Author Topic: Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years  (Read 243 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« on: May 09, 2016, 02:37:33 PM »
Chiranjeevi, India's Best Dancer



Then number one heroine Vijayashanthi acted maximum number of films with Megastar Chiranjeevi than any other heroine. She paired up with Chiranjeevi in 19 films. 'Pasivadi Pranam', 'Yamudiki Mogudu', 'Athaku Yamudu Ammayiki Mogudu' and 'Gang Leader' stood as industry hits in the rocking combo of Chiranjeevi and Vijayashanthi apart from many blockbusters and super hits.


Chiranjeevi's 1991's industry hit film 'Gang Leader' completes 25 years of its release today. Speaking about Chiranjeevi Vijayashathi said, " Chiranjeevi garu stands the best dancer in India even today. Even though some heroes dance well in this generation, Chiranjeevi garu's style and grace is unmatchable. When I was conferred the best actress award for 'Karthavyam' movie by the national awards committee, Chiranjeevi garu arranged a grand party that evening and invited Bollywood actors Govinda and Divyabharathi apart from his family members. I have never seen such an appreciation from others when a heroine gets an award."

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« Reply #1 on: May 09, 2016, 03:13:51 PM »
మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి.. 1990ల్లో ఇదో క్రేజీ కాంబినేషన్. హీరోల్లో చిరంజీవికి - హీరోయిన్స్ లో విజయశాంతికి టాప్ రేంజ్ ఇమేజ్ ఉండేది. ఈ ఇద్దరూ కలిసి నటించే మూవీపై ముందునుంచే అంచనాలు పెరిగిపోయాయి. అలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కు ప్రముఖమైన స్థానం ఉంటుంది. ఇప్పుడీ సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్లు పూర్తైంది.

కొన్ని విషయాల్లో చిరంజీవికి సాటి రాగల వ్యక్తులు ఇప్పటికీ లేరు అంటున్నారు లేడీ అమితాబ్ గా గుర్తింపు  పొందిన విజయశాంతి. 'డ్యాన్సులు చేయడంలో ఇప్పటికీ చిరంజీవిని ది బెస్ట్ అనాల్సిందే. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ ఆయన. చిరంజీవికి పోటీ రాగల వాళ్లు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ లేరు. ఈ తరంలో కొంతమంది  హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నా.. చిరంజీవిలో ఉన్న స్పెషల్ స్టైల్ వీరిలో కనిపించదు. సొంతగా ఆయనకు ఉండే గ్రేస్ స్పెషల్ అస్సెట్.' అంటున్నారు విజయశాంతి.

అలాగే వ్యక్తిగా కూడా చిరు చాలా మంచి వారని చెప్పిన ఆమె.. గ్యాంగ్ లీడర్ కోసం భద్రాచలం కొండ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో 'కర్తవ్యం' చిత్రానికి ఉత్తమనటి అవార్డు వచ్చినట్లు తెలిసిందట. ఆ సాయంత్రమే పెద్ద పార్టీ అరేంజ్ చేసి చిరు ఫ్యామిలీతో పాటు గోవిందా - దివ్యభారతిలను కూడా పిలిచారట చిరు. ఓ హీరోయిన్ కు అవార్డు వస్తే ఈ స్థాయిలో అభినందించడం ఆయన్నే చూశానంటున్నారు విజయశాంతి.

source:tupaki.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« Reply #2 on: May 09, 2016, 03:34:21 PM »
Good dancer......

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« Reply #3 on: May 09, 2016, 04:14:07 PM »


’గ్యాంగ్ లీడర్’… సినిమా ఓ సంచలనం. ’సుప్రీమ్’ హీరో చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన సినిమా. ’గ్యాంగ్ లీడర్’ 1991 మే 9 న విడుదలైంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం చాలా దోహదం చేసింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి నటించింది. విజయశాంతి నటనతో పాటు గ్లామర్ ఈ సినిమాకు ఓ ప్లస్ పాయింట్. అంతవరకూ కుటుంబకథాచిత్రాలు చేస్తున్న విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అటు కుటుంబఅనుబంధాలు చూపుతూనే చక్కటి కమర్షియల్ సినిమాకు నిర్వచనంలా ఈ చిత్రం నిలిచింది. రావుగోపాల రావు విలనిజం, అల్లు రామలింగయ్య హాస్యం గుర్తుండిపోతాయి.

బప్పిలహరి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. జి ఏ యన్ జి గ్యాంగ్ అనే పాటకానీ, భద్రాచలం కొండ, వానా వానా వెల్లువాయే పాట కానీ, సండే అననురా మండే అననురా అనేపాట కానీ ఏ పాటకాపాట ప్రత్యేకం. ప్రభుదేవా సమకూర్చిన డ్యాన్సులు ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు పోటీపడి విజయశాంతి డ్యాన్స్ చేసింది. ఈ సినిమా 100 రోజుల పండుగను (శతదినోత్సవం) తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు జరుపుకుని సంచలనం సృష్టించింది. ఇందుకోసం అప్పట్లో ప్రత్యేక విమానాన్ని వాడారు. అలాగే పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ’చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను’ అన్న చిరంజీవి డైలాగు ఈ చిత్రంలోనిదే. ఈ సినిమాలో లోక్ సింగ్ ఫోటోగ్రఫీ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.

source:123telugu.com

Offline SRG

  • Newbie
  • *
  • Posts: 34
  • Megafan
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« Reply #4 on: May 09, 2016, 07:33:07 PM »
 :clap: :clap:

Keka movie..

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« Reply #5 on: May 10, 2016, 02:52:13 PM »
’గ్యాంగ్ లీడర్’… సినిమా ఓ సంచలనం. ’సుప్రీమ్’ హీరో చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన ’గ్యాంగ్ లీడర్’ 1991 మే 9 న విడుదలైంది. గ్యాంగ్ లీడర్ సినిమా పాతిక సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అభిమానులు ఆ సినిమాలో తమకు నచ్చిన సన్నివేశాలను, డైలాగ్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారి సరసన మెగాపవర్ రామ్ చరణ్ కూడా చేరారు.

గ్యాంగ్ లీడర్ లో బాగా పాపులర్ అయిన ’’చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తా’ అన్న చిరంజీవి డైలాగుని డబ్ స్మాష్ చేసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. రామ్ చరణ్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవడంతో పాటు రామ్ చరణ్ గ్యాంగ్ లీడర్ రీమేక్ చేస్తాడన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

source:123telugu.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Chiranjeevi Annyya's Gand Leader Completes 25 years
« Reply #6 on: May 12, 2016, 02:13:35 PM »
I like very munch this movie

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
11 Replies 1006 Views Last post July 23, 2012, 11:05:14 PM
by haribabu015
1 Replies 656 Views Last post August 22, 2012, 10:04:23 PM
by manikumar18
1 Replies 645 Views Last post May 09, 2014, 08:55:08 AM
by charan fan
1 Replies 339 Views Last post October 23, 2015, 12:42:51 PM
by MbcMen
5 Replies 393 Views Last post November 20, 2015, 04:26:18 PM
by MbcMen