Author Topic: కోల్ స్కామ్: దాసరిపై కొత్త విషయాలు బట్టబయలు!  (Read 430 times)

charan fan

 • Guest
బొగ్గు కుంభకోణం(కోల్ స్కామ్) యూపీయే హయాంలో జరిగిన పెద్ద కుంభకోణాల్లో ఒకటి. కోల్‌ గేట్‌గా ప్రసిద్ధి చెందిన ఆ కుంభకోణం వెనుక ఏం జరిగిందో వివరిస్తూ బొగ్గు శాఖ కార్యదర్శిగా రిటైరైన పి.సి. పరాఖ్‌ ఒక పుస్తకం రాశారు. ప్రధాని కార్యాలయం అధికారులు, బొగ్గుశాఖ మంత్రులుగా చేసిన దాసరి నారాయణరావు, శిబూ సోరెన్‌ ఎలా మన్మోహన్‌ సింగ్‌ ఆదేశాలను ఎలా బుట్టదాఖలు చేశారో వివరించారు. క్రూసేడర్‌ ఆర్‌ కాన్‌స్పిరేటర్‌ – కోల్ గేట్‌ అండ్‌ అదర్‌ ట్రూత్స్‌ పేరిట రాసిన ఆ పుస్తకంలో.. చాలా సందర్బాల్లో ప్రధాని ఎలా నిస్సహాయుడిగా ఉండిపోయారో పరాఖ్ వివరించారు.

సంజయ్‌ బారు పుస్తక ప్రహసనం ప్రజల ముందుకు వచ్చి రెండు రోజులు గడవక ముందే ప్రధాని బలహీనతలను మరో మాజీ బ్యురోక్రాట్‌ బహిర్గతం చేస్తున్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి.పరాఖ్‌ కోల్‌గేట్‌ కుంభకోణం గురించి రాసిన పుస్తకంలో ప్రధానమంత్రిని పీఎంఓ అధికారులు, ఇతర మంత్రులూ ఎంతమాత్రం పట్టించుకోలేదంటూ వివరించారు. బొగ్గుకుంభకోణంలో దేశానికి కలిగిన నష్టం కాగ్‌ చెప్పిన లక్షా 86వేల కోట్ల కంటె చాలా ఎక్కువేనని పరాఖ్‌ స్పష్టం చేశారు. కాగ్‌ను స్వయంగా ప్రధానమంత్రే విమర్శించడాన్ని పరాఖ్‌ తప్పుపట్టారు.

రాఖ్‌ కథనం ప్రకారం… బొగ్గు బ్లాకుల కేటాయింపులకు కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు. కానీ పీఎంవో అధికారులు, బొగ్గు శాఖ సహాయమంత్రులుగా చేసిన దాసరి నారాయణరావు, శిబూసోరెన్‌ దానికి అడ్డుపడ్డారు. పరాఖ్‌ రిటైర్ అయేంత వరకూ ఆ ప్రతిపాదనను ఆలస్యం చేశారు. పరాఖ్‌ పదవీ విరమణ తర్వాత ఆ ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేశారు. కానీ వారిని ప్రధానమంత్రి ఏ దశలోనూ అడ్డుకోలేక నిస్సహాయంగా ఉండిపోయారు.

కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ మన్మోహన్‌ సింగ్ చెప్పడాన్ని పరాఖ్‌ తప్పుపట్టారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌ను నిలువరించడానికి…. ఆ పథకాన్ని సమూలంగా నాశనం చేయడానికీ.. దాసరి నారాయణరావు, శిబూసోరెన్‌ చేసిన ప్రయత్నాలను పరాఖ్‌ వివరించారు.

మన్మోహన్‌ సింగ్‌ నిస్సహాయతపై పరాఖ్‌ జాలిపడ్డారు. తన ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఉన్న కొందరు వ్యక్తుల స్వార్థ పూరిత చర్యలను అడ్డుకోలేకపోవడం దురదృష్టకరమని పరాఖ్ వ్యాఖ్యానించారు. సొంత మంత్రులే అవమానిస్తున్నా… తన నిర్ణయాలను అమలు చేయకపోయినా… కొన్ని నిర్ణయాలను తిప్పికొట్టినా… ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదోనని పరాఖ్‌ విస్మయ పడ్డారు.

బొగ్గుశాఖ కార్యకలాపాల్లో ఎంతోమంది ఎంపీలు తలదూర్చి అధికారులపై దాడులు చేసేవారని పరాఖ్ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో కూడా ప్రధానమంత్రి నిస్సహాయంగా ఉండిపోవడాన్ని తప్పుపట్టారు. జాతి ప్రయోజనాల కోసమే రాజీనామా చేయకూడదని మన్మోహన్‌ భావించేవారట. ఐతే పీఎం ఎదుర్కొంటున్న పరిమితుల మధ్య బొగ్గుశాఖలో సంస్కరణలు అమలుచేయడం అసాధ్యమని తనకు స్పష్టంగా తెలిసిందన్నారు.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Pedda lectures stage ekkite, chesevi maatram lattukore panulu

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,169
 • DIE HARD FAN OF POWERSTAR
The Enforcement Directorate( ED) lodged a case against the senior director, Darshakaratna dasari narayana rao on Monday, 5th May on the charges of money laundering. They have also registered a case against the congress MP Naveen Jindal. Dasari has been quizzed by the CBI officials recently. In response to the directions made by the CBI officials, ED registered a case on Dasari. It is a known news that Dasari celebrated his 70th birthday on 4th of May.

dasari narayana rao earlier, worked as a minister of state in coal ministry during the congress government. During his tenure the biggest scam ever in coal ministry was happened. Dasari has to strive hard to get out of the cases against him.

birhtday gift for him.chiru ni annodu evadu bagupadaledu. :))

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 261 Views Last post October 16, 2014, 09:05:54 AM
by siva