Author Topic: Rudrama Devi web reviews  (Read 548 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
Rudrama Devi web reviews
« on: October 09, 2015, 03:11:58 PM »


గుణా టీమ్‌ వర్క్స్‌
 
రుద్రమదేవి
 
తారాగణం: అనుష్క, రానా, అల్లు అర్జున్‌, కృష్ణంరాజు,
 
ప్రకాష్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌ త్రిస, సుమన్‌,
 
హంసానందిని, ఆదిత్య మీనన్‌, బాబా సెహగల్‌లతోపాటు
 
లెక్కకు మించిన నటీనటులు
 
సంగీతం: ఇళయరాజా
 
పాటలు: సీతారామశాస్త్రి
 
సినిమాటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌
 
ఎడిటింగ్‌: ఎ.శ్రీకరప్రసాద్‌
 
ఆర్ట్‌: తోట తరణి
 
కాస్ట్యూమ్స్‌: నీతా లుల్లా
 
మాటలు: పరుచూరి బ్రదర్స్‌
 
సమర్పణ: రాగిణి గుణ
 
రచన, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్‌
 
విడుదల తేదీ: 09.10.2015
 
కాకతీయ సామ్రాజ్యాన్ని 1261 నుండి 1289 వరకు పాలించి కాకతీయ వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వీరనారి రాణి రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించే ఒక మహా యజ్ఞాన్ని మూడు సంవత్సరాల క్రితం చేపట్టాడు దర్శకుడు గుణశేఖర్‌. స్టీరియో స్కోపిక్‌ 3డి అనే అధునాతన టెక్నాలజీతో భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కింది. రుద్రమదేవిగా అగ్ర కథానాయిక అనుష్క నటించింది. చాళుక్య వీరభద్రుడిగా రానా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించారు. రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్న గుణశేఖర్‌ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎన్నో అడ్డంకులను అధిగమించి అక్టోబర్‌ 9న రుద్రమదేవి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన మహిళ అందరికీ ఆదర్శంగా నిలిచిన రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించడంలో గుణశేఖర్‌ ఎంతవరకు విజయం సాధించాడు? రుద్రమదేవిగా నటించిన అనుష్క ఆ క్యారెక్టర్‌కు ఎంతవరకు న్యాయం చెయ్యగలిగింది? చాళుక్య వీరభద్రుడిగా తన నటనను ప్రదర్శించేందుకు రానాకు ఎంతవరకు వీలు కలిగింది? గోన గన్నారెడ్డి అనే ఒక ఫెరోషియస్‌ క్యారెక్టర్‌కు అల్లు అర్జున్‌ ఎంతవరకు న్యాయం చెయ్యగలిగాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
 
కథ: కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవుడు(కృష్ణంరాజు) పాలిస్తుంటాడు. అతని భార్య సోమాంబ(ప్రభ). గణపతిదేవుడికి పుత్ర సంతాన యోగం లేదని ఓ బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకుంటారు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్‌), మురారి దేవుడు(ఆదిత్య మీనన్‌). నిండు గర్భిణిగా వున్న సోమాంబకు పుట్టబోయేది ఖచ్ఛితంగా ఆడపిల్లే అయితే గణపతిదేవుడి తర్వాత కాకతీయ సామ్రాజ్యం తమ గుప్పెట్లోకి వస్తుందని ఆశపడతారు. అనుకున్నట్టుగానే సోమాంబ ఆడపిల్లను ప్రసవిస్తుంది. ఆమెకు రుద్రాంబ అని పేరు పెడతారు. పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే దాయాదులకు, సామంతరాజులకు తెలిస్తే రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తారు, శత్రువులు దాడి చేస్తారని భయపడిన గణపతిదేవుడు, మంత్రి శివదేవయ్య(ప్రకాష్‌రాజ్‌) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచేస్తారు. గణపతిదేవుడు దంపతులకు మగబిడ్డ పుట్టాడని అందర్నీ నమ్మిస్తారు. దానికి తగ్గట్టుగానే రుద్రాంబకు రుద్రదేవుడని పేరు పెట్టి మగపిల్లాడిలా పెంచుతారు. వేష, భాషల్లో, యుద్ధవిద్యల్లో మగపిల్లలతో సమానంగా పెరుగుతుంది రుద్రాంబ. తను ఆడపిల్ల అనే విషయం తను కూడా మర్చిపోతుంది. అలా 25 సంవత్సరాలు గడిచిపోతాయి. యుద్ధ విద్యల్లో, శత్రువులతో పోరాడడంలో తనకు తిరుగులేదనిపించుకుంటుంది రుద్రాంబ. రుద్రదేవుడిగా వున్న రుద్రాంబను చూసి ఆడపిల్లలు కూడా మనసు పడతారు. తన చిన్ననాటి స్నేహితుడైన చాళుక్య వీరభద్రుడు(రానా) కూడా ఆమెను మగవాడనే అనుకుంటాడు. పెళ్ళీడుకొచ్చిన కొడుక్కి పెళ్ళి చేయాలని సామంతరాజులు కోరడంతో రుద్రాంబకు ముమ్మిడమ్మ(నిత్య మీనన్‌)ని ఇచ్చి పెళ్ళి కూడా చేస్తారు. ఇదిలా వుండగా అంత:పురం నుంచి వున్న సొరంగ మార్గం ద్వారా అప్పుడప్పుడు తన నిజ స్వరూపంతో బయటికి వస్తుంటుంది రుద్రాంబ. అలా వచ్చినపుడు చాళుక్య వీరభద్రుడు ఆమెను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత తన మిత్రుడు రుద్రదేవుడు అబ్బాయి కాదని, అమ్మాయని తెలుసుకుంటాడు చాళుక్యవీరభద్రుడు. తన ప్రేమ కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకని మగవాడిగానే వుండిపోతానని చెప్తుంది రుద్రాంబ. ఒక పక్క గోన గన్నారెడ్డి(అల్లు అర్జున్‌) అనే బందిపోటు వల్ల కాకతీయ సామ్రాజ్యానికి, రుద్రమదేవికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరో పక్క మహదేవనాయకుడు(విక్రమ్‌జీత్‌) కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తుంటాడు. వీటన్నింటినీ రుద్రాంబ ఎలా ఎదుర్కొంది? చివరికి రుద్రాంబ చాళుక్య వీరభద్రుడి ప్రేమను అంగీకరించిందా? రుద్రదేవుడు మగవాడు కాదని, ఆడపిల్ల అనే విషయం రాజ్య ప్రజలకు తెలిసిందా? తెలిసిన తర్వాత రుద్రాంబను యువరాణిగా అంగీకరించారా? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
 
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: రుద్రదేవుడిగా, రుద్రమదేవిగా అనుష్క ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి రుద్రదేవుడిగా పెరిగిన రుద్రాంబ క్యారెక్టర్‌ అద్భుతంగా పోషించింది. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్య యువరాణి రుద్రమదేవిగా, వీరోచితంగా పోరాడే వీరనారిగా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది. చాళుక్య వీరభద్రుడుగా నటించిన రానా కూడా తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. రుద్రమదేవికి అన్నివిధాలుగా సహాయపడే క్యారెక్టర్‌లో తనదైన నటన ప్రదర్శించాడు. గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్‌ ఆపాత్రని అవలీలగా పోషించాడు. తెలంగాణ యాసతో తను చెప్పే ప్రతి డైలాగ్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌కు అల్లు అర్జున్‌ పెర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. అతను చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఆ తర్వాత చెప్పుకోదగిన క్యారెక్టర్‌ ప్రకాష్‌రాజ్‌ది. మంత్రి శివదేవయ్యగా రాజుకి సలహాలు ఇచ్చి నడిపించే క్యారెక్టర్‌లో తన మార్క్‌ చూపించాడు. చాలా సన్నివేశాల్లో అతను చెప్పిన డైలాగ్స్‌, క్లైమాక్స్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. గణపతిదేవుడుగా కృష్ణంరాజు చాలా హుందాగా, ఒక రాజులా కనిపించాడు. ఈ కథలో లెక్కకు మించిన పాత్రలు, వాటిని పోషించిన పాత్రధారులు వున్నారు. వారంతా తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.
 
టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి చెప్పుకోదగ్గ టెక్నీషియన్స్‌ అంటే ఇళయరాజా, అజయ్‌ విన్సెంట్‌, తోట తరణి, పరుచూరి బ్రదర్స్‌. ఇళయరాజా చేసిన పాటల్లో మూడు పాటలు బాగున్నాయి. ఆ పాటల పిక్చరైజేషన్‌ కూడా చాలా రిచ్‌గా అందర్నీ ఆకట్టుకునేలా వున్నాయి. ఒక హిస్టారికల్‌ మూవీ అనగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ వుంటుందో అందరికీ తెలిసిందే. ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి పెట్టింది పేరు. ఈ సినిమాలో మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మార్క్‌ని చూపించారు. ఇలాంటి కథలో సెట్స్‌కి ఎంత ప్రాధాన్యముంటుందో మనకు తెలుసు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు తన అద్భుతమైన సెట్స్‌తో కనువిందు చేశారు తోట తరణి. అతను వేసిన సెట్స్‌ వల్ల ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా కనిపించింది. కాకతీయ సామ్రాజ్యాన్ని, అప్పటి స్థితి గతుల్ని స్క్రీన్‌మీద ఆవిష్కరించారు. వీటికి అద్భుతమైన గ్రాఫిక్స్‌ కూడా తోడై సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయి. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చి ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా చూపించారు. గుణశేఖర్‌ విషయానికి వస్తే రుద్రమదేవి చరిత్రను తను ఎలా చెప్పాలనుకున్నాడో, స్క్రీన్‌ మీద ఎలా ఆవిష్కరించాలని అనుకున్నాడో దాన్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ చేసి చూపించాడు. కథలోని పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. అలాగే వారినుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. సుదీర్ఘంగా వుండే రుద్రమదేవి చరిత్రను 2 గంటల 38 నిముషాల్లో చెప్పడం చాలా కష్టమని గుణశేఖర్‌ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తాయి. ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఆకట్టుకునేలా తియ్యడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా అతను పెట్టిన ఎఫర్ట్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. అన్నింటినీ మించి క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశారు. అనుష్క కత్తి యుద్ధం చేసే సీన్స్‌ టెర్రిఫిక్‌గా అనిపిస్తాయి.
 
విశ్లేషణ: రుద్రమదేవి పుట్టుక దగ్గర్నుంచి కథను మొదలు పెట్టి ఆమె పెరిగి పెద్దదై రాజ్యాన్ని ఏవిధంగా పాలించింది, ఎలాంటి సాహసాలు చేసింది, శత్రు దేశాల నుంచి ప్రజల్ని ఎలా కాపాడింది అనే విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో చెప్పడంలో గుణశేఖర్‌ సక్సెస్‌ అయ్యాడు. మొదటి నుంచీ రుద్రమదేవిని అమ్మాయిగా ఎస్టాబ్లిష్‌ చెయ్యకపోవడం, అందరూ ఆమెను అబ్బాయిగానే ట్రీట్‌ చెయ్యడం, ఆమె అమ్మాయిగా వున్నప్పుడు చాళుక్య వీరభద్రుడు ఆమెను ఇష్టపడడం వంటి సన్నిశాలతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. మధ్య మధ్య గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ వచ్చి తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇక సెకండాఫ్‌కి వచ్చిన తర్వాత కూడా అబ్బాయిగానే చూపించడం సెకండాఫ్‌లో సగం సినిమా నడిచిన తర్వాత రుద్రమదేవిగా ప్రజలకి పరిచయం చెయ్యడం, ఆ తర్వాత చెలికత్తెలతో ఆమెకు ఓ పాట పాడుకోవడం, ఒక ఆడపిల్లకు రాణిగా పట్టాభిషేకం చెయ్యడం ప్రజలకు నచ్చక రాజ్య బహిష్కారం చెయ్యడం వంటి సీన్స్‌ ఆడియన్స్‌కి కాస్త బోర్‌ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు బాగున్నప్పటికీ దానికి ఎక్కువ టైమ్‌ కేటాయించడంతో సినిమా ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అని ఆడియన్స్‌ ఎదురుచూసేలా చేస్తుంది. చరిత్రను చరిత్రలాగే చెప్పాలి కాబట్టి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసే సన్నివేశాల్ని జోడించడం ఇలాంటి కథలో కుదరదు. కాబట్టి ఆడియన్స్‌ అక్కడక్కడ అసహనానికి లోనయ్యే అవకాశం వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే గుణశేఖర్‌ రుద్రమదేవి కథను ఎంతో ఇష్టపడి, దానికోసం ఎంతో ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమాని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుంది? కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది.
 
ఫినిషింగ్‌ టచ్‌: మెస్మరైజ్‌ చేసే హిస్టారికల్‌ మూవీ
 
సినీజోష్‌ రేటింగ్‌: 3/5

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
Rudrama Devi web reviews
« Reply #1 on: October 09, 2015, 03:39:10 PM »

విడుదల తేదీ : 9 అక్టోబర్ 2015
 
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
 
దర్శకత్వం : గుణశేఖర్
 
నిర్మాత : గుణశేఖర్
 
సంగీతం : మాస్ట్రో ఇళయరాజా
 
నటీనటులు : అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్..
 


కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించి, ప్రజల చేత మన్ననలు పొంది, కాకతీయ వంశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టతలు తెచ్చి పెట్టిన వీరణారి రుద్రమదేవి జీవిత కథాంశంతో తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ‘ది వారియర్ క్వీన్’ అనేది ఉపశీర్షిక. ఇండియాలోనే మొట్ట మొదటి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ డైరెక్టర్. అనుష్క మెయిల్ లీడ్ గా నటించగా రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు, కేథరిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హిస్టారికల్ కథని ఎంత మేరకు ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాడన్నది ఇప్పుడు చూద్దాం..
 
కథ :
 
ఓరుగల్లు(ఇప్పటి వరంగల్)ని కాకతీయ రాజ్య పీఠంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా 63 ఏళ్ళు పరిపాలించిన రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు). ఆయనకి వారసులు లేరు. ఆయన చివరి సంతానం కూడా ఆడబిడ్డే పుడుతుంది. కానీ తనకి వారసుడు పుట్టలేదు అని తెలిస్తే దేవగిరి రాజైన సింగన్న(రాజ మురాద్) దండెత్తి వస్తాడని, అలాగే తన దాయాదుల వల్లే తమకు ముప్పు పొంచి ఉన్నదని గణపతి దేవుడు బాధపడుతున్న తరుణంలో మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచి, తమకు పుట్టింది మగ పిల్లాడే, అని తనకి రుద్రమదేవి అనే నామకరణం చేసినా రుద్రదేవ యువరాజుగా ప్రజలకి పరిచయం చేస్తాడు. అనుకున్నట్టుగానే కుమార్తెను ఒక రాజుని తయారు చేసినట్టే సకల విద్యల్లోనూ శిక్షణ ఇప్పిస్తాడు. రుద్రదేవ కూడా అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. అప్పుడే యువరాజుగా పట్టాభిశాక్తుల్ని చేస్తారు.
 
ఇదిలా ఉండగా గణపతిదేవుడు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్). మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు రుద్రవీరని చంపి కాకతీయ సింహాసనాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, మరోవైపు దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) కూడా కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి వ్యూహాలు రచిస్తుంటాడు. అదే తరుణంలో బంధిపోటుగా పేరు తెచ్చుకున్న గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్ర వీరతో పోరు కోసం సిద్దంగా ఉంటాడు. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రుద్రవీర ఏం చేసింది.? రుద్రవీర యువరాజు మగ కాదు,ఆడ అని తెలిసిన తర్వాత కాకతీయ ప్రజలు ఏం చేసారు.? అలా చేయడం వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? ఆ ఇబ్బందుల నుంచి ప్రజలని కాపాడి, మహాదేవ నాయకుడి నుంచి కాకతీయ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.? అసలు రుద్రవీరకి బాల్య మిత్రుడైన గోనగన్నారెడ్డి రుద్రమదేవికి ఎందుకు ఎదురెళ్ళాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.
 
ప్లస్ పాయింట్స్ :
 
రుద్రమదేవి జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. అలానే రుద్రమదేవి సినిమాకి కూడా హైలైట్ గా నిలిచే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ముందుగా ఆ బ్లాక్స్ గురించి చెప్పుకుంటే.. రుద్రమదేవి చిన్ననాటి ఎపిసోడ్ తో పాటు, అనుష్క ఇంట్రడక్షన్ సీన్ అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ఆ తర్వాత అనుష్క పై ఓ ముఠా దాడి చేసినప్పుడు అక్కడ అనుష్క చేసే వీరోచిత పోరాటం బాగుంది. ఆ ఫైట్ లో అనుష్క కత్తితిప్పుడు సూపర్బ్. వీటికంటే మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారిగా థియేటర్లోని ఆడియన్స్ లో ఓ సరికొత్త ఎనర్జీ జెనరేట్ అవుతుంది. ఈ సీన్ లో ఇంటెన్స్ తో పాటు డైలాగ్స్ లో కావలసినంత వెటకారం, కామెడీ కూడా ఉంటాయి. అందుకే ఈ సీన్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్ లో చూపే సర్ప వ్యూహం – గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి.
 
ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్నారు.. సో సినిమాకి హైలైట్ గా నిలిచిన నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే.. ముందుగా ఇలాంటి ఓ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించడమే కాకుండా ఈ సినిమా కోసం రెండేళ్ళు టైం కేటాయించిన అనుష్కకి హ్యాట్సాఫ్. అనుష్క వారియర్ లా, ఒక మెచ్యూర్ యువరాణిలా బాగా చేసింది. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో కత్తి తిప్పడం, రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలకు దీటుగా నిలిచింది. ఇక అంతఃపురంలో రాణిగా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇక అనుష్క కంటే మించి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది గోనగన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్. బన్ని లుక్ అండ్ తెలంగాణా యాసలో బన్ని చెప్పిన డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. ‘గమ్మునుండవో..’ అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ కూడా అవుతుంది. తన ఇంటెన్స్ యాక్షన్ రోల్ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. రుద్రమదేవి అనే సినిమాకి అనుష్క – అల్లు అర్జున్ లు రెండు కళ్ళు లాంటివారు. ఇక రానా యువరాజు పాత్రలో బాగా చేసాడు. మంత్రిగా ప్రకాష్ రాజ్, రాజుగా కృష్ణంరాజులు తమ పాత్రలకి న్యాయం చేస్తే సుమన్, ఆదిత్య మీనన్, విక్రంజీత్ లు నెగటివ్ షేడ్స్ ని బాగా చేసారు. మిగతా చిన్న చిన్న పాత్రలో చేసిన నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు తెరపై కాస్త గ్లామర్ ని ఒలకబోశారు.
 
ఇక సినిమా పరంగా చూసుకుంటే.. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన సెట్స్ మనకు 13వ శతాబ్దంని గుర్తు చేస్తాయి. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 7 కోట గోడల నిర్మాణం, చివరి వార్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కథలో బాగంగా వచ్చే కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
 
మైనస్ పాయింట్స్ :
 
సినిమా ప్రారంభం ముందే ఈ రియల్ లైఫ్ కథలో ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే క్షమించాలి అని వేసారు కాబట్టి కథ గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ కథలో రియాలిటీ కంటే సినిమాటిక్ కల్పిత అంశాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే సినిమాకి రాసుకున్న కథనం బాలేదు. ఎందుకు అంటే చెబుతున్నది రియల్ గా జరిగిందే అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా రెగ్యులర్ వేలో రాసారు. దాని వలన అన్ని పాత్రల పరిచయాల తర్వాత రుద్రమదేవి కథలో ఏం జరుగుతుందా అనేది తెలిసిపోతుంది. దాంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలియని ఓ కథని చెబుతున్నప్పుడు అందులో ఎన్నో కొన్ని థ్రిల్స్ ఉండాలి. కానీ ఇందులో థ్రిల్స్ అనేవి లేవు. రుద్రమదేవి కథ మొత్తానికి ఒకే ఒక్క ట్విస్ట్ ని రాసుకున్నారు, ఆ ట్విస్ట్ ఆడియన్స్ ఊహించదగినదే కావడం వలన చివర్లో పెద్ద కిక్ ఏమీ ఉండదు. ఇక నేరేషన్ కూడా అంతే స్లోగా సాగడం, ముఖ్యంగా సెకండాఫ్ లో అయితే ఉన్న మూడ్ ని మరింత తగ్గించేలా నేరేషన్ ఉంటుంది. సెకండాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.
 
సెకండాఫ్ లో సూపర్ అని చెప్పుకునేలా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం. సన్నివేశాలే బోర్ కొడుతున్నాయి అంటే.. మధ్య మధ్యలో వరుసగా పాటలు వచ్చి సినిమా వేగాన్ని ఇంకా కిందకి పడేస్తాయి. సో పాటల్ని కట్ చేసేయవచ్చు. ఇకపోతే ఇలాంటి హిస్టారికల్ సినిమాలలో డైరెక్టర్ చేయాల్సిన మేజిక్ చరిత్రలోని పాత్రలని సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు కనెక్ట్ చేసెయ్యాలి. అలానే ఆడియన్స్ లో మనం 13వ శతాబ్దంలో ఉన్నా అనే ఫీలింగ్ ని కలిగించాలి. ఈ రెండింటిలో ఏ ఫీలింగ్ ని క్రియేట్ చేయలేకపోయాడు. ఎక్కడా పాత్రలని 100% ఎలివేట్ చేయలేదు. దాంతో ఒకటి రెండు పాత్రలకు తప్ప మిగతా ఏ పాత్రకి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. దానివల్ల ఆడియన్స్ సినిమాతో కంటిన్యూగా సింక్ అవ్వరు. ఇక సినిమాకి కీలకం కావాల్సిన వార్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఒకటి రెండు ఫార్మేషన్స్ ని బాగానే చూపిన వార్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు గ్లామర్ అట్రాక్షన్ కే తప్ప సినిమాకి పెద్ద ఉపయోగపడని పాత్రలు. వీరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ని కూడా తీసేయవచ్చు.
 
సాంకేతిక విభాగం :
 
సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. ఆయన వేసిన సెట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఆయన కాకతీయ కట్టడాలను కళ్ళకు కట్టినట్లు రూపకల్పన చేసారు. అలాగే సెట్స్ కి కొనసాగింపుగా చేసిన విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అంటే బాగున్నాయి అనేలా ఉన్నాయే తప్ప, ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమాకి ఉండాల్సిన హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇక అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ లో లేదా బయట తీసిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు సినిమాకి హెల్ప్ కాలేదు, అలాగే ఆయన నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. సో మ్యూజిక్ అనేది ఈ సినిమాకి మైనస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత సీనియర్ ఎడిటర్ ఇంత స్లోగా ఉండేలా ఓ ఎపిక్ డ్రామాని ఎడిట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి తరానికి మ్యాచ్ అయ్యేలా నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మాత్రం అందరికీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పీటర్ హెయిన్, విజయ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ జస్ట్ యావరేజ్ అనుకునేలా ఉన్నాయే తప్ప రుద్రమదేవి అనే హిస్టారికల్ సినిమాకి సరిపోయే రేంజ్ లో లేవు. తోట ప్రసాద్ – గుణశేఖర్ – పరుచూరి బ్రదర్స్ కలిసి రానుకున్న డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ కి రాసిన డైలాగ్స్ బాగున్నాయి.
 
ఇక కథ – కథనం – నిర్మాణం – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది గుణశేఖర్.. కథ – రుద్రమదేవి అనే ఒరిజినల్ కథని తీసుకొని దానికి ఎక్కువ సినిమాటిక్ అంశాలను జత చేసి చివరికి వచ్చేసరికి రెగ్యులర్ స్టొరీ చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. కథనం – అవసరానికి మించిన సాగదీత, స్లో అండ్ రొటీన్. దర్శకత్వం – దర్శకుడిగా ఓ హిస్టారికల్ కథనే ఎంచుకున్నారు బాగుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. ఏ ఒక్క పాత్రని పూర్తిగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. అలాగే చాలా సీన్స్ లో ఇంటెన్స్ ఉన్నా దానిని తెరపైకి తీసుకురాలేకపోయాడు. నిర్మాతగా కూడా ఓ డీసెంట్ విజువల్ ట్రీట్ ఇచ్చాడే తప్ప, ఓ కేవ్వుకేక అనిపించుకునే విజువల్ వండర్ మూవీ అయితే ఇవ్వలేదు.
 
తీర్పు :
 
భారతీయ వీరణారిగా చరిత్ర పుటల్లో నిలిచిన రాణీ రుద్రమదేవి జీవిత గాధ ఆధారంగా హిస్టారికల్ ఎపిక్ డ్రామాగా వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకునేలా లేకపోయినా, పరవాలేదు అనిపించుకునేలా మాత్రం ఉంది. కథలో దమ్మున్న సినిమా అయినప్పటికీ కథనం మరియు డైరెక్షన్ కారణాల కారణంగా యావరేజ్ అటెంప్ట్ గా నిలిచిపోవాల్సి వచ్చింది. ఒక హిస్టారికల్ కథని చెబుతున్నప్పుడు ఆ కథని ప్రేక్షకుల మదికి బలంగా తగిలేలా చెప్పాలి కానీ చెప్పలేకపోయారు. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ లు తమ పాత్రల మీద ప్రాణం పెట్టి చేయడం వలన ఆ పాత్రలకు మంచి ఎస్టాబ్లిష్ మెంట్ వచ్చింది, అవే సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యాయి. సినిమాని సాగదీయడం, అనవసరపు సాంగ్స్, ఆకట్టుకోలేకపోయిన వార్ ఎపిసోడ్స్, సెకండాఫ్ బాగా డల్ గా సాగడం లాంటివి సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్ గా అంచనాలను కాస్త తగ్గించుకొని, కాస్త స్లో అయినా పర్లేదు అనుకొని సినిమా చూస్తే డీసెంట్ హిస్టారికల్ ఫిల్మ్ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.
 
123తెలుగు.కామ్ రేటింగ్ :3/5

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Rudrama Devi web reviews
« Reply #2 on: October 13, 2015, 03:59:36 PM »
తారాగణం: అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్య మీనన్, కాథరిన్ ట్రెస, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు

దర్శకత్వం – నిర్మాత: గుణశేఖర్

సంగీతం: ఇళయరాజా

బ్యానర్: గుణ టీం వర్క్స్

ఓ గొప్ప బాధ్య‌త భుజానేసుకొన్నాడు గుణ‌శేఖ‌ర్‌. అది… రుద్ర‌మదేవి క‌థ‌ని మ‌ళ్లీ చెప్పాల‌నుకోవ‌డం. చ‌రిత్ర‌ను ఈత‌రానికి అందివ్వాల‌నుకోవ‌డం. నిజంగానే ఇదో సాహ‌స‌వంత‌మైన అడుగు. ఈ సినిమాకి తానే నిర్మాతై… తీర్చిదిద్దాడు కూడా. మూడేళ్ల క‌ఠోశ శ్ర‌మ‌.. తొమ్మిదేళ్ల నుంచి రీసెర్చ్‌, రూ.75 కోట్ల వ్య‌యం!  అయితే ఈ క‌ష్ట‌మంతా తెర‌పై క‌నిపించిన‌ప్పుడే శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం వ‌స్తుంది. లేదంటే.. చిందించిన చెమ‌ట‌బిందువుల‌కు అర్థం ఉండ‌దు. గుణ‌శేఖ‌ర్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడ‌న్న‌ది ప్రేక్ష‌కుల‌కు అన‌వ‌స‌రం. థియేట‌ర్లో కూర్చున్న ఆ రెండున్న‌ర గంట‌లూ… తృప్తినిచ్చిందా, లేదా అన్న‌దే కొల‌మానం. మ‌రి ఈ కొల‌త‌ల్లో రుద్ర‌మ‌దేవికి ఏ స్థానంలో నిల‌బెట్టాడు??  త‌న క‌ష్టానికి త‌గిన ప్ర‌తిప‌లం ద‌క్క‌బోతోందా?  భారీ కాన్వాన్ నిండిన ఈ సినిమా.. ఏం సాధించింది, గుణ‌శేఖ‌ర్ క‌ల.. త‌న క‌థని ఎలా ఆవిష్క‌రించాడు?  చూద్దాం. రండి.
కాకతీయ వంశం దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ఉన్న త‌రుణ‌మ‌ది. గణపతి దేవ రాజు (కృష్ణం రాజు)కు అన్నీ క‌ష్టాలే. సామంతులు సింహాసనం చేజిక్కించుకోవ‌డానికి ఎదురుచూస్తుంటారు. శుత్ర‌రాజులు దండెత్త‌డానికి సిద్ధంగా ఉంటారు. దానికి తోడు వార‌సుడు లేని రాజ్యం. గ‌ణ‌ప‌తి దేవ‌రాజుకి మ‌గ‌బిడ్డ పుడితే త‌ప్ప‌.. త‌మ క‌ష్టాలు గట్టెక్క‌వు అనుకొంటారు. కానీ.. ఆడ‌బిడ్డ (అనుష్క‌) పుడుతుంది.  కానీ రాజ్య క్షేమం దృష్ట్యా.. పుట్టిన బిడ్డ మ‌గ‌పిల్ల‌వాడే అని న‌మ్మిస్తారు. రుద్ర‌దేవుడు అని పేరు పెట్టి… పెంచుతారు. అన్నిర‌కాల యుద్ధ విద్య‌ల్లో ఆరితేరిపోతుంది.. రుద్ర‌మదేవి.

చాళుక్య వీరభద్రుడు(దగ్గుబాటి రానా) గోన గన్న రెడ్డి(అల్లు అర్జున్)  రుద్ర‌దేవుడికి మంచి స్నేహితులు. గోన గ‌న్నారెడ్డి పెరిగి పెద్ద‌వాడై… బందిపోటు దొంగ‌గా మారిపోతాడు. సామంత రాజుల మీద  కక్ష కట్టి ఒకొక్క‌రినీ చంపుకొంటూ వ‌చ్చి… రుద్ర‌మ‌దేవికి స‌వాలుగా నిలుస్తాడు. మిగిలిన సామంత రాజులు రాజ్యాన్ని ఎలాగైనా కైవ‌సం చేసుకోవాల‌ని కుట్ర‌ప‌న్నుతారు. ఈలోగా రుద్ర‌దేవుడికి పెళ్లి నిశ్చియం అవుతుంది. తాను మ‌గ‌వాడ్ని కాద‌న్న విష‌యం ఎంతో కాలం దాచ‌లేని ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితుల్లో రుద్ర‌మ‌దేవి ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంది? త‌న రాజ్యాన్ని ఎలా కాపాడుకొంది? అనేదే రుద్ర‌మ‌దేవి క‌థ‌.
రుద్ర‌మ‌దేవి క‌థ కాదు..చ‌రిత్ర‌. ఆ చ‌రిత్ర గురించి గుణ‌శేఖ‌ర్ క్షుణ్ణంగానే అధ్య‌యనంచేసిన‌ట్టు క‌నిపించాడు. రుద్ర‌మదేవి జీవితంలో ముఖ్య ఘ‌ట్టాల‌ను వ‌రుస‌గా పేర్చుకొంటూ వెళ్లి… త‌న‌దైన సినిమాటిక్ ముగింపు ఇచ్చాడు. అక్క‌డ‌క్క‌డా త‌న‌కు కావ‌ల్సిన‌ట్టుగా స‌న్నివేశాల్ని సృష్టించుకొన్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. చ‌రిత్ర‌ను మ‌రీ అలానే రాగా… దించేస్తే. ఆర్ట్ ఫిల్మ్ అయ్యే ప్ర‌మాదం ఉంది గ‌నుక‌, ఆ మార్పుల్ని ప్రేక్ష‌కులూ పెద్ద త‌ప్పుగా భావించ‌క్క‌ర్లెద్దు. అయితే… రుద్ర‌మ‌దేవి క‌థ‌ని.. క‌థ‌కుడిగా బాగానే చెప్పిన గుణ‌శేఖ‌ర్‌, ఓ ద‌ర్శ‌కుడిగా మాత్రం దాన్నో దృశ్య‌కావ్యంలా తీర్చిదిద్ద‌లేక‌పోయాడు. ఇదో విజువ‌ల్ ఫీస్ట్ అని ఆశించి థియేట‌ర్లో కి అడుగుపెట్టిన ప్రేక్ష‌కుడు కాస్త నిరాశ‌కు లోన‌వుతాడు. పైగా బాహుబ‌లి త‌ర‌వాత విడుద‌ల అవుతున్న చిత్ర‌మిది. విజువ‌ల్స్ విష‌యంలో పోలిక వ‌చ్చి తీరుతుంది. ఆ పోలికే.. ఈ సినిమాకి ప్ర‌ధాన శాపంగా మారే అవ‌కాశం ఉంది. ప్ర‌తీ సీనూ బ్లూ మ్యాట్‌లోనే తీయ‌డం వ‌ల్ల స‌హ‌జ‌త్వం కొర‌వ‌డింది. గ్రాఫిక్స్ షాట్స్ ఏమిటో సామాన్య ప్రేక్ష‌కుడికి సుల‌భంగా అర్థ‌మైపోతుంటాయి. ఇక క‌థ‌తో ఎక్క‌డ ప్ర‌యాణం చేస్తాడు?  రుద్ర‌మ‌లోని ధీరోదాత్త‌త‌ను చూపించాల్సిన సినిమా ఇది. కానీ ఆ విష‌యంపై గుణ పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌లేదు. ఏదో రెండు మూడు సంద‌ర్భాల్లో వీర‌నారిగా తీర్చిదిద్దాడు. ఎక్కువ‌గా రుద్ర‌మ‌దేవిలోని `ఆడ‌త‌నం`పై ఫోక‌స్ పెట్టాడ‌నిపిస్తుంది.
పెద్ద కాన్వాన్ ఉన్న సినిమా ఇది. ప్ర‌తీ స‌న్నివేశం భారీగానే క‌నిపిస్తుంటుంది. వంద‌ల మంది న‌టీన‌టులుంటారు. కానీ ఒక్క‌రినీ స‌రిగా వాడుకోలేదు. చాలామంది మొహాలు చూపించడానికే ప‌నికొచ్చారు. అనుష్క చాలా క‌ష్ట‌ప‌డింది. ఆ క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంటుంది. వీర‌నారిగా, వ‌య‌సొచ్చిన ఆడ‌పిల్ల‌లా రెండు ర‌కాల భావోద్వేగాల‌నూ చ‌క్క‌గా ప‌లికించింది. యువ‌రాణిగా చాలా అందంగా క‌నిపించింది. రానా పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు. భ‌ళ్లాల‌దేవ‌ని చూసిన క‌ళ్ల‌తో ఈ సినిమాలో రానాని చూడ‌డం కాస్త ఇబ్బందే. కృష్ణంరాజు ఓకే. ఎక్కువ డైలాగులు ఉన్న పాత్ర‌…ప్ర‌కాష్‌రాజ్‌దేనేమో. మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో డైలాగుల్లా వాటినీ ప‌లికేశాడు ప్ర‌కాష్‌రాజ్‌. అంద‌రికంటే ఎక్కువ మార్కులు తీసుకెళ్లిపోయింది.. బ‌న్నీ!  ఈ సినిమాకి అత‌నే ఆయువుప‌ట్టు. గోన‌గ‌న్నారెడ్డిగా ఆ వీర‌త్వం, ఆచురుకుద‌నం అద్భుతంగా ప‌లికించాడు. తెలంగాణ యాస‌లోనే అత‌ని డైలాగులు ప‌లికించాల‌నుకోవ‌డం గుణ‌శేఖ‌ర్ తీసుకొన్న తెలివైన నిర్ణయం. ఆ భాష‌లోని సొగ‌సు.. ఈ పాత్ర‌తో మ‌రోసారి బ‌య‌ట‌పెట్టారు. ఈ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది కూడా బ‌న్నీనే. బ‌న్నీ పాత్ర‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టినా త‌ప్పులేద‌నిపించింది. ఈ సినిమా కోసం అనుష్క ఎంత క‌ష్ట‌ప‌డినా, చివ‌ర్లో బ‌న్నీ క్రెడిట్ ప‌ట్టుకెళ్లిపోయాడు.

విజువ‌ల్‌గా ఈ సినిమా అనుకొన్నంత గొప్ప‌గా లేదు. ముందే చెప్పిన‌ట్టు… బ్లూమేట్‌కి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. తోట త‌ర‌ణి వేసిన అద్భుత సెట్ల ప‌నిత‌నం కూడా అంత‌గా క‌నిపించ‌లేదు. ఇళ‌య‌రాజా పాట‌ల్లో రెండు మెలోడీలు మ‌ధురంగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతంలో ఆయ‌న మార్క్ క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కెమెరా, త్రీడీ ఎఫెక్ట్స్‌.. బాగానే కుదిరాయి. అయితే.. క‌థ‌లో లీన‌మ‌వ్వ‌డానికి కావ‌ల్సిన స‌హ‌జ‌త్వం ఎందుకో లోపించింది.
చివ‌రిగా… ఈ సినిమాకి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌చ్చినా దానికి క‌ర్త క‌ర్మ క్రియ గుణ‌శేఖ‌రే!  బ‌న్నీ, అనుష్క‌, రానా, నిత్య‌మేన‌న్ లాంటి న‌టీన‌టులు ఈ సినిమా కోసం కొన్ని త్యాగాలు చేశారు. అయితే.. ఆ త్యాగాల‌కు స‌రైన విలువ‌.. ఈ సినిమా హిట్టు కొట్ట‌డంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. గుణ ప‌డిన క‌ష్టం చూసో, మ‌న చ‌రిత్ర‌ని మ‌నం గౌర‌వించుకోవాల‌నో ఈ సినిమాని చూడాలి. విజువ‌ల్ పీస్ట్ అనుకొనో, అద్భుతాన్ని చూడ‌బోతున్నామ‌నుకొనో థియేట‌ర్‌కి వెళ్తే… భంగ‌పాటు త‌ప్ప‌దు.

పదును తగ్గిన రుద్రమదేవి కత్తి

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Rudrama Devi web reviews
« Reply #3 on: October 21, 2015, 03:34:15 PM »
You can check the Rudhramadevi movie web review @ http://www.teluguodu.com/rudramadevi-review/

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 415 Views Last post August 13, 2014, 04:13:40 PM
by charan fan
4 Replies 724 Views Last post October 24, 2014, 02:21:55 PM
by siva
2 Replies 523 Views Last post December 14, 2014, 07:21:54 AM
by thisisbalu
5 Replies 771 Views Last post December 19, 2014, 07:17:50 PM
by charan fan
5 Replies 517 Views Last post October 14, 2015, 01:36:27 PM
by Pa1Kalyan