Author Topic: Song Lyrics from Pawan Kalyan's Movies  (Read 654 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« on: February 26, 2016, 12:51:04 PM »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #1 on: February 26, 2016, 12:51:39 PM »
ఆరడుగుల బుల్లెట్టు

గగనపువీధి వీడి వలసవెళ్ళి పోయిన నీలి మబ్బు కోసం
 తరలింది తనకుతానే ఆకాశం పరదేశం
 శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
 విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం

 భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
 ఉక్కుతీగ లాంటి ఒంటి నైజం
 వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం
 రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
 శత్రువంటూ లేని వింత యుధ్ధం
 ఇది గుండె లోతు గాయమైన శబ్దం
 నడిచొచ్చే నర్తనశౌరీ పరిగెత్తే పరాక్రమశైలీ
 హలాహలం హరించిన ఖడ్గత్‌హృదయుడో
 వీడు ఆరడుగుల బుల్లెట్టు
 వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

 గగనపువీధి వీడి వలసవెళ్ళి పోయిన నీలి మబ్బు కోసం
 తరలింది తనకుతానే ఆకాశం పరదేశం
 శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
 విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం

 దివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటి
 వినిపించని కిరణం చప్పుడు వీడు
 వడివడిగా వడగళ్ళై దడదడమని జారేటి
 కనిపించని జడివానేగా వీడు
 శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
 శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో
 వీడు ఆరడుగుల బుల్లెట్టు
 వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

 తన మొదలే వదులుకుని పైకెదిగిన కొమ్మలకి
 చిగురించిన చోటుని చూపిస్తాడు
 తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికి
 తన తూరుపు పరిచయమే చేస్తాడు
 రావణుడో రాఘవుడొ మనసుని దోచే మానవుడో
 సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
 వీడు ఆరడుగుల బుల్లెట్టు
 వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

 గగనపువీధి వీడి వలసవెళ్ళి పోయిన నీలి మబ్బు కోసం
 తరలింది తనకుతానే ఆకాశం పరదేశం
 శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
 విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #2 on: February 26, 2016, 12:52:10 PM »
నిన్ను చూడగానే

నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
 నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

 నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
 నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే
 ఏమిటో ఏమాయో చేసినావే కంటిచూపుతోటి
 ఏమిటో ఇదేమిరోగమో అంటించినావే వంటివూపుతోటి
 ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

 నిన్ను చూడగానే నా చిట్టిగుండె
 నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
 నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

 అంతపెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేపకళ్ళ లోతుల్లో
 ఎట్టా నింపావే ఇరగదీసావే
 భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
 దాన్ని నువ్వు భూమిపైన పెరెగేస్తూ ఇట్టా తిరగేస్తూ తిరగరాసావే
 ఏ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తే చీమలా నేను వెంటపడనా
 నావలా నువ్వు తూగుతు నడుస్తూవుంటే కాపలాకి నేను వెంటరానా
 కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాంరావే మరదలా
 నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే

 ఆహుం ఆహుం ఆహుం ఆహుం
 అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓరమ్మా
 కొడలేలేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం
 ఓయ్ కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా
 పచ్చి పాలమీద మీగడేదమ్మా
 వేడి పాలలోన వెన్న ఏదమ్మా

 మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
 ఈ పాలసీసా అందాన్ని చూడనేలేదు ఇంక ఏంలాభం
 కోహినూరు వజ్రాన్ని ఎత్తికెళ్ళినోడు రాజైనా
 దాని మెరుపు నీలోని దాగి ఉందని తెలియలేపాపం
 ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేనుమాత్రం ఎంతనీ పొగిడి పాడగలనూ
 తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
 సిరివెన్నల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా

 నిన్ను చూడగానే నా చిట్టిగుండె
 నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
 నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #3 on: February 26, 2016, 12:53:20 PM »Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #4 on: February 29, 2016, 11:12:02 AM »
I am expecting same type of songs for Sardar Gabbar Singh also.

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #5 on: March 24, 2016, 01:15:38 AM »
SARDAAR GABBAR SINGH

పాట : ఓ పిల్లా.. సుభానల్లా..
గాయనీ గాయకులూ : విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్
సాహిత్యం : అనంత శ్రీరామ్

ఓ పిల్లా సుభానల్లా వచ్చావే ఎండల్లొ వెన్నెల్లా
నీవల్ల హల్లా గుల్ల అయ్యింది మనస్సు ఇవ్వాళ

నా ఖాఖీ చొక్కాని రంగుల్లో ముంచావే
నా లంగా ఓణీకి చీరల్లే సిగ్గందించావే

ఓ పిల్లా సుభానల్లా వచ్చావే ఎండల్లొ వెన్నెల్లా
నీవల్ల హల్లా గుల్ల అయ్యింది మనస్సు ఇవ్వాళ

నీ కళ్ళలో మాయున్నది, ఆ చూపులో మందున్నది
ఖైదీల అంతు చూసే నన్నే, ఖైదీలా కూర్చో పెట్టేసావే
నీ నవ్వులో మహిమున్నది, గిలిగింతలే పెడుతుందది
మౌనాన్ని వాటేసే నాతోనే, ఎదేదో మాటాడిస్తున్నాదే
ఏ ఈత రానోడ్ని గోదాట్లో తోసావే, మళ్ళీ మబ్బుల్లో తేల్చావే

ఓ పిల్లా సుభానల్లా వచ్చావే ఎండల్లొ వెన్నెల్లా
నీవల్ల హల్లా గుల్ల అయ్యింది మనస్సు ఇవ్వాళ

మామూలుగా మొండోడిని, ఏ మూలనో మంచోడిని
హయ్యయ్యో ఇపుడీ రెండూ కాక,  చంటోన్నయిపోయా నిను చూసాక
నేనెప్పుడూ నా దానిని, నాలా ఇలా నన్నుండనీ
మార్చావో వచ్చేస్తా నీ దాకా, నన్నైనా నేను ఆపలేక
నే కాల్చే తూటాలు పువ్వులా పుట్టాయే
నీ మెడలో దండెయిమన్నాయే

ఓ పిల్లా సుభానల్లా వచ్చావే ఎండల్లొ వెన్నెల్లా
నీవల్ల హల్లా గుల్ల అయ్యింది మనస్సు ఇవ్వాళ

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #6 on: March 24, 2016, 03:39:54 AM »
పాట : నీ చేప కళ్ళు..
గాయనీ గాయకులూ : సాగర్, చిన్మయి
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

చూడకు చూడకు చూపులు నాటకు  చెంపల మైదానంలో
చీటికి మాటికి సిగ్గులు రేపకు  ఒంపుల పూల వనంలో
అట్టా ఓ ఊపిరి గాలై తాకావో నువ్వు  నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు
సూరీడే నువ్వు చురుక్కు మంది అణువణువు   

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై  కందిపోయె నేడు ఎందుకిల్ల ఏ తీగ లాగావని
బంతిపూల సింగారమే రంగు రంగు బంగారమై  చెంత చేరుకుంది చేతులార నా జంట కావాలని 
నీలో ఎడమైపున చోటు నన్నే పిలిచింధి
అదిరే కుడివైపున కన్ను ఆహ అంటుంది
జొడీ కుదిరింది 

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

బుగ్గచుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టెయ్యనా  ఎప్పుడైతెనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా
పూల దండ మార్చాలిగా కౌగిలింత దండెయ్యనా  ఎక్కడైతెనే రేపో మాపో కళ్యాణమౌతుందిగా
అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుంది
అవునా నువ్వమాటంటే నాతో బాగుంధి
తోడే దొరికింది     

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #7 on: March 26, 2016, 11:43:42 AM »
I like Pawan Kalyan Song Lyrics...

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #8 on: March 31, 2016, 04:13:59 PM »
పాట : తౌబ తౌబా
గాయనీ గాయకులూ : ఎం.ఎం.మనసి, నకాశ్ అజిజ్
సాహిత్యం : అనంత శ్రీరామ్హే తోబ తోబ తోబ తోబ  తోడుగుంది  దిల్లురూబ 
 ఊపుగా తానొక్క స్టెప్పెస్తే  ఊరికే ఊరంత తిడతారే
 అప్సరలు ఇలాగే చిందేస్తే దేవతలు శభాషు అంటారే   
 ఊర్వశి రంభ మేనక  అంతా అచ్చం నీ టైపే 
 వాల్లకో రూల్ వీల్లకో రూల్  పెట్టమనడం తప్పు కాదా?
 తప్పు తప్పే పెద్ద తప్పే  తప్పు తప్పే సుద్ధ తప్పే

 దాన్ని నాట్యం దీన్ని మేళం  అంటు అనడం తప్పు కాదా   
 తప్పు తప్పె పెద్ద తప్పే  తప్పు తప్పె సుద్ధ తప్పే

హే తోబ తోబ తోబ తోబ  బాటిల్ ఎత్తై అంది ధాబా 
 మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజేసుకుంటారే 
 స్వర్గలొకంలో జనమంతా సుర్ అనే సారాని ఏస్తారే
 ఇంద్రుడు అండ్ కంపెని పగలు రాత్రి కొడతారే

 వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా ?
  తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే 

హే వాణ్ణి కింగు నిన్ను బొంగు అంటు అనడం తప్పు కాదా ?
  తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే 

హే తోబ తోబ తోబ తోబ పేకనట్టా దాచకబ్బా
 చేతిలో పేకున్న ప్రతివోడ్ని చేతకానోడల్లే చూస్తారే 
 తీసి పారెయ్యొద్దు జూదాన్ని ధర్మరాజంతోడు ఆడాడే
 భారతం జూదం వల్లే మలుపే తిరిగి అదిరింది
 వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా ?
 తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే 
 చుక్కకైన ముక్కకైన  సంకెళ్ళెస్తే తప్పు కాదా ?
 తప్పు తప్పే పెద్ద తప్పే  తప్పు తప్పే సుద్ధ తప్పే

 చుక్కనైనా ముక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా ?
 తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుద్ధ తప్పే

 ఇక్కడేస్తే తప్పు కాదా ?
 తప్పు తప్పే పెద్ద తప్పే

 ఇక్కడేస్తే తప్పు కాదా ?
 తప్పు తప్పే పెద్ద తప్పే     

 ఇక్కడేస్తే తప్పు కాదా ?
 తప్పు తప్పే పెద్ద తప్పే
 తప్పు తప్పే పెద్ద తప్పే
 తప్పు తప్పే పెద్ద తప్పే

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Song Lyrics from Pawan Kalyan's Movies
« Reply #9 on: April 01, 2016, 11:12:12 AM »
Nice,,i love very munch Pawan Kalyan song lyrics......

Related Topics

  Subject / Started by Replies Views Last post
10 Replies 2843 Views Last post April 27, 2012, 12:19:24 AM
by madhupatel
5 Replies 2787 Views Last post January 24, 2012, 08:01:02 PM
by pawanist
15 Replies 1729 Views Last post August 28, 2012, 07:43:11 PM
by haribabu015
7 Replies 1478 Views Last post August 12, 2013, 02:12:53 AM
by Abhimani
1 Replies 307 Views Last post February 26, 2016, 12:07:36 PM
by MbcMen