Author Topic: రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో హుడ్ హుడ్ సహయనిధికి పవన్ కళ్యాణ్ చెక్  (Read 524 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో హుడ్ హుడ్ సహయనిధికి తన విరాళాన్ని పవన్ కళ్యాణ్ చెక్ రూపంలో అందచేశారు.


Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,678
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు: చంద్రబాబు

విశాఖపట్నం : బాధితులను ఆదుకోవడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుపాను బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్ ను బాబు ఈ సందర్భంగా అభినందించారు. గురువారం విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తో కలసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. తుపాన్ బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. హుదూద్ తుపానుకు ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నాని తెలిపారు. టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు సాయం అందించడానికి ముందుకు రావడం పట్ల బాబు హర్షం వ్యక్తం చేశారు. ఖర్చు ఎంతైనా పరవాలేదు... ప్రజల బాధలు తీరాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. బంగాళదుంపల కోసం బెంగాల్ సీఎంతో మూడుసార్లు మాట్లాడినట్లు చంద్రబాబు వివరించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 250 లోడుల బంగాళదుంపలు విశాఖ నగరానికి చేరుకోనున్నాయని తెలిపారు. నేటి నుంచి తుపాను సహాయ కార్యక్రమాలు అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత తీరిందన్నారు. విశాఖ ప్రజలలో ఆత్మస్థైర్యం కలిగించామన్నారు. ఆహార పోట్లాలు అవసరం లేదని ప్రజలే తమకు చెబుతున్నారని చెప్పారు. అవసరమైతే ఫైరింజన్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. సహాయక చర్యలో పాల్గొనని... పని చేయని వారేవరినీ ఊరుకోనని ఉన్నతాధికారులను హెచ్చరించారు. విశాఖపట్నంలో గురువారం పరిస్థితి చక్కబడిందని చంద్రబాబు అన్నారు.

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
4 Replies 656 Views Last post May 16, 2012, 09:18:49 PM
by haribabu015
1 Replies 467 Views Last post May 24, 2012, 03:07:05 PM
by siva
4 Replies 1305 Views Last post July 06, 2012, 06:40:10 AM
by siva
2 Replies 658 Views Last post August 22, 2013, 12:10:58 PM
by manikumar18
0 Replies 461 Views Last post December 04, 2013, 07:46:05 AM
by charan fan