Author Topic: A Contest to Meet Ram Charan  (Read 163 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
A Contest to Meet Ram Charan
« on: July 07, 2016, 02:15:54 PM »


Here is a great opportunity for mega fans to meet their fvourite hero Mega Power Star Ram Charan. A contest has been announced to meet Ram Charan on 'Dhruva' sets. According to it, mega fans who wish to meet Ram Charan should create a video that has a dialogue of Ram Charan enacted by the fans and dubsmash it under the tag MyDubForRam. The winner of the contest can get a chance to meet Ram Charan on 'Dhruva' sets.

Meanwhile, Ram Charan has recently met mega fans of Guntur, Krishna and Prakasham and appreciated the charitable works conducted by them. Also, Ram Charan is planning for a week long birthday celebrations of Megastar Chiranjeevi involving a big number of mega fans across the Telugu states.

'Dhruva's shoot is currently progressing on a rapid pace. Rakul Preet Singh pairs up with Ram Charan in this stylish action thriller. Hip Hop Tamizha scored the music of the movie. Surender Reddy has directed the movie on Geetha Arts.

source:cinejosh.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
A Contest to Meet Ram Charan
« Reply #1 on: July 08, 2016, 11:33:52 AM »
Good opportunity for fans

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
A Contest to Meet Ram Charan
« Reply #2 on: July 15, 2016, 01:39:45 PM »
రామ్ చరణ్ ధృవ మూవీ హై రేంజ్ స్పీడ్ లో ఫినిష్ అయిపోతోంది. ఆగస్ట్ 15న ఫస్ట్ లుక్.. అక్టోబర్ లో సినిమా రిలీజ్ ఖాయమంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పేశాడు. మరి చెర్రీ చేయనున్న నెక్ట్స్ మూవీ ఏంటి? ఇదే ప్రశ్న చరణ్ ని నేరుగా ఫేస్ బుక్ లైవ్ లో ఓ అభిమాని అడిగాడు.

''నా నెక్ట్స్ సినిమా సుకుమార్ గారితో ఉంటుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కన్ఫాం అయింది. దీన్ని అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది'' అంటూ క్లారిటీ ఇచ్చాడు చరణ్. ఇక చేయాలని అనుకుంటున్న సినిమాలపై కూడా చాలానే సవాళ్లు చెర్రీకి ఎదురయ్యాయి. ''గౌతమ్ మీనన్ సినిమాలు నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఆల్మోస్ట్ ప్రతీ మూవీ చూస్తాను. త్వరలో ఆయనతో ఓ మూవీ చేస్తానని అనుకుంటున్నా'' అని ఫ్యాన్ కి జవాబిచ్చిన చరణ్.. మురుగదాస్ తో కూడా ఏదో ఒక రోజు పని చేయడం ఖాయమని చెప్పడం విశేషం. ఇక డెబ్యూ డైరెక్టర్లతో సినిమా అంటే చాలా ఉత్సాహమని.. తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు.

వీటన్నిటికంటే చెర్రీకి ఎదురైన టఫ్ క్వశ్చన్ ఏంటంటే.. బాలీవుడ్ లో మళ్లీ ట్రై చేస్తారా అనే. జంజీర్ తో ఓ సారి దెబ్బ తిన్నాడు కాబట్టి.. దీనికి నో అనే ఆన్సర్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారంతా. కానీ ''బాలీవుడ్ లో మళ్లీ ప్రాజెక్ట్.. మంచి సబ్జెక్ట్ దొరకాలే కానీ ఎక్కడైనా చేస్తా.. అది తమిళ్ కావచ్చు.. బాలీవుడ్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ఏ మూవీ చేసేందుకైనా నేను రెడీ'' అంటూ తన బాలీవుడ్ ఫ్యూచర్ పై ఓ స్పష్టత ఇచ్చాడు మెగా పవర్ స్టార్.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
A Contest to Meet Ram Charan
« Reply #3 on: July 15, 2016, 01:42:11 PM »
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా పేరు కత్తిలాంటోడు అన్నది నిజమేనా.. రామ్ చరణ్-సుకుమార్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ధ్రువ ఫస్ట్ లుక్ ఎప్పుడు.. రిలీజ్ డేట్ ఏది..? ఈ విషయాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఐతే రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాల్లో ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఇవాళ సాయంత్రం ఫేస్ బుక్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన చరణ్ తన సినిమాలు.. తన తండ్రీ రీఎంట్రీ మూవీతో పాటు మరికొన్ని అంశాలపై మాట్లాడాడు. ఆ చిట్ చాట్ లో చరణ్ చెప్పిన కొన్ని ముచ్చట్లు..

* చిరంజీవి 150వ సినిమా టైటిల్ కత్తిలాంటోడు కాదు. ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు. త్వరలోనే ప్రకటిస్తాం.

* కొందరు మెగా అభిమానుల్ని సెలక్ట్ చేసి చిరంజీవి 150వ సినిమా సెట్స్ లో ఆయన్ని కలిసే అవకాశం కల్పిస్తాం.

* సుకుమార్ తో నేను చేయబోయే తర్వాతి సినిమా అక్టోబరులో మొదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

* బాబాయి పవన్ కళ్యాణ్ బేనర్లో నేను చేయబోయే సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది.

* ధ్రువ ఫస్ట్ లుక్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలవుతుంది. సినిమా అక్టోబరు 7న రిలీజ్ చేస్తాం.

* ప్రభాస్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ మధ్యే బాహుబలి సెట్స్ లో అతణ్ని కలిశాను.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
A Contest to Meet Ram Charan
« Reply #4 on: July 15, 2016, 01:44:14 PM »
సోషల్ మీడియా.. స్టార్లను ఫ్యాన్స్ ను దగ్గర చేసేసింది. ఎప్పుడో ఎక్కడో నిలబడే చూసే రోజులు పోయాయి. నేరుగా తమ మనసులో ఏముందో అడిగే అవకాశాన్ని సోషల్ మీడియా కల్పించింది. ఫేస్ బుక్ లో రామ్ చరణ్ లైవ్ లో.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు. రెండు గంటల వ్యవధిలో లక్షల మంది వ్యూయర్స్ లైవ్ చూడ్డం.. 70 వేల కామెంట్లు.. వేల కొద్దీ లైక్స్.. ఇదంతా చూస్తే చెర్రీ స్టామినా అర్ధం కావడం లేదూ.. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ ఓపెన్ హార్ట్ తో సింపుల్ అండ్ సూపర్బ్ గా ఫ్యాన్స్ తో పంచుకున్న సంగతులేంటో చూద్దాం.

' డాడీ 150వ సినిమాలో ఆన్ స్క్రీన్ కనిపిస్తానో లేదో తెలీదు.. కానీ ఆఫ్ స్క్రీన్ లో నేను ప్రొడ్యూసర్. ఆయనే సోలో హీరో. మేబీ ఓ సాంగ్ చేస్తే చేయచ్చు.. అది కూడా వినాయక్ గారి డెసిషన్ పై ఆధారపడి ఉంటుంది' అంటూ మెగాస్టార్ 150పై మాట్లాడిన చరణ్.. చిరు సినిమాకి కత్తిలాంటోడు టైటిల్ కాదని.. త్వరలో మంచి టైటిల్ అనౌన్స్ చేస్తామని చెప్పాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు అంటూ వందల కొద్దీ క్వశ్చన్ చేశారు. 'పవన్ కళ్యాణ్ గారితో సినిమా వచ్చే ఏడాది ఉండొచ్చు. మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్. మీకంటే నేనే ఎక్కువ ఎదురుచూస్తున్నా' అన్నాడు చెర్రీ.

ఇక తన మూవీ ధృవ అద్భుతంగా షూటింగ్ జరుగుతోందని.. ఫస్ట్ లుక్ ను ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 15న) రోజున విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పిన చెర్రి.. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేస్తామని చెప్పాడు. 'మల్టీస్టారర్ అంటే గుడ్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఐ లవ్ మల్టీ స్టారర్స్. పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ అంటే.. మా ఇద్దరి కమిట్ మెంట్స్ పూర్తయ్యాక కలిసి చేస్తాం' అని ఆన్సర్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేసేశాడు చెర్రీ.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
A Contest to Meet Ram Charan
« Reply #5 on: July 15, 2016, 01:59:27 PM »
మొట్టమొదటిసారిగా ఫేస్ బుక్ లైవ్ ద్వారా దాదాపు 13 నిమిషాలపాటు తన అభిమానులతో "లైవ్ చాట్" చేసిన రామ్ చరణ్ తాను నటిస్తున్న "ధృవ" గురించి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తున్న 150వ చిత్రం గురించి చాలా విశేషాలు చెప్పాడు. ఆ విశేషాలు మీకోసం..!!

ధృవ సినిమా గురించి...

>> సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న "ధృవ" చిత్రం ఫస్ట్ లుక్ ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారట.

>> అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో "ధృవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

>> "ధృవ" కాశ్మీర్ షెడ్యూల్ లో చరణ్ విపరీతంగా ఎంజాయ్ చేశాడట, కుదిరితే కుటుంబంతో సహా అందర్నీ కాశ్మీర్ కు సెలవులకు వెళ్ళమని చెబుతున్నాడు.

మెగా 150వ సినిమా గురించి..

>> ప్రచారంలో ఉన్నట్లుగా చిరంజీవి 150వ చిత్రం టైటిల్ "కత్తిలాంటోడు" కాదు అని చరణ్ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం మంచి టైటిల్ అన్వేషణలో ఉన్నారట. మంచి టైటిల్ సెట్ అవ్వగానే ఎనౌన్స్ చేస్తారట.

>> మెగా 150వ సినిమా అప్పుడే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొంది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

>> మెగా రీఎంట్రీ సినిమాలో నేను నటించను, ఒకవేళ వినాయక్ గారు, నాన్నగారు (చిరంజీవి) చేయమని చెబితే మాత్రం ఏదైనా పాటలో మాత్రం కనిపిస్తాను.

>> ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా 150వ చిత్రం సంక్రాంతికి విడుదలవ్వడం ఖాయమని చరణ్ స్పష్టం చేశాడు.

"స్వచ్చ భారత్" తరహా ప్రోజెక్ట్..

>> "స్వచ్చ భారత్" ఫార్మాట్ లో "మెగా ఫ్యాన్" అనే ఒక ప్రోజెక్ట్ ను మొదలెట్టాలన్నది చరణ్ అభిప్రాయం. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే.. ఆ సమస్యకు సంబంధించిన వివరాలు ఫోటోతో సహా తన ఫేస్ బుక్ పేజ్ కి పంపితే "మెగా ఫ్యాన్స్" సహాయంతో ఆ సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని చరణ్ చెప్పాడు.

పవర్ స్టార్ తో సినిమా గురించి..

>> మంచి కథ దొరకాలే కానీ.. కళ్యాణ్ బాబాయ్ తో కలిసి నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

source:teluguone.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
A Contest to Meet Ram Charan
« Reply #6 on: July 15, 2016, 07:39:00 PM »
హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిని కలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆయన అభిమానులైతే దూరం నుంచి చూసినా చాలనుకునేవారు వేలల్లో కాదు.. కాదు.. లక్షల్లో ఉంటారు. మరి అలాంటి అవకాశాన్ని తాను కల్పిస్తానని అంటున్నారు చిరంజీవి తనయుడు, యువ కథానాయకుడు రామ్‌చరణ్‌.
రామ్‌చరణ్‌ తొలిసారి ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో లైవ్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా వారడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందరూ మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో ‘మెగాఫ్యాన్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిరు అభిమానులు సమాజ సేవలో భాగంగా తమ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛభారత్‌, నీటి సమస్యను పరిష్కరించడం వంటి కార్యక్రమాలు చేసి ఆ విషయాలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేయాలని కోరారు. ఉత్తమమైన సేవ చేసిన వారిని తన తండ్రి చిరంజీవి 150వ సెట్‌కు తీసుకెళ్తామని, మొత్తం యూనిట్‌ సభ్యులు ఆ వ్యక్తిని ప్రశంసిస్తారని తెలిపారు.
ప్రశ్న: చిరంజీవి ఎలా ఉన్నారు?
జవాబు: నాన్నగారు చాలా బావున్నారు, షూటింగ్‌ బాగా జరుగుతోంది
ప్రశ్న: ‘ధ్రువ’ విడుదల ఎప్పుడు?
జవాబు: అక్టోబరు తొలి వారం లేదా రెండో వారంలో ‘ధ్రువ’ను విడుదల చేస్తాం.
ప్రశ్న: పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తారా?
జవాబు: మంచి కథ దొరికితే.. కచ్చితంగా చేస్తా
ప్రశ్న: చిరంజీవి 150లో మీరు ఉన్నారా?
జవాబు: నేను చిరంజీవి గారి చిత్రంలో ఉన్నానని చెప్పలేను. ఏదైనా పాటలో, లేదా మరేదైనా పాత్ర అని చూడాలి
ప్రశ్న: ‘ధ్రువ’ ఫస్ట్‌లుక్‌
జవాబు: బహుశా.. ఆగస్టు 15న
ప్రశ్న: మహేశ్‌బాబుపై మీ అభిప్రాయం?
జవాబు: ఆయన చాలా బావుంటారు. మంచి నటుడు, నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన.
ప్రశ్న: మీ లక్ష్యం?
జవాబు: ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం
ప్రశ్న: ప్రభాస్‌పై మీ అభిప్రాయం?
జవాబు: నా ప్రియమైన స్నేహితుడు. తాజాగా బాహుబలి సెట్‌కు వెళ్లా
ప్రశ్న: మీకు ఇష్టమైన నటి?
జవాబు: ఆసక్తికరమైన ప్రశ్న.. అందరూ మంచి కథానాయకలే
ప్రశ్న: ఉపాసనా ఎలా ఉన్నారు?
జవాబు: ఉపాసనా చాలా బావుంది
ప్రశ్న: చిరంజీవి చిత్రం గురించి చెప్పండి?
జవాబు: షూటింగ్‌ జరుగుతోంది. సంక్రాంతికి చిత్రాన్ని తీసుకొస్తాం
ప్రశ్న: కబాలి చిత్రం గురించి?
జవాబు: ఎదురుచూస్తున్నా.. అందరూ ఎదురుచూస్తున్నారు
ప్రశ్న: తర్వాతి చిత్రం
జవాబు: సుకుమార్‌తో
ప్రశ్న: చిరు 150 టైటిల్‌ ‘కత్తిలాంటోడు’?
జవాబు: ‘కత్తిలాంటోడు’ కాదు.. ఇంకా నిర్ణయించలేదు. త్వరలో మంచి టైటిల్‌ను నిర్ణయిస్తాం
ప్రశ్న: ‘ధ్రువ’లో ఫన్నీ మూమెంట్‌?
జవాబు: నేను ఫన్నీగా ఉండే వ్యక్తిని కాను. కానీ కశ్మీర్‌ షెడ్యూల్‌లో సరదాగా గడిపాం. చిరంజీవి గారి 30 నుంచి 40 సినిమాల షూటింగ్‌ అక్కడ జరిగింది
ప్రశ్న: మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తి ఉందా?
జవాబు: ఉంది

source:www.eenadu.net

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
A Contest to Meet Ram Charan
« Reply #7 on: July 16, 2016, 12:09:34 PM »
Nice Interview

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
1 Replies 353 Views Last post September 24, 2012, 10:19:55 AM
by yugandhar
3 Replies 414 Views Last post June 30, 2013, 07:32:25 AM
by siva
1 Replies 268 Views Last post March 10, 2014, 06:22:14 PM
by lokesh
1 Replies 172 Views Last post April 02, 2016, 10:46:53 AM
by MbcMen
0 Replies 149 Views Last post April 14, 2016, 02:19:19 PM
by Pa1Kalyan