Author Topic: ‘గంగోత్రి’ చూస్తే దాక్కోవాలనిపిస్తుంది  (Read 356 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
స్టైల్‌, డ్యాన్స్‌, నటన... ఇలా అన్ని విషయాల్లోనూ వైవిధ్యం చూపిస్తున్న కథానాయకుడు అల్లు అర్జున్‌. యువతను ఆకట్టుకొంటూనే, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవ్వడం బన్నీకి బాగా తెలుసు. కథానాయకుడిగా 13 ఏళ్ల ప్రయాణం బన్నీది. ఇటీవల ‘సరైనోడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ కబుర్లివీ...

మొత్తానికి ‘వూర మాస్‌’ అనిపించుకొన్నారు...
 (నవ్వుతూ) అలాంటి పేరూ తెచ్చుకోవాలి కదా? ఆ మాసిజాన్ని స్టైలిష్‌గా చూపించారు బోయపాటి శ్రీను. మా టార్గెట్‌ ఆడియన్స్‌ మాసే. వాళ్లకు ఈ సినిమా నచ్చాలనుకొన్నాం. అదే జరిగింది. మా సొంత సంస్థ గీతా ఆర్ట్స్‌లో దాదాపు అందరు కథానాయకులకీ పెద్ద విజయాలున్నాయి... నాకు తప్ప. ఆ లోటు ‘సరైనోడు’ తీర్చింది.
సొంత సంస్థలో సినిమా కాబట్టి బాగా ఖర్చుపెట్టించుకొన్నారా?
ఆ సౌలభ్యాలు ఉంటాయి. ఈ సినిమా కోసం బొలీవియాలో ఓ పాట తెరకెక్కించాం. దాని కోసం చాలా ఖర్చుపెట్టాం. సొంత సంస్థ కాబట్టి ‘ఈ పాట అక్కడే తీయాలి’ అని పట్టుబట్టి మరీ చేయించుకొన్నా.

సినిమా విడదలయ్యాక వసూళ్ల లెక్కలు చూసుకొంటారా?
చూస్తా కానీ వాటికి పెద్దగా ప్రాధాన్యమివ్వను. అవి శాశ్వతం కాదు. ప్రతి రెండేళ్లకూ లెక్కలు మారిపోతుంటాయి.

రొటీన్‌, కమర్షియల్‌ చిత్రాలకే ఇప్పుడు గిరాకీ ఉందంటారా?
కొత్త కథ చూస్తున్నామా, రొటీన్‌ సినిమానే చూస్తున్నామా? అనే ఆలోచన ప్రేక్షకులకు ఉండదు. కొత్త కథ అయినా, పాత కథ అయినా జనాలకు నచ్చాలి. అంతే.

గతంతో పోలిస్తే మీరు మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు...
వయసు పెరుగుతోంది కదండీ. దాంతోపాటు అవగాహనా పెంచుకోవాల్సిందే. నా బలాలేంటి? బలహీనతలేంటి? అనే విషయంపై నాకు అవగాహన ఉంది. నా పరిమితులు నాకు తెలుసు.

‘సరైనోడు’ వేడుకలో ‘పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌...’ అన్నారు. దాని గురించి సోషల్‌ మీడియాలో బాగా చర్చ జరిగింది?
ఇప్పుడూ అదే మాట... ‘పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌’. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి.

మీ సినిమా విడుదలవుతోందంటే ఫలితం గురించి టెన్షన్‌ పడతారా, లేదంటే ముందే తెలిసిపోతుందా?
కొన్ని సినిమాల ఫలితం ముందే తెలిసిపోతుంది. నా సినిమా అయినా సరే, ఓ ప్రేక్షకుడిగానే చూస్తా. ముందు నాకు నచ్చితే అప్పుడు ఫలితం గురించి పట్టించుకోను. ఓ సినిమా బాగా ఆడినా ఆడకపోయినా ఏదో ఓ బలమైన కారణం ఉండి ఉంటుంది.

సెట్‌కి వెళ్లే ముందు హోమ్‌ వర్క్‌ ఏమైనా చేస్తారా?
రేపటి సన్నివేశం ఏమిటి? ఏం తీస్తున్నాం అనే విషయాల్ని దర్శకుడితో కూర్చుని చర్చిస్తా. నావరకూ కొత్తగా ఏం చేయగలను? అనే విషయాలపై దృష్టి పెడతా.

మీ తొలి సినిమా ‘గంగోత్రి’కీ ఇప్పటికీ చూస్తే బన్నీ భలే మారిపోయాడనిపిస్తుంది. ఆ మార్పు ఎలా సాధ్యమైంది?
‘గంగోత్రి’ సమయంలో నాకు సినిమా గురించి తెలీదు. రాఘవేంద్రరావు గారు చెప్పారు, నేను చేసేశానంతే. ‘ఆర్య’ వచ్చేసరికి చాలా విషయాలు అర్థమయ్యాయి. అందుకే ‘గంగోత్రి’కీ, ‘ఆర్య’కీ చాలా తేడా కనిపిస్తుంది.

‘గంగోత్రి’ ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది?
దాక్కోవాలనిపిస్తుంది... (నవ్వుతూ). సాధారణంగా నా పాత సినిమాలు, నా పాత పాటలు ఎక్కువగా చూస్తుంటా. ఎక్కడ ఎదగాలో, ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

చిరు పాటల్ని రీమిక్స్‌ చేసే అవకాశం ఉన్నా, ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు?
నాకు భయం. చిరంజీవిగారు ఓ పాటకు డ్యాన్స్‌ చేశారంటే అది వంద శాతం పక్కాగా ఉంటుంది. ఎలాగూ వంద శాతాన్ని దాటుకుని వెళ్లలేం. అలాంటప్పుడు ఆ రిస్క్‌ తీసుకోవడం ఎందుకు?

డ్యాన్స్‌ విషయంలో అప్‌డేట్‌ అవ్వాల్సిన సమయం వచ్చిందంటారా?
అవును. నా డ్యాన్స్‌ నాకే బోర్‌ కొడుతోంది. నా బాడీ ఎంత తిరగాలో అంతా తిరిగేసింది. ఇప్పుడు నా నటనతోనే వాళ్లని మెప్పించాలి. అలాగని డ్యాన్స్‌ని వదల్లేను కదా? నా పరిధిలోనే ఎంత చేయాలో అంతా చేసి చూపించాల్సిందే.

మన హీరోలు ప్రయోగాత్మక చిత్రాలవైపు ఎందుకు దృష్టి పెట్టడం లేదు?
అంతా కమర్షియల్‌ కోణంలోనే ఆలోచిస్తున్నాం. ఒకవేళ కొత్తగా చేద్దామని ఉన్నా, అలాంటి కథలు వినిపించే దర్శకులెక్కడున్నారు? నా దృష్టిలో రూల్స్‌ తెలిసినవాళ్లే బ్రేక్‌ చేయగలరు. కమర్షియల్‌ సినిమా అంటే ఏమిటో తెలిసినవాళ్లే దాన్ని దాటుకొని ప్రయోగాత్మక చిత్రాలు చేయగలరు.

మల్టీస్టారర్‌ సినిమాలకు సిద్ధమా?
ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. సోలోగా మరో రెండు మూడు సినిమాలు చేయాలి. అప్పుడు మల్టీస్టారర్‌ గురించి ఆలోచిస్తానేమో?


‘‘వీలున్నప్పుడల్లా అయాన్‌తో సమయం గడుపుతున్నా. వాడు నా సినిమాలు ఇంకా చూళ్లేదు. వీడియోగేమ్స్‌కి అలవాటు పడిపోతాడేమో అని ఇంట్లో టీవీ తీసేశా. నా సెల్‌ఫోన్‌లో అప్పుడప్పుడూ పాటలు చూస్తుంటాడు. వాడికి ‘బాహుబలి’ పాటలంటే ఇష్టం. మా ఆవిడ నా సినిమాల గురించి పెద్దగా పట్టించుకోదు. చెబితే వింటుందంతే. నా సినిమాల సెట్‌కి అరుదుగా వస్తుంటుంది’’.
‘‘సరైనోడు’ సమయంలో కండలు పెంచాల్సివచ్చింది. అందుకే కొత్త డైట్‌ విధానం ఫాలో అయ్యా. రోజుకి ఆరు విడతలలో భోజనం చేసేవాణ్ని. సినిమా అయిపోయింది కదా? ఇప్పుడు రెగ్యులర్‌ డైట్‌లోకి వచ్చేశా. షూటింగ్‌ ఉన్నప్పుడు వారానికి నాలుగుసార్లు జిమ్‌ చేస్తుంటా. లేదంటే రోజుకి రెండు పూటలూ జిమ్‌లో గడుపుతా’’
 ‘‘రివ్యూలు రాసేవాళ్లకు సినిమా గురించి తెలీదేమో అనిపిస్తుంటుంది. రాసేవాళ్లంతా బాగా చదువుకొన్నవాళ్లే కావొచ్చు. వాళ్ల స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. 4జీ, వాట్సాప్‌ అంటూ ఎక్కడో ఉండిపోయారు. వాళ్లకు సీ క్లాస్‌ ఆడియన్స్‌ పల్స్‌ ఎలా తెలుస్తుంది? సినిమాని సినిమాలా చూసి సమీక్షించేవాళ్లు నాకు ఇక్కడ కనిపించడం లేదు’’


source:eenadu.net

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
అల్లు అర్జున్‌.. సూపర్‌ డాన్సర్‌.ఫైట్లు అదరగొట్టేస్తాడు.. పెర్‌ఫార్మ్సెన్స్‌ విషయంలో వంక పెట్టలేం. కథల ఎంపికలో తనదైన ముద్ర చూపిస్తాడు.. మధ్యమధ్యలో గోనగన్నారెడ్డిలాంటి పాత్రల్లోనూ మెప్పిస్తాడు. అందుకే.. బన్నీ ఓ ఆల్‌రౌండర్‌ అయిపోయాడు. తెలుగులోనే కాదు, మలయాళంలోనూ బన్నీకి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తమిళంలోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకోవాలని చూస్తున్నాడు. కథానాయకుడిగా బన్నీ ప్రయాణం మొదలై పదమూడేళ్లు గడిచాయి. ఆ ప్రయాణం ఎలా సాగింది? ఏం నేర్చుకొన్నాడు? తన ప్రణాళికలేంటి? ఈ విషయాలపై సితారతో తన అభిప్రాయాలు పంచుకొన్నాడు.
డాన్స్‌.. డాన్స్‌
‘‘నా సినిమాలంటే డాన్స్‌లు ఆశిస్తారు. నేను కూడా వాళ్ల అంచనాలకు తగినట్టు కనిపించడానికి నావంతుగా కష్టపడుతున్నా. సినిమాలో ఆరు పాటలుంటే.. ఆరు పాటల్లోనూ వైవిధ్యమైన స్టెప్పులు వేయాలనుకొనేవాడ్ని. అయితే రాను రాను.. ఓ పాట ప్రత్యేకంగా ఉన్నా సరిపోతుందనిపిస్తోంది. ఎందుకంటే నా బాడీ ఎలా తిరగాలో ఎంత తిరగాలో అంతా తిరిగిపోయింది.. 360 డిగ్రీలలో ఏ డిగ్రీ వదల్లేదు.. (నవ్వుతూ). నా డాన్స్‌ నాకే బోర్‌ కొడుతోంది. దానిలోంచి బయటపడాలి. డాన్సింగ్‌ స్టైల్‌ మార్చుకోవాలి. డాన్స్‌ మాస్టర్లూ కొత్త ఆలోచనలతో వచ్చినప్పుడే అది సాధ్యం. కేవలం డాన్సులతోనే ఇప్పుడు నేను ఆడియన్స్‌కి షాక్‌ ఇవ్వలేను. కేవలం నా నటనతోనే వాళ్లకు దగ్గరవ్వగలను. అందుకోసమే ప్రయత్నిస్తున్నా..’’

ఎవరికి వాళ్లే
 ‘‘లెగస్సీ అనేది పెద్దగా పట్టించుకోను. మాకో ఫ్లాట్‌ ఫామ్‌ అందించడం వరకే అది పనిచేస్తుంది. ఆ తరవాత ఎవరి టాలెంట్‌ వాళ్లు చూపించాల్సిందే. థియేటర్లో నా సినిమా ఉంది కదా అని చూసేయరు... బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఓ సినిమా ఎంత చేయాలో అంతా చేస్తుంది. దానిపై ఎవరి ప్రభావమూ ఉండదు. మా కుటుంబంతో చాలామంది హీరోలున్నారు. అయితే ఎవరి స్టైల్‌ వాళ్లదే. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి తెచ్చుకొంటారు తప్ప.. కాపీ కొట్టరు. నాకు చిరంజీవిగారంటే, పవన్‌ కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లని అనుసరించను. నా దారి నాదే. చరణ్‌ కూడా అంతే. తనకంటూ ఓ స్టైల్‌ని పంపాదించుకొన్నాడు. వరుణ్‌ తేజ్‌ కథల్ని ఎంచుకొనే విధానం నాకు బాగా నచ్చుతుంది. కొత్త పంథాలో వెళ్తున్నాడు. ఇక సాయిధరమ్‌ అయితే... తనది పూర్తిగా కమర్షియల్‌ దారి. నా తమ్ముడు శిరీష్‌ కూడా విభిన్నంగానే ప్రయత్నిస్తున్నాడు. తాను నమ్మిన కథలతోనే ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది’’

ఫ్లాప్‌ అవుతుందని ముందే తెలుసు
‘‘నా పాత సినిమాలన్నీ అప్పుడప్పుడూ వేసుకొని ఓసారి చూస్తుంటా. ఇది వరకు నా సినిమా చూసుకొంటే నేను మాత్రమే కనిపించేవాడ్ని. నేనెలా చేశా, నా డ్రస్సు ఎలా ఉంది? తప్పులేమైనా చేశానా? ఇవి మాత్రమే గమనించేవాడ్ని. సినిమాని సినిమాగా చూడలేకపోయాను. ఇప్పుడు సినిమాని సినిమాలా చూస్తున్నా. మిగిలినవాళ్ల తప్పులూ కనిపిస్తున్నాయి. సినిమా ఆడుతుందా, లేదా? అనే విషయం ముందే తెలిసిపోతుంది. ‘ఈ సినిమా తప్పు చేయదు’ అనే నమ్మకం నాకొస్తే.. తప్పకుండా అది హిట్టవుతుంది. ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’కి అలానే అనిపించింది. ‘వరుడు’ ఫ్లాప్‌ అవుతుందని అప్పుడే తెలిసిపోయింది. ఏ సినిమాకి రావాల్సిన ఫలితం దానికి వస్తుంది. ఓ సినిమా పోయిందంటే.. వూరకే పోదు. దానికి తప్పకుండా ఓ బలమైన కారణం ఉంటుంది’’

ప్రయోగాల మాటేంటి?
‘‘రొటీన్‌ సినిమా, కొత్త సినిమా అనేది నేను చూడను. గుడ్‌ సినిమా, బ్యాడ్‌ సినిమా మాత్రమే ఉంటాయి. రొటీన్‌ సినిమా కదా అని ప్రేక్షకులు తిరస్కరించరు. మరీ కొత్తగా ఆలోచించారు కదా అని నెత్తిన పెట్టుకోరు. బేసిగ్గా వాళ్లకు సినిమా నచ్చాలంతే. తెలుగులో రొటీన్‌ కథలే ఎక్కువ వస్తుంటాయి. అలాంటి సినిమాలు చూసేవాళ్లు, చేసేవాళ్లు ఎక్కువమంది ఉన్నారు. కొత్తగా ఆలోచించే దర్శకులు కరవయ్యారు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలన్నా భయమే. స్టార్‌ హీరో అవకాశం ఇవ్వగానే వాళ్లకు సరిపడా కథలనే రాసుకొస్తారు. సూర్యలాంటి కథానాయకులు తెలుగులోనూ ఉంటే బాగుంటుంది. నా వరకూ ప్రయోగాలు చేస్తా. కాకపోతే.. కమర్షియల్‌ పంథా విడిచిపెట్టను’’

స్పీడు పెంచాలి
 ‘‘పరిశ్రమలోకి అడుగుపెట్టి పదమూడేళ్లు అయిపోయింది. ఎక్కడ ‘గంగోత్రి’.. ఎక్కడ ‘సరైనోడు’. ఈ ప్రయాణం, నాలో వచ్చిన మార్పు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సినిమా సినిమాకీ నేర్చుకొన్నాను. నేర్చుకొంటూనే ఎదిగాను. ఈ ప్రయాణంలో ప్రతీ సినిమా ప్రత్యేకమే. నాకొచ్చిన అవకాశాల పట్ల, చేసిన సినిమాల పట్ల సంతృప్తిగా ఉన్నా. ‘అరె... ఫలానా సినిమా చేయాల్సిందే’ అని ఎప్పుడూ అనుకోలేదు. అయితే.. స్పీడు పెంచాల్సిన అవసరం గుర్తించా. ఎక్కువ సినిమాలు చేస్తే నటుడిగా మరింత ఎదిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఎక్కువమందికి చేరువ కావొచ్చు. ఓ సినిమా మాస్‌కి నచ్చితే, మరో సినిమా యువతరానికి నచ్చొచ్చు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తే... అందరికీ నచ్చే సినిమాలు క్యాటర్‌ చేయొచ్చు’’

source:www.eenadu.net

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
0 Replies 320 Views Last post October 16, 2014, 09:05:54 AM
by siva