Author Topic: Loukyam movie web reviews  (Read 630 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Loukyam movie web reviews
« on: September 26, 2014, 02:57:57 PM »
సమీక్ష : లౌక్యం – టైంపాస్ కామెడీ ఎంటర్టైనర్.!


విడుదల తేదీ :26 సెప్టెంబర్ 2014

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : శ్రీవాస్
నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్..
‘లక్ష్యం’ లాంటి సూపర్ హిట్ మూవీ అందించిన కాంబినేషన్ లో మాచో హీరో గోపీచంద్ మరోసారి శ్రీ వాస్ తో కలిసి చేసిన సినిమా ‘లౌక్యం’. గోపీచంద్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీధర్ సీపాన కథ – మాటలు అందించాడు. యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ మిక్స్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సాహసం’ సినిమా తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం గోపీచంద్ చేసిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ ‘లౌక్యం’ గోపీచంద్ కి కమర్షియల్ హిట్ ఇచ్చిందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :
వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ (గోపీచంద్) తన ఫ్రెండ్ ప్రేమ కోసం వరంగల్ లో దాదా అయిన బాబ్జీ(సంపత్) చెల్లెల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తాడు. దాంతో బాబ్జీ నుంచి తప్పించుకోవడానికి వెంకీ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ చంద్రకళ (రకుల్ ప్రీత్ సింగ్) ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకీ చంద్రకళ కూడా వెంకీ ని ప్రేమిస్తుంది.

కట్ చేస్తే సిటీలో డాన్ అయిన సత్య (రాహుల్ దేవ్) చెల్లెలే చంద్రకళ. వెంకీ – చంద్రకళల ప్రేమ గురించి తెలుసుకున్న సత్య వెంకీని చంపేయమంటాడు. అదే సమయంలో కేశవ్ రెడ్డి (ముఖేష్ ఋషి) చంద్రకళని చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు కేశవ్ రెడ్డి ఎవరు? చంద్రకళని ఎందుకు చంపాలనుకున్నాడు? బాబ్జీకి సత్య కి ఏమన్నా సంబంధం ఉందా? వీరందరి నుంచి వెంకీ ఎలా తప్పించుకొని చంద్రకళని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనేది తెరపైనే చూడాలి….

ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్ చాలా రోజుల తర్వాత మరోసారి పక్కింటి కుర్రాడిలా, జోష్ ఉన్న పాత్రలో కనిపించాడు. ‘రణం’ సినిమా తర్వాత కామెడీ, యాక్షన్ కలిపి చేసిన పాత్ర ఇది. రణం లోలానే గోపీచంద్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాత్రని చేసాడు. తనే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలబడి కథని ముందుకు నడిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేసాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన గత సినిమా కంటే రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ సినిమాలో బాగా చూపించారు. అలాగే సినిమా మొదటి నుంచి మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తూ తన గ్లామరస్ డోస్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించింది. గోపీచంద్ – రాకుల్ ప్రీత్ కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి ముఖ్యమైన మరో మూడు మెయిన్ పిల్లర్స్ గురించి.. వాళ్ళే సిప్పీగా కనిపించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం, బాయిలింగ్ స్టార్ బబ్లూగా కనిపించిన పృధ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ), చంద్రమోహన్. బాయిలింగ్ స్టార్ గా పృథ్వి వచ్చే నాలుగైదు సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. చెప్పాలంటే సినిమా స్లో అవుతున్న టైంలో తన ఎపిసోడ్స్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. బ్రహ్మానందం చేత చెప్పించిన సూపర్ హిట్ మూవీస్ లో బాగా ఫేమస్ అయిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. అలాగే చంద్రమోహన్ తన తింగరి చేష్టలతో కొంతవరకూ నవ్వించాడు. సెకండాఫ్ లో గోపీచంద్ – బ్రహ్మానందం – చంద్ర మోహన్ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి.
ఇక ఈ సినిమాలో ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ హంసా నందిని.. తను కేవలం ఒక పాటకి మాత్రమే పరిమితం కాకుండా కొన్ని సీన్స్ లో కూడా కనిపించి గ్లామర్ తో ఆకట్టుకుంది. సంపత్, రాహుల్ దేవ్, ముఖేష్ రుషి, రఘుబాబు తదితరులు తమ పాత్రలకి న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ మరియు ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సినిమాకి చాలా హెల్ప్ అవుతాయి. ఉదాహరణకి చాలా స్లోగా ఉన్న క్లైమాక్స్ లో వచ్చే లెజెండ్ ఎపిసోడ్.

మైనస్ పాయింట్స్ :
ప్రతిసారి ఇలాంటి సినిమాలకు మేము కామన్ గా చెబుతున్న మరియు మీరు రెగ్యులర్ గా చదువుతున్న మైనస్ పాయింట్లే ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే రచయితలు – దర్శకులు ఒకే పాయింట్ ని తిప్పి తిప్పి సినిమాలు తీయడం వలన.. ఇక మైనస్ పాయింట్స్ లోకి వెళితే.. కథ యాజిటీజ్ గా ఉంది.. దేనికి యాజిటీజ్ అంటే
డీ, రెడీ, కందిరీగ, దూకుడు, రభస, ఆగడు ఇప్పుడు లౌక్యం.. కథల్లో బ్యాక్ డ్రాప్ లు మారిన కథలో మాత్రం పెద్ద తేడా ఉండదు. కావున ఈపాటికే మీకు కథ ఎలా ఉంటది అనేది క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

ఇక రెండవ మేజర్ మైనస్ స్క్రీన్ ప్లే.. ఇది కూడా యాజిటీజ్ గానే ఉంటుంది. ఏ మాత్రం మార్పు ఉండదు. స్క్రీన్ ప్లే పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగించకపోతే ఆ సినిమా స్క్రీన్ ప్లే ఫెయిల్ అయినట్టే.. సేమ్ టు సేమ్ అదే జరిగింది.. ప్రతి ట్విస్ట్ ఆడియన్స్ ఊహించేయవచ్చు. అలాగే సినిమాలో చాలా బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా చోట్ల సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే పాటలు కూడా సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి. పాటల ఆర్డర్ మార్చి ఉండాలి అలాగే పాటలు సందర్భానుసారంగా వచ్చి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో సత్యం రాజేష్ ని సరిగా వినియోగించుకొని ఉంటే కామెడీ పండేది. ఇక లాజికల్ గా చాలానే మిస్టేక్స్ ఉంటాయి.

సాంకేతిక విభాగం :
ప్రతి సినిమాకి కథే హీరో అంటారు కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతా… శ్రీధర్ సీపాన అందించిన కథ పైన చెప్పినట్టు పలు హిట్ సినిమాల కథలానే యాజిటీజ్ గా ఉంది. సో ఈయన కథ కోసం ఇసుమంతైనా కష్టపడలేదు. ఇలాంటి యంగ్ రైటర్స్ కూడా కొత్తగా ఆలోచించకుండా ఇలాంటి పరమ రొటీన్ కథలపై దృష్టి పెట్టడం, స్టార్ హీరోకి కథ ఇస్తూ కూడా స్పూఫ్ కామెడీలను నమ్ముకోవడం బాధాకరమైన విషయం. ఈ మూవీకి డైలాగ్స్ రాసింది కూడా శ్రీధర్ సీపాన. పంచ్ డైలాగ్స్ ఎక్కువగా రాసారు కానీ అందులో ఒక 60-70% పేలాయనే చెప్పాలి. అందుకే కొన్ని పార్ట్స్ లో కామెడీ వర్కౌట్ అయ్యింది. ఇక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన శ్రీవాస్ సినిమా విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆయన రాయించుకుంది రొటీన్ కాన్సెప్ట్ కావడంతో సినిమాని ఆసక్తికరంగా తీయలేకపోయారు. చాలా చోట్ల స్పెషల్ కేర్ తీసుకొని ఉండాల్సింది. ఫైనల్ గా తన గత సినిమాలనే అవుట్ పుట్ ని అందించాడు.

కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి స్క్రీన్ ప్లే రాసారు.. వారిద్దరే ఇప్పటికి చాలా సినిమాలకు ఇలాంటి కథ – స్క్రీన్ ప్లే రాసారు. సో వాళ్ళు అదే పాత సినిమాల స్క్రీన్ ప్లే దీనికి ఇచ్చారు. దాంతో సినిమా ఊహాజనితంగా మారింది. వెట్రి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తను మాత్రం తనకిచ్చిన లోకేషన్స్ మరియు నటీనటుల్ని గ్రాండ్ అండ్ కలర్ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ పాటలు ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజ్ గానే ఉంది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ డైరెక్టర్ తో ఇంకాస్త ఫైట్ చేసి లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా చోట్ల బోరింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. కనల్ కన్నణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసుకోవాల్సింది.

తీర్పు :
గోపీచంద్ ‘సాహసం’ తర్వాత సంవత్సరంకి పైగా తీసుకొని చేసిన రెగ్యులర్ అండ్ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ‘లౌక్యం’ ప్రేక్షకులను నవ్వించడంలో బాగా సక్సెస్ అయ్యింది. రొటీన్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయినప్పటికీ చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేయవచ్చు. గోపీచంద్ ఎనర్జీ పెర్ఫార్మన్స్, పృథ్వి – బ్రహ్మానందం – చంద్రమోహన్ కామెడీ మిమ్మల్ని నవ్విస్తే, రకుల్ ప్రీత్ సింగ్ – హంసానందినిల గ్లామర్ సినిమాకున్న స్పెషల్ అట్రాక్షన్.. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా నచ్చదు, రెగ్యులర్ గా నవ్వించే నాలుగు కామెడీ బీట్స్, నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు ఉంటే చాలు అనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు వేరే ఏమీ లేనందు వల్ల ఈ సినిమా బాగానే ఆడే ఆవకాశం ఉంది. పర్ఫెక్ట్ గా సినిమాని ప్రమోట్ చేసుకుంటే గోపీచంద్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా నిలిచే అవకాశం ఉంది.
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Loukyam movie web reviews
« Reply #1 on: September 26, 2014, 03:03:39 PM »
Behind the Movie Loukyam: Struggling hero Gopichand, ravishing beauty Rakul Preet together in for director Sriwass makes this film something special. Presence of Kona and Gopi is the best advantage to guarantee humor. Let us get into the review.

In the Movie Loukyam: Babji (Sampath Raj) and Sathya (Rahul Bose) are goon brothers ruling Warangal and Hyderabad respectively. They have two sisters Bujji (Annapurna) and Chandra Kala (Rakul Preet Singh). Story begins with Bujji running away from marriage to elope with boy friend with the help of Venky (Gopichand). Story shifts from Warangal to Hyderabad where Venky falls in love with Chandra Kala while men of Babji search for the same Venky. However they house arrest cab driver Sippy (Brahmi) and Venky’s father Meka Papa Rao aka Puppy (Chandramohan) to know the whereabouts of Venky. On the other side, Babji’s rival Kesava Reddy (Mukesh Rishi) is burning with revenge. How Venky used his diplomatic intelligence to solve the entire puzzle and win his love forms the rest…

Values of the Movie Loukyam: Like any other formula film hitting the screens in last few years, ‘Loukyam’ is also a complete and regular formula flick with zero innovative factors. Director Sriwass blindly followed the customary screenplay of Kona and Gopi while story, dialogues of Sreedhar Seepana oozed oodles of humor. Basically, they did not try anything out of the box and just struck to the old pickled treatment of cooking a commercial potboiler. However, dialogues played crucial part in playing the game to advantage. Sreedhar Seepana should be appreciated for such good work in second half. Camera work of Vetri is just mediocre and SR Shekkhar’s editing did not have the same sharpness of his earlier films. Anup Rubens music is a better score while BGM has come satisfactory. Production values of Bhavya Creations is just average.

On performance front, Gopichand looked refreshing with energy flown freely throughout. His chemistry with Brahmi and other members of comedy team is noteworthy. Styling and glow on face of Gopi is back. Rakul Preet Singh is a fresh mint with newfangled glamour. She had wonderfully shared the screen with Gopi. Then, it is Brahmanandam got a full length role and has done the justice to perfection. Chandra Mohan as Puppy and 30 Years Pridhvi are the new find outs to spill the comedy from now on. In second half, it’s these three members stole the show. Sampat Raj, Rahul Bose and Mukesh Rishi’s villainy lacked the cruelty. They were made into unimportant buffoons during the proceeding of story. Hamsa Nandini is hot in a song. Raghu Babu, Raghu, Bharath, Posani, Pragathi etc did their portions.

Out of the Movie Loukyam: Keeping it in one line, Gopichand can finally have a smile on face. Out from his too much of experimentation zone, ‘Loukyam’ comes as a safe guaranteed success for him. Although, the treatment and screenplay is regular, applying this kind of a project for Gopi is something new. He should be thankful to the team of Sriwass for offering a real break. If first half is meant to just introduce the characters with good doses of fun and functionality, second half goes with non-stop hilarity. Never to miss, Kona and Gopi take cinematic liberties at their will and wish to create the confusion comedy with a predictable screenplay. Sometimes they missed the target but this time, everything fell in place.

For clever audience, this may is a hard pill to swallow while for entertainment lovers who just watch the film for time pass, ‘Loukyam’ offered enough of it. Commercially, ‘Loukyam’ could be a safe venture for everyone associated. Most importantly, Gopichand is back into hit race.

Cinejosh Verdict of Loukyam: Nothing New - Yet You Enjoy.

Cinejosh Rating: 3/5

charan fan

 • Guest
Loukyam movie web reviews
« Reply #2 on: September 26, 2014, 03:19:41 PM »
3.5 u funny website

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,217
 • DIE HARD FAN OF POWERSTAR
Loukyam movie web reviews
« Reply #3 on: September 26, 2014, 03:24:21 PM »
Seems one more shock to Aagadu team.

Loukyam also getting good reviews. Hope it will be one more decent hit for Gopi Chand...

Good Luck to Loukyam team.........

Offline sridhergurram

 • Jr. Member
 • **
 • Posts: 326
Loukyam movie web reviews
« Reply #4 on: September 26, 2014, 09:17:02 PM »
Movie is good, Brahmi Rocks.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Loukyam movie web reviews
« Reply #5 on: September 26, 2014, 11:11:43 PM »
సౌఖ్యం లేదు... ( 'లౌక్యం' రివ్యూ)

హిట్ కొట్టాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ లా మరి నడుస్తున్న కామెడీనే సౌఖ్యం అనేదాన్ని బాగా నమ్మినట్లున్నారు లౌక్యం టీమ్. అయితే ఎంత కామెడీలో అయినా కూసింత కథ, కాస్త కొత్త మలుపులు ఉండేలా దర్శక,రచయితలు లౌక్యం ప్రదర్శించి ఉంటే బాగుండేది. అయితే బ్రహ్మానందం ఉన్నాడు కదా ఆయన లాగేస్తాడులే... అని బ్రహ్మానందం మీదే భారం పెట్టి, ఆయన్ను అడ్డం పెట్టుకుని ఒడ్డెక్కాలనే ప్రయత్నం చేసారు. రవితేజను గుర్తు చేసేలా హీరో నటన, శ్రీను వైట్ల స్క్రీన్ ప్లేని దగ్గర పెట్టుకుని చేసినట్లున్న కథనం... ఈ సినిమా చూస్తుంటే గతంలో వచ్చిన ఐదారు సినిమాలు ఒకేసారి చూసిన ఫీల్ కలగచేసింది. అయితే గోపీంచంద్ తో సమానంగా బ్రహ్మానందం సీన్లు రాసుకుని కామెడీతో కథను కదం తొక్కించే ప్రయత్నం చేసారు. కానీ ప్రెడిక్టుబుల్ గా నడిచే కథనం, క్లైమాక్స్ అంత ఆసక్తిని కలిగించవు. వరంగల్ లో ఉండే వెంకీ అలియాస్ వెంకటేశ్వరులు(గోపిచంద్) లోకల్ గూండా బాబ్జీ(సంపత్) చెల్లెలుని తన స్నేహితుడు ప్రేమిస్తే కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేస్తాడు. దాంతో అచ్చ తెలుగు విలన్ లాంటి బాబ్జీ...వెంకీని వెతుకుతూంటే...తప్పించుకోవటానికి హైదరాబాద్ వస్తాడు. అక్కడ వెంకీ ఓ రోజు చంద్రకళ(రాకుల్ ప్రీతి సింగ్) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమెను ఇంప్రెస్ చేయటానికి రకరకాల విన్యాసాలు చేసి మెప్పిస్తాడు....పనిలో పనిగా డ్యూయిట్స్ వేసుకుంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ వెంకీ ని పూర్తిగా ఇరుకున పడేస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటీ అంటే చంద్రకళ మరెవరో కాదు... బాబ్జీ రెండో చెల్లెలు. అక్కడ నుంచి వెంకీ లవ్ స్టోరీ ఏ మలుపు తీసుకుంది...చివరకు ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అల్లు అర్జున్ పరుగు చిత్రం ను గుర్తు చేసే ఈ చిత్రం ట్విస్ట్ కి కామెడీతో డీల్ చేయాలనే ఆలోచన బాగానే ఉన్నప్పుటికీ ట్విస్ట్ ఊహించగలిగేలా మారి ఇంటర్వెల్ బ్యాంగ్ ఎఫెక్టివ్ గా లేదు. అలాగే సెకండాఫ్ పరమ రొటీన్ గా ఉండటం జరిగింది. బ్రహ్మానందం పాత్ర సిప్పీగా నవ్వించినా...అదీ ఇంతకుముందు చూసిన సిట్యువేషన్స్ నుంచి రావటం జరిగింది. ఇక రచయితలు కొత్తగా ఫీలైంది...కేవలం ప్రతీసారి విలన్ ఇంట్లో హీరో వెళ్లటం జరుగుతోంది...ఈ సారి హీరో ఇంట్లో విలన్ రావటం పెట్టారు. అదొక్కడే మిగతా శ్రీను వైట్ల సినిమాలకు దీనికీ తేడా. అంతే. అప్పటికి రచయితలు కోన, గోపీ మోహన్ ఉన్నంతలో బాగానే నవ్వించారనే చెప్పాలి. అలాగే అంత రొటీన్ క్లైమాక్స్ లోనూ బాయిలింగ్ స్టార్ బబ్లూ అంటూ పృద్వీ చేసిన కామెడీ బాగా వర్కువుట్ అయ్యింది. థియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏం చూసాము అంటే చెప్పలేం కానీ.. ఉన్నంత సేపూ నవ్వుకున్నాం అని చెప్పగలుగుతారు.

2/5 - thatstelugu rating

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Loukyam movie web reviews
« Reply #6 on: September 26, 2014, 11:12:56 PM »
చెలరేగిపోయాడు (‘ఆగడు’ రివ్యూ) [/size]"నన్ను మీరు ఆడియో పంక్షన్ లో హీరోయిన్ ని పొగిడినట్లు పొగడకండి"...ఇలాంటి ఖతర్నాక్ డైలాగులు ఎవరు సినిమాలో ఉంటాయి... ఖచ్చితంగా అది శ్రీను వైట్ల సినిమా అయ్యిండాలి అన్నంతగా తనదైన శైలిని తెలుగు తెరపై పరుస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన చిత్రం రాబోతోందంటే ఖచ్చితంగా అది నవ్వుల విందే అని ఫిక్స్ అయిపోతారు. అలాంటిది మహేష్ వంటి స్టార్ హీరోతో ఆయన కలిస్తే..అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి..ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకేనేమో...టైటిల్ కు తగ్గట్లే ఎక్కడా తన పంచ్ లను,కామెడీ ఎపిసోడ్స్ ని మిస్ అవకుండా కథ లేకపోయినా పరుగెత్తే కథనంతో తన దూకుడు మరోసారి చూపించాడు. మసాలా కామెడీ ఎంటర్టైనర్ ని అందించాడు. యీక్షన్ కామెడీ... ఇప్పటి టాలీవుడ్ భాక్సాఫీస్ గెలుపు సూత్రం అని నమ్మి స్టార్ హీరోలు వరసగా చేస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. కొద్దిగా రివేంజ్, బోల్డు కామెడీతో ఎప్పటిలాగే శ్రీను వైట్ల తనదైన శైలి పంచ్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లగేజీ తో దిగిపోయాడు. అతని కామెడీ టింజ్ కు సూపర్ స్టార్ సూపర్బ్ ఫెరఫార్మెన్స్ తోడయ్యి...థియోటర్లలను నవ్వులలో ముంచెత్తుతోంది. చూసేవారికి పెద్దగా శ్రమ లేకుండా ఓ హీరో, విలన్, చిన్న లవ్ స్టోరీ, మధ్యలో బుల్లి రివేంజ్, దానికి తగ్గ సెంటిమెంట్ పెట్టుకుని శ్రీను వైట్ల కామెడీకే పూర్తి స్ధానం ఇస్తూ చెలరేగిపోయాడు. అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత కామెడీని సెకండాఫ్ లో తీసుకురాకుండా కథలోకి వచ్చి...యాక్షన్, రివేంజ్ తో నడపాడు. ఇంటర్వెల్ సైతం ట్విస్ట్ లు ఏమీ పెట్టుకోకుండా...ప్లాట్ గా వేసాడు. అయితే ఒకటి మాత్రం నిజం...ఇలాంటి కథ మహేష్ బాబు కాకుండా మరొకరు అయితే ఎంత వరకూ మోయగలరనేది అనుమానమే. అటు బ్రహ్మానందం డాన్స్ ఎపిసోడ్స్, ఇటు శృతి హాసన్ హాట్ ఐటం సాంగ్, మధ్య మధ్యలో మహేష్ బాబు తన సినిమాల్లోంచే కథలు తీసుకుని ఎదుటివారికి చెప్తూ బోల్తా కొట్టించే తీరు ఈ సినిమాకు బోనస్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు(మీలో ఎవరు పోటుగాడు) టైప్ ఎపిసోడ్, ఆ తర్వాత వచ్చే మహేష్ ఫ్లూట్ డాన్స్ హైలెట్ గా నిలుస్తాయి. దూకుడు లోని హిట్ ఫార్ములాను దగ్గర పెట్టుకుని చేసినట్లున్న ఈ చిత్రం మహేష్ ఖాతాలో మరో మంచి హిట్ ని నమోదు చేస్తుందనటంలో సందేహం లేదు. అనాధ అయిన శంకర్(మహేష్) ని చేరదీస్తాడు పోలీస్ అధికారి రాజారావు(రాజేంద్రప్రసాద్) . కానీ అనుకోని పరిస్ధితుల్లో రాజరావు పొరపాటుపడి ఓ కేసులో శంకర్ బోస్టన్ స్కూల్ కి పంపుతాడు. శంకర్ అక్కడే పెరిగి పెద్దవాడయ్యి... ఎనకౌంటర్ శంకర్ గా బయిటకు వస్తాడు. డైరక్ట్ గా బుక్కపట్నం లో డ్యూటీకి దిగిపోతాడు. అక్కడ అరాచకాలు చేస్తున్న విలన్ దామోదర్ అలియాస్ దాము (సోనూసూద్) ని అడ్డుకోవటానికి పోలీస్ యూనిఫాం తో తన దైన శైలిలో చెలరేగిపోతాడు. అంతేకాకుండా దాము కట్టబోతున్న పవర్ ఫ్లాంట్ ప్రాజెక్టుని సైతం ఆపుచేయిస్తాడు. ఈ లోగా దాము గురించి మరో షాకింగ్ నిజం తెలుస్తుంది. అప్పుడు దాము సామ్రాజ్యాన్నీ పూర్తిగా కూలదోయటం మొదలెడతాడు. అసలు ఎనకౌంటర్ శంకర్ కి, దాము కి ఉన్న రిలేషన్ ఏమిటి..కథలో స్వీట్స్ సరోజ(తమన్నా) పాత్ర ఏమిటి...డిల్లీ సూరి (బ్రహ్మానందం) కథలోకి ఎంట్రీ ఇలా ఇచ్చి..ఏం చేస్తాడు...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణకు వస్తే... ఈ కథ కొత్తదీ కాదు...అలాగని కథనమూ అద్బుతంగా లేదు. చాలా రొటీన్ కథకు, చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అందించారు శ్రీను వైట్ల. అయితే అది మహేష్ సినిమా కావటం, కామెడీ పండటం తో ఆ సమస్య హైలెట్ కాలేదు. అలాగే... ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. ఒక్కసారి ట్విస్ట్ లు రివిల్ అయ్యాక...చాలా సాదాసీదా సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే సోనూసూద్ నెగిటివ్ క్యారెక్టర్ ని సైతం ఎలివేట్ చెయ్యకపోవటంతో కొన్ని చోట్ల సీన్స్ నడుస్తున్నాయి కానీ హీరో ప్యాసివ్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఇక తెలుగు సినిమాకు కీలకంగా నడిచే ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా సాదాగా, ఇంకా చెప్పాలంటే ప్లాట్ గా ఉన్నాయి. Rating: 2.5/5[/size][/font]

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Loukyam movie web reviews
« Reply #7 on: September 26, 2014, 11:13:22 PM »
Loukyam cinema Aagadu pai 100 times better annaru.

Offline Vishal Gadalay

 • Jr. Member
 • **
 • Posts: 268
Loukyam movie web reviews
« Reply #8 on: September 26, 2014, 11:29:49 PM »
vaityla gadiki correct ga icchara kona and gopi mohan....Power 1 week mundu.....Loukyam 1 week tarvtha..kavalsinde vediki...

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
80 Replies 6261 Views Last post April 13, 2013, 08:40:04 PM
by RamSharan
9 Replies 983 Views Last post November 21, 2013, 01:54:48 PM
by siva
21 Replies 1488 Views Last post January 10, 2014, 08:38:12 PM
by charan fan
4 Replies 461 Views Last post February 07, 2014, 03:29:29 PM
by siva
Loukyam

Started by pawanist « 1 2 » Telugu Cinema

20 Replies 1283 Views Last post November 17, 2014, 12:48:54 AM
by Pa1Kalyan