Author Topic: ఆడియో సమీక్ష : గోవిందుడు అందరివాడేలే – ఫీల్ గుడ్ తెలుగు నేటివిటీ ఆల్బమ్..!  (Read 673 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,678

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మొట్ట మొదటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. గోవిందుడు అందరివాడేలే ఆడియో సెప్టెంబర్ 15న మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసారు. యువన్ శంకర రాజా మ్యూజిక్ అందించిన ఈ ఆడియో ఆల్బమ్ లో మొత్తం 6 పాటలున్నాయి. మరి ఆ ఆరు పాటలు ఏ తీరుగ ఉన్నాయనేది ఇప్పడు చూద్దాం…

1. పాట : నీలిరంగు చీరలోన
గాయకుడు : హరి హరన్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
ఆల్బంలో వచ్చే ఈ మొదటి పాట సోలో సాంగ్.. తాన్ననననన అంటూ సాగే కోరస్ తో బ్యాక్ గ్రౌండ్ లో ఏమో హార్మోనియం సౌండ్ తో మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే తబలా సౌండ్ తో పాట మొదలవుతుంది. నీలిరంగు చీరలోన అంటూ సాగే ఈ పాటని హరి హరన్ చాలా బాగా పాడాడు. పాటలో భావాన్ని వినేటప్పుడు పుట్టించేలా అతని వాయిస్ ఉంది. సుద్దాల అశోక్ తేజ్ ఈ పాటలో తన సహపత్ని గురించి పొగుడుతూనే, ఆ సహపత్నిని జీవితంతో పోలుస్తూ ఎంతో భావపూరితమైన సాహిత్యాన్ని అందించాడు. పాటలోని భావాన్ని ఏం మాత్రం పక్కకి పోనివ్వకుండా యువన్ శంకర్ రాజా హార్మోనియం, డప్పు, నగరాలతో వినసొంపుగా పాటని తీర్చిదిద్దాడు. మెలోడీ సాంగ్స్ ని ఆస్వాదించే వారికి ఈ పాట వెంటనే నచ్చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ పాటని విజువల్ గా గ్రాండ్ గా ఉంటే ఆడియన్స్ స్క్రీన్ పై నుంచి చూపుతిప్పుకోలేరు.

2. పాట : గులాబీ కళ్ళు రెండు ముళ్ళు
గాయకుడు : జావేద్ అలీ
సాహిత్యం : శ్రీ మణి
గులాబీ కళ్ళు’ అంటూ సాగే ఈ పాట కూడా ఆల్బంలోని మరో సోలో సాంగ్. ఈ పాట ఎలక్ట్రిక్ గిటార్, పెర్క్యూషణ్ వాయిద్యాలతో ఫాస్ట్ బీట్స్ తో ఈ సాంగ్ మొదలవుతుంది. ఈ పాట హీరో హీరోయిన్ ని పొగుడుతూ తన అందాలను వర్ణిస్తూ పాడే పాటలో శ్రీ మణి అందించిన సాహిత్యం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. జావేద్ అలీ ఆ పాటలో భావాల్ని మిస్ అవ్వకుండా తన వాయిస్ లో పలికించాడు. ఈ పాటకి జావేద్ వాయిస్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పటికే ఈ పాట విజువల్స్ ని రిలీజ్ చేసారు. యువన్ పాటని బీట్స్ తో స్టార్ట్ చేసి మధ్యలో లిరిక్స్ వినపడేలా స్లో చేసి మళ్ళీ బీట్స్తో కంపోజ్ చేసిన విధానం పాటకి బాగా సెట్ అయ్యింది. కావున ఈ పాత వినేటప్పుడు ఎంత ఆకట్టుకుంటుందో విజువల్ గా దానికన్నా బాగా ఆకట్టుకుంటుందని ఆశించవచ్చు. ఈ ఆల్బంలో వినగానే నచ్చే సాంగ్ ఇదే అవుతుంది..

3. పాట : రా రాకుమార
గాయని : చిన్మయి
సాహిత్యం : ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
ఈ ఆల్బంలో వచ్చే మూడవ పాట రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్.. ఇది విజువల్ గా డ్యూయెట్ సాంగ్ అయినా చిన్మయి మాత్రమే పాడడం వలన సోలో సాంగ్ అని చెప్పుకోవచ్చు. రా రాకుమారా అంటూ సాగే ఈ పాటని హీరోయిన్ హీరోని ఇష్టపడుతూ ఊహించుకొని పాడుకునే సాంగ్.. దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సందర్భానుసారంగా పాటకి బాగా సెట్ అయ్యింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా రొమాంటిక్ సాంగ్ కి సింక్ అయ్యేలా ఉంది. ఈ పాటలో రామ్ చరణ్ – కాజల్ కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని ఆశించవచ్చు.


4. పాట : ప్రతిచోట నాకే స్వాగతం
గాయకుడు : రంజిత్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ప్రతిచోట నాకే స్వాగతం అంటూ రజింత్ పాడిన ఈ పాట ఆల్బంలో నాల్గవ పాట. రామ్ చరణ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. యువన్ శంకర్ రాజా చాలా క్రియేటివ్ గా ఈ ట్యూన్ కంపోజ్ చేశారు. డిస్కో బీట్స్, కాంటెంపరరీ సంగీతంతో మిక్స్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం లనదన్ లో పెరిగిన ఓ కుర్రాడి పాత్రలోని మనోభావాలను ప్రతిబించేలా ఉంది. ఈ పాట వింటుంటే అభిమానులకు, శ్రోతలకు 80వ దశకంలో చిరంజీవి నటించిన హిట్ సినిమా పాటలు గుర్తొస్తాయి. ఈ పాటకి చరణ్ నుంచి సింప్లీ బట్ సూపర్బ్ స్టెప్స్ ఉంటాయని ఆశించవచ్చు.

5. పాట : బావగారి చూపే
గాయనీ గాయకులు : రంజిత్, విజయ్ యేసుదాసు, సుర్ముకి, శ్రీ వర్ధిని
సాహిత్యం : చంద్రబోస్
ఇక ఆల్బంలో ఐదవ పాట అయిన బావగారి చూపే సాంగ్ రొమాంటిక్ ఫీల్ తో సాగుతుంది. పాట మొదలవగానే వచ్చే లేడీ వాయిస్ అందరినీ ఆకట్టుకుంటుంది. లిరిక్స్, సింగర్స్ వాయిస్, ట్యూన్ ప్రతి అంశం శ్రోతలను మొదటిసారి పాట వినగానే ఆకట్టుకుంటాయి. యువన్ శంకర్ రాజా, కృష్ణవంశీ పాటలో సినిమా కథను అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించారు. యువన్ అందించిన ట్యూన్ లో పల్లెటూరి వాతావరణం ప్రతిభింబించింది. బావ – మరదళ్ళ మధ్య సాగే ఈ పాట చూడడానికి మరింత ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది.

6. పాట : కొక్కోడి
గాయనీ గాయకులు : కార్తీక్, హరి చరణ్, మనసి, రిట
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
డప్పు, గజల్స్, కీ బోర్డ్ సౌండ్స్ మిక్సింగ్ తో సాగే ఈ పాట సినిమాలో వచ్చే ఓ గ్రూప్ సాంగ్ గా ఉండే అవకాశం ఉంది. సాహిత్యం కాస్త మాస్ గా ఉండే ఈ పాటని లక్ష్మీ భూపాల్ పల్లెటూరి నేటివిటీకి తగ్గట్టు రాశారు. సినిమాలోని రెండు జంటల మధ్య సాగే పాటలో వాయిస్ లో మార్పుని చూపిస్తూ కార్తీక్, హరి చరణ్, మనసి, రిటల వాయిస్ ఈ పాటకి బాగా సెట్ అయ్యింది. ఈ పాటలో యువన్ శంకర్ రాజా వాడిన సన్నాయి వాయిద్యం సౌండ్ వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా అంతా పాటకి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ పాట విజువల్ గా మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.

తీర్పు :
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అచ్చ తెలుగు సాంప్రదాయాలతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం. కావున యువన్ శంకర్ రాజా కూడా కథానుగుణంగా, కృష్ణవంశీ చెప్పిన సందర్భాలకు సరిపోయే విధంగా పాటలని కంపోజ్ చేసాడు. చెప్పాలంటే ఇలాంటి తరహా పాటలు చేయడం యువన్ కి ఇదే మొదటిసారని కూడా చెప్పవచ్చు. అయినప్పటికీ తను మెలోడియస్ గా కంపోజ్ చేసి తన పాటలతో ఆకట్టుకున్నాడు. నా పరంగా గులాబీ కళ్ళు రెండు, బావగారి చూపే, నీలిరంగు చీరలోన మరియు ప్రతిచోట నాకే స్వాగతం బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. కృష్ణవంశీ ఇలాంటి పాటలని తీయడంలో తన కంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఈ పాటలు వినేటప్పటి కంటే స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు
« Last Edit: September 24, 2014, 10:41:24 PM by siva »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
పాట మొదలవగానే వచ్చే లేడీ వాయిస్ అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలో సినిమా కథను అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించారు. ట్యూన్ లో పల్లెటూరి వాతావరణం ప్రతిభింబించింది. బావ – మరదళ్ళ మధ్య సాగే ఈ పాట చూడడానికి మరింత ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది.

చిన్నారికి ఓణీలిచ్చెయ్
వయ్యారిపై బాణాలేసేయ్
చిన్నారికి ఓణీలిచ్చె
వయ్యారిపై బాణాలేసే
శుభకార్యం జరుపుటకై
వచ్చాడు వచ్చాడు
బంగారి బావ బంగారి బావ బంగారి బావా

బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే హే పువ్వుల చినుకులే హే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే హే పువ్వుల చినుకులే హే

హొ హొ హొ హొ హొ
లంగా తోటి ఓణీకుంది ఓ బంధం
ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం
పాదాలకి అందెలకుంది ఓ బంధం
ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం
వాలు జడ జాజులు ఓ జంట
వడ్డాణము నడుము ఓ జంట
ఇక నీతో నేనవుతా జంటా
చేతులకి జంటే గోరింట లేకపోతె కళే లేదంట
నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై
బంగరు చినుకులే హే బంగరు చినుకులే హే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే

నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది
అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది
ఏయ్ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది
ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది
కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే
ఈ కోవెల్లో భక్తుడు నేనే
అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే
ఈ ఇంట్లో మనవడినై
ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై
ప్రేమల చినుకులే హే ప్రేమల చినుకులే హే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే హే పువ్వుల చినుకులే హే

source: pawanfans.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే ఓ ఓ
జిలేబి ఒళ్ళూ చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నవే ఓ ఓ
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావే రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటఏ
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే
పిల్లా పిల్లా ఓ ఓ

నాతోటి నీకింత తగువెందుకే
నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకెంత పొగరెందుకే
పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా
ఆపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి
నా గుండెల్లో ఉప్పొంగి
ఉడికేంత ముద్దియ్యవే మరి మనోహరి
నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే

ఏం మధువు దాగుందో ఈ మగువలో
చూస్తేనే కిక్కెక్కెలా
ఆ షేక్స్‌పియర్ అయినా నిను చూసెనో
ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే పరదేశి నేననా
నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి
న్యూక్లియర్ రియాక్టరై నా అణువణువు అణుబాంబు
ముద్దుల్తొ ముంచెయ్యవే

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే ఓ ఓ
జిలేబి ఒళ్ళూ చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నవే ఓ ఓ
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే
పిల్లా పిల్లా ఓ ఓ

source: pawanfans.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
కో కో కోడి మందెక్కేసి రంగేసిందబ్బా
అరె పిల్లని చూసి పిచ్చెక్కేసి తొడగొట్టిందబ్బా
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా
యబ్బా యబ్బా గిలిగిలి యబ్బా గొడవెట్టిందబ్బా
అడియబ్బా యబ్బా ఊపిరి డబ్బా ఉడికెత్తిందబ్బా
అడియబ్బా యబ్బా రైకల జబ్బ చిటికేసిందబ్బా
అడియబ్బా యబ్బా సుక్కల జుబ్బ సురుకెత్తిందబ్బా
లండనే వదిలొచ్చానే పండగే చేయిస్తానే ఉండవే గుండెలోన బావ మరదలిగా
మనసుపడి పడి చచ్చానే కులుకుతూ గల గల గబ గబ చక చక పరుగున సరసకు రా

అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా హొయి

పిల్లోడనీ చనువిస్తే గిల్లేస్తడే చంటోడు సయ్యాటకే రమ్మంటడే రాకాసోడే
కారంగా ముద్దిచ్చుకో గారంగా హగ్గిచ్చుకో గుత్తంగా సోకిచ్చుకో అల్లేసుకో
వలలేస్తాడే తుంటరి కలలోకొస్తాడే బులపాటాల

బంగారి కల నిజమే చేసి మొగుడైపోతా
సూపర్ బాబా అంతేరబ్బాయ్ హాయ్ హాయ్ రబ్బా హాయ్ హాయ్

పగలంతా పొగలొచ్చే నిదరోయినా సెగలొచ్చే ఎటు చూసినా ఎదురొచ్చే నీ అందమే
అందాలకే తోడొస్తే అచ్చంగా వచ్చేస్తలే కడదాకా ఉంటాను నీ కౌగిల్లలో
నువ్వు అవునంటే ఇప్పుడే ఎత్తుకుపోతానే

అనుకోలేదే ఎప్పుడు నాకిష్టుడు కృష్ణుడిలా వస్తాడని
టచ్ చేసావే గిచ్చేసావే వచ్చేసాం మేమే

అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా
అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా
అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ
అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా

source: pawanfans.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
యో ప్రతి చోట నాకే స్వాగతం
అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం
సంతోషం నా చుట్టు ఉండే లోకం
చిరునవ్వే నేచేసే సంతకం
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
దూకే సుడిగాలిని హగ్ చేస్తా గుండెతో
కలిపేస్తా శ్వాసలో వంద యేళ్ళ బంధంలా
కురిసే వడగళ్ళని కరిగిస్తా ప్రేమతో
జారే జడివానలో జల్సా చెయ్యంగా
హె హె ప్రతి చోట నాకే స్వాగతం
అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం
సంతోషం నా చుట్టు ఉండే లోకం
చిరునవ్వే నేచేసే సంతకం

ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి తోడుగా కోరుకో
సంతోషాన్ని కూడ
ఏమి లేనోడు మస్తీలేనోడే
అన్నీ ఉన్నోడు హ్యాపీగున్నోడే
సాగే సమయాన్ని సరదాతొ నింపాలిగా
సంకెళ్ళే లేని సందళ్ళుగా నేడే
హొ హె హొ హె హొ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ

డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
రి రి రి రిథం రి రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
రి రి రి రిథం రి రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథం
రి రి రి రిథం రి రి రి రిథం

నేననే మాటను నా అనే వాళ్లుగా
మార్చితే ఏర్పడే బంధమే కుటుంబం
నాలుగ్గోడల్నే ఇల్లనుకోలేము
నాలుగు మనసుల్ని ఒక్కటి చేద్దాము
బుజ్జి భూగోళం పువ్వల్లే నవ్వాలంటే
ప్రతి ఇంటింట పండాలిగా శాంతి
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ
డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథం నౌ హొ

source: pawanfans.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
రా రాకుమారా రాజసాన ఏలరా
ఎదపై చేరనీరా పూలమాలే నేనుగా
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా

నీ తలపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణము ఇష్టమే
కలలే నిజమయేలా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కలయేలాఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం

రా రా రాకుమారా రాజసాన ఏలరా
ఎదపై చేరనీరా పూలమాలే నేనుగా

బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరో వరం ఏదైన గానీ

source: pawanfans.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
నీలి రంగు చీరలోన
సందమామ నీవె జాణ
ఎట్ట నిన్ను అందుకోనే
ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే హేహే
ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే
మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణా
ఈ భూమి పైన నీ మాయలోన
పడనోడు ఎవడె జాణా
జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా

రాక రాక నీకై వచ్చి
పొన్నమట్టి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
పూవు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదే కష్టమనుకో
ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని
వెయిరా అడుగెయిరా వెయి
జాణ కాని జాణరా
జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా
ఆడుకుంటే పూబంతి రా

సాహసాల పొలమే దున్ని
పంట తీసే బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా
బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవే ఆయుధమైతే
ప్రతి పూట విజయదశమియే వస్తుంది రా
నీపై విధి విసిరె నిప్పుతో
ఆడుకుంటె దీపావళి
చెయిరా ప్రతి ఘడియ పండగే
చెయిరా చెయిరా చెయి
జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా

source: pawanfans.com

 

Related Topics