Author Topic: ఆ ఫీలింగ్ చూపడంలో మెగా ఫ్యామిలీ కేక  (Read 345 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
ఇప్పుడంటే మెగా-నందమూరి రైవల్రీ అని మాట్లాడుతున్నారు కాని.. అప్పట్లో అయితే మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ రైవల్రీ చాలా అధికంగా ఉండేది. ఎందుకంటే.. 80వ దశకంలో చిరంజీవి 'ఖైదీ' వంటి సినిమాలను చేస్తూ టాప్ రేంజ్ కు వచ్చేసరికి.. అప్పటికే అక్కడ నెం.1 స్థానంలో కూర్చుంది సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఆల్రెడీ ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ హడావుడి కాస్త ఫేడైంది. అందుకే అప్పట్లో ధియేటర్స్ లో కృష్ణ వర్సెస్ చిరు అభిమానుల మధ్య ఒకలాంటి రచ్చలు జరుగుతూనే ఉండేవట.

కట్ చేస్తే.. అసలు ఇటువంటి రైవల్రీలతో సంబంధం లేకుండా.. స్వయంగా 'మెగా' ఫ్యామిలీ మెంబర్లే ఇతర హీరోల ఫ్యాన్లు. వారు దానిని ఓపెన్ గా ఎడ్మిట్ చేసేవారు కూడా. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి తల్లిగారైన అంజనమ్మ.. అక్కినేని అభిమాని. ఆవిడ ధియేటర్లలో కొడుకు చిరంజీవి సినిమాలు ఆడుతున్నా కూడా.. ముందు అక్కినేని సినిమాలను చూసి.. ఆ తరువాతే కొడుకు సినిమా చూసేవారట. అంత అభిమానం ఆవిడకు. స్వయంగా మెగాస్టార్ ఈ విషయం ఎన్నోసార్లు చెప్పారు. అదే విధంగా.. ఎంతో రైవల్ అనుకున్న బాలయ్య అంటే చరణ్ కు చాలా ఇష్టం. అప్పట్లో ఒక పిల్లాడు బాలయ్య డైలాగులు మీ ముందు చెప్పకూడదు అంటే.. దానిదేముంది.. నాక్కూడ బాలయ్య అంటే ఇష్టం.. డైలాగులు చెప్పు అన్నాడు చరణ్. ఆ తరువాత శ్రీమంతుడు సినిమా నచ్చిందని కూడా చరణ్ ఒక్కడే తనకు ఫోన్ చేసి విషెస్ చెప్పాడని స్వయంగా మహేష్ బాబే చెప్పాడు.

మొన్నామధ్యన.. మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా.. మీకు ఎవరంటే ఇష్టం అని వరుణ్ తేజ్ ను అడిగితే.. తడుంకోకుండా ప్రభాస్ పేరు చెప్పేశాడు. అలాగే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా అంతే. గూడఛారి 116 అండ్ మోసగాళ్లకు మోసగాడు పోస్టర్ ను ట్వీట్ చేసి మరీ కృష్ణ కు అభినందనలు తెలియజేశాడు. ఒకప్పుడు ఉన్న మెగా-కృష్ణ రైవల్రీ గురించి తెలిసినవారు ఈ ట్వీట్లను చూసి కాస్త అవాక్కయ్యారు. ఏదేమైనా కూడా.. ఇతర హీరోలపట్ల ఉన్న అభిమానాన్ని చూపించడంలో మెగా హీరోల రూటే సెపరేటబ్బా!! కేక అంతే!!

source:tupaki.com

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Kevvu keka...............

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 12,235
 • DIE HARD FAN OF POWERSTAR
హీరోలలో మెగా హీరోలు వేరయా అనుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఒకరితో సక్సెస్ కొట్టగలిగితే మరో హీరోనుంచి ఆఫర్ రావడం.. ఒకసారి ఆ టీమ్ లోకి ఎంటర్ అవగలిగితే.. ఫ్లాప్ వచ్చినా అండగా నిలబడేవారు కావడమే ఇందుకు కారణం. వీటికి తోడు.. ఇప్పుడు పక్క హీరోల సినిమాలకు కూడా సపోర్ట్ చేస్తూ.. మెగా కుర్రాళ్లు మరీ మంచోళ్లయిపోతున్నారు.

తమ సినిమాలకు తప్ప పక్కనోళ్ల మూవీస్ ని పట్టించుకోని అలవాటు టాలీవుడ్ హీరోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ మెల్లగా మారుతోంది. అలా మార్చేస్తోంది మెగా కుర్రాళ్లే కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ని సపోర్ట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. ట్రైలర్ చూశానని.. ఎన్టీఆర్ రాకింగ్ అని.. హీరోలను కొరటాల క్లాసీగా చూపిస్తాడని అంటున్నాడు వరుణ్ తేజ్. ఇది లేటెస్ట్ అయితే.. గతంలో నారా రోహిత్-తారకరత్నలు నటించిన రాజా చెయ్యి వేస్తే చిత్రానికి సపోర్ట్ చేశాడు సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్.

ఎన్టీఆర్ కి మద్దతుగా వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తే.. తారక్ అన్నయ్యకి బెస్ట్ విషెస్ అంటూ వీడియో బైట్ కూడా ఇచ్చాడు తేజు. వీళ్ల కంటే నాలుగు అఢుగులు ముందే ఉన్నాడు మెగా పవర్ స్టార్. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా.. సక్సెస్ అయినా తనే ఫోన్ చేసి విషెస్ చెప్పేస్తూ ఉంటాడు. శ్రీమంతుడు రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత.. రామ్ చరణ్ తప్ప వేరే ఎవరూ ఫోన్ కూడా చేయలేదని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి మెగా కుర్రాళ్లు ట్రెండ్ మార్చేస్తున్నట్లే కనిపిస్తోంది.

source:tupaki.com

 

Related Topics