Author Topic: రూపాయికే ‘‘మీ’’ ఫోన్  (Read 183 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 12,235
  • DIE HARD FAN OF POWERSTAR
రూపాయికే ‘‘మీ’’ ఫోన్
« on: July 15, 2016, 07:31:08 PM »


మంచి స్మార్టు ఫోన్ అంటే కనీసం 10 వేలు పెట్టాల్సిందే. లేదంటే సరైన కాన్ఫిగరేషన్ దొరక్క స్పీడందుకోలేం. బడాబడా బ్రాండ్లను తట్టుకుని నిలబడి మంచి నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న చైనాకు చెందిన షియోమీ సంస్థ ఇప్పటికే స్మార్టుఫోన్ల మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకొంది.  తాజాగా ఆ కంపెనీ రూపాయికే ఫోన్ ఇస్తానంటోంది. అందుకు తగిన సందర్భాన్నీ ఎంచుకుంది. భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టి రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ భారీ ఆఫర్ అనౌన్సు చేసింది.

జులై 20 నుంచి 23 వరకు వర్తించే ఈ ఆఫర్ పై వినియోగదారులు అప్పుడే ఆసక్తి పెంచుకున్నారు.  20 నుంచి 23 తేదీల మధ్య ప్రతి రోజూ రెండు గంటలకు ఫ్లాష్ సేల్ పేరిట ఫేస్ బుక్ ద్వారా షియోమీ వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందించనుంది. ఆఫర్ లో భాగంగా కేవలం రూపాయి ధరకే ఫోన్లు - పవర్ బ్యాంక్ లు - బ్లూటూత్ స్పీకర్లు అందజేయనుంది. తొలిరోజు 10 షియోమీ ఎంఐ ఫోన్లు ఐదు - 100 పవర్ బ్యాంకులు - రెండో రోజు రెడ్ మీ నోట్ 3 ఫోన్లు పది - 100 ఎంఐ బ్యాండ్ లు - ఆఖరి రోజున ఎంఐ మ్యాక్స్ ఫోన్లు పది - 100 ఎంఐ బ్లూటూత్ స్పీకర్లను వినియోగదారులకు అందజేయనుంది.

దీని కోసం ఏం చేయాలో కూడా షియోమీ ఇప్పటికే ప్రకటించింది. ఫేస్ బుక్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. తద్వారా తన వ్యాపారం మరింత విస్తరించుకునేందుకు ప్లాన్ చేసింది.  దీనికోసం యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇంతవరకు కస్టమర్లు ఫ్లిప్ కార్ట్ - అమేజాన్ - స్నాప్ డీల్ వంటి ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా వీటిని కొనుగోలు చేసేవారు. అలా కాకుండా నేరుగా వినియోగదారులను దగ్గర చేసుకునేందుకు షియోమీ ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. జూలై 19 లోగా పేస్ బుక్ లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు ఉంచుతామని షియోమీ వెల్లడించింది.

source:tupaki.com

 

Related Topics