Author Topic: మోడీ ప్రభంజనాన్ని ఎదుర్కొని నిలిచిన ఆ నలుగురు  (Read 221 times)

Offline devenderp

  • Newbie
  • *
  • Posts: 6
  • Megafan
భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశంలో సృష్టించిన సునామీలో అన్ని రాష్ట్రాల్లో ప్రధానా పార్టీలు అన్నీ కొట్టుకుపోయాయి..
దేశం మొత్తం మోడీ హవా కొనసాగినప్పటికీ ఆ నలుగురు మాత్రం మోడీ అనే సునామిని ఆపగలిగారు.ధీరులుగా గెలిచి చూపించారు,సత్తా చాటారు..వారే తెలంగాణా దళపతి కేసిఆర్,పశ్చిమబెంగాల్ దీదీ మమత బెనర్జీ,తమిళనాడు జయలలిత,ఒడిసా నవీన్ దాదా..మోడీ హవా ఈ నాలుగు రాష్ట్రాల్లో కొనసాగాకపోవడానికి అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులే కారణం.

తెలంగాణా రథసారధి కేసిఆర్,నరేంద్రమోడిని చూసి ఓటేయ్యవద్దని టిఆర్ఎస్ అభ్యర్ధులనే ఎంపీలుగా గెలిపించాలని పదేపదే పిలుపునిచ్చారు. తెలంగాణా ప్రజానీకం ఈ పిలుపుని స్వికరించడమే కాకా తెలంగాణా కోసం పోరాడిన అభ్యర్ధులని ఎంపిలుగా గెలిపించారు. దేశమంతా మోడీ హవా స్పష్టంగా కనిపించడంతో ముందే అప్రమత్తం అయిన కేసిఆర్ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారంలో పావులు కదిపారు.ఏమాత్రం జంకు లేకుండా నరేంద్రమోడి పైనే గురి పెడుతూ మోడీ సన్యాసి అని కూడా అనేశారు.దీంతో మైనార్టీ ఓట్లన్నీ చెక్కు చెదరకుండా చూసుకోగలిగారు.పూర్తిగా తెలంగాణా సెంటిమెంటు టిఆర్ఎస్ ఖాతాలో పడటం అసెంబ్లీ తో పాటు లోక్ సభ సీట్లు కూడా ఆ పార్టికి దక్కాయి.

పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మోడీ ప్రభంజనానికి బ్రేకులు వేయడంలో సక్సెస్ అయ్యారు.బెంగాల్ రాష్ట్రం జనాభాలో నాలుగోవంతు ఉన్న ముస్లింల ఓట్లు రాబట్టడం లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మోడికి ఓటు వేస్తె మూటా ముల్లే సర్దుకోవాల్సివస్తుందని స్థానికుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం లో మమత సఫలీకృతం అయ్యారు.పార్టీ ముఖ్యనేతలను, వామపక్ష శ్రేణులను సమీకరించి వారికి బిజెపి అభ్యర్ధులని ఓడించే బాధ్యతను అప్పగించారు. మమత అవినీతికి అతీతంగా ,నిరాడంబరంగా ఉంటారు.దీంతో ప్రజలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు.

2004 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ కూడా గెలవని అన్నాడిఎంకె ఈసారి మాత్రం తమిళనాడులోని 39పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు తప్ప మిగిలిన 37స్థానాల్లో అన్నాడిఎంకె నే గెలుచుకోవడం విశేషం.జయ సిఎం అయిన ఏడాది నుండే తమిళనాడుకు చెందిన వ్యక్తే ఎర్రకోట పై ఈసారి జెండా ఎగరవేయాలని తన రాష్ట్ర ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే కాకా గత సంవత్సరం నుండే మూడవ కూటమి వస్తే తానే ప్రధానమంత్రి అవుతాననే సంకేతాలను బలంగా పంపించారు.ప్రధాని పదవికి 'మోడీ కావాలో ..ఈ లేడి కావాలో తేల్చుకోండని అని పిలుపుని ఇచ్చారు.రాజకీయ విశ్లేషకులు ఈ నినాదం తమిళులపై బాగా ప్రభావం చూపిందని భావిస్తున్నారు.

ఇక ఒడిసా విషయానికి వస్తే ఇక్కడ కూడా మోడీ హవా కొనసాగలేదు.నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతదాల్ పెద్ద పెద్ద హామీలు గుప్పించకపోయినా నవీన్ అవినీతిరహిత పాలన పై ప్రజలు తిరుగులేని నమ్మకాన్ని ఉంచి వరుసగా నాలుగోసారి గద్దేనేక్కించారు.మొత్తం 21 పార్లమెంట్ స్థానాలకు గాను 19 చోట్ల బీజేడి విజయం సాధించి తన సత్తా చాటింది.
« Last Edit: May 19, 2014, 08:15:36 AM by charan fan »