Author Topic: Janatha Garage Review and Boxoffice Updates  (Read 912 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« on: September 01, 2016, 03:24:31 PM »
సినీజోష్‌ రివ్యూ: జనతా గ్యారేజ్‌
మైత్రి మూవీ మేకర్స్‌

జనతా గ్యారేజ్‌

తారాగణం: మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌, సమంత, నిత్యమీనన్‌, సాయికుమార్‌, సచిన్‌ ఖేడ్కర్‌, అజయ్‌, సురేష్‌, ఉన్ని ముకుందన్‌, బ్రహ్మాజీ, దేవయాని, సితార తదితరులు

సినిమాటోగ్రఫీ: తిరు

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సి.వి.ఎం.)

రచన, దర్శకత్వం: కొరటాల శివ

విడుదల తేదీ: 01.09.2016

ఎన్టీఆర్‌ సినిమా వస్తోందంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారు? ఎన్టీఆర్‌ నుంచి ప్రేక్షకులైనా, అభిమానులైనా ఆశించేది ఏమిటి? ఎన్టీఆర్‌ని ఎలాంటి క్యారెక్టర్‌లో చూడాలనుకుంటారు? అందరికీ కావాల్సిన అంశాలు జనతా గ్యారేజ్‌లో వున్నాయా? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న... మిర్చి, శ్రీమంతుడు వంటి యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని రూపొందించి ఓ స్పెషాలిటీ వున్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ సినిమా చేస్తున్నాడంటే ఈ కాంబినేషన్‌పై ఆడియన్స్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. కథగానీ, కథనంగానీ, యాక్షన్‌గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ ఓ రేంజ్‌లో వుంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరు జనతా గ్యారేజ్‌ అని ఎనౌన్స్‌ చెయ్యగానే టైటిల్‌ చూసి అభిమానులు కాస్త నిరాశకు లోనైనా కొరటాల శివ చెప్పే కథ మీద నమ్మకంతో సినిమాలో ఏదో వుంటుందని ఆశించారు. మరి ఇన్ని రకాల ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ఈరోజు రిలీజైన జనతా గ్యారేజ్‌ వాటిని రీచ్‌ అయ్యిందా? వరసగా రెండు సూపర్‌హిట్స్‌ ఇచ్చిన కొరటాల శివ జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కి కూడా సూపర్‌హిట్‌ ఇవ్వగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కష్టాల్లో వున్న కుటుంబాల కన్నీళ్ళు తుడిచే ఓ కుటుంబం కథ జనతా గ్యారేజ్‌. అతని పేరు సత్యం(మోహన్‌లాల్‌). తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రారంభించిన జనతా గ్యారేజ్‌లో వాహనాల రిపేర్లే కాకుండా, తప్పుడు మార్గాల్లో వెళ్ళే మనుషుల్ని కూడా రిపేరు చేస్తుంటారు. కొంతమంది అసాంఘిక శక్తులకు సత్యం చేసిన రిపేర్ల ఫలితంగా తమ్ముడు, మరదలు హత్య చేయబడతారు. తన వల్లే ఒక కొడుక్కి తల్లి, తండ్రి లేకుండా పోయారన్న బాధతో ఆ కొడుకుని తన కుటుంబం నీడలు కూడా పడకుండా పెంచమని బావకి ఇచ్చి పంపిస్తాడు. తల్లిదండ్రులు ఎలా వుంటారో కూడా తెలియకుండా ముంబాయిలో ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడవుతాడు. అతని పేరు ఆనంద్‌(ఎన్టీఆర్‌). ఎన్విరాన్‌మెంట్‌ రీసెర్చ్‌ చేస్తుంటాడు. ప్రకృతిని ప్రేమిస్తుంటాడు. వాతావరణాన్ని కాలుష్యం చేసేవారిని చూస్తే సహించలేడు. వారికి తగిన విధంగా రిపేర్లు చేస్తుంటాడు. ఇలా సత్యం కుటుంబానికి దూరంగా పెరిగిన ఆనంద్‌ ఆలోచనలు కూడా సత్యంని పోలి వుంటాయి. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆనంద్‌ హైదరాబాద్‌ వస్తాడు. అనుకోకుండానే జనతా గ్యారేజ్‌కి వచ్చి సత్యంని కలుసుకుంటాడు. అప్పటివరకు జనతా గ్యారేజ్‌ని రన్‌ చేసిన సత్యం ఆ బాధ్యతని ఆనంద్‌కి అప్పగిస్తాడు. ఆనంద్‌ని జనతా గ్యారేజ్‌ని రన్‌ చేయమని సత్యం ఎందుకు అడగాల్సి వచ్చింది? సత్యం కుటుంబ సభ్యులు తనవారేనని ఆనంద్‌ తెలుసుకోగలిగాడా? తనకు దూరంగా పెరిగిన ఆనంద్‌ మళ్ళీ తన దగ్గరికే రావడంపై సత్యం ఎలా రియాక్ట్‌ అయ్యాడు? జనతా గ్యారేజ్‌ ద్వారా ఆనంద్‌ ఎలాంటి రిపేర్లు చేశాడు? ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది తెరపై చూడాల్సిందే.

ఈ కథలో చెప్పుకోదగిన విషయంగానీ, విశేషం గానీ ఏమీ లేదు. ఒక సాధారణమైన కథ. ఎవరు కష్టాల్లో వున్నా స్పందించి వారికి న్యాయం చేసే ఓ మంచి మనిషి సత్యం. జనతా గ్యారేజ్‌ పేరుతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుష్టులను శిక్షిస్తుంటాడు. దాని ఫలితంగా తన తమ్ముడు, మరదల్ని కోల్పోయిన సత్యం తన కుటుంబం నీడ పడకూడదని వారి కొడుకుని తన బావకిచ్చి పంపించేస్తాడు. ఇదే ఫార్ములాని ప్రభాస్‌తో చేసిన మిర్చిలో కూడా వాడాడు కొరటాల. నిత్యం పగ, ప్రతీకారాలతో రగిలిపోయే తన ఊరికి దూరంగా కొడుకుని వుంచుతాడు హీరో తండ్రి. దాన్నే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్‌ చేశాడు. ఊరికి వచ్చిన కొడుకు కూడా పగతో రగిలిపోయే క్యారెక్టర్‌ మిర్చిలో వుంటుంది. జనతా గ్యారేజ్‌ విషయానికి వస్తే ఇందులో కూడా తమ్ముడు కొడుకుని దూరంగా పంపించినా పెద్దయిన తర్వాత తన గ్యారేజ్‌కే వచ్చి అందరికీ రిపేర్లు చేస్తుంటాడు. కొరటాల ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోగా, ప్రేక్షకుల్ని విసిగించే సన్నివేశాలు చాలా వున్నాయి. స్లో నేరేషన్‌తో మొదలయ్యే సినిమా ఇకనైనా స్పీడందుకుంటుందేమోనని ఎదురు చూసే ఆడియన్స్‌కి నీరసం వస్తుంది తప్ప కథనంలో ఎలాంటి మార్పూ వుండదు. సినిమా స్టార్ట్‌ అయిన 20 నిముషాలకు హీరో ఎంటర్‌ అవుతాడు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా ప్రకృతిని కాపాడండి, కాలుష్యాన్ని పెంచకండి అని హీరోయిన్‌తో సహా అందరికీ క్లాసులు పీకుతుంటాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ పవర్‌ఫుల్‌గా అనిపించదు. అతను చెప్పే డైలాగులు ఆడియన్స్‌కి నీరసం తెప్పిస్తాయి. క్యారెక్టర్‌కి తగ్గట్టు పెర్‌ఫార్మ్‌ చేసినా అది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడేలా లేదు. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎప్పటిలాగే స్పీడ్‌ వుంది. సత్యంగా మోహన్‌లాల్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా నేచురల్‌గా అనిపించింది. అందర్నీ ఆకట్టుకునే సత్యం క్యారెక్టర్‌లో మోహన్‌లాల్‌ ఒదిగిపోయారని చెప్పాలి. ఇక హీరోయిన్లలో ఒకరైన బుజ్జి(సమంత) క్యారెక్టర్‌కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. కేవలం పాటలకే పరిమితమైన క్యారెక్టర్‌. ఏమాత్రం ఇంపార్టెన్స్‌ లేని హీరోయిన్‌గా నిత్యమీనన్‌ ఈ సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. మిగతా క్యారెక్టర్లలో సాయికుమార్‌, సచిన్‌ ఖేడ్కర్‌, అజయ్‌, ఉన్ని ముకుందన్‌, దేవయాని, సితార, సురేష్‌ ఫర్వాలేదు అనిపించారు. ప్రీ క్లైమాక్స్‌ ముందు ఐటమ్‌ సాంగ్‌లో కనిపించిన కాజల్‌ ఆకట్టుకోలేకపోయింది. ఈ పాట స్టార్ట్‌ అవ్వగానే ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అని ఆడియన్స్‌ ఎదురు చూసేలా చేసింది. శ్రీమంతుడులో ఓ మంచి క్యారెక్టర్‌ చేసిన జగపతిబాబుతో సినిమా స్టార్టింగ్‌లో వాయిస్‌ ఓవర్‌ చెప్పించారు. అది కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేదు.

టెక్నికల్‌గా చూస్తే తిరు ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. దేవిశ్రీప్రసాద్‌ చేసిన మ్యూజిక్‌ ఎఫెక్టివ్‌గా లేదు. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దేవి చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్‌ అయ్యాయి. కానీ, ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. దానికి తగ్గట్టుగానే పిక్చరైజేషన్‌లో కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో మాత్రం దేవి కేర్‌ చాలా కేర్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లోగానీ, సెకండాఫ్‌లోగానీ చాలా సీన్స్‌ స్టార్ట్‌ అయిన కొన్ని సెకన్స్‌లోనే ఎండ్‌ అయిపోయి వెంటనే వేరే సీన్‌లోకి వెళ్ళిపోవడం వల్ల జర్క్‌లు ఎక్కువగా వున్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్‌ కొరటాల శివ గురించి చెప్పాలంటే అతను సెలెక్ట్‌ చేసుకున్న కథలో ఆడియన్స్‌ని రెండున్నర గంటల సేపు సీట్లలో కూర్చోబెట్టే సత్తా లేదు. దానికి తగ్గట్టుగానే కథనం కూడా వుండడంతో ఆకట్టుకోలేకపోయింది. హీరోతో పర్యావరణాన్ని గురించి చాలా డైలాగులు చెప్పించడంతో ఆడియన్స్‌ చాలా బోర్‌ ఫీల్‌ అవుతారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది ఇసుమంత కూడా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుంచి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌కి ఎక్కడా రిలీఫ్‌ ఇవ్వలేకపోయాడు కొరటాల. గవర్నమెంట్‌ ఆఫీస్‌లో సీన్‌, ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌కి వచ్చే సీన్‌ మాత్రమే ఎఫెక్టివ్‌గా అనిపించాయి. తన గ్యారేజ్‌కి వచ్చిన ఆనందే తన తమ్ముడి కొడుకు అని రివీల్‌ చేసే సన్నివేశం చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎమోషన్‌ అనేది ఏ సీన్‌లోనూ సరిగ్గా క్యారీ అవ్వలేదు. సిటీలో బాంబ్‌ బ్లాస్ట్స్‌ చేసింది ఎవరో కనిపెట్టమని పోలీస్‌ కమిషనర్‌ జనతా గ్యారేజ్‌కి వచ్చి సాయం అడిగితే వారిని కనిపెట్టి పోలీసులకు అప్పగించకుండా, ఆ కుట్రలో తన కొడుకే వున్నాడని, తన కొడుకే తన మనిషిని చంపాడని తెలుసుకొని కొడుకునే చంపడానికి సిద్ధపడతాడు సత్యం. దానికి హీరో కూడా మద్దతు తెలుపుతాడు. అది ఎంతవరకు సమంజసమో డైరెక్టర్‌కే తెలియాలి. క్లైమాక్స్‌ లేకుండానే సినిమా కంప్లీట్‌ అయిపోయిందా అన్నట్టు సడన్‌గా ఎండ్‌ టైటిల్స్‌ స్టార్ట్‌ అవుతాయి. మరి ఈ సినిమా ద్వారా కొరటాల శివ ఏం చెప్పదలుచుకున్నాడు? ఇలాంటి కథతో ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్‌ చేద్దామనుకున్నాడు? అని ఆలోచించుకుంటూ థియేటర్‌ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌గా చెప్పాలంటే కొరటాల శివ సెలెక్ట్‌ చేసుకున్న కథకి చాలా రిపేర్లు చెయ్యాల్సిన అవసరం వుంది. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసే కొన్ని పార్టులు కూడా వెయ్యాల్సిన అవసరం వుంది. కథ ఎంత బాగా చెప్పినా, కథనం ఎంత బాగున్నా సగటు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపిస్తే ఆ సినిమాని ఎవరూ కాపాడ లేరనే విషయాన్ని జనతా గ్యారేజ్‌ ప్రూవ్‌ చేస్తుంది.

ఫినిషింగ్‌ టచ్‌: ఈ గ్యారేజ్‌కి రిపేర్లు అవసరం

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #1 on: September 01, 2016, 03:32:54 PM »
Young Tiger NTR's 'Janatha Garage' has done a pre release business of Rs.63.20 crores world wide with its Telugu version. Given below is the area wise break up.

AREA                               PRE BIZ (IN CRORES)

----------------------              -----------------------------

NIZAM                                       15.30

CEDED                                        9.00

NELLORE                                    2.34

KIRSHNA & GUNTUR                 8.34

VIZAG                                          5.12

EAST GODAVARI                         4.23

WEST GODAVARI                        3.30

AP & TS PRE BIZ                       47.63

KARNATAKA                                 7.02

ROI                                                1.30

OVERSEAS                                   7.25

WW TELUGU VERSION             63.20

* Malayalam version including satellite rights: 4.20 cr.

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #2 on: September 02, 2016, 03:21:57 PM »
Junior NTR took Box Office by a storm very much matching up to trade expectations. ‘Janatha Garage’ opened to sensational revenues on day one with huge premiere shows adding more to final value. As per the reports we received, ‘Janatha Garage’ raked almost close to Rs.21 Crores share (including premiere shows) on day one within the Telugu states breaking many records. Below is the breakup:

Area                        Share  (in Crores)   

Nizam                            5.65

Ceded                            3.72

Guntur                           2.58

Vizag                             2.30

East                              2.28

West                             1.85

Krishna                          1.54

Nellore                          0.89

Total Share In AP, TS      20.81 Crores

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #3 on: September 02, 2016, 04:04:15 PM »
ఇచ్చ‌ట అన్ని రిపేర్లూ చేయ‌బ‌డును అనే ట్యాగ్ లైన్‌తో వ‌చ్చింది... జ‌న‌తా గ్యారేజ్. ఈ సినిమా చూశాక మాత్రం.. జ‌న‌తా గ్యారేజ్‌కే రిపేర్లు అవ‌స‌రం అనిపించింది సామాన్య ప్రేక్ష‌కుల‌కు.  క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌ల చిత్ర‌ణ ఇవేం కొర‌టాల శివ గ‌త సినిమాల స్థాయిలో లేవు. అయినా స‌రే..మా సినిమా సూప‌ర్ హిట్టండీ అని చెప్పుకొంటోంది చిత్ర‌బృందం. అక్క‌డితో ఆగితే ఫ‌ర్వాలేదు. కానీ శ్రీ‌మంతుడుని మించిన సినిమా అంటూ కోత‌లు కోస్తోంది. స్వ‌యంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా అదే మాట అంటున్నాడు. శ్రీ‌మంతుడు కంటే మించిన హిట్టు అంటూ మీడియా ముందు డ‌బ్బా కొడుతున్నాడు. శ్రీ‌మంతుడుతో ఈసినిమాకి పోలికేంటి?? అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ న‌వ్వుకొంటున్నారు. కొర‌టాల స్వ‌త‌హాగా ర‌చ‌యిత. ఓ ర‌చ‌యిత‌గా.. శ్రీ‌మంతుడు లోని పాత్ర‌ల్లో ఉన్న బ‌లం ఎంతో.. జ‌నతా గ్యారేజ్‌లో ఉన్న బ‌ల‌మెంతో త‌న‌కు తెలుసు. వ‌సూళ్ల మాట ప‌క్క‌న పెడితే.. శ్రీ‌మంతుడు ముందు జ‌న‌తా తేలిపోవ‌డం ఖాయం. ఇవి తెలిసి కూడా ఆత్మ‌వంచ‌న చేసుకోవ‌డం ఎందుకో అర్థం కాదు. మిర్చి, శ్రీ‌మంతుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌లు బలంగా ఉంటాయి. కానీ జ‌న‌తాలో అది క‌నిపించ‌లేదు. ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నా.. వాళ్లు చేసింది సున్నా. ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్ మ‌ధ్య బ‌ల‌మైన భావోద్వేగాలు పండ‌లేదు. కొత్తగా ఉందిరా... అనిపించుకొన్న సీన్ ఒక్క‌టీ లేదు. డైలాగ్ రైట‌ర్ గా కూడా కొర‌టాల ఫ్లాపే. అలాంట‌ప్పుడు ఈ ఆత్మ‌వంచ‌న ఎందుకో మ‌రి.

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #4 on: September 02, 2016, 10:28:59 PM »
Long back, Share Guarantees(SGs) and Minimum Guarantees (MGs) were added to the worth share of films when the business of those films got closed. Afterwards, SGs and MGs were added to the first week's share of the films. It's now learnt that the makers have requested the distributors of 'Janatha Garage' to add the SGs and MGs for the 1st day's worth share of the film in AP and Telangana states. As such, the movie's first day's share zoomed up to Rs.21 crores. According to trade sources the movie collected Rs.17.10 crores worth share on day one in AP and Telangana states.

Meanwhile, 'Janatha Garage' opened with mixed reports all over on the day one of its release. Young Tiger NTR and Malayalam Superstar Mohanlal's performances were lauded by the critics.

Samantha and Nitya Menen have romanced NTR in this message oriented action entertainer. The movie was directed by Koratala Siva on Mythri Movie Makers. Devi Sri Prasad has provided the music of the movie.

Source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #5 on: September 04, 2016, 08:46:35 PM »
భారీ అంచ‌నాల మ‌ధ్య జ‌న‌తా గ్యారేజ్ సినిమా విడుద‌లైంది. తొలి రోజు వ‌సూళ్ల‌లో దుమ్ము దులిపినా జ‌న‌తాలో ఎన్నో లోపాలు. ప్ల‌స్సులు కంటే.. ఈసినిమాలో మైన‌స్సులే ఎక్కువ క‌నిపిస్తున్నాయి. సాక్షాత్తూ ఎన్టీఆర్ అభిమానులు కూడా... ఆ త‌ప్పుల్ని ఒప్పుకొంటున్నారు. ఇంత‌కీ జ‌న‌తాలో బ‌లంగా క‌నిపించిన ఆ బ‌ల‌హీన‌త‌లు ఏమిటి?  జ‌నాలు వేటి గురించి ఎక్కువ‌గా మాట్లాడుకొంటున్నారు.. అవ‌న్నీ ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకొంటే...


* క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. స‌రిక‌దా, ఏ స‌న్నివేశం కూడా కొత్త‌గా అనిపించ‌లేదు. ప్ర‌స్థానం, స‌ర్కార్ ఛాయ‌లు ఎక్కువ‌గా క‌నిపించాయి.

* కొర‌టాల మంచి ర‌చ‌యిత‌.. కానీ అత‌ని పెన్ను అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే మెరిసింది.

* ఈ సినిమాలో అస‌లు హీరోయిన్లు ఉన్నారా అనిపిస్తుంది. స‌మంత‌, నిత్య‌ల పాత్ర‌లు అంత ఘోరంగా ఉన్నాయి.
స‌మంత అస్స‌లు బాలేదు. ఆమె గ్లామ‌రంతా ఏమైపోయిందో?

* జ‌న‌తా గ్యారేజ్ సినిమా మొద‌లైన తొలి 40 నిమిషాల్లో ఎన్టీఆర్ క‌నిపించేది రెండంటే రెండే సార్లు. అది ఎన్టీఆర్ అభిమానుల్ని ఇబ్బంది పెట్టే విష‌య‌మే.

* ఎన్టీఆర్‌ని ప్ర‌కృతి ప్రేమికుడిగా చూపించారు. తొలి స‌గం అంతా అలానే న‌డిపారు. కానీ ఇంట్ర‌వెల్ త‌ర‌వాత ఆ మాటే మ‌ర్చిపోయారు. ఎన్టీఆర్ క్యారెక్ట‌రైజేష‌న్‌కీ ఈ క‌థ‌కీ సంబంధం లేకుండా పోయింది.

* ఇంట్ర‌వెల్ బ్యాంగ్ సాదా సీదాగా ఉంది. ఆ సీన్‌లో ఎమోష‌న్ కూడా పండ‌లేదు.

* జ‌న‌తా గ్యారేజ్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెట్ట‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉండాలి.. అది ఈ సినిమాలో క‌నిపించ‌లేదు.

* ఆనంద్ ఎవ‌రో కాదు త‌మ్ముడి కొడుకే అని మోహ‌న్ లాల్‌కి తొలిసారి తెలిసే స‌న్నివేశం చాలా సాదా సీదాగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు.  ఆసీన్‌లో ఎన్టీఆర్ హావ‌భావాలూ అంత గా పండ‌లేదు. పెద‌నాన్న‌... అంటూ ఎన్టీఆర్ పాత్ర ఒక్క‌సారి కూడా ప‌ల‌క‌రించడు.

* ఈ క‌థ‌లో ప్ర‌ధాన మైన లోపం..   బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డ‌మే. ఉన్నిముకుంద‌న్ పాత్ర‌ని పాడుచేశారు.
 
* క్లైమాక్స్ అయితే... మ‌రీ దారుణం. బాంబు బ్లాస్టులంటూ హ‌డావుడి త‌ప్ప ఏం లేదు.


ఈ లోపాల‌పై ద‌ర్శ‌కుడు కాస్త దృష్టిసారిస్తే బాగుండేది. కానీ ఏం చేస్తాం?  సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేశాక స్క్రిప్టు మ‌ళ్లీ రాసుకొందామ‌నుకొంటే లాభం ఏముంది??

Source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #6 on: September 04, 2016, 08:48:37 PM »

స్టార్  సినిమా విడుద‌లైందంటే అంతా వ‌సూళ్ల గురించి మాట్లాడుకొంటారు. చిత్ర‌బృందంకూడా.. మా సినిమా తొలి రోజు ఇంత వ‌సూలు చేసిందీ, ఆ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింద‌ని గొప్ప‌లు చెప్పుకొంటుంది. జ‌న‌తా గ్యారేజ్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఈసినిమా తొలిరోజు దాదాపుగా రూ.24 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింద‌ని చిత్ర‌బృందం చెప్పుకొంటోంది. ఆల్ టైమ్ ఇండ్ర‌స్ట్రీ వ‌సూళ్ల‌లో 3వ స్థానంలో ఉన్నామ‌ని జ‌న‌తా టీమ్ అంటోంది. అయితే ఈ లెక్క‌ల‌న్నీ త‌ప్పు అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు జ‌న‌తా వ‌సూళ్లు రూ.18 కోట్లేన‌ని లెక్క‌లు గ‌ట్టి మ‌రీ చూపిస్తున్నాయి.  బెనిఫిట్ షోల ద్వారా ఎంతొచ్చిందో అధికారికంగా తెలియ‌క‌పోయినా.. వాటినీ ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో చూపించ‌డం వ‌ల్ల‌.. నికార్సు లెక్క‌లేవీ బ‌య‌ట‌కు రాలేదు. ఓవ‌ర్సీస్‌లో 5.5 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసిందని చెబుతున్నా.. అక్క‌డ అంత ఉండ‌క‌పోవొచ్చ‌ని ట్రేడ్ ఎన‌లిస్ట్స్ చెబుతున్నారు. ఒక‌వేళ రూ.24 కోట్ల లెక్క స‌రి కాక‌పోతే... శ్రీ‌మంతుడు రికార్డుల్ని జ‌న‌తా గ్యారేజ్ దాట‌న‌ట్టే లెక్క‌!  సో.. జ‌న‌తా 4 వ స్థానంలో ఉంద‌న్న‌మాట‌. రేప‌టిక‌ల్లా తొలిరోజు వ‌సూళ్ల‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.
Source:teluguone.com
« Last Edit: September 04, 2016, 08:55:27 PM by Pa1Kalyan »

Offline RestingStar

 • Newbie
 • *
 • Posts: 17
 • Megafan
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #7 on: September 07, 2016, 08:36:09 AM »

Offline RestingStar

 • Newbie
 • *
 • Posts: 17
 • Megafan
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #8 on: September 07, 2016, 08:39:35 AM »
ALL TIME RECORD collections


Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #9 on: September 07, 2016, 05:55:21 PM »
The overwhelming ‘Janatha Garage’ success is a huge morale booster for Junior NTR and his Fans to grandly announce their hero’s entry back into number game. Although Koratala Siva directorial surpassed the trade expectations overcoming the divided verdict expressed by critics on release day, surprisingly the movie performed equally well in domestic and overseas regions.

However, a huge drop in ‘Janatha Garage’ collections in the US is a reason to worry for exhibiting local buyers. In fact, the movie did good business on Monday by collecting $ 115,793 taking the overall total to $ 1,553,591 thus breaching 1.5 M mark, an achievement on any terms. Good news is Monday was a labor holiday and the film enjoyed a long weekend with additional Monday.

On Tuesday, the numbers fell to all time low of just $30K showing 75% drop. Going by this pace, it is hard for ‘Janatha Garage’ to reach $2 M mark which is shorter than what ‘Nannaku Prematho’ achieved. Let us wait for final numbers by end of this week.

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #10 on: September 07, 2016, 05:55:42 PM »
Junior NTR and Koratala Siva’s ‘Janatha Garage’ is over toppling all the top records. The film is going unstoppable all over the globe. Like domestic market, even the overseas trade is flourishing with some unbelievable figures. However, the latest reports we had is about ‘Janatha Garage’ six days collections in Andhra Pradesh and Telangana states. Below is the are wise breakup:   

Area                                                 Share (In Crores)

Nizam                                               14.24

Ceded                                               8.05

Vizag                                                5.12

Guntur                                              4.57

East                                                 3.77

Krishna                                             3.42

West                                                3.23

Nellore                                             1.67

Total Share (AP & TS)                        44.07 Crores

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #11 on: September 07, 2016, 06:07:29 PM »
Young Tiger NTR's 'Janatha Garage' carried mixed reports on the day one of its release. Even then, there hasn't been big dip in collections and steady collections were recorded in its first weekend's run. The movie's exact status will be known from Monday. According to the trade sources, the movie has collected an estimated share of Rs.40 crores world wide in its first weekend's run.

Strangely, the movie's world wide shares are being projected as Rs.50+ crores in its first weekend's run by some box office tracking media. However, none of the fans of other heroes, movie lovers and even some sensible fans are not trusting these boasted up numbers and they wish to get the exact numbers of collections. It is expected that the makers might reveal the exact collections of the film soon.

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #12 on: September 07, 2016, 06:29:11 PM »
జ‌న‌తా గ్యారేజ్ చూసినోళ్లంతా 'ఇది అద్భుతం.. సూప‌ర్ హిట్‌... బ్లాక్ బ‌స్ట‌ర్‌' అనేం అన‌డం లేదు. ఓకే ఓకే సినిమా అంటున్నారంతే! ఎన్టీఆర్ గ‌త సినిమాల కంటే కాస్త బెట‌ర్‌గా... కొర‌టాల బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కంటే త‌క్కువ‌గా ఉంది రిజల్ట్‌. వ‌రుస‌గా సెల‌వ‌లు రావ‌డం జ‌న‌తాకు క‌లిసొచ్చిన విష‌యం. అంత‌మాత్రాన ఈ సినిమాకి ఊహించ‌ని విధంగా లాభాలొచ్చేశాయి అని చెప్ప‌లేం. మ‌రి ఆ లెక్క‌లేమిటి? జ‌న‌తా గ్యారేజ్ వ‌ల్ల బాగుప‌డింది ఎవ‌రు? ఈ విష‌యాల గురించి లోతుగా ఆలోచిస్తే... కొన్ని న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ప‌డ‌తాయి.

జ‌న‌తా గ్యారేజ్‌కి రూ.50 కోట్లొచ్చాయి... రూ.60 కోట్లొచ్చాయి అని గొప్ప‌గా చెప్పుకొంటోంది చిత్ర‌బృందం. అస‌లు లెక్క‌ల్లోకి వెళ్తే.. జ‌న‌తా బ‌డ్జెట్ రూ.55 కోట్ల పైచిలుకు. ఈ సినిమా నిర్మాత‌లు భారీ లాభాల‌కు అమ్ముకొన్నారు. ఒక్కో నిర్మాత‌కూ ఎంత‌కాద‌న్నా... రూ.5 కోట్ల‌యినా లాభం వ‌చ్చింది. ఎన్టీఆర్‌, కొర‌టాల‌కు చెరో ప‌ది కోట్ల వ‌ర‌కూ ద‌క్కాయి. ఈ సినిమా వ‌ల్ల బాగుప‌డిందెవ‌రైనా ఉన్నారంటే ఇది వీళ్లే. మ‌రి సినిమాని కొన్న బ‌య్య‌ర్లు ఏమైపోవాలి?  ఈ సినిమాని భారీ రేట్ల‌కు కొన్న బ‌య్య‌ర్ కూడా బాగుప‌డాలంటే.. జ‌న‌తా గ్యారేజ్ టోట‌ల్ గా రూ.80కోట్లు వ‌సూలు చేయాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే అది సాధ్య‌మ‌య్యే విష‌యం అనిపించ‌డం లేదు. జ‌న‌తా గ్యారేజ్‌ని నైజాంలో దిల్ రాజు రూ.16కోట్ల‌కు కొన్నాడు. ఖ‌ర్చులు, వ‌డ్డీల‌తో క‌ల‌పి అది రూ.18 కోట్ల వ‌ర‌కూ అయ్యింది. ఇప్ప‌టికి ఈ సినిమాకి నైజాంలో రూ.14 కోట్లు వ‌చ్చాయ‌ని చిత్ర‌బృందం లెక్క‌గ‌ట్టింది. ఆ లెక్క‌లే నిజ‌మ‌నుకొన్నా... ఈ సినిమాకి ఇంకా రూ.4 కోట్లు రావాలి.

సోమ‌వారం వ‌ర‌కూ వ‌సూళ్లు బాగానే ఉన్నా.. మంగ‌ళ‌వారం పూర్తిగా డ్రాప్ అయ్యాయి. థియేట‌ర్లో 30 శాతం టికెట్లు కూడా స‌రిపోవు. ఇప్పుడొచ్చే క‌ల‌క్ష‌న్లు మొత్తం అద్దెల‌కే స‌రిపోతాయి. అలాంట‌ప్పుడు రూ.4 కోట్లు రాబ‌ట్టుకోవ‌డం అసాధ్యం. నైజాం అనే కాదు.. దాదాపు  ప్ర‌తి ఏరియాలోనూ ఇదే ప‌రిస్థితి. కాక‌పోతే ఏ బ‌య్య‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోడంతే!  సినిమా తీసిన వాడికీ, కొన్న‌వాడికీ ఓ రూపాయి వ‌చ్చిన‌ప్పుడే అది హిట్ సినిమా అనుకొంటే.. జ‌న‌తా గ్యారేజ్ ఎక్క‌డ ఉందో మీరే ఆలోచించుకోండి.

source:teluguone.com

Offline RestingStar

 • Newbie
 • *
 • Posts: 17
 • Megafan
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #13 on: September 07, 2016, 08:19:49 PM »

Offline RestingStar

 • Newbie
 • *
 • Posts: 17
 • Megafan
Janatha Garage Review and Boxoffice Updates
« Reply #14 on: September 08, 2016, 04:27:36 PM »
రూ 100 కోట్ల క్లబ్బులో గ్యారేజ్…ఎన్టీఆర్ హ్యాపీ


ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజీ సినిమా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెప్లెంబర్ 1 వ తేదీన విడుదలయిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. మోహన్ లాల్, సమంతా రుతుప్రభు, నిత్య మేనన్ ఇతర పాత్రలు పోషించారు

“ ఈ విజయం థ్రిల్లింగ్ గా ఉంది.. ప్రేక్షకులు ఆదరించారు. వారి మద్దతుతో ఇది ఘనవిజయం సాధించగలిగింది. అంకెలు, వసూళ్ళ మీద నాకంత ఆసక్తి లేదు.. మంచి సినిమాలు చేయాలన్నది నా తపన. గ్యారేజిలో నా రోల్ ఓ డిఫరెంట్ మోడ్ లో ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడం నాకు ముఖ్యం” అన్నాడు ఎన్టీఆర్.

50కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు.

అతి వేగంగా వంద కోట్ల క్లబ్బులో చేరిన రెండో సినిమా జనతా గ్యారేజ్ అనీ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ అన్నారు.. ఇంతకుమునుపు బాహుబలి సినిమా ఇలానే చాలా వేగంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది అన్నారాయన. ఆంధ్ర, తెలంగాణా రెంటి లోనూ సినిమా బాగా ఆడుతోంది.. అమెరికాలో సినిమా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఆరు రోజుల వ్యవధిలో 1.6 మిలియన్ డాలర్లు సాధించిందీ సినిమా.

source:V6news

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
26 Replies 859 Views Last post July 21, 2016, 04:47:55 PM
by MbcMen
19 Replies 535 Views Last post July 21, 2016, 04:50:30 PM
by MbcMen
4 Replies 112 Views Last post August 16, 2016, 03:03:11 PM
by Pa1Kalyan
0 Replies 171 Views Last post September 05, 2016, 07:52:05 PM
by pragyanar
0 Replies 133 Views Last post September 05, 2016, 08:12:07 PM
by pragyanar