబడిందని చెప్పవచ్చు!