Author Topic: Bengal Tiger Review  (Read 279 times)

Offline Rahul D

  • Newbie
  • *
  • Posts: 67
  • Megafan
Bengal Tiger Review
« on: December 10, 2015, 08:03:46 PM »

Movie : Bengal Tiger

TT Movie Rating : 2.75/5

ROUTINE FORMULA – MASS MOVIE

To start with :  Mass Maharaj Ravi Teja after a debacle at Box Office with KICK 2 which was released 4 months back, now tests his luck with Bengal Tiger.  He teams up with Sampath Nandi(Racha Fame), who is directing a movie all-most after 3 years. Tamannah Batia and Raashi Khanna are paired opposite Mass Maharaj to raise the glamour quotient. The promotions by the production team carried out well post audio release and the trailers and heroines glamour posters released so far raised the required curiosity among the mass audience. Did Mass Maharaj achieve the much needed break with Bengal Tiger?..............

See more at in the Source Below

Source: http://www.tollytracking.com/review-bengal-tiger/

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Bengal Tiger Review
« Reply #1 on: December 11, 2015, 12:27:07 PM »
సంస్థ‌; శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌
తారాగ‌ణం ; ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, రావుర‌మేష్‌, షాయాజీ షిండే, బ్ర‌హ్మానందం, పృథ్వీ, నాజ‌ర్‌, పోసాని, నాగినీడు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి త‌దిత‌రులు
సంగీతం; భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్; డి.వై.స‌త్యనారాయ‌ణ‌
కెమెరా; సౌందర్ రాజన్
ఎడిట‌ర్‌; గౌతంరాజు
ఫైట్స్‌; రామ్ ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌; కె.కె.రాధామోహ‌న్‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం;- సంప‌త్ నంది

ర‌వితేజకి కిక్ సినిమా సీక్వెల్ కిక్‌2 పెద్ద‌గా క‌లిసి రాలేదు. అటు సంప‌త్ నంది ర‌చ్చ త‌ర్వాత గ‌బ్బ‌ర్‌సింగ్ సీక్వెల్ అని వెళ్లి తిరిగొచ్చాడు. నిర్మాత రాధామోహ‌న్ ఆది హీరోగా తెర‌కెక్కించిన గ‌త సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. రాశీఖ‌న్నాకి శివ‌మ్ ఫ్లాప్‌. త‌మ‌న్నాకి మాత్రం బాహుబ‌లితో హిట్ ఉంది. సంగీతం అప్ప‌టిదాకా పెద్ద హీరోల‌కు కొట్ట‌ని భీమ్స్. ఇలా అంద‌రూ కొత్త కొత్త‌గా, త‌మ‌ని తాము ప్రూవ్ చేసుకోవాల‌ని క‌సిగా ప‌నిచేసిన సినిమా బెంగాల్ టైగ‌ర్‌. బెంగాల్ టైగ‌ర్ జాతికే పులి అయితే ఈ సినిమా జాతి టెక్నీషియ‌న్స్ ప‌నిచేసిన సినిమా. సో క‌సి మీదున్న వారు బెంగాల్ టైగ‌ర్‌ని ఎలా స్వారీ చేశారో ఓ సారి చూద్దాం.

#BengalTiger

క‌థ‌:
ఆకాష్ నారాయ‌ణ్ ( ర‌వితేజ‌) సాఫ్ట్ వేర్ లో మాస్ట‌ర్స్ చ‌దివుంటాడు. అత‌నికి ఇద్ద‌రు అన్న‌య్య‌లుంటారు. ఇద్ద‌రు వ‌దిన‌లు, ఓ బామ్మ‌, త‌ల్లి, అన్న‌య్య‌ల పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఉంటాడు ఆకాష నారాయ‌ణ్‌. ఇతని కేర‌క్ట‌ర్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే వాతావ‌ర‌ణం లాంటి వ్య‌క్తి. ఎప్పుడు ఎలా ఉంటాడో అత‌నికే తెలియదు. దేనికి రియాక్ట్ అవుతాడో కూడా అత‌నికి తెలియ‌దు. అలాంటిది అత‌నికి ఓ సారి పెళ్ళి చూపుల‌ను ఏర్పాటు చేస్తారు. పెళ్లికూతురు (అక్ష‌) త‌న‌కు కాబోయేవాడు అట్లీస్ట్ ఓ పేప‌ర్లో పేరున్న‌వాడో, లేకుంటే టీవీలో క‌నిపించిన‌వాడో కావాల‌ని కోరుకుంటుంది. ఆ విష‌యాన్నే ఆకాష్‌తోనూ చెబుతుంది. దాంతో హ‌ర్ట‌యిన ఆకాష్ ఏకంగా ఓ మంత్రి స‌భ జ‌రుగుతున్న ప్ర‌దేశంలోకి వెళ్లి మంత్రి (సాయాజీ షిండే)పై రాయి విసురుతాడు. ఎలాగోలా మంత్రి ద‌గ్గ‌ర ప‌నికి కుదురుతాడు. అక్క‌డి నుంచి హోమ్ మంత్రి త‌న‌య శ్ర‌ద్ధ (రాశీఖ‌న్నా) ఇండియాకి వ‌స్తుంద‌ని తెలుసుకుని ఆమెను కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. శ్ర‌ద్ధ‌కి అంత‌కు ముందే క‌ర‌ణ్ (రాణే)తో వివాహం నిశ్చియ‌మై ఉంటుంది. కానీ ఆకాష్ వ్య‌వ‌హారం ఆమెకు న‌చ్చ‌డంతో అత‌న్ని పెళ్లి చేసుకుంటాన‌ని ఇంట్లో ప్ర‌పోజ‌ల్ పెడుతుంది. ఆలోచించిన హోమ్ మంత్రి (రావు ర‌మేష్‌) అందుకు ఒప్పుకుంటాడు. కానీ ఆకాష్ మాత్రం తాను సీఎం (బోమ‌న్ ఇరాని) కుమార్తె మీరా(త‌మ‌న్నా)పై ప్రేమ‌ను పెంచుకున్నాన‌ని చెబుతాడు. దాంతో క‌థ అస‌లు మ‌లుపు తీసుకుంటుంది. ఇంత‌కీ హీరో ఎవ‌రిని పెళ్లి చేసుకున్నాడు? శ‌్ర‌ద్ధ‌నా?  మీరానా? మ‌రెవ‌రిని? ఆకాష్ సీఎంను ఎందుకు టార్గెట్ చేశాడు?  సీఎంకి, ఆకాష్‌కి మ‌ధ్య ఉన్న పాత ప‌గ‌లేంటి? అస‌లు ఆకాష్ ఎవ‌రు? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో తెలిసే నిజాలు.

ప్ల‌స్ పాయింట్లు

సినిమా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. హీరోను ఎలివేట్ చేసే సీనూ, హీరోకి ఫ్రెండ్స్ బ్యాచ్‌, రెండు పంచ్ డైలాగులు, ఓ ఫైట్‌, ఓ సాంగ్‌, క‌ట్ చేస్తే మ‌ర‌లా సేమ్ రిపీట్‌… ఇలానే సాగుతుంది సినిమా. సెకండాఫ్‌లో ఎక్క‌డో హీరో తండ్రి ఫోటో చూపించిన త‌ర్వాత వ‌చ్చే చిన్న మ‌లుపు వ‌ర‌కు ఈ సినిమా ఇంతే. హంసానందిని యాజ్ యూజువ‌ల్‌గా ఐట‌మ్ సాంగ్‌లో క‌నిపించినా, దాని వ‌ల్ల పెద్ద‌గా సినిమాకు ఒరిగింది ఏమీ లేదు. పృథ్వి ఇన్నేళ్ళ క‌ష్టానికి ఇప్పుడు మంచి ఫ‌లితం ద‌క్కుతున్న‌ట్టు అనిపిస్తోంది. ఇందులో ఫ్యూచ‌ర్ స్టార్ గా పృథ్వి న‌ట‌న ఆక‌ట్టుకుంది. రాశీఖ‌న్నా, త‌మ‌న్నా హై ఎండ్ యూత్‌గా బాగా చేశారు. రాణే కూడా త‌న పాత్ర‌లో ఇమిడిపోయాడు. కొద్దిగా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా సాయాజీ షిండే పాత్ర కూడా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా ఫోటోగ్ర‌పీ బావుంది. లొకేష‌న్ల‌ను కూడా కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. పాట‌ల‌ను తీసిన విధానం బావుంది. కొన్ని మూమెంట్స్లో ర‌వితేజ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఇమిటేట్ చేసిన‌ట్టు అనిపించింది. అలాగే సంప‌త్ నంది మాట‌లు క‌నీసం పావుగంట‌కు ఓ సారైనా ప‌వ‌న్‌ని త‌ల‌చుకున్నాయి. సూప‌ర్‌స్టార్ అంటే ర‌జ‌నీకాంతే గుర్తుకొస్తారు. కానీ అంత‌కు మించిన స్టార్ డ‌మ్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తెచ్చుకున్నారు వంటి డైలాగులు అలాంటివే. ప్ర‌తి సీనుకు ముందూ త‌ర్వాతి సీన్‌లో క‌నిపించే మెయిన్ థీమ్‌ను ముందుగా ప్రొజెక్ట్ చేయ‌డం బాగా అనిపించింది. అక్క‌డ‌క్క‌డా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వ‌ప్ర‌తిభ గుభాళించింది. భీమ్స్ అందించిన పాట‌లు కూడా పాడుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చూపుల్తో పాట మాత్రం క్యాచీగా ఉంది. మిగిలిన‌వ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ పంథాలో కొట్టుకుపోయేవే. శ్రీమ‌ణి రాసిన లైన్లు కూడా ఆ పాట‌లో బావున్నాయి.

మైన‌స్ పాయింట్లు

హీరోకి ఓ త‌ల్లి ఉండాలి కాబ‌ట్టి ప్ర‌భ‌, ఓ బామ్మ ఉండాలి కాబ‌ట్టి ర‌మాప్ర‌భ ఉన్న‌ట్టు అనిపిస్తుంది. శ్యామ‌ల వ‌దిన పాత్ర‌లో కాస్త అతిగానే చేసిన‌ట్టు అనిపిస్తుంది. సురేఖావాణి డైలాగులు బాగానే ఉంటాయి. ఇటు సంధ్యా జాన‌క్‌కి గానీ, ప్ర‌గ‌తికిగానీ పెద్ద‌గా డైలాగులు కూడా లేవు. బోమ‌న్ ఇరాని త‌న మార్కు స్టైల్లోనే క‌నిపించారు. అత్తారింటిదారేదితో ఆయ‌న పాత్ర‌ని పోల్చి చూడ‌లేం. ఇది పూర్తిగా వేరే త‌ర‌హా పాత్ర‌. రావు ర‌మేష్ పుత్తూరు యాస‌లో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. కానీ పూర్తిగా యాస‌ను క‌న్వే చేయ‌లేక‌పోయారు. బ్ర‌హ్మానందం పాత్ర ఉన్నా వేస్టే. ఆ ఎపిసోడ్‌ని తీసేసినా పోయేదేమీ ఉండ‌దు. సినిమాలో ల్యాగ్ త‌గ్గుతుంది. పోసాని కొంత వ‌ర‌కు ఫ‌ర్వాలేద‌నిపించినా, క్ర‌మేణ ఆ పాత్ర బోర్ కొట్టిస్తుంది. సెకండాఫ్ లో ఏం జ‌ర‌గ‌బోతుందో ముందే తెలిసిపోతుంది. దాంతో ప్రేక్ష‌కుడిని పెద్ద‌గా కూర్చోబెట్టే క‌థ‌నం క‌నిపించ‌దు. సీఎం కూతురు ఓ కామ‌న్ మ్యాన్‌ని పెళ్లాడ‌టానికి కార‌ణ‌మైన స‌న్నివేశాలు క‌న్విన్సింగ్‌గా అనిపించ‌వు. క‌నీసం హోమ్ మినిస్ట‌ర్ కూతురు క‌న్విన్స్ అయినంత మాత్రం కూడా సీఎం కూతురు క‌న్విన్స్ అయిన విష‌యంలో క్లారిటీ క‌నిపించ‌దు. ఒకే అబ్బాయిని సీఎం కూతురూ, హోమ్ మినిస్ట‌ర్ కూతురు పెళ్లి చేసుకోవ‌డ‌మ‌నే కాన్సెప్ట్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటుంద‌నుకున్నారేమో కానీ, అది కూడా వ‌ర్క‌వుట్ కాదు. తొలి పాట‌ను చూస్తే గ‌బ్బ‌ర్ సింగ్ టైటిల్ సాంగ్ గుర్తుకొస్తుంది.

విశ్లేష‌ణ‌
బెంగాల్ టైగ‌ర్ సినిమా గురించి ర‌వితేజ చెప్పిన మాట‌లే స్క్రీన్‌పై క‌నిపించాయి. ఈ సినిమా గురించి చెప్పమంటే త‌న పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని, ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుందని, క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటుంద‌ని, యాక్ష‌న్‌, పాట‌లూ ఉంటాయ‌నీ అన్నారు. సినిమా గురించి ఆయ‌న చాలా బాగా చెప్పారు. ఎందుకంటే క‌థాప‌రంగానూ అంత‌కుమించి చెప్పుకోద‌గ్గ‌ది ఇందులో ఏమీ లేదు. అంతా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమానే కాబ‌ట్టి. తొలిస‌గంలో పృథ్వి కామెడీ ట్రాక్‌, సెకండాఫ్‌లో కొంత‌లో కొంత హీరోయిన్ గ్లామ‌ర్ కాస్త కాపాడింది. సెకండాఫ్‌లో కొన్ని నిమిషాలు రాశీఖ‌న్నా బికినీలో క‌నిపిస్తుంది. సో కుర్ర‌కారుకు అదొక ట్రీట్‌. చూపుల్తో దీపాలా పాట కూడా సెకండాఫ్‌. అదో విజువ‌ల్ ట్రీట్‌. అక్క‌డ‌క్క‌డా కొన్ని ట్విస్టులు. సో సెకండాఫ్ గురించి పెద్ద‌గా చెప్పేదేమీ లేదు. కొంత‌లో కొంత తొలి స‌గ‌మే న‌య‌మ‌ని అనిపిస్తుంది. సినిమా సెకండాఫ్‌లో ల్యాగ్ అనిపిస్తుంది. సో బెంగాల్ టైగ‌ర్ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా.

ట్యాగ్‌లైన్: ఫస్ట్ హాఫ్ శుక్ర గ్రహం, సెకండ్ హాఫ్ శని గ్రహం

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 236 Views Last post September 28, 2015, 05:54:27 PM
by MbcMen
1 Replies 250 Views Last post October 20, 2015, 04:13:16 PM
by MbcMen
1 Replies 241 Views Last post December 11, 2015, 12:22:06 PM
by MbcMen
0 Replies 193 Views Last post December 11, 2015, 03:52:56 PM
by Rahul D
1 Replies 196 Views Last post December 15, 2015, 05:06:11 PM
by MbcMen