Author Topic: Racegurram Reviews  (Read 869 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« on: April 11, 2014, 05:05:32 PM »
Race Gurram jeevi review
Jeevi rating: 3.25/5
Punchline:
Kill Bill Pandey
Genre:
Action/Family Drama
Type:
Stright
Banner:
Lakshmi Narasimha Productions

Cast
: Allu Arjun, Shaam, Shruti Haasan, Saloni, Prakash Raj, Ravi Kishan, Posani Krishna Murali, Brahmanandam, Kota Srinivasa Rao, Mukesh Rushi, Sayaji Shinde, Ali, Jayaprakash Reddy, MS Narayana, Raghubabu, Tanikella Bharani, Srinivasa Reddy, Raghu Karumanchi, Duvvasi Mohan, Pavithra Lokesh, Pragathi etc

Story:
Vakkantham Vamsi
Music:
S.S. Thaman
Lyrics: Chandrabose, Varikuppala Yadagiri, Rehaman, Vishwa
Dialogues:
Deepak Raj - Vikram Siri
Editor:
Gowtam Raju
Cinematography: Manoj ParamahamsaAction: Ram-LakshmanArt: Narayana Reddy Screenplay - Director: Surender Reddy
Producers: Nallamalupu Srinivas (Bujji) & Dr. Venkateswara Rao
Release date
: 11 April, 2014
Theater watched: Screen 4, Prasads Multiplex, Hyderabad


Story

Ram (Shaam) and Lakshman a.k.a Lucky (Allu Arjun) are brothers. Ram is a sincere guy who grows up to become an honest cop. Lucky is a happy-go-lucky guy who enjoys life. Ram and Lucky have a tom and jerry kind of fight going on. Siva Reddy (Ravi Kishan) is a factionist who wants to become a politician. Ram gathers evidence against Siva Reddy and Lucky unintentionally intercepts them. The rest of the story is all about the race between Lucky and Siva Reddy.


Artists Performance
Allu Arjun: Allu Arjun comes up with a fabulous performance as a racy youngster, chivalrous boyfriend and a family man. He has changed dialogue modulation and its excellent. His mannerisms and the way he says ‘daevudaa’ is cute. His dances are superb and his performance in action sequences is extraordinary. He matched the comedy timing of Brahmanandam in combination scenes. This film has given him excellent scope to give an allround performance.

Others: Shruti Haasan plays the role of an unemotional and unresponsive girl who is transformed to a normal one. She is pretty good. Shaam is extremely fit as a cop and executed his role with finesse. Bhojpuri star Ravi Kishanplayed the role of main villain. He is good, but his characterization is eccentric. Prakash Raj plays a comical role with limited screen time. Posani Kishna Murali comes up with another entertaining performance.Brahmanandam is extremely good as ‘Kill Bill Pandey’ - a special cop. His entrance and screen presence creates a roller coaster ride of entertainment. Saloni plays love interest of Shaam. Ali does the role of fake doctor effectively again after Kick film. Jaya Prakash Reddy is good as chief cop. MS Narayana plays a delightful role in the first half.

Technical departments
Story - screenplay - direction: The basic story is about two brothers who fight with each other realizing the brotherhood when pitted against a baddie. The writer has added all possible commercial angles to the story. The screenplay is good in the second half. All characterizations in the film are good except for that of villain which is highly eccentric. Director Surender Reddy has made sure that he didn’t miss popular commercial elements in the movie, at the same time his technical standards are in tact. There are ups and lows in the narration, but he has made sure that he ended the film on a high note. It’s a good comeback for Surender Reddy.

Other departments: Cinematography by Manoj Paramahamsa is of top notch quality. Good color grading and nice visual effects added glitz to the visuals. Songs scored by SS Thaman are alright. But the background score in second half is very good (especially Allu Arjun’s bike entrance in a new avatar towards climax). Cinema Choopista is my favorite song. On the visuals front, I liked Boochade and Down Down. Picturization and art direction for these two songs is excellent. The placement of first two songs in second half is not good. But the title track towards climax is excellently shot. Art direction by Narayana Reddy deserves a special mention. Dialogues by Deepak Raj - Vikram Siri are very good and mostly entertaining. All action sequences are stylishly choreographed by Ram - Laxman. Editing by Gowtam Raju is fine. Production values by Nallamalupu Srinivas (Bujji) and Dr. Venkateswara Rao are of high standards.

Analysis
Initial half of the first half is entertaining. Interval fight is pretty heavy. Second half is neatly done. The last 20 minutes of the film which features Brahmanandam gives a high. Plus points of the movie are Allu Arjun, Brahmanandam, Cinematography, second half screenplay, all round orientation and production values. On the flip side, eccentric villain characterization and uneven tempo of the film should have been taken care of. On a whole, Race Gurram with it’s allround commercial elements should do well at box office! And watch out for Brahmi as ‘kill bill pandey’!

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« Reply #1 on: April 11, 2014, 05:08:56 PM »
సమీక్ష : రేసు గుర్రం – స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్

విడుదల తేదీ : 11 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం :సురేందర్ రెడ్డి
నిర్మాత :నల్లమలపు బుజ్జి
సంగీతం:ఎస్ఎస్ థమన్
నటీనటులు: అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని, శ్యామ్..
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టైలిష్ మేకింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘రేసు గుర్రం’. ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 100కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ ‘రేసు గుర్రం’ విజయం అందుకుందో లేక పరాజయాన్నే అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :
ఓపెన్ చేస్తే వరంగల్.. తనికెళ్ళ భరణికి ఇద్దరు కుమారులు, వాళ్ళే రామ్(కిక్ శ్యామ్) – లక్ష్మణ్ అలియాస్ లక్కీ (అల్లు అర్జున్). వీరిద్దరికీ చిన్నప్పటి నుంచి అస్సలు పడదు. పెద్దయ్యాక ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. అలాగే రామ్ ఎసిపి అవుతాడు. లక్కీ మాత్రం బేవర్స్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు.హైదరాబాద్ లో పేరు మోసిన రౌడీ షీటర్ అయిన మద్దిలి శివారెడ్డి(రవి కిషన్) ఎమ్మెల్యే కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ శివారెడ్డి నేరాలను నిరూపించి ఎమ్మెల్యే అవ్వకూడదని ట్రై చేస్తుంటాడు. దాంతో శివారెడ్డి అతన్ని చంపేస్తాడు. దాంతో ఆ కేసు రామ్ చేతికి వెళుతుంది.ఇదే తరుణంలో లక్కీ స్పందనని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి లక్కీ – స్పందన ఒకటవుతారు. అది చూసిన రామ్ వాళ్ళని విడగొట్టాలని అనుకుంటాడు. దాంతో రామ్ – లక్కీ మధ్య పెద్ద గొడవ అవుతుంది. అప్పుడే లక్కీ కి ఒక నిజం తెలుస్తుంది. అదే శివారెడ్డి రామ్ ని చంపాలనుకునటున్నాడని.. అక్కడి నుండి లక్కీ తన అన్నని కాపాడుకోవడానికి ఏమేమి ప్లాన్ చేసాడు? అందులో భాగంగా కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం)ని ఎలా వాడుకున్నారు? అన్నదే మీరు వెండితెరపై చూడాల్సిన మిగిలిన కథాంశం


ప్లస్ పాయింట్స్ : రేసు గుర్రం సినిమాకి అల్లు అర్జున్ హీరో అవ్వడం మొదటి ప్లస్ పాయింట్. డైరెక్టర్ రాసుకున్న కథకి అతని వందకి వంద శాతం న్యాయం చేసాడు. ఈ సినిమాలో అతను చూపించిన మానరిజం, డైలాగ్ డెలివరీ ఇంతకముందు సినిమాల్లో చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్ని వాడే ‘దావుడా…’. అనే ఊతపదం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అలాగే బన్ని నుంచి అభిమానులు ఆశించే డాన్సులు అన్ని పాటల్లోనూ వేయకపోయినా ‘సినిమా చూపిస్తా మామ’, ‘డౌన్ డౌన్ డుప్ప’ పాటల్లో మాత్రం స్టెప్స్ బాగా వేసాడు. అల్లు అర్జున్ తర్వాత ఈ సినిమాకి చెప్పుకోవాల్సిన మరో హీరో ఉన్నాడు, అతనే కామెడీ కింగ్ బ్రహ్మానందం. హీరో అని ఎందుకు అన్నానంటే బ్రహ్మానందం లేకపోతే సెకండాఫ్ లేదు. అతనే సెకండాఫ్ కి ప్రాణం పోసి, తన భుజాల మీద వేసుకొని సినిమాని నడిపించాడు. అలాగే తను ఉన్నంత సేపు ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూ ఉంటారు. ఇక హీరోయిన్ శృతి హాసన్.. స్పందన పాత్రలో శృతి గ్లామర్ తో పాటు, పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా ఏమడిగినా ఇన్నర్ గా ఫీలవుతా అనే ఎపిసోడ్స్ లో బాగా చేసింది. అలాగే ఎన్నడూ లేనతంగా శృతి కూడా బన్నితో పాటు స్టెప్పులు వేసి మంచి డాన్సర్ అనిపించుకుంది.బన్నికి అన్నగా చేసిన శ్యామ్ ‘కిక్’ తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. అన్నదమ్ములుగా అల్లు అర్జున్ – శ్యామ్ బాగా సెట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ఉన్నంతలో తన నటనతో ప్రేక్షకులను నవ్వించాడు. విలన్ పాత్ర పోషించిన రవి ప్రకాష్ కూడా మంచి నటనని కనబరిచాడు. సలోని అతిధి పాత్రలో మెప్పించింది. ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి కూడా బాగా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులు బాగా నవ్వుకోవడానికి కామెడీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్, బ్రహ్మానందం వచ్చిన తర్వాత వచ్చే చివరి 30 నిమిషాలు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. సెకండాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ బాగుంటుంది, అలాగే అన్ని పాటలని బాగా స్టైలిష్ గా షూట్ చేసారు.


మైనస్ పాయింట్స్ :మొదటి మైనస్ పాయింట్ అంటే ఈ సినిమా కథ ఎందుకంటే అది చాలా పాతది. ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమాల్లోనే చూసాం కానీ ఇందులో స్క్రీన్ ప్లేతో కాస్త కొత్తగా ప్రెజెంట్ చేద్దాం అనుకోని ట్రై చేసారు. కావున కొద్ది సేపటి తర్వాత సినిమాలో నెక్స్ట్ ఏమి జరుగుతుందా అనేది మనం ఊహించేయవచ్చు.ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ ని అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం కోసం బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు స్లోగా ఉంటుంది. ఓవరాల్ గా కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ని ట్రిమ్ చేస్తే బాగుంటుంది. పాటలు చూడటానికి బాగున్నప్పటికీ సెకండాఫ్ లో వచ్చే ఒక్క పాట కూడా సందర్భానుసారంగా కాకుండా పాటలు ఉండాలి అన్న కాన్సెప్ట్ ప్రకారం వచ్చినట్టు ఉంటుంది. ముఖేష్ ఋషి, ప్రకాష్ రాజ్ లాంటి పాత్రలకి సరైన ముగింపు లేదు. అలాగే ‘కిక్’ నుంచి కంటిన్యూ చేసిన ఆలీ పాత్ర పెద్దగా నవ్వించలేకపోయింది.


సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగంలో మేజర్ హైలైట్ అంటే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ. సినిమా లుక్ మొత్తం చాలా స్టైలిష్ గా, విజువల్స్ అన్ని చాలా గ్రాండ్ గా ఉంటాయి. అలాగే నటీనటులందరినీ చాలా బాగా చూపించాడు. ఎడిటర్ కొన్ని బోరింగ్ విషయాలను, సాగదీసినట్టు ఉంది అన్న సీన్స్ ని కత్తిరించి పారేసి ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. థమన్ అందించిన పాటలు పెద్ద సక్సెస్ అయ్యాయి అలాగే విజువల్ గా కూడా చూడటానికి చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టే ఉంది.వక్కంతం వంశీ అందించిన కథ పాతదే అయినా దానికి ఇప్పటి కమర్షియల్ హంగులను అద్ది బాగానే రాసుకున్నాడు. సురేందర్ రెడ్డి టేకింగ్ ఎప్పటిలానే చాలా స్టైలిష్ గా ఉంది. కామెడీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన సురేందర్ రెడ్డి బలమైన ట్విస్ట్ లకి, హీరోయిజం ఎలిమెంట్స్ కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా తెలుగు ఆడియన్స్ కి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఇవ్వడంలో మాత్రం సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. నల్లమలపు బుజ్జి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.


తీర్పు :భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రేసు గుర్రం’ సినిమా బాక్స్ ఆఫీసు రేసులో విజయాన్ని అందుకునే రేంజ్ లోనే ఉంది. ఈ సమ్మర్ కి పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ గా నిలిచిపోతుంది. అల్లు అర్జున్ తో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, పోసాని కలిసి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తే శృతి హాసన్ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ‘రేసు గుర్రం’ అల్లు అర్జున్ కెరీర్లో నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్ళడమే కాకుండా, తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది.


123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

123తెలుగు టీం
« Last Edit: April 11, 2014, 05:16:14 PM by siva »

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« Reply #2 on: April 11, 2014, 05:38:16 PM »
Race Gurram Movie Review
 
Behind the Movie Race Gurram: Stylish combination of Allu Arjun, Shruti Hasan and Surender Reddy along with SS Thaman’s music made this film special. Let us see, how far this film can race at BO?

In the Movie Race Gurram: Ram (Kick Shyam) and Lakshman aka Lucky (Allu Arjun) are brothers with opposite mindsets who go on quarrelling from childhood days. Into the profession, Ram becomes ACP while Lucky is a Julayi who enjoys spending time with friends falls in love with emotionless Spandana (Shruti Hasan). On other side, Police Department vexed by illegal and crime businesses of Shiva Reddy (Ravi Kishen) eyeing for MLA ticket wants to nail him down.
When Ram plays spoil sport with romantic affair of Lucky, in retaliation Lucky runs away with Ram’s police vehicle which also consists of important file needed to arrest Shiva Reddy. However, twist comes in the form of sudden attack by Shiva Reddy’s men on this police vehicle. Lucky then realizes the sincerity and dedication of Ram towards the profession and comes forward to save him from the clutches of Shiva Reddy and his father Peddi reddy (Mukesh Rishi). Rest is the race between Lucky and Shiva Reddy? How did Lucky use MLA (Posani) and Police Officer Kill Bill Pandey (Brahmi)? Who finally won, watch it on big screen.

Values of the Movie Race Gurram: Surender Reddy is a super specialist in technical aspects. Never in the past, he letdown the patrons with direction and screenplay. Vakkantam Vamsi’s simple story becomes effective with neat treatment and plain screenplay adopted by Surender Reddy. In fact, Manoj Paramahamsa’s cinematography is top notch and lighting used added a bit of innovation on screen. Goutham Raju’s editing was just ok. SS Thaman’s music mesmerizes with title song and Down Down Duppa. BGM was also a decent work. Production values are quite high from Nallamalapu Bujji of Lakshmi Narasimha Productions.

Performance wise Allu Arjun is strenuous to show versatility. His characterization is new and the dialogue modulation Bunny has shown is just ‘Devudaa…’ outstanding. About dances, day by day Bunny’s grace is scaling high. His ease at performing stunts is yet again delivered. His comic timing improved considerably. This is how Bunny connects with all the sets of audience. Shruti Hasan looked modern and glamorous. Her energy in dances matched the level of Bunny which is highly impressive. Kick Shyam is best fit. Saloni has a short role. Ravi Kishen did not give his best, may be due to unfamiliarity with Telugu language. Prakash Raj is always special. Mukesh Rishi, Tanikella Bharani is short. Posani as MLA and Brahmi as Kill Bill Pandey stole the pre climax portions with their impeccable comedy timing racing at lightening speed. Rajiv Kanakala, MS Narayana are into their emotional best. Ali continues his Dr. Bali from ‘Kick.’ Rest, everyone did fine.   

Out of the Movie Race Gurram: Technically, the standards of Telugu film making are increasing with each year and technicians like Surender Reddy and Manoj Paramahamsa needs to be appreciated for putting such master class work. This is technically a well made film supported with clean and smart performances from all the artists. Although second half did not get along with the same magic spilled by first half, entry of Brahmi and Posani can be seen as something like a borrowed concept from Srinu Vytla’s school of thought. Anyways, if it is just the entertainment without cross checking the logics which you are interested in, then both first and second halves of ‘Race Gurram’ are equally enjoyable.
On special focus for Bunny, he is tremendously improving as an artist with each film. May it be comic timing or effortless dances; he is emerging as the best in Mega Camp. His styling too needs a special underlining. More perfectly, Bunny and Shruti chemistry worked to the mark which made first half thoroughly entertaining. The thread of Prakash Raj as father to Shruti is definitely new. Enough of praises; watch ‘Race Gurram’ without any second thoughts. Commercially, Bunny has one more ‘Julayi’ on hand because ‘Race Gurram’ connects equally with class and mass audience irrespective of centre disparity.

Cinejosh Verdict of Race Gurram: This is a Winning Horse at Box Office
Cinejosh rating: 3.25

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« Reply #3 on: April 11, 2014, 05:41:53 PM »
Rating: 3.0/5---సూర్య ప్రకాష్ జోస్యుల
యాక్షన్ ఎంటర్టైనర్ , మైండ్ గేమ్, బ్రహ్మానందం అనే మూడు అంశాల చుట్టూ ఎడతెగకుండా తిరుగుతున్న తెలుగు పరిశ్రమ ...'అత్తారింటికి దారేది' తో ఫ్యామిలీ ప్రేక్షకుల వైపు టర్న్ తీసుకుంది. దాంతో అటు ఫ్యామిలను రాబడుతూనే, ఫ్యాన్స్ ని, మాస్ ప్రేక్షకులను అలరించేలా తెలుగు సినిమా రూపొందించటం దర్శకులుకు టాస్క్ గా మారింది. మరో ప్రక్క అల్లు అర్జున్ గత కొంతకాలంగా కేవలం డాన్స్ లు,స్టైల్ మీదే కాకుండా మిగతా ఎలిమెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి తన మార్కెట్ విస్తరించుకుంటున్నాడు. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని ట్రెండ్ ని వదలకుండా...కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మానందంని దింపి, అన్నదమ్ముల అనబంధం అనే ఫ్యామిలీ మసాలా దినుసు వేసి మరీ సురేంద్రరెడ్డి వండిన వంటకమే ఈ చిత్రం. కథలో కొత్తదనం ..ఊహించని ట్విస్ట్ లు లేకపోయినా...రెండు గంటల సేపు ఎంటర్ట్నైన్ చేయటంలో సఫలీకృతమయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో బ్రహ్మానందం, అలీతో చేసిన కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ గుర్రం మీద పందెం కాయచ్చు... టిక్కెట్ డబ్బుకు తగ్గ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అనే భరోసా కలిపించింది.

అన్నదమ్ములైన రామ్(శ్యామ్),లక్ష్మణ్ అలియాస్ లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ఎసిపి గా ఎదిగిన రామ్ ... తన నిజాయితీతో లోకల్ రాజకీయనాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదిస్తాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటాడు. ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు. తన అన్నను ఎలా ఆ కుటిల రాజకీయనాయకుడు నుంచి రక్షించాడు...ఆ క్రమంలో కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం) ఎలా ఉపయోగపడ్డాడు అన్నది మిగతా కథ. అలాగే...లక్కీ తొలిచూపులోనే ప్రేమలో పడిన స్పందన(శృతి హాసన్)ని ఎలా దక్కించుకున్నాడు...సినిమాలో సలోని పాత్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స్టోరీ లైన్ గా సునీల్, నాగచైతన్య నటించిన 'తడాఖా' గుర్తుకు వచ్చినా దాన్ని విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్, కామెడీ సన్నివేశాలతో మైమరిపించగలిగారు. ఫక్తు కామెడీ వ్యవహారం కావటంతో ట్విస్ట్ లు లేకపోవటమే కలిసివచ్చింది. 'కిక్' చిత్రం తరహాలో పూర్తిగా కామెడీతో చిత్రాన్ని పరుగెత్తించాలన్న దర్శకుడు నిర్ణయం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా నీట్ గా ఉన్నాయి. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం మరోసారి విజృంభించాడు. అలీ.. 'బాలీ ఫ్రమ్ మలేషియా'(కిక్ లో పాత్ర కంటిన్యూషన్) గా బాగా నవ్వించాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు. అయితే ఇంటర్వెల్ ఫైట్ లెంగ్త్ మరింత ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. అలాగే ఫస్టాప్ లో కొన్ని డల్ మూవ్ మెంట్స్ ని సైతం తొలిగిస్తే బాగుండేది.
Thatstelugu

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« Reply #4 on: April 11, 2014, 05:43:19 PM »
ప్లస్ పాయింట్స్:
అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్
శృతి హాసన్ గ్లామర్
సాంగ్స్, కామెడీ
 
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
ఫైట్స్
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం'  ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే.

లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ.

పెర్ఫార్మెన్స్:
అల్లు అర్జున్లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్లో నటించడం అర్జున్కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు.

కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు.

మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్లో  హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు.

టెక్నికల్:
తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి.
టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి.

డైరెక్షన్:
టేకింగ్లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు.
Sakshi

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« Reply #5 on: April 11, 2014, 05:45:43 PM »
race-gurrram-movie-review
race-gurrram-movie-review
race-gurrram-movie-review

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
Racegurram Reviews
« Reply #6 on: April 11, 2014, 06:14:10 PM »
Getting all positive reviews......

Can it collect 45Cr+?

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
Racegurram Reviews
« Reply #7 on: April 11, 2014, 07:08:34 PM »
First week will be crucial. Bad planning in OS. Lack of publicity in OS especially. This kind of movies will do much better in OS.

charan fan

  • Guest
Racegurram Reviews
« Reply #8 on: April 12, 2014, 06:04:29 AM »
First week will be crucial. Bad planning in OS. Lack of publicity in OS especially. This kind of movies will do much better in OS.
ekkauva theaters lone release chesyaru antunaru ga mari

Offline yugandhar

  • Power Member
  • ******
  • Posts: 5,264
Racegurram Reviews
« Reply #9 on: April 12, 2014, 10:15:49 AM »
123Telugu.com
3.5/5

Tupaki.com
3/5

ReleaseDay.com
3.25/5

HelloAndhra.com
3.5/5

Gulte.com
3/5

CineJosh.com
3.25/5

Mirch9.com
Above Avg

Telugumirchi.com
3.75/5

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
4 Replies 722 Views Last post October 24, 2014, 02:21:55 PM
by siva
0 Replies 254 Views Last post November 14, 2014, 03:07:36 PM
by Pa1Kalyan
1 Replies 412 Views Last post April 06, 2015, 10:14:13 PM
by Pa1Kalyan