Author Topic: Pawan Kalyan - Narendra Modi meeting updates  (Read 507 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
Pawan Kalyan - Narendra Modi meeting updates
« on: April 22, 2014, 03:16:27 PM »
నాకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ: పవన్
నిజామాబాద్ లో ప్రారంభమైన బీజేపీ 'భారత్ విజయ్ ర్యాలీ' బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం మొదలైంది. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఎలా వచ్చిందనే విషయం కన్నా వచ్చిన తెలంగాణను ఎలా పాలించాలనే దానిపైనే మాట్లాడుకోవాలని చెప్పారు. తాము పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కొందరు చెబుతున్నారని... కానీ, కొందరు యువకుల బలిదానాలు, పోరాటాల వల్లే తెలంగాణ సాధ్యమైందని పరోక్షంగా టీఆర్ఎస్ పై సెటైర్ విసిరారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు చనిపోతుంటే తెలంగాణ ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కులాలు, మతాలన్నింటికీ సమాన న్యాయం చేయడమే జనసేన సిద్ధాంతమని వెల్లడించారు

కులం పేరుతో శ్రవణ్ కు సీటు నిరాకరించారు: పవన్ కల్యాణ్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉండి తనదైన కృషి చేసిన దాసోజు శ్రవణ్ కు కులం పేరుతో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్పారు. 'నీ కులానికి పట్టుమని పది ఓట్లు కూడా లేవు' అంటూ శ్రవణ్ కు సీటు ఇవ్వలేదని వివరించారు. కులమే అనుకుంటే ఒక కుటుంబానికి అన్ని సీట్లు అవసరమా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పోరాటం చేసే సత్తా ఉందా, లేదా అన్నదే చూడాలని, కులం కాదన్నారు. కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఇదేనా రాజకీయమని అడిగారు. తాను మొన్నటి వరకు ప్రత్యక్ష రాజీకీయల్లో లేనని, అసలు నేనడిగితే ఓట్లేస్తారా? అన్నది కూడా తనకు తెలియదని చెప్పారు. మూడు పార్టీలు, ముగ్గురు అభ్యర్థులు ఇదే నిజామాబాద్ లోక్ సభలో అసలైన పోటీ అని పేర్కొన్నారు.

కేసీఆర్ చేతిలో తెలంగాణను పెడితే... మరోసారి మోసపోవాల్సి వస్తుంది: కేసీఆర్ పై పవన్ సెటైర్లు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు, మౌలికవసతులు కావాలని... అవి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆసరా తప్పక ఉండాలని చెప్పారు. రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ అని, కాబోయే ప్రధాని మోడీ అని... అలాంటప్పుడు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోడీ మద్దతు అవసరమని తెలిపారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తిట్టడం అలవాటని... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని హితవు పలికారు. మోడీ లేదు, గీడీ లేదు అని గతంలో కేసీఆర్ అన్నారని... అలాంటప్పుడు, రేపు మోడీ ప్రధాని అయితే తెలంగాణకు కేసీఆర్ ఏమి సాధిస్తాడని ప్రశ్నించారు. జిల్లాకో విమానాశ్రయం వచ్చేలా చేస్తానని హామీలిస్తున్న కేసీఆర్... కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా విమానాశ్రయాలు నిర్మిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. మాటలు తప్ప, సిద్ధాంతాలు లేని కేసీఆర్ లాంటి నేతల చేతిలో తెలంగాణను పెడితే... తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. బాధ్యత లేని నాయకులకు తెలంగాణను అప్పగిస్తే... ఈ ప్రాంతం మరో 20 ఏళ్లు వెనక్కు వెళుతుందని చెప్పారు.

సోనియావల్లే మన్మోహన్ కు చెడ్డపేరు: జనసేన అధినేత
ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ కు తెరవెనుక నుంచి నడిపిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే చెడ్డపేరు వచ్చిందని పవన్ విమర్శించారు. నడిచేది మన్మోహన్.. నడిపించేది సోనియా అని ఆరోపించారు. సోనియా నిర్వాకం వల్లే తెలంగాణ పోరాటంలో పలువురు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. కానీ, ఈ విషయాన్ని అందరూ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖండిస్తారని పవన్ చెప్పారు. ఈ సారి ఓటేయాలని అడిగేందుకు కాంగ్రెస్ నేతలు వస్తే బీజేపీకి ఓటు వేస్తున్నామని చెప్పండని సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ, టీడీపీ శ్రేణులకు సూచించారు

సచిన్ సంపాదనకు పీవీనే కారణం: పవన్   
సచిన్ వందలు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడంటే... దానికి కారణం దివంగత ప్రధాని పీవీ నరసింహారావే కారణమని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనికి కారణం ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే అని... దేశం ఆర్థికాభివృద్ధి చెందింది కాబట్టే సచిన్ వెంట మల్టీ నేషనల్ కంపెనీలు క్యూ కట్టాయని చెప్పారు. అంత గొప్ప పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానపరిచిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే రింగు రోడ్డులు నిర్మించడం కాదు... నీరు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కల్పన అని చెప్పారు. ఈ సారి మన దేశానికి మాటల మనిషి కాకుండా, చేతల మనిషి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నారని చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశం మొత్తం ఎంతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
Pawan Kalyan - Narendra Modi meeting updates
« Reply #1 on: April 22, 2014, 03:18:43 PM »
Live stream

www.youtube.com/watch?v=rOO70NXsjis


www.youtube.com/watch?v=B6gK4ibrkJQ

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
Pawan Kalyan - Narendra Modi meeting updates
« Reply #2 on: April 22, 2014, 03:22:30 PM »
Pawan Kalyan Speech


www.youtube.com/watch?v=15X1pRn8YNs Small | Large

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678
Pawan Kalyan - Narendra Modi meeting updates
« Reply #3 on: April 22, 2014, 04:01:23 PM »

పవన్ ను ఆకాశానికెత్తేసిన మోడీ

నిజామాబాద్ బహిరంగసభలో ప్రసంగించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆకాశానికెత్తేశారు. "తెలంగాణ ఏర్పడటం, సీమాంధ్రలో ఆందోళన నేపథ్యంలో నేను చింతిస్తున్న సమయంలో... ఒక రోజు నా దగ్గరకు పవన్ వచ్చారు. రాజకీయాలను పక్కనపెట్టి, నా మనసులోని మాటను చెబుతున్నా... పవన్ మాటలు నా మనసును కదిలించాయి. పవన్ కల్యాణ్ లాంటి యువకులు ఉన్నంత కాలం... తెలుగు స్పూర్తి కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు ముందుకు సాగుతాయి" అంటూ పవన్ ను మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
21 Replies 2376 Views Last post January 03, 2017, 12:10:04 AM
by Pa1Kalyan
131 Replies 4833 Views Last post February 26, 2017, 01:44:45 PM
by Pa1Kalyan
13 Replies 215 Views Last post November 08, 2016, 02:54:06 PM
by Pa1Kalyan