Author Topic: గూగుల్ ని రూ.800కి కొనేశాడు  (Read 300 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
ఇవాల్టి రోజున గూగులమ్మ లేనిదో ప్రపంచంలో చాలామందికి పొద్దుపోని పరిస్థితి. అలాంటి గూగులమ్మ వెబ్ సైట్ ని కేవలం రూ.800 కొనుగోలు చేసిన సన్మయ్ ఆ మధ్యన మీడియాలో ప్రముఖంగా కనిపించారు. గుజరాత్ లోని మండ్వీ ప్రాంతానికి చెందిన ఇతడు.. Google.comను కేవలం రూ.800కే కొనుగోలు చేసి సంచలనం సృష్టించాడు. లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే ఈ సైట్ ను సాంకేతికంగా చోటు చేసుకున్న లోపంతో సొంతం చేసుకొని.. 60 సెకన్ల పాటు దానికి ఓనర్ గా ఉన్న ఈ భారతీయ యువకుడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు.

జరిగిన పొరపాటును గుర్తించి..నాలుక్కర్చుకొని ఆ అమ్మకాన్ని రద్దు చేయటం తెలిసిందే. అయితే.. నిమిషం పాటు ఓనర్ అయిన సన్మయ్ కి గూగుల్ ప్రోత్సాహకంగా రూ.4.07లక్షల్ని నజరానాగా ప్రకటించింది. అయితే.. ఈ మొత్తాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ విద్యా కార్యక్రమానికి కేటాయిస్తానని సన్మయ్  ప్రకటించటంతో అతడి ఉదారతకు కదిలిపోయిన గూగుల్ తాను ఇస్తానన్న రూ.4.07లక్షల్ని రూ.8లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ ఉదంతంలో సన్మయ్.. గూగుల్ ఇద్దరిని అభినందించాల్సిందే.

తనలోని లోపాన్ని ఎత్తి చూపిన విషయంపై హుందాగా రియాక్ట్ కావటంతో పాటు.. సాంకేతికంగా ఉన్న లోపంతో నిమిషంపాటు ఓనర్ అయిన వ్యక్తిపై గుర్రుతనం ప్రదర్శించకుండా రూ.4 లక్షలు ఇస్తామని చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఆ మొత్తాన్ని సదరు వ్యక్తి తన సొంతానికి వాడుకోకపోవటాన్ని చూసి రెట్టింపు ఇవ్వాలనుకోవటం గూగుల్ గొప్పతనమైతే.. తనకు వస్తున్న మొత్తాన్ని తన అవసరాల కంటే కూడా సమాజానికి ఉపయోగించాలని భావించిన సన్మయ్ కూడా మొనగాడే.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
గూగుల్ ని రూ.800కి కొనేశాడు
« Reply #1 on: February 01, 2016, 06:18:57 PM »