Author Topic: కమిలిన కమలం  (Read 218 times)

charan fan

  • Guest
కమిలిన కమలం
« on: September 17, 2014, 10:56:53 AM »
మెదక్‌లో టీఆర్ఎస్దే హవా
కొత్తప్రభాకర్‌రెడ్డి ఘనవిజయం
ప్రచారంలో విఫలమై భారీ మూల్యం చెల్లించిన కాంగ్రెస్, బీజేపీ
రెండు, మూడు స్థానాలకు పరిమితం


సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. ప్రతిపక్షాలను చిత్తు చేసి ఎంపీ స్థానాన్ని ఏకపక్షంగా గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,288 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆయనకు అండగా నిలిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలబడగా.. 11 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ స్థానానికి లోక్‌సభ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నెల 13న ఉప ఎన్నిక జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 10,46,092 ఓట్లు పోలవ్వగా టీఆర్ఎస్ అభ్యర్థికి 5,71,810 ఓట్లు వచ్చాయి. 2,10,524 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో, 1,86,343 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ పోటీ చేసిన కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి 67.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనప్పటికీ టీఆర్ఎస్కు ఓట్ల శాతం తగ్గకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో గులాబీ దండుకు 55 శాతం ఓట్లు రాగా.. ఈ ఉపఎన్నికలో దాన్ని స్వల్పంగా పెంచుకుని 55.2 శాతం ఓట్లను కొల్లగొట్టింది. కాగా, ఈ ఎన్నికలో ఘన విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్‌రావును సైతం అభినందించారు.

సిద్దిపేటదే హవా..

కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యతలో సిద్దిపేట నియోజకవర్గమే కీలకమైంది. ఇక్కడ 76,733 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థికి తిరుగులేని ఆధిక్యత దక్కింది. మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 93,759 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వచ్చాయి. ఇక నర్సాపూర్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న సునీతారెడ్డి నిరాశ చెందక తప్పలేదు. నర్సాపూర్‌లో సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే రాగా... టీఆర్ఎస్కు 73,710 ఓట్లు పడ్డాయి. వెనుకబడి పోతారనుకున్న చోటే గులాబీ దండుకు 6,443 ఓట్ల ఆధిక్యత లభించడం విశేషం. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఇక్కడి ఓటర్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే అండగా నిలిచారు. ఈ నియోజకవర్గంలో 18,849 ఓట్లతో జగ్గారెడ్డి వెనుకబడ్డారు.

చతికిలపడిన ప్రతిపక్షాలు

రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత రాలేదన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లిన ప్రతిపక్షాలు.. అధికారపార్టీపై పెద్దగా ఒత్తిడిని పెంచలేకపోయాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను వదిలి వ్యక్తిగత దూషణలు అందుకోవడం కూడా వారికి నష్టం చేకూర్చింది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వంటి వారు ఇంకో అడుగు ముందుకేసి బహిరంగ చర్చలతో సవాళ్లకు దిగారు. మరోవైపు మంత్రి హరీష్‌రావు ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టారు. రుణమాఫీ, రైతుల ఆత్మహత్యల అంశాల జోలికి వెళ్లకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లకే వాటిని పరిమితం చేశారు. సిద్దిపేట తరహా అభివృద్ధిని రాష్ర్ట మంతటికీ విస్తరిస్తామని కేసీఆర్ కూడా అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరోవైపు సిద్దిపేట అభివృద్ధిని జగ్గారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపణ చేస్తూ, కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని హరీష్ సవాల్ విసరడంతో బీజేపీ నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వివరణలకే పరిమితమై విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. మొత్తానికి ప్రధాన సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన కాంగ్రెస్, బీజేపీలు అస్త్ర సన్యాసం చేసినట్టు వ్యవహరించి ఉప ఎన్నికలో విఫలమయ్యాయి. అందుకే ఓటింగ్ శాతం భారీగా పడిపోయినా టీఆర్ఎస్ మెజార్టీలో పెద్దగా తేడా రాలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

charan fan

  • Guest
కమిలిన కమలం
« Reply #1 on: September 17, 2014, 11:04:30 AM »
•   ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ
•    24 సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకుగాను 10 సీట్లలోనే గెలుపు
•   యూపీలో సమాజ్‌వాదీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా
•     గుజరాత్లో కమలనాథులకు ఊరట
•     మోదీ స్థానం వడోదరలో బీజేపీకి భారీగా తగ్గిన మెజారిటీ
•     3 లోక్‌సభ స్థానాల్లో ఒక్కోటి చొప్పున దక్కించుకున్న
•     బీజేపీ, సమాజ్‌వాదీ, టీఆర్ఎస్
•     ఫలితాలు వెలువడిన 32 అసెంబ్లీ స్థానాలకు
•     బీజేపీకి 12, ఎస్పీకి 8, కాంగ్రెస్‌కు 7
•     ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున దక్కించుకున్న
•     టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్
•     సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
•     20న వెలువడనున్న ఆంటాగఢ్ అసెంబ్లీ స్థానం ఫలితాలు
•     సీనియర్లను పక్కనపెట్టిన ఫలితమే: బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా
 
ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ
 
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టించిన కమలనాథులకు ఊహించని షాక్ ఇది. అధికారం చేపట్టిన తర్వాత అతికొద్ది కాలంలోనే జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కూడా కనిపించలేదని స్పష్టమవుతోంది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో మొన్నటివరకు తమ చేతిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో(1 మిత్రపక్షం) 14 సీట్లను బీజేపీ ఇప్పుడు కోల్పోయింది.

20న ఆంటాగఢ్ ఫలితాలు..

సోమవారం ఫలితాలు వెలువడిన 9 రాష్ట్రాల్లోని 32 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకోగా.. కాంగ్రెస్ ఏడు, సమాజ్‌వాదీ పార్టీ 8, టీడీపీ, ఏఐయూడీఎఫ్, టీఎంసీ, సీపీఎంలు ఒక్కో స్థానం చొప్పున దక్కించుకున్నాయి. సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎస్పీలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి. ఆ పార్టీల స్థానాలు ఆ పార్టీలకే దక్కాయి.   ఛత్తీస్‌గఢ్‌లోని ఆంటాగఢ్ స్థానం ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయి. ఎన్నికల ఫలితాలు మోదీకి పరీక్ష కాదని బీజేపీ పేర్కొంటున్నప్పటికీ, ప్రతికూల ఫలితాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి. యూపీ, రాజస్థాన్‌లో ఫలితాలు బీజేపీని నిరుత్సాహానికి గురిచేయగా, గుజరాత్లో ఆరు స్థానాల్లో గెలవడం, బెంగాల్లో ఖాతా తెరుచుకోవడం కొంత ఊరటనిచ్చింది.

యూపీలో దూసుకెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ...

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్లింది. సార్వత్రిక ఎన్నికల్లో 73 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా రావడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ఎన్నిక జరిగిన 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ అభ్యర్థులు, 1 బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఖాళీ చేసినవే. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు ఎస్పీ ఖాతాలోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్ సత్తాచాటుకున్నారు. నోయిడా, సహరన్‌పుర్, తూర్పు లక్నో అసెంబ్లీ స్థానాల్లో కమలం వికసించగా, బిజ్నోర్, ఠాకుర్ద్వారా, నిఘాసన్, హమీర్పుర్, చర్ఖారి, సిరాథు,బల్హా, రొహానియా అసెంబ్లీల్లో ఎస్పీ అభ్యర్థులు గెలిచారు.

గుజరాత్లో బీజేపీకి ఊరట..

గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చింది. అక్కడ క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. 9 అసెంబ్లీను గెలిపించి ప్రధాని మోదీకి జన్మదిన కానుక ఇవ్వడానికి ఆ రాష్ట్ర సీఎం ఆనంది చేసిన హామీ చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా మారింది. ఫలితాలు మాత్రం బీజేపీకి కొంత ఊరటనిచ్చాయి. వడోదర లోక్‌సభతో పాటు, మనినగర్, టంకారా, తేలాజా, ఆనంద్, మటర్, లిమ్ఖేడా అసెంబ్లీను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, దీసా, ఖంభాలియా, మంగ్రోల్లలో కాంగ్రెస్ గెలిచింది.. మోదీ ఖాళీ చేసిన వ డోదరలో బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్.. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 3.29 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో ఈ స్థానాన్ని మోదీ 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా..

రాజస్థాన్‌లోని అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం (దక్షిణ కోటా నియోజకవర్గం)లో గెలుపొందగా, మిగిలిన మూడు స్థానాలు.. సూరజ్గర్హ, వుయీర్, నసీరాబాద్ అసెంబ్లీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈశాన్యంలోనూ కమలానికి ప్రతికూల ఫలితాలొచ్చాయి. త్రిపురలోని మను అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకోగా, సిక్కింలోని రామ్గంగ్-యాన్గంగ్ అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అస్సాంలో సిలిచర్‌లో బీజేపీ, లఖీపుర్లో కాంగ్రెస్, జమునాముఖ్లో ఏఐయూడీఎఫ్ గెలిచాయి.

పశ్చిమబెంగాల్లో ఖాతా తెరిచిన బీజేపీ

బెంగాల్‌లోని చౌరంగి నియోజకవర్గంలో బీజేపీ  గెలుపొందగా, దక్షిణ బషీర్హాట్ స్థానం టీఎంసీకి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య గెలుపొందారు. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.