Author Topic: రెండు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు... హీట్/ఫట్ అవుతాయా?  (Read 217 times)

Offline lokesh

  • Full Member
  • ****
  • Posts: 2,118
జై సమైక్యాంధ్ర పార్టీ. జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవ నికపై రెండు రోజుల వ్యవధిలోనే ఆవిర్భవించిన పార్టీలు ఇవి. మూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ నాయకత్వంలో రాజమండ్రి వేదికగా ఏర్పడింది ఒకటైతే... హైదరాబాద్‌లోని నోవాటిల్ వేదికగా సినిమా ఫక్కీలో ఆవిష్కృతం కాబోతున్న పవన్ జనసేన పార్టీ మరొకటి. మరో రెండు నెలలలోపే కీలమైన సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనున్నది. ఈ కొత్త పార్టీలకు ఉన్నది చాలా తక్కువ సమయమే. పార్టీల జెండా, అజెండా ప్రజలకు పరిచమయ్యేలోగానే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనున్నది. అట్టడుగు స్థాయిలో పార్టీ నిర్మాణానికి కూడా సమయం సరిపోదు. ఇప్పటికే సీమాంధ్ర వేదికగా తెలుగుదేశం, వైకాపాలు పటిష్టమైన యంత్రాంగంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. విభజన నేపథ్యంలో నాయ కులను కోల్పోయినా, కేడర్ పరంగా, ఓటు బ్యాం కు పరంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే వున్నది. ఇలాంటి పరిస్థితిలో బలంగా వున్న ఈ మూడు పార్టీలను
అధిగమించి, సత్తాచాటే స్థితి కొత్త పార్టీలకు ఉంటుందా అన్న చర్చ ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణ రాష్ర్టంలో నడుస్తోంది.
తెలుగువారి ఆత్మగౌరవం, సమైక్య నినాదంతో జెఎస్‌పి కిరణ్ నాయకత్వంలో ముందుకు వెళ్తోంది. విభజనకు కాంగ్రెస్, భాజపా, తెలుగుదేశం, వైకాపాలన్నీ కారణమని నాలుగు పార్టీలను సీమాంధ్రప్రజల దృష్టిలో దోషులుగానిలిపి తాను లబ్దిపొందే ప్రయత్నం చేస్తోంది. కిరణ్ వెంట నడిచే నాయకులే కరువయ్యారు. బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలు, కొందరు కిరణ్ కేబినెట్ సహచరులు తప్ప మర్వెరూ ఆయన వెంట లేరు. పార్టీ నిర్మాణమే జరగలేదు. మరి సమైక్య సెంటిమెంట్‌పై ఆశలు పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా కిరణ్ పార్టీ వెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో కిరణ్ పార్టీ ఏదో ఒక ప్రధాన పార్టీ గెలుపునకో, ఓటమికో పరోక్షంగా కారణమవుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
అభ్యుదయ భావాలు, సామాజిక న్యాయం వంటి అంశాలే అజెండాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ విధి విధానాలను ప్రకటించనున్నారు. జెండా, అజెండా, గీతం అన్నీ ఖరారయి పోయాయి. ఒక హాలులో పవన్ చేసే ప్రసంగాన్ని 2 కేంద్రాల్లో ప్రత్యక్షంగా వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన కుటుంబంలోనే సహకారం కొరవడింది. తాను చిరంజీవి అన్నయ్య వెంటే వుంటానని, అభిమానులు కూడా అన్నయ్య వెంటే వుంటారని నాగబాబు మీడియాతో స్పష్టంగా చెప్పడంతో మెగా అభిమానుల్లో చీలిక అనివార్యమనిపిస్తోంది. గతంలో పిఆర్‌పి కూడా ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఏర్పడి సమయం చాలక , స్వయంకృతాభం వల్ల చతికిల పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాపు సామాజిక నేతలంతా దాదాపుగా తెలుగుదేశం గూటికి అక్కడక్కడ మిగిలిన వారు వైకాపా గూటిలో చేరిపోయారు. ఈ పార్టీ కూడా కిరణ్ పార్టీలాగా నాయకుల కొరత నెలకొన్నది. కొత్తగా అభ్యుర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి కిరణ్, పవన్ పార్టీలకు ఎదురుకానున్నది.
సమయం తక్కువగా వుండటం, మూడు ప్రధాన పార్టీలు తమకంటే పటిష్టంగా ముందుండటం వంటి పరిణామాల్లో కిరణ్, పవన్ పార్టీలు సాధించబోయే ఫలితాలపై దాదాపు పెదవి విరుపులే వ్యక్తమవుతున్నాయి. ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లను చీల్చడానికి కొంతమేర ఉపయోగ పడతాయే తప్ప, ఈ రెండు పార్టీలకు వచ్చే ఆధిక్యత అంటూ ఏమీ వుండదనే అంచనాలొస్తున్నాయి. ఒక్కో పార్టీ ఐదు నుంచి ఆరు శాతం మేర ఓటును సాధిస్తే అవి ఆ మూడు ప్రధాన పార్టీలలో ముఖ్యంగా అధికారం కోసం నువ్వా నేనా అని పోరాడుతున్న తెలుగుదేశం, వైకాపాలను పీఠంపై కూర్చోడానికో, దెబ్బతీయడానికో దోహదపడతాయే తప్ప ఈ రెండు పార్టీలు రాబోయే సాధారణ ఎన్నికల్లో సాధించే ఫలితాలు అంతంత మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 262 Views Last post October 16, 2014, 09:05:54 AM
by siva