Author Topic: Ram Charan interviews in print media  (Read 307 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Ram Charan interviews in print media
« on: October 15, 2015, 08:54:04 AM »
నాన్నను దాటాలని కలలోనూ అనుకోను - రామ్‌చరణ్‌
Updated :14-Oct-2015 : 19:02
[/b][/size][/font]
[/size]‘‘నాన్నను దాటి ముందుకు వెళ్లాలని కల్లోకూడా అనుకోను. నాన్న వెనుక ఉండటంలోనే నాకు సంతోషం. అదే నాకు గౌరవం. దానికి మించి ఇంకేదో గొప్పగా చెయ్యాలని నాకేమీ లేదు. ఇప్పుడు మేం అనుభవిస్తున్నదంతా ఆయన సంపాదించిపెట్టిందే’’ అని చెప్పారు రామ్‌చరణ్‌. ఆయన టైటిల్‌ రోల్‌ చేసిన సినిమా ‘బ్రూస్‌లీ.. ద ఫైటర్‌’. శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తమ కార్యాలయంలో మీడియాతో సంభాషించారు రామ్‌చరణ్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

 
ఈ సినిమాలో నాన్నగారు నటించాలనే విషయంలో నేను నేరుగా జోక్యం చేసుకోలేదు. శ్రీను వైట్ల మా ఇంటికి వచ్చి నాన్నగారిని అడిగారు. ఆయన కూడా కన్విన్సయి చేయడానికి ఒప్పుకున్నారు. స్ర్కిప్టులోని ఓ సన్నివేశంలో ఓ బిగ్‌ స్టార్‌ ప్రెజెన్స్‌ అవసరం. నాన్నగారు చెయ్యకపోతే స్ర్కిప్టులో ఆ సీక్వెన్స్‌ తీసేసేవాళ్లమేమో. ఆయన మళ్లీ మేకప్‌ వేసుకుని నటిస్తుంటే అమ్మ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఆయనపై షూటింగ్‌ మొదలైన రోజు నేను టెన్షన్‌తో ఏడు గంటలకల్లా సెట్స్‌కు వెళ్లిపోయా. ఎనిమిదేళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నానని నాన్నకూ టెన్షన్‌గానే ఉంది. ఆయన లుక్‌ని నేనే సెట్‌ చేశాను. కాస్ట్యూమ్స్‌ను నేనే డిజైన్‌ చేశాను. క్లీన్‌ షేవ్‌తో చేద్దామని ఆయననుకున్నారు. నాకు ‘గ్యాంగ్‌లీడర్‌’ గుర్తుకొచ్చి, ఒక రోజు మాసిన గడ్డంతో కనిపిస్తే బాగుంటుందని చెప్పాను. ఆ గెటప్‌తోనే సెట్స్‌పైకి వచ్చారు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ కంటే ముందు ఎలా ఉండేవారో, అలా ఉన్నారనిపించింది. నాన్నపై పాట వద్దని చెప్పింది నేనే. ఓ ఫైట్‌ సీక్వెన్స్‌లో ఆయన వస్తారు. అంతవరకూ ఓకే కానీ, సాంగ్‌ కూడా చేద్దామని శ్రీను వైట్ల అంటే నేను చాలా బలంగా వద్దని చెప్పాను. ఆయన 150వ సినిమాకే పాటల్ని వదిలేద్దామని చెప్పాను. ‘మగధీర’లో ఉపయోగించిన గుర్రాన్నే నేను ఆ ఫైట్‌లో ఉపయోగించాను. తనకు వైట్‌ హార్స్‌ కావాలని నాన్న అడిగారు. మా దగ్గర వైట్‌ హార్స్‌ లేదు. బయట్నించి తెప్పించాం. అది వైల్డ్‌గా ఉంది. అదింకా సంవత్సరం కూడా ట్రైనింగ్‌ అవలేదు. దానిపై నాన్న రైడింగ్‌ అంటే నాకు భయమేసింది. ఆ ఫైట్‌లో ఇద్దరం గుర్రాలపై కలిసివచ్చేలా ఓ షాట్‌ ఉంది. నాన్న ఫాస్ట్‌గా వెళ్లిపోయారు. నేను నమ్మలేకపోయా. ఆయనకు దానిపై ఎలా గ్రిప్‌ వచ్చిందో తెలీలేదు. షూటింగ్‌ వాతావరణమంటే ఆయనకలా ఉంటుందేమో. మూడు రోజుల పాత్రే కాబట్టి నాన్న రెమ్యూనరేషన్‌ తీసుకోలేదు. (నవ్వుతూ) నాన్న అడిగినా దానయ్యగారు ఇవ్వలేదు.
తను పరిచయం చేసిన పద్ధతిలో కాకుండా కొత్తగా ఏదైనా చెయ్యాలని ఈ సినిమాలో ప్రయత్నించారు శ్రీను వైట్ల. దాని కోసమే స్ర్కిప్టు రూపకల్పన కోసం ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. ఆర్టిస్టుల నుంచి నటనను రాబట్టుకొనే విషయంలో ఆయనలో ఓ ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది. తనకు కావాల్సింది చాలా ఈజీగా రాబట్టుకుంటారు. ఆయన కల్పించే సన్నివేశంలోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ప్రత్యేకంగా మనం కామెడీ కోసం ఓ జోకర్‌లా ఏమీ చెయ్యక్కర్లేదు. ఆయన రాసింది మనం చేస్తే, చెబితే అదే కొత్తగా ఉంటుంది. గత సినిమాల్లో నేను కొన్ని సన్నివేశాల్లోనే కామెడీ చేశాను కానీ ఇందులో నేను చేసిన పాత్ర పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. విలన్‌తో చేసే సీన్లు కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఇది స్టంట్‌మన్‌ కేరక్టర్‌ కావడంతో ఫిజిక్‌ను మెయిన్‌టైన్‌ చేయాల్సి వచ్చింది. ఈ కేరక్టర్‌ని పోషించేప్పుడు చాలా దెబ్బలు తగిలాయి. ఇదివరకెప్పుడూ ఇన్ని దెబ్బలు తగల్లేదు. మణికట్టుకైన దెబ్బ ఇంకా పూర్తిగా నయం కాలేదు. డూప్‌ను ఉపయోగించకుండా నా స్టంట్స్‌ను నేనే చేయడం వల్ల ఇవి తగిలాయి. నాన్నగారు ‘గ్యాంగ్‌లీడర్‌’లో చేసిన పాత్ర తరహాలో ‘బ్రూస్‌లీ’లోనూ నా కేరక్టర్‌ సరదాగా మొదలై, నెమ్మదిగా సిస్టర్‌ సెంటిమెంట్‌లోకి బ్లెండ్‌ అవుతుంది. నా సోదరిగా కృతి ఖర్బందా చేసింది.

ఆయన సినిమాలే స్ఫూర్తి
బ్రూస్‌లీని అభిమానించని వాళ్లెవరు? ఆయన సినిమాల్లో ‘ఎంటర్‌ ద డ్రాగన్‌’ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ ఫైట్లతో పాటు ఫ్యామిలీ కోసమో, లేదంటే ఏదన్నా ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌తోనో ఉంటాయి. దానివల్లే మనం ఆయన ఫైట్లను ఎంజాయ్‌ చేశామనుకుంటాను. అలా అందరికీ అర్థమయ్యే ఎమోషన్‌నే ఆయనెప్పుడూ చేశారు. ఆ సినిమాలను స్ఫూర్తిగా తీసుకునే, మా ‘బ్రూస్‌లీ’ని సిస్టర్‌ సెంటిమెంట్‌తో చేశాం. కేరక్టర్‌ ప్రకారం నేను బ్రూస్‌లీ అభిమానిని కాబట్టి ఆయన టాట్టూను డిజైన్‌ చేసి పెట్టుకున్నా. ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’, ‘రీసౌండ్‌’ అనే టైటిళ్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి కానీ, సబ్జెక్టుకు ‘బ్రూస్‌లీ’ అనేది కరెక్టుగా ఉంటుందని, అదే పెట్టాం.

 
 
నచ్చలేదని పూరికే చెప్పాంకొణిదెల ప్రొడక్షన్స్‌పై పెద్ద సినిమాలు చేస్తాం. వైట్‌ హార్స్‌ అనేది పూర్తిగా నూతన ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెడుతున్న నిర్మాణ సంస్థ. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేస్తాం. నాతో పాటు ఇంకెవరైనా సహ నిర్మాతగా వచ్చి సినిమాలు తీయొచ్చు. నాన్నతో సినిమా పూర్తయ్యాకే, వైట్‌ హార్స్‌ బేనర్‌పై సినిమా మొదలుపెడతాను. దసరా లోపలే నాన్న 150వ సినిమా డైరెక్టర్‌ ఎవరనేది ప్రకటిస్తాం. పూరి జగన్నాథ్‌ చెప్పిన ఫస్టాఫ్‌ కథ నాన్నకు బాగా నచ్చింది. సెకండాఫ్‌ నచ్చలేదు. ఆ సంగతి ఆయనకే స్పష్టంగా చెప్పాం. ఆయన వరుణ్‌తో చేస్తున్న ‘లోఫర్‌’తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనను డిస్టర్బ్‌ చేయదలచుకోలేదు. ఆయనకు కూడా కథమీద కూర్చోడానికి టైమ్‌ ఉండదు. ఆయన విషయంలో మేం ఫేర్‌గానే ఉన్నాం. నాన్నగారు తనతో చెప్పలేదని ఎందుకన్నారో తెలీదు. ఏదైనా నాన్న 150వ సినిమా అర్థవంతంగా ఉండాలి. 151, 152, 153 సినిమాల స్ర్కిప్టులు రెడీగా ఉన్నాయి. వాటిని చేయడానికి శ్రీను వైట్ల, వినాయక్‌ రెడీగా ఉన్నారు. వాటికి నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ 150వ సినిమాదే సమస్య. ఏదేమైనా కచ్చితంగా జనవరిలో దాని షూటింగ్‌ మొదలవుతుంది. ఆ సినిమాకు నాన్నకు నేను రెమ్యూనరేషన్‌ ఇచ్చేదేమిటి! నిర్మాత బాధ్యతలు వహిస్తున్నందుకు ఆయనే నాకు నెలకు ఇంతని మెయిన్‌టెన్స్‌ ఇస్తారనుకుంటా.

మా కుటుంబమంతా ‘రుద్రమదేవి’ వెనకే ఉంది
‘బ్రూస్‌లీ’ విడుదలను వాయిదా వేసే విషయమై గుణశేఖర్‌గారు నన్ను సంప్రదించారు. ‘నా చేతుల్లో ఏమీలేదు సార్‌. దానయ్యగారినే అడగాలి’ అని చెప్పాను. ‘బ్రూస్‌లీ’ విడుదల అనేది నా రెస్పాన్సిబిలిటీ కాదు. రిలీజ్‌ డేట్‌ అనేది నా కంట్రోల్‌లో లేని విషయం. దీనివల్ల ఎవరెలా ఫీలవుతారనేది నాకు తెలీదు. నాకు తెలిసింది - ముహూర్తం రోజే దసరాకు వస్తామని చెప్పాం. అది పక్కా. దానికి రికార్డ్స్‌ ఉన్నాయి. అలా ముందే ప్లాన్‌ చేసుకుని, అందరం కష్టపడుతూ, నాలుగు నెలల్లో రిలీజ్‌కు వచ్చాం. ‘రుద్రమదేవి’ సినిమా ఎప్పుడొస్తుందనేది మాకు ఐడియా ఉండుంటే, మేం మార్చుకునేవాళ్లమేమో. ఆ సినిమా ఎప్పుడొస్తుందనేది ఎవరికీ ఐడియా లేదు. ఆ సినిమా బాగా ఆడాలని మాకుంది. అందుకే నాన్నగారు, బన్నీ దానికి సపోర్ట్‌ చేశారు. మొత్తంగా మా ఫ్యామిలీ అంతా ఆ సినిమా వెనకాలే ఉంది. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఊహించలేదు. ఇది దురదృష్టకరం.

 
నాగార్జునగారు కన్‌ఫామ్‌ కాలేదుఒకప్పుడు రీమేక్స్‌ చెయ్యకూడదని అనుకున్నాను. ఇప్పుడలా అనుకోవట్లేదు. తమిళంలో వచ్చిన ‘తని ఒరువన్‌’ అమేజింగ్‌ ఫిల్మ్‌. బాధ్యతతో తీసిన సినిమాలా కనిపించింది. దాని రీమేక్‌ను సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో జనవరిలో ప్రారంభిస్తాం. అందులో నా హీరో కేరక్టర్‌ కంటే మోస్ట్‌ ఇంపార్టెంట్‌ విలన్‌ కేరక్టర్‌. అక్కడ దాన్ని అరవింద్‌స్వామి చేశారు. ఆ పాత్రకు నాగార్జునగారి పేరు విన్నాను. ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. మాధవన్‌ను, అరవింద్‌స్వామిని కూడా అనుకుంటున్నాం. నిజానికి ఇది ఎన్వీ ప్రసాద్‌గారి ప్రాజెక్టు. తర్వాత దానయ్యతో కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే విజయ్‌ సినిమా ‘కత్తి’ రీమేక్‌ హక్కుల గురించి చర్చలు జరుపుతున్నాం. అది కచ్చితంగా మా ప్రొడక్షన్‌లోనే ఉంటుంది. ‘తని ఒరువన్‌’ రీమేక్‌ తర్వాత గౌతమ్‌ మీనన్‌తో లవ్‌స్టోరీ చేస్తాను. దానికి నిర్మాత ఎవరనేది ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. ఈ ఏడాది ఆఖరులో ప్రకటిస్తాం. తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ ఏక కాలంలో దాన్ని చేయబోతున్నాం.

 
యాక్టర్లు ఎక్కువ.. డైరెక్టర్లు తక్కువగతంలో సంపత్‌ నందితో చేశాను. పెద్ద డైరెక్టరా, కాదా అనే దానికి నేనెప్పుడూ ఇంపార్టెన్స్‌ ఇవ్వను. ప్రతిభ ఉన్న కొత్త డైరెక్టర్లు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. దురదృష్టవశాత్తూ మన ఇండసీ్ట్రలో యాక్టర్లు ఎక్కువగా, డైరెక్టర్లు తక్కువగా ఉన్నారు. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్‌, వినాయక్‌లాంటివాళ్లే ఇప్పటికీ ఇండసీ్ట్రలో పట్టుకలిగి ఉన్నారు. వీళ్లకు దీటుగా నిలిచే కొత్త డైరెక్టర్లను మేం చూడలేదు. కొత్త టాలెంట్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నాం. ఇటీవల ‘సినిమా చూపిస్త మావ’, ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాల్ని చూశాను. రెండూ బాగున్నాయి. పెద్ద బడ్జెట్‌తో తియ్యగల స్ర్కిప్టులతో ఆ దర్శకులు వస్తే కచ్చితంగా ప్రోత్సహిస్తాం.

 
 
మా కాంబినేషన్‌ వేస్ట్‌ కాకూడదుబాబాయ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’తో బిజీగా ఉన్నారు. దాన్నుంచి బయటపడ్డాక నాతో తీసే సినిమా స్ర్కిప్టుపై కూర్చుంటారు. వచ్చే ఏడాది మా సినిమా ఉంటుంది. నాన్న, బాబాయ్‌తో కలిసి సినిమా చెయ్యాలని నాకూ ఉంది. కానీ ఏ డైరెక్టరైనా కాన్ఫిడెంట్‌గా మాకు సరిపోయే కథ తీసుకువస్తే ముగ్గురం వింటాం. చేస్తే కన్విన్సింగ్‌గా ఉండాలి. అన్నీ బాగా సింక్‌ అయితేనే చెయ్యాలి. లేకపోతే చెయ్యకూడదు. ఇప్పటివరకూ మా దగ్గరకు అలాంటి స్ర్కిప్టులు రాలేదు. ఎవరైనా కథ చేసుకుంటే, వినగానే అదిరిపోయిందన్నట్లు ఉండాలి. ఉత్తినే చేయకూడదు. ఆ కాంబినేషన్‌ వేస్ట్‌ అవకూడదు. ఒకవేళ్ల అలాంటి స్ర్కిప్టు వస్తే బాబాయ్‌, నేనూ కలిసి నిర్మిస్తామేమో.

 
 
ఆమె అలిగిందిఈ సినిమా ప్రమోషన్‌ పనులు పూర్తయ్యాక నా భార్య ఉపాసనను తీసుకొని హాలీడేకి వెళ్లాలి. ఇప్పటికే అడిగింది, ‘ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా, లేదా’ అని. షూటింగ్‌లో ఒళ్లంతా దెబ్బలు తగిలి, నొప్పులుగా ఉంది, ముందు కేరళ వెళ్లి ఆయుర్వేద చికిత్స తీసుకోవాలంటే అలిగింది. అందువల్ల ఆమెను తీసుకొని ఎక్కడికైనా వెళ్లాలి. తీరిక సమయాల్లో క్యూబ్‌లో సినిమాలు చూస్తుంటాను. పాత స్నేహితుల్ని కలుస్తుంటాను. మా ఫామ్‌కు వెళ్లి గుర్రాలతో కొంత సమయం గడుపుతుంటాను. ఈ మధ్య అమలగారు పంపిస్తే ఓ ఒంటెను దత్తత తీసుకున్నాం. అది ఓ సర్కస్‌పై రైడ్‌ చేసినప్పుడు విడిపించిన ఒంటె. నాన్న నరసాపురం వద్ద ఓ ఊరిని దత్తత తీసుకున్నారు. దానిలో నేనూ ఇన్‌వాల్వ్‌ అవుతున్నా. అలాగే మా చారిటబుల్‌ ట్రస్ట్‌కు పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నా.

 
 
నన్నెలా తప్పు పడతారు?అక్కర్లేని విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అనవసరంగా మా ఎనర్జీ అంతా అటేపు వెళ్తోంది. ఆ ఎనర్జీని నా పనిపై పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటాననిపించింది. అందుకేనేమో ఓపిక ఎక్కువయ్యిందనుకుంటా. ట్రూజెట్‌ ఎయిర్‌లైన్స్‌కు నేను కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌ను మాత్రమే. మహేశ్‌ కానీ, బన్నీ కానీ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎలా పనిచేస్తున్నారో, దీనికి నేనూ అంతే. ఆ కంపెనీలో సమస్య వస్తే మమ్మల్నెలా బ్లేమ్‌ చేస్తారు? మ్యాగీ నూడుల్స్‌ గురించి అమితాబ్‌ బచ్చన్‌పై కేసు పెట్టడమేంటి? ఇప్పటివరకూ ట్రూజెట్‌లో నేనెక్కడికీ వెళ్లలేదు. నేనైతే వాళ్లకు ఆ సమస్య రాకుండా చూసుకొమ్మని చెప్పాను.
[/size][/font][/font]

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Ram Charan interviews in print media
« Reply #1 on: October 15, 2015, 08:54:23 AM »
అది వినడానికి బాగుంటుంది..కానీ వాస్తవం మరోలా వుంటుంది!
Updated : 10/14/2015 11:15:01 PMViews : 703
ramcharan

నాన్న కెమెరా ముందుకు వస్తున్న క్షణాలు తలచుకొని నేను టెన్షన్ పడ్డాను. ఎనిమిదేళ్ల విరామం తరువాత కెమెరా ముందుకొస్తున్నానని నాన్న లొకేషన్‌లోకి టెన్షన్‌గానే వచ్చారు. కాస్ట్యూమ్స్‌తో సహా లుక్‌ని అంతా నేనే డిజైన్ చేశాను. గడ్డంతో రావాలా? లేక గడ్డం తీసేసి క్లీన్ షేవ్‌తో వెళ్లాలా? అని ఆయన ఆలోచిస్తుంటే గ్యాంగ్ లీడర్‌లుక్ గుర్తొచ్చి లైట్‌గా గడ్డం వుంటే బాగుంటుందని నేనే చెప్పడం జరిగింది. ఆ తరువాత లొకేషన్‌లో గ్యాంగ్ లీడర్‌లా ఆయన ప్రత్యక్షమయ్యే సరికి అంతా సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యాం అన్నారు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్రూస్‌లీ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ బుధవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలివి.

మీ నాన్నగారి 150వ చిత్రంలో అతిథి పాత్ర చేస్తానన్నారు. ఇప్పుడేమో ఆయనే మీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ఆలోచన ఎవరిది?
నాన్నగారి సినిమాలో చిన్నపాత్ర అయినా సరే ఆ అవకాశాన్ని వదులుకోను. అయితే బ్రూస్‌లీలో నాన్నగారిని అతిథి పాత్రలో నటింపజేయాలన్న ఆలోచన మాత్రం నాది కాదు. నాకు తెలియకుండానే శ్రీను వైట్ల మా ఇంటికి వచ్చి నాన్నను అడగడం జరిగింది. కథ డిమాండ్ మేరకు ఓ సన్నివేశంలో స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తి కనిపించాలి. శ్రీను వైట్ల చెప్పిన స్క్రిప్ట్ నచ్చి ఓకే అన్నారు. ఆ తర్వాత 150వ నంబర్ చాలా ముఖ్యమైనదే అయినా మళ్లీ నేను రెండున్నర గంటలు కనిపించేదే పూర్తిస్థాయి సినిమా. ఈ చిత్రంలో నేను చేస్తున్న అతిథి పాత్రని నా రీ ఎంట్రీకి టీజర్‌గా భావించుకోండి అని నాన్నగారు చెప్పడం జరిగింది. ఆయన చేయకపోతే ఆ పాత్రను కథలోంచి తొలగించే వారిమేమో.

సినిమాలో మీ నాన్నపై ప్రత్యేకంగా పాట వద్దనడానికి కారణం ఏదైనా వుందా?
పాట పెట్టకుంటేనే బాగుంటుందని నేనే చెప్పాను. నాన్న చేసింది చిన్న అతిథి పాత్ర. అదీ ఓ ఫైట్ సన్నివేశంలో వస్తుంది. అంత వరకు ఓకే మళ్లీ పాట కూడా పెడదాం అని శ్రీను వైట్ల చెప్పినప్పుడు అస్సలు కుదరదు. అది 150వ సినిమాలోనే అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది.

స్టంట్‌మెన్ పాత్ర కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకున్నారు?
ఈ ఏడాది ఏప్రిలో బ్రూస్‌లీ మొదలైంది. దీనికి ముందు నెలన్నర పాటు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎం.ఎం.ఏ) ను బ్యాంకాక్ వెళ్లి నేర్చుకున్నాను. యాక్షన్ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం కావడంతో దీని కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా గాయాలయ్యాయి. ఈ స్థాయిలో నేను ఏ సినిమా విషయంలోనూ గాయాలపాలు కాలేదు.

బ్రూస్‌లీ కథలో ఏం నచ్చి ఈ సినిమా చేశారు?
నేను ఇంత వరకు చేసిన సినిమాల్లో ప్రారంభం నుంచి హీరో పాత్ర ఏదో ఒక బాధ్యతతో...భారంతో సాగుతుంది. అయితే బ్రూస్‌లీలో నా పాత్ర అలా కాకుండా చాలా జాలీగా ఎలాంటి బరువు బాధ్యతలు లేని పాత్ర. నా వయసుకు తగ్గ పాత్ర ఇది. గ్యాంగ్‌లీడర్‌లో నాన్న పాత్ర సరదాగా సాగుతూ ఆ తరువాత బాధ్యతల్ని తీసుకుంటుంది. ఇందులోనూ నా పాత్ర అలాగే సాగుతుంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. కృతికర్భందా నాకు సోదరిగా నటిస్తోంది. జాలీగా తిరిగే ఓ యువకుడు అప్పటి వరకు నాన్న మోసిన కుటుంబ బాధ్యతల్ని స్వీకరించి ఆ కుటుంబానికి నేనున్నానన్న భరోసాను ఎలా కలిగించాడు? ఆ తర్వాత ఏం జరిగిందన్నదే చిత్ర ఇతివృత్తం.

కాలేజీ నేపథ్యంలో స్టూడెంట్ పాత్రలో ఇంత వరకు కనిపించలేదు. అ తరహా పాత్రలో కనిపించే ఆలోచన ఏదైనా వుందా?
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తాను. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తాను. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. తమిళ వెర్షన్‌కు నా పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నాను.

బ్రూస్‌లీ సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా? 
బ్రూస్‌లీ చేసిన కథలన్నీ ఫ్యామిలీ నేపథ్యంలో సాగినవే. దాని వల్లే నేను ఆయన ఫైట్స్‌ని కూడా ఎంజాయ్ చేశానేమో అనిపించేది. బ్రూస్‌లీ చేసిన సినిమాలని స్ఫూర్తిగా ఈ చిత్రం చేశాను. ప్రతి స్టంట్‌మెన్ అభిమానించే వ్యక్తులు బ్రూస్‌లీ, జాకీచాన్. సినిమాలో నాకు బ్రూస్‌లీ అంటే అభిమానం. అందుకే బ్రూస్‌లీ టాటూని కుడి చేతిపై వేసుకున్నాను. టైటిల్ అనుకోకముందు షూటింగ్‌లో బ్రూస్‌లీ టాటూ చూసిన వారంతా అన్ని పేర్లకన్నా బ్రూస్‌లీ పేరు కరెక్ట్ అని చెప్పడంతో అదే టైటిల్‌ని ఖరారు చేశాం.

చిరంజీవిగారు మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారన్న విషయం తెలిసి మీ కుటుంబ సభ్యులు ఎలాంటి అనుభూతిని వ్యక్తం చేశారు?
నాన్న మేకప్ వేసుకుని మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారని తెలిసి తొలి రోజు అమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. మామూలుగా నా దర్శకులంతా లొకేషన్‌కు ఆలస్యంగా రమ్మని చెబుతుంటారు. అయితే ఈ సినిమా లొకేషన్‌కు ఉదయం 7గంటలకే వెళ్లిపోయాను. నాన్న కెమెరా ముందుకు వస్తున్న క్షణాలు తలుచుకుని నేను టెన్షన్ పడ్డాను. ఎనిమిదేళ్ల తరువాత కెమెరా ముందుకొస్తున్నానని ఆయనా టెన్షన్‌గానే వచ్చారు. ఆయన కాస్ట్యూమ్స్‌తో సహా లుక్‌ని అంతా నేనే డిజైన్ చేశాను. గడ్డంతో రావాలా లేక తీసేసి క్లీన్‌గా వెళ్లాలా అని ఆయన ఆలోచిస్తుంటే గ్యాంగ్‌లీడర్‌లుక్ గుర్తొచ్చి లైట్‌గా గెడ్డం వుంటే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది. ఆ తరువాత ఆయన్ని నేను చూడలేదు. షూటింగ్‌లో కలుద్దాం అన్నాను. బ్రూస్‌లీ లొకేషన్‌లో గ్యాంగ్‌లీడర్‌లా ప్రత్యక్షమయ్యే సరికి అంతా సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యాం.

సెట్‌లో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారేమో అనిపించలేదా?
అలా ఎప్పుడూ వుండదు. ఆయన్ని దాటి రేసులో ముందుకు వెళ్లాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ ఆలోచన రాదు కూడా. ఎప్పుడూ ఆయన వెనకే ఉండటానికి ఇష్టపడతాను. దానికి మించి ఈ జీవితానికి ఇంకా ఏమీ కోరుకోవడం లేదు.

త్వరలో కొణిదెల ప్రొడక్షన్స్, వైట్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలని ప్రారంభిస్తున్నారని తెలిసింది?
వైట్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మినిమం బడ్జెట్ చిత్రాలు తీయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించబోతున్నాం. ఇక కొణిదెల ప్రొడక్షన్స్‌లో భారీ చిత్రాలు మాత్రమే నిర్మిస్తాం. ఈ రెండు ప్రొడక్షన్ కంపెనీల గురించి అనౌన్స్ చేసిన వెంటనే సాయిధరమ్‌తేజ్, శిరీష్ ఫోన్ చేసి టాలెంట్ వున్న కొత్త వాళ్లు చాలా మంది వున్నారు. టైమిస్తే కథ వినిపిస్తారట అని చెబితే ఈ రెండు నెలలు నాన్నగారి 150వ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంటాను ఆ తరువాత రమ్మని చెప్పాను.

150వ సినిమా దర్శకుడు ఎవరనుకుంటున్నారు?
అది నాన్నగారు చెబుతారు. దసరా లోపలే ప్రకటిస్తాం.

ఇప్పటి వరకు రీమేక్‌లు చేయని మీరు తొలిసారి తమిళ హిట్ చిత్రం తని ఒరువన్ రీమేక్‌ని అంగీకరించడానికి కారణం?
ఒకప్పుడు రీమేక్‌లు చేయకూడదని అనుకున్నాను. అయితే ఇకపై అలాంటి నిబంధనలు పెట్టుకోదలుచుకోలేదు. ఆ మధ్య వచ్చిన గబ్బర్‌సింగ్ అనూహ్య విజయాన్ని సాధించింది. అలాగే నాన్నగారు నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్, శంకర్‌దాదా జిందాబాద్, ఠాగూర్ చిత్రాల్ని విజయవంతం చేశారు. అవన్నీ రీమేక్‌లే. నేనూ ఎందుకు చేయకూడదనుకున్నాను. తమిళంలో విడుదలైన తనిఒరువన్ స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది.

చాలా బాధ్యతగా తీసిన సినిమా అనిపించింది. మోహన్‌రాజా అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగులోనూ అదే స్థాయిలో విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. సురేందర్‌రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారు. జనవరిలో సెట్స్‌పై కొస్తుంది. విలన్ పాత్రని అక్కడ అరవింద్‌స్వామి చేశారు. రీమేక్ కోసం ఆయన్ని అడిగాం. మాధవన్, నాగార్జున పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఎక్కువగా పెద్ద దర్శకులతోనే పనిచేస్తున్నారు. కొత్త వాళ్లతో చేయాలన్న ఆలోచన ఏమైనా వుందా?
దిల్‌రాజు సంస్థలో వచ్చే ఏడాది ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. ఆయన కొత్త వాళ్లతో బాగా చేయించుకుంటారు. అలా ఎవరైనా కొత్త వాళ్లు మంచి కథతో వస్తే చెప్పండి కలిసి చేద్దాం అన్నాను. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది వుంటుంది.

పవన్‌కళ్యాణ్ నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది?
ఇటీవలే అయన్ని కలిశాను. ఓ కథని సిద్ధం చేస్తున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ తరువాత అది కార్యరూపం దాల్చుస్తుంది.

150వ సినిమా కత్తి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి?
కత్తి సినిమా నాన్నకు బాగా నచ్చింది. అయితే దాని రీమేక్ రైట్స్ ఇంకా తీసుకోలేదు. సంప్రదింపులు జరుగుతున్నాయి.

పెద్ద సినిమాల విడుదలకు తప్పని సరిగా రెండు వారాల గ్యాప్ వుండేలా చూసుకుంటున్నారు. అయితే రుద్రమదేవి సినిమా కోసం బ్రూస్‌లీని వాయిదా వేసుకోమని దర్శకుడు గుణశేఖర్ మిమ్మల్ని కలిశాడని తెలిసింది?
గుణశేఖర్‌గారు నన్ను కలిసి సినిమా విడుదల వాయిదా వేసుకోమని అడిగారు. అయితే నాచేతుల్లో ఏమీలేదు. నేను నిర్మాత దానయ్యను అడగాలి అని చెప్పాను. విడుదల విషయం అన్నది నా కంట్రోల్‌లో వుండదు. ముహూర్తం రోజునే బ్రూస్‌లీ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తున్నామని చెప్పాం. ముందు నుంచి ప్లాన్ చేసుకుని అందరం కష్టపడుతూ ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేశాం. రుద్రమదేవి ఎప్పుడు విడుదలవుతుందో ఐడియా వుంటే ఏమో మేము కూడా రిలీజ్ డేట్ మార్చుకునే వాళ్లం కావచ్చు. ఆ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు.

ఆ సినిమా ఆడాలనే బన్నీ దగ్గరి నుంచి మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. బాహుబలి సమయంలో రాజమౌళి శ్రీమంతుడు చిత్రాన్ని వాయిదా వేసుకోమని అడిగారు. ఆ తరువాత మహేష్ కిక్-2ని వాయిదా వేసుకోమని ఆ చిత్ర వర్గాలని కోరడం జరిగింది. అంతెందుకు ఆగడు విడుదల సమయంలో గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని వాయిదా వేసుకోమని మహేష్ నన్ను అడిగాడు. ఆ సమయంలో అందరం ఒకరికి ఒకరం సహకరించుకున్నాం.

పెద్దస్టార్‌ల సినిమాలు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ అని దాసరిగారు ఇటీవల చెప్పారు?
మంచిదే. స్టార్‌ల సినిమాలు ఎప్పుడు విడుదలైతే అప్పుడే పండగ. వినడానికి బాగుంది. కానీ వాస్తవంలో మాత్రం అది మరోలా వుంటుంది.

పూరి జగన్నాథ్‌తో 150 ఫిల్మ్ చేస్తున్నామని ప్రకటించారు. ఆ తరువాత ఈ సినిమాకు డైరెక్టర్ తను కాదని మీడియా ద్వారా తెలిసి పూరి బాధపడ్డానని చెప్పారు?
వరుణ్‌తేజ్‌తో లోఫర్ సినిమా షూటింగ్‌లో పూరిజగన్నాథ్ బిజీగా వున్నందున మరోసారి చూద్దామని స్వయంగా ఆయనకే చెప్పాం. ఇలా చెప్పినా ఆయన ఎందుకలా అన్నారో తెలియదు.

మీ నాన్నగారి150 సినిమా ఎలా వుండాలనుకుంటున్నారు?
ఎంటర్‌టైన్‌మెంట్ వుంటూనే సామాజిక అంశం నేపథ్యంలో వుండాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఇన్నేళ్ల తరువాత నాన్న గారు చేసే సినిమా అర్థవంతమైనదై వుండాలి. అందుకే కథ కోసం ఇంత కాలం ఎదురు చూశాం. 150 సినిమా కథ ఓకే అయితే ఆ తర్వాత రెండు చిత్రాలకు కథలు సిద్ధంగా వున్నాయి. 150వ సినిమాను జనవరిలో స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.
namaste telangana

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Ram Charan interviews in print media
« Reply #2 on: October 15, 2015, 08:55:52 AM »

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,661
Ram Charan interviews in print media
« Reply #3 on: October 15, 2015, 08:58:27 AM »
Vaartha
-బ్రూస్‌ లీ ..రామ్‌చరణ్‌
గోవిందుడు అందరి వాడేలే.. లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తర్వాత రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న మరోఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం 'బ్రూస్‌ లీ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 16న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో రామ్‌చరణ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు 'తెర' పాఠకులకోసం...

సినిమా ఎలా ఉండబోతోంది?
ఇదొక కుటంబ కథాచిం. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సినిమా మొత్తం రిలేషన్స్‌ మెయిన్‌టెన్‌ చేస్తూ,చూపించారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడ బాగా చూపించారు. సినిమాలో నాపాత్ర పేరు కార్తీక్‌. కుటుంబంతో కనెక్ట్‌ అయ్యే తను ఓ స్టంట్‌ మాస్టర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇలా సాగిపోతున్న తన జర్నీలో ఈన ప్రొఫెషన్‌ ఎలాంటి మలుపు తెప్పిందనేదే ఈ సినిమా కథ. లవ్‌స్టోరీ కళలో భాగం మాత్రమే. ముఖ్యంగా ఇదొక ఫ్యామిలీ డ్రామా.

వరుసగా కుటుంబ కథా చిత్రాల్లో నటించటానికి కారణం?
కావాలని ప్రత్యేకంగా నేను లాంటి స్రికప్టు సెలెక్ట్‌ చేసుకోవట్లేదు. గోవిందుడు అందరి వాడేలే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. బ్రూస్‌ లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయినా యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీ అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. నా తదుపరి చిత్ర తని ఒరువన్‌లో అసలు ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ ఉండవు. అదికూడ నేనుప్లాన్‌ చేసిందికాదు.

లుక్‌ విషయంలో ఎలాంటి కేర్‌ తీసుకుంటున్నారు?
ఈ సినిమాలో కొత్తగా కన్పిస్తున్నాను. అంలే మాత్రం ఆ క్రెడిట్‌ అంతా శ్రీను వైట్లగారికే చెందుతుంది. ఈ సినిమాకు షార్ట్‌ హెయిర్‌లో కన్పించాలా? లేక లాంగ్‌ హెయిర్‌లో కన్పించాలా? అని ఆలోచిస్తున్నపుడు శ్రీనువట్లై గారు చిరుత షూటింగ్‌ టైంలో నేను దిగిన ఫొటోలు పంపించి దానికి దగ్గరగా ఉండే లుక్‌ కావాలన్నాఉ. నాకు హెయిర్‌ అపుడు ఒత్తుగా ఉండేది. ఇపుడు లేదు సార్‌ అనిచెప్పాను (నవ్వుతూ..)

సినిమా ఎవరితో చూడబోతున్నారు?
నేను మొదట చెప్పినట్టు సినిమా విడుదలకు ఒక్కరోజుముందు అంటే అక్టోబర్‌ 15న బ్లైండ్‌స్కూల్‌లో అంధ విద్యార్థులతో కలిసి సినిమా చూస్తాను. వారు హీరో వెవరు? డైలాగ్స్‌ ఎవరు చెబుతున్నారు..అనే విషయాలను గుర్తించగలరు.

మీ తండ్రి మెగాస్టార్‌ 150వ చిత్రం అనుకోవచ్చా?
మొదట ఒక ఫైట్‌ సీన్‌కోసం నాన్నగారిని నటించమని అడగటానికి అత్యాస అన్పించిందిచ ఆయన 150 వ చిత్రం నిర్మాతగా నేనుఒప్పుకోలేదు.కానీ మా టీం నాన్నగారిని అప్రోచ్‌ అవ్వగానే ఆయన ఓకే చెప్పారు. శ్రీనువైట్లగారు ఓపాట కూడ చేయించాలనుకున్నారు.కానీ నేను గట్టిగా వద్దని చెప్పేశా. నాన్నగారు ఉన్న జోష్‌లో సాంగ్‌కి కూడ ఓకే చెప్పేసేవారు. ఈ సినిమాలో ఆయనది కేవలం అతిథి పాత్ర మాత్రమే. 150వ సినిమా చిత్రంగా కన్సిడర్‌ చేయొద్దు. బ్రూస్‌ లీ రిలీజ్‌ అయ్యే సమయానికి నాన్నగారి 150వ చిత్రం గురించి అధికారిక ప్రకటనచేస్తాం. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఓ సందేశాత్మక చిత్రాన్ని చేయాలనుకుంటున్నాం.

నిద్రలేకుండా షూటింగ్‌ చేశారని విన్నాం?
అవునండడీ.,.. 24 గంటల్లో ఓ నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్లం. బ్రూస్‌లీ సాంగ్‌ షూటింగ్‌ కేవలం రెండే రెండు రోజుల్లో కంప్టీట్‌ చేశాం. అసలు ఆ సాంగ్‌ షూటింగ్‌ ఎపుడు స్టార్ట్‌ చేసామో ..ఎపుడు కంప్టీట్‌ చేశామో కూడ గుర్తులేదు. రోబో లాగా పనిచేశాం. రోజు లంచ్‌ తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టి అర్ధరాత్రి 2 గంటలకు ముగించేవాళ్లం. అయినా క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా తీశాం. ఆ క్రెడిట్‌ అంతా మనోజ్‌ పరమహంస గారికే దక్కుతుంది. అతి తక్కువ సమయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మంచి క్వాలిటీతో సినిమా తీశారు.

షారూక్‌ షూటింగ్‌కు రావటం ఎలా అన్పించింది?
షూటింగ్‌ చివరి రోజు రాత్రి 2 గంటల సమయంలో ఆయన సెట్‌కి విచ్చేశారు. అందరం సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యాం. డాన్సులు అన్ని చూసి షారూక్‌గారు ఎంజా§్‌ు చేశారు.

మొదటిసారిగా కామెడీ సినిమాలో నటిస్తున్నట్టు ఉన్నారు?
ఇది మొత్తం కామెడీ సినిమా అయితే కాదు. స్ట్రాంగ్‌ పాయింట్‌ను శ్రీను వైట్ల గారి స్టైల్‌లో ట్రీట్‌ చేశారు. కథ పరంగా వెళ్తూ ప్రతి సన్నివేశాన్ని ఎంటర్‌టైన్‌గా చూపించాం. నేను ఎపుడు చేసే దానికంటే రెండు,మూడు రెట్లు ఎక్కువగా ఇందులో కామెడీ చేశాను. ఫోర్డ్స్‌ కామెడీ, ఫోర్డ్స్‌ యాక్షన్‌ సినిమాలో ఉండవు. శ్రీనువట్లై గారి కథను మంచి స్క్రీన్‌ప్లేతో కోన వెంకట్‌గారు తీర్చిదిద్దారు. బ్యాంకాక్‌లో షూట్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ బాగుంటాయి. ఒక్కరి కష్టం అని చెప్పలేం. టీం ఎఫర్ట్‌ పెట్టి చేసిన సినిమా..

మ్యూజిక్‌కు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది.?
సినిమాలో 5 పాటల్లో 4 పాటలు మంచి హిట్‌ అయ్యాయి. యునానిమస్‌గా ప్రేక్షకుల నుండి మంచిస్పందన వస్తోంది. తమన్‌ మ్యూజిక్‌కు మరి నేను డాన్‌స పరంగా జస్టిఫై చేశానో లేదో తెలియదు.

4నెలల్లోపూర్తి చేసి విడుదల చేయటానికి కారణాలు ఏమైనా?
సినిమాను ప్రారంభించిన మొదటిరోజే డేట్‌ చెప్పేసామనే తొందరలో అయితే సినిమా చేయలేదు. అనుకున్న డేట్‌ కే రావాలని ఎవరిని తొందర పెట్టలేదు. సంతోషంగా షూటింగ చేసుకుంటూ వెళ్లాం. ఒకవేళ రిలీజ్‌ లేట్‌గా చేయాలనుకుంటే ఇంకో రెండు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చూసుకునేవాళ్లం.

రుద్రమదేవికోసం సినిమా ఏమైనా వాయిదా వేసే అవకాశాలున్నాయా?
మేము ఎవరి మీద పడలేదు. వాళ్లే మా మీద పడ్డారు. మేము చెప్పిన సమయానికే సినిమా రిలీజ్‌ చేస్తున్నాం. నేను ఎలాంటి రూల్స్‌ బ్రేక్‌ చేయలేదు. బాహుబలి సమయానికి శ్రీమంతుడు సినిమా రిలీజ్‌ అవుతుందని తెలిసి రాజమౌళిగారు శ్రీమంతుడు టీంకి ఫోన్‌ చేసి సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పోన్‌ చేయమని అడిగారు. శ్రీమంతుడు టీం కిక్‌2 సినిమాను పోన్‌ చేయమని వాళ్లని అడిగారు. అలాగే ఆగడు సినిమా రిలీజ్‌ సమయంలో గోవిందుడు అందరివాడేలే వాయిదా వేయమని శ్రీనువైట్లగారు అడిగిన వెంటనే ఆయన చెప్పినట్లే చేశాం. కాని ఇపుడు మాత్రం కుదరట్లేదు. నెక్స్ట్‌ నుంచి ముందు ఎవరు రిలీజ్‌ డేట్‌ చెప్తారో .. వారి సినిమాకు 15రోజులు ముందు , తర్వాతే సినిమాలు రిలీజ్‌ కాకుండాఉండేలా అందరు జాగ్రత్త పడిడే ఆరోగ్యకరంగా ఉంటుంది.

మీరే స్టైలిష్‌గా కూడ చూసుకున్నారంట?
నిజానికి స్లైటిష్‌ కోసం ఎదురు చూసే అంతసమయం నాకు లేదు..అందుకే ఈ సినిమకు స్టైలిష్‌గా కూడ నేనేవ్య వహరించాను.

శ్రీను వైట్ల గారితో వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?
ఆయన సినిమాలు ఉన్నట్టుగానే ఆయన కూడ చాలా జోరియల్‌గా ఉంటారు. పెద్ద డైరెక్టర్‌ అనే గర్వం, మొండితనం ఆయనలో ఉండవు.

ఫ్లూట్‌ స్టెప్‌ అందరినీ బాగా ఆకర్షిస్తుందా..
నిజంచెప్పాలంటే, నాకు సఅలు ఈస్టెప్‌వేయటం ఇష్టం లేదు. డైరెక్టర్‌గారు డాన్స్‌ మాస్టర్‌ బలవంతంగా నాతో స్టెప్‌ చేయించారు. రొటీన్‌గాఫ్టూట్‌ సాంగ్‌కు ఫూట్‌ స్టెప్‌ వేయాలా.. అన్పించింది. కన్వినియన్స్‌ అయి డాన్సు చేశాను. ఫైనల్‌గా అదే అందరికీ నచ్చుతుంది.

పవన్‌కళ్యాణ్‌ నిర్మాత మీ సినిమా ఎపుడు ఉంటుంది?
బాబా§్‌ు ప్రస్తుతం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాతా సినిమా వివరాలను ప్రకటిస్తాం. ప్రస్తుతమయితే ఇద్దరు ముగ్గురు రచయితల సమక్ష్లంలో స్క్రిప్టు వర్క్‌ జరుగుతోంది.

మీ ఫ్యామిలీలో మల్టీస్టారర్‌ ఎపుడు ఉంటుంది?
ఖచ్చితంగా చేస్తాం. అది నేను బన్నీ అవ్వొచ్చు. లేదా మరొకిరితో అయినా అవ్వొచ్చు. కథ నచ్చితే డెఫనెట్‌గా చేస్తాం...

ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేస్తున్నారా?
నాన్నగారు చేయబోయే 150 సినిమా నుంచి కొణిదెల కంపెనీ అనేసంస్థ స్థాపించి పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. అదికాకుండా వైట్‌ హార్స్‌ పేరిట మరో ప్రొడక్షన్‌ కంపెనీ మొదలుపెట్టి రెండు, మూడ కోట్ల బడ్జెట్‌లో సినిమాలు తీసి కొత్త దర్శకులకు, నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాం.

తదుపరి ప్రాజెక్టుల గురించి...
డిసెంబర్‌ నుండి తని ఒరువన్‌ షూటింగ్‌ మొదలు కానుంది. సురేందర్‌రెడ్డి డైరెక్ట్‌ చేయనున్నారు. దాని తర్వాత గౌతం మీనన్‌తో మరో సినిమా చేయనున్నాను.

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Ram Charan interviews in print media
« Reply #4 on: October 15, 2015, 04:55:55 PM »
any have i will see you ram charan Burce lee movie tomorrow

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
2 Replies 805 Views Last post May 03, 2012, 08:52:07 AM
by RamSharan
34 Replies 2427 Views Last post January 15, 2013, 10:52:53 PM
by haribabu015
2 Replies 624 Views Last post January 17, 2013, 04:51:28 AM
by IamRam
pawan kalyan interviews

Started by charan fan Pawan Kalyan

1 Replies 353 Views Last post November 08, 2013, 03:41:18 PM
by siva
8 Replies 693 Views Last post December 28, 2014, 03:02:24 PM
by siva