Author Topic: ఆఫీసు పైనుంచి దూకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య  (Read 192 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
తిరువనంతపురం :[/size] కేరళలోని టెక్నోపార్క్ క్యాంపస్ లో గల ఓ ఐటీ సంస్థలో పనిచేసే శ్రీరాజ్ శ్రీధరన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆరో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పనిచేసే ఆఫీసు భవనం పైనుంచే గురువారం ఉదయం అతడు దూకేశాడు. అతడి మృతిపట్ల తాము తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్లు యూఎస్ టీ గ్లోబల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు మూడేళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్న అతడు.. చాలా బాగా పనిచేసేవాడని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భవానీ బిల్డింగ్ వద్ద ఈ సంఘటన జరిగిందన్నారు. వెంటనే అతడి సహోద్యోగులు, హెచ్ఆర్ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా, అక్కడకు వెళ్లేసరికే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సంఘటనకు కారణాలేంటో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

 

Related Topics