Author Topic: Andhrabhoomi paper review on GAV  (Read 715 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Andhrabhoomi paper review on GAV
« on: October 03, 2014, 07:11:51 PM »
అందరివాడేలే...!
** గోవిందుడు అందరివాడెలే ( ఫర్వాలేదు)

తారాగణం: రామ్‌చరణ్, కాజల్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, కమలినీముఖర్జీ,జయసుధ, కోట శ్రీనివాసరావు, వెనె్నల కిషోర్, రావు రమేష్ తదితరులు.సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: సమీర్‌రెడ్డిబ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్, నిర్మాత: బండ్ల గణేష్దర్శకత్వం: కృష్ణవంశీ

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు కృష్ణవంశీ తన మార్క్‌ను మరోసారి వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కమర్షియల్ చట్రంలో పాతుకుపోయన తెలుగు సినిమా కథను కొత్తదారిలో పరుగెత్తించాడు. గతంలో చూసిన కొన్ని చిత్రాల క్రీనీడలు అక్కడక్కడా పర్చుకున్నా, మొత్తంగా చూస్తే గోవిందుడు ఓ మంచి ప్రయత్నమే.


కమర్షియల్ సినిమాల్లో వరుసగా నటిస్తూ గుర్తింపుతెచ్చుకున్న రామ్‌చరణ్ తొలిసారిగా కుటుంబ కథా చిత్రంలో నటించడం విశేషం. మాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు తన నటనలో సరికొత్త కోణాన్ని చూపాడు. కుటుంబ కథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులనుంచి ఫర్వాలేదనిపించుకుంటోంది. శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, జయసుధ, కోట ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ప్రస్తుతం కుటుంబ విలువలు తగ్గిపోతున్న నేపథ్యంలో బంధాలు, అనుబంధాల గురించి చూపే ప్రయత్నం చేశారు.కథాపరంగా లండన్‌లో పుట్టి పెరిగిన భారతీయ యువకుడు అభిరామ్ (రామ్‌చరణ్) మన పని మనమే చేసుకోవాలి. మన కుటుంబాన్ని మనమే కలుపుకుపోవాలి అనే సిద్ధాంతాల్ని నమ్మిన యువకుడు. లండన్‌లో పెరిగినా, భారతీయ సాంప్రదాయాలంటే చాలా ఇష్టమున్న యువకుడు. తన తండ్రి చంద్రశేఖర్ (రెహమాన్) ద్వారా ఇండియాలో ఉన్న తన కుటుంబం గురించి తెలుసుకొని, వారిని కలవడానికి ఇండియాకు వస్తాడు. ఆ గ్రామంలో అందరి బాగోగులు చూసుకునే బాలరాజు (ప్రకాష్‌రాజ్) కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. అలా ఆ ఇంట్లో వారందరినీ కలుపుకొని ఆ కుటుంబానికి తన తండ్రిని ఎలా దగ్గర చేశాడు? తనే ఆ ఇంటి వారసుడనని, బాలరాజుకు ఎలా చెప్పాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తెలుగువారి కుటుంబాల్లో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో యాంత్రిక జీవితం గడుపుతున్న వారిలో బాంధవ్యాల విలువను తెలుపుతూ ఇలాంటి ఓ అచ్చతెలుగు చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్నది చిత్ర దర్శకుడి సంకల్పం. తనకున్న మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే చిత్రంలో నటించిన రామ్‌చరణ్ సాహసమే చేశాడు. సినిమా చివర్లో వచ్చే సన్నివేశాల్లో రామ్‌చరణ్ పరిణితిగల నటన ఆకట్టుకుంటుంది. ఫ్రెష్‌లుక్‌తోపాటు తనదైన మేనరిజమ్‌తో కనిపించాడు. కాజల్ అగర్వాల్ గతంలో కన్నా కొత్తగా కనిపించే ప్రయత్నం చేసింది. అచ్చతెలుగు ఆడపడుచులా కనువిందు చేసింది. తెలుగు కుటుంబాల్లో ప్రేయసీ ప్రియుల ప్రేమ భాష్యాలు చిత్రంలో చూపినట్లుగా ఆకట్టుకుంటాయ.

తాత పాత్రలో ప్రకాష్‌రాజ్ ఒదిగిపోయాడు. సినిమానంతా తన భుజాలమీద వేసుకొని నడిపించాడు. అతడి గెటప్‌తోపాటు నటన కూడా సరికొత్తగా ఉండేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. నానమ్మగా జయసుధ ఉన్నంతలో బాగానే చేసింది. శ్రీకాంత్ పాత్ర హాస్యనటుడికి జిరాక్స్‌లా మారింది. ఆయన పాత్రకు విలువే లేనట్లు చేశారు. బంగారి అల్లరివాడుగా ఎందుకు మారాడు? అన్నదానికి జవాబులేదు. కమలినీముఖర్జీ, రెహమాన్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్‌ల నటన ఓకే.


సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపే ప్రయత్నం చేసింది. అలాగే కళా దర్శకుడి ప్రతిభ సెట్లల్లో కనిపించింది. యువన్‌శంకర్‌రాజా అందించిన బాణీలు సినిమాకు ప్లస్. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. కృష్ణవంశీ మళ్లీ తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నం చేశాడు. కుటుంబ విలువల్ని, అనుబంధాల్ని చూపించడంలో ఆయన శైలి కనిపించింది. కుటుంబ కథాంశాలతో మానవీయ కోణాల్లో సినిమాలు తీసి, ప్రేక్షకులనుంచి మంచి స్పందనకోసం దర్శకుడు ప్రయత్నించాడు.

 అక్కడక్కడ చిన్నచిన్న లోపాలు ఉండి, మొదటి భాగంలో కాస్త వేగం తగ్గినట్టు కనిపించింది. కామెడీ లేకపోవడం ఇలాంటి చిత్రానికి మైనస్సే. కోట శ్రీనివాసరావు, రావు రమేష్‌ల విలనిజమ్ రెండో భాగంలో మధ్యలోనే వదిలేశారు. క్లైమాక్స్‌లో కూడా ఆ పాత్రల్ని చూపించలేదు. మానవ సంబంధాల నేపథ్యంలో సరికొత్త కథనాలు రూపొందించుకోవడంలో తప్పులేకపోయనా, నేలవిడిచి సాము చేసే పాత్రల పరిధి లేకపోవడం ఈ చిత్రంలో పెద్ద రిలీఫ్.


టాలీవుడ్‌లో ఇప్పుడు వస్తున్న ద్వంద్వార్థాల మాటలు, చీప్ కామెడీ, ఐటమ్‌సాంగ్ తరహా పాటలు లేకపోవడం ఈ చిత్రానికి హుందాతనాన్ని ఇచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చిన కుటుంబ ప్రాధాన్యత చిత్రాలలో గోవిందుడు ఉన్నంతలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Andhrabhoomi paper review on GAV
« Reply #1 on: October 03, 2014, 07:14:15 PM »
Manaku full anti site ee maatram review ichindante great

Offline yugandhar

 • Power Member
 • ******
 • Posts: 5,264
Andhrabhoomi paper review on GAV
« Reply #2 on: October 03, 2014, 10:59:59 PM »
elanti paper undi ani naku idea ledu

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,169
 • DIE HARD FAN OF POWERSTAR
Andhrabhoomi paper review on GAV
« Reply #3 on: October 04, 2014, 07:30:26 AM »
I guess it is telugu version of Deccon Chronicle....

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Andhrabhoomi paper review on GAV
« Reply #4 on: October 04, 2014, 04:30:12 PM »
Andhrabhoomi paper is one of the old paper. Andulo Vennala anedi chaala click ainadi. Andhrabhoomi paper sales okka friday roje peaks vuntaayi because of Vennela. Ippatiki konni areas lo ee paper baagane potundi. But Friday maatram daani sales baaguntaayi.

More over adi pakka mega vyatireka paper. Yes it belongs to Deccan Chronicle.

Offline pawanist

 • Pawan Kalyan Follower...Ram Charan Fan
 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 16,524
 • ĸonιdala ғan
  • chiranjeeviblog
Andhrabhoomi paper review on GAV
« Reply #5 on: October 05, 2014, 12:20:51 AM »
charan gurinchi emanadu last lo oka muka lo em telchalo ..telugu vachinavalu chepagalaru thanks

Offline NewEin

 • Newbie
 • *
 • Posts: 37
 • A die hard Charan fan...
Andhrabhoomi paper review on GAV
« Reply #6 on: October 05, 2014, 10:07:21 AM »
charan gurinchi emanadu last lo oka muka lo em telchalo ..telugu vachinavalu chepagalaru thanks
tanakunna mass image ni pakkana petti kutumba viluvalaku pradhanya miche chitram lo natinchina ramcharan sahasame chesadu. chitram chivarlo vache sannivesallo ramcharan parniti gala natana akattukuntundi. fresh look to patu tanadaina manarisms to akattukunnadu.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Andhrabhoomi paper review on GAV
« Reply #7 on: October 05, 2014, 03:55:54 PM »
charan gurinchi emanadu last lo oka muka lo em telchalo ..telugu vachinavalu chepagalaru thanks
tanakunna mass image ni pakkana petti kutumba viluvalaku pradhanya miche chitram lo natinchina ramcharan sahasame chesadu. chitram chivarlo vache sannivesallo ramcharan parniti gala natana akattukuntundi. fresh look to patu tanadaina manarisms to akattukunnadu.
Idi starting lo vundi
commercial cinemallo varusaagaa natistu gurtimpu techukunna Ram Charan tholosaari gaa kutumba katha chitram lo natinchadam vishesham. Mass image ni pakkana petti family entertainer tho prekshakulaku thana natanalo sarikotta konanni choopaadu.

Offline pawanist

 • Pawan Kalyan Follower...Ram Charan Fan
 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 16,524
 • ĸonιdala ғan
  • chiranjeeviblog
Andhrabhoomi paper review on GAV
« Reply #8 on: October 05, 2014, 07:47:08 PM »
oh ithe okay

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
6 Replies 846 Views Last post October 30, 2012, 05:58:49 PM
by yugandhar
11 Replies 1195 Views Last post January 19, 2013, 03:38:17 PM
by Nayak
4 Replies 575 Views Last post February 06, 2013, 08:40:03 PM
by haribabu015
3 Replies 487 Views Last post January 03, 2014, 04:14:40 PM
by charan fan
2 Replies 376 Views Last post October 02, 2014, 09:07:14 AM
by dushyanth