Author Topic: Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN  (Read 275 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« on: September 02, 2016, 03:17:54 PM »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #1 on: September 02, 2016, 03:18:23 PM »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #2 on: September 02, 2016, 03:20:53 PM »
బర్త్ డే స్పెషల్: సమానవతా వాది పవన్! 
మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రభావితుడై సినీరంగం ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్  అనతి కాలంలోనే తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించి పవన్.. స్టార్ స్థాయికి ఎదిగాడు. అలా తనకంటూ ఓ ఇమేజ్ పొందగలిగాడు.

కొణిదెల వెంకట రావు, అంజలీ దేవికి చివరి సంతానంగా పవన్ కళ్యాణ్ 1971  సెప్టెంబర్ 2వ తేదీన జన్మించాడు. కాగా పవన్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. హనుమంతుడిపైన ఉన్న అమిత భక్తితో పవన్ కళ్యాణ్ అని పిలవడం ఆరంభించారు . చిన్నప్పుడు కరాటేని బాగా ఇష్టపడ్డ పవన్ అందులో బ్లాక్ బెల్ట్ ను కూడా సాధించాడు.

1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన 'తొలి ప్రేమ' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. తర్వాత తర్వాత నటుడుగా మంచి సంచలనాలు సృష్టించాడు పవన్. పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడుగానే కాకుండా దర్శకుడు కూడాను. పవన్ కళ్యాణ్  కెరీర్ లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలుగా గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి,  ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్,  అత్తారింటికి దారేది,  గోపాల గోపాల వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు.  పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో, వెరైటి సంభాషణలతో, తన సహజమైన నటనతో యువతను కట్టిపడేస్తుంటాడు. సామాన్య మానవులే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్ట పడటానికి కారణం కూడా అదే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్పూర్తి తో దర్శకుడుగా 'జానీ' చిత్రాన్ని రూపొందించాడు. స్వతంత్రమైన వ్యక్తిత్వం, విప్లవ భావాలు, నిరంతరం చైతన్యంతో కూడిన మనస్సు కలిగిన మానవతా వాది పవన్. సినిమాలో నటుడుగానే కాకుండా నిజ జీవితంలో కూడా మంచి సహాయకారి. పవన్ తన సినిమా  ద్వారా నష్ట పోయిన వారిని చాలా సందర్భాల్లో ఆదుకున్నాడు. పవన్ నటించిన 'జానీ' సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తగిన సాయం అందించి ఆదుకున్నాడు.

పవన్ కు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తోటకు వెళ్ళి వ్యసాయం చేయడానికి ఇష్టపడేవాడు. ఖాళీ సమయంలో హైదరాబాద్ లోని తమ ఫామ్ హౌస్‌లో కూరగాయలు, పండ్ల, మొక్కలు వంటివి పెంచుతుంటాడు. కాగా పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కొంతకాలం ఉన్నాడు.  ఆ కంపెనీకి ప్రకటనల కోసం తీసుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా పవన్ చరిత్ర కెక్కాడు. పవన్ తన జీవితాన్ని చాలా సాదాసీదాగా గడపడానికి ఇష్టపడతాడు. ఓసారి లండన్ వెళ్తూ...  ఇక్కడ విమానాశ్రయంలో ఒక సాదాసీదా షర్టు వేసుకుని, పాస్ పోర్ట్ చేత పట్టుకుని, రెండు చేతులు కట్టుకుని ఒక సామాన్యమైన వ్యక్తి మాదిరి నిల్చున్న తీరుతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం. పవన్ ఎప్పుడూ సింపుల్ గా ఉండాలని కోరుకుంటాడు.

రాజకీయనేతగా ప్రజలకు మరింత సేవ చేయాలని, ప్రజలకు మరింత దగ్గర కావాలని భావించిన పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014వ తేదీన జనసేన పార్టీ స్థాపించాడు. ఈ పార్టీ కోసం పనిచేయడానికి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలతో పాటు, సెలబ్రిటీలు కూడా ఉత్సాహం చూపుతున్నారు.  సినీ నటుడుగా, జనసేనానిగా సురకత్తిలా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్  కొన్ని సార్లు ఓ విప్లవవాదిలా దర్శనమిస్తాడు. ఇంకా ఓ గొప్ప వక్తగానూ, మార్క్సిస్టు దృక్పథం కలిగిన ఉన్నత బావాలు కల వ్యక్తిలా కనపడతాడు. తరచి చూడాలే గానీ పవన్ పలు కోణాల్లో దర్శనమిస్తుంటాడు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వేడుకనైనా పెద్ద పెద్ద ఆర్భాటాలు, గ్రాండ్ ఫంక్షన్స్ లాంటివి లేకుండా సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడతాడు. మామూలు గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడు. కనీసం తన ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా మొహమాటంగా నవ్వుతూ పక్కకు తప్పించుకు తిరుగుతాడు. షూటింగ్ స్పాట్ లోనూ, మిగతావిషయాల్లోనూ హైపర్ యాక్టివ్ అనిపించే పవన్ మరెందుకో పార్టీలలో మాత్రం సైలెంట్ అయిపోతాడు. పవన్ ఇప్పటి వరకూ తన బర్త్ డే పార్టీ జరుపుకున్న సంధర్భాలూ అరుదనే చెప్పాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటూ, అలాంటి భావాలతో నిరంతర చైతన్యంతో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన నాయకుడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడకు వెళ్ళి తన ఆవేదనను బాధను ప్రజలతో పంచుకుంటాడు. తగిన సాయమందిస్తుంటాడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మూలాలను వెతుకుంటూ నిరంతరం తన్ను తాను తరచి చూసుకుంటూ చాలా సామాన్య జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కు సినీజోష్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #3 on: September 02, 2016, 03:53:45 PM »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #4 on: September 02, 2016, 05:36:19 PM »
సినిమాల్లో నటిస్తే నటుడైపోవచ్చు! హిట్ సినిమాలు ఖాతాలో పడితే స్టార్ అవ్వొచ్చు! బ్లాక్ బస్టర్స్ కూడా తోడైతే సూపర్ స్టార్ అవ్వొచ్చు! కాని, సినిమాలు, హిట్స్, బ్లాక్ బస్టర్స్... ఇలాంటివి వున్నంత మాత్రాన పవర్ స్టార్ అవ్వటం కుదరదు! అందుకు, సూపర్ స్టార్ ఇమేజ్ కు మించిన మరేదో అట్రాక్షన్ కావాలి! ఆ ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రమే మామూలు స్టార్ ని పవర్ స్టార్ చేస్తుంది....

పవర్ స్టార్ గురించి మరీ గొప్పగా మాట్లాడితే ఆయన్ని పొగడటానికి అనుకోవటం సహజమే! కాని, నిజంగా కూడా పవర్ స్టార్ మిగతా స్టార్స్ కంటే భిన్నం. అందుకే, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ అనే మేనియా రొటీన్ గా సూపర్ హిట్ చిత్రాల కారణంగా పుట్టింది కాదు. స్వయంగా తానే పదేళ్లపాటూ నాకు సక్సెస్ లేదని చెప్పుకున్నాడు! అయినా ఆయనకున్న ఫాలోయింగ్ అందర్నీ విస్మయపరచటానికి కారణం ఏంటి? ఇన్ ఫ్యాక్ట్, పవన్ తనకు ఫ్లాప్స్ ఎదురయ్యాయని ఒప్పుకోవటమే ఆయన పవర్ స్టార్ స్టేటస్ కి సీక్రెట్ అనుకోవాలి!

నాకు పెద్దగా యాక్టింగ్ రాదు. వచ్చిన పరిమితమైన యాక్టింగ్ తోనే సినిమాలు చేస్తుంటాను. ఇది కూడా పవన్ చెప్పుకున్న మాటే. ఇలా తన గురించి తాను నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా మాట్లాడుకోవటమే పవన్ ప్రత్యేకత! అదే గొప్పతనం! అవును... తాను గొప్పోడ్ని కాదని ఒప్పుకోవటమే పవన్ గొప్పతనం! ఎట్ లీస్ట్ ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కి అతనిలో నచ్చేది అదే....

పవన్ మెగా బ్రదర్ గా వచ్చాడు. కాని, ఇప్పుడు అతను మెగా బ్రదర్ గా మిగిలిపోలేదు. పవనిజమ్ అనే తెగకి నాయకుడయ్యాడు. అఫ్ కోర్స్, చిరు ఫ్యాన్స్ అతడ్ని ఎలాగూ అభిమానిస్తూనే వుంటారు. కాని, తనకంటూ ఒక ప్రత్యేక అనుచర వర్గాన్ని పవన్ తయారు చేసుకున్నాడు. అదే అతడ్ని ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కి అతీతంగా నిలబెడుతోంది! ఏ హీరో తాలూకూ ఫంక్షన్ అయినా ప్రతీ చోటా పవన్ , పవన్ అంటూ అరుపులు వినిపించేలా చేస్తోంది!

పవన్ కళ్యాణ్ తన మేనియాని ఇన్నేళ్ల కాలంలో ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించుకున్నాడా అంటే .... కాదనే చెప్పాలి. ఆయన తన చుట్టూ తానొక ప్రపంచం తనకు తెలియకుండానే నిర్మించుకున్నాడు! అందుకు మూలం... పవన్ విభిన్నమైన వ్యక్తిత్వం, నిజాయితీతో కూడిన ప్రవర్తన. ఈ రెండూ పవన్ కళ్యాణ్ ని ఒక హీరో స్థాయి నుంచి స్టార్ గా, స్టార్ నుంచి పవర్ స్టార్ గా ఎదిగేలా చేశాయి! ఫ్యాన్స్ తో కేవలం సినిమాల వరకు మాత్రమే బాక్సాఫీస్ బంధం కాకుండా ... రియల్ లైఫ్ అనుబంధం ఏర్పడేలా చేశాయి!

కేవలం కొన్ని సంవత్సరాల్లోనే.... మిగతా హీరోలు దశాబ్దాల పాటు కష్టపడి సృష్టించుకున్న అభిమానుల సామ్రాజ్యాన్ని పవన్ ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన ఇంకా ఇంకా విస్తరిస్తూ మరిన్ని జన్మదినాలు చేసుకోవాలని మనమూ ఆశిద్దాం... 

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #5 on: September 02, 2016, 05:38:45 PM »
‘Many Happy Returns of the day to our Power Star Pawan Kalyan,’ this is the single post from Allu Arjun on Twitter seen clearly as first step towards healthy patch up with Power Star Fans. Of course, this could have satisfied all those angry Pawan Kalyan Fans who were exploiting on every single occasion to disrespect Bunny. Well, can this be the end for Bunny-Pawan contention?

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #6 on: September 02, 2016, 05:40:40 PM »


పవన్ కళ్యాణ్ అభిమానులకు.. అల్లు అర్జున్ కు అనుకోకుండా అంతరం వచ్చేసింది. గత కొన్ని నెలల్లో రకరకాల పరిణామాలు జరిగాయి. పరిస్థితి చాలా సెన్సిటివ్ గా తయారైంది. ఈ మధ్య ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో పవన్ అభిమానులకు సర్దిచెప్పినా పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చినట్లుగా కనిపించలేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పాడు బన్నీ. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన బన్నీ.. చివర్లో ‘పవర్’.. ‘స్టార్’ సింబల్స్ పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరోవైపు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కూడా పవన్ కు డీటైల్డ్ గా విష్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు సినీ ప్రముఖులు చాలామంది పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. డైరెక్టర్ బాబీ తనకు తెలిసిన అత్యంత దేశభక్తి.. అత్యంత దయగల వ్యక్తి పవన్ అని.. నిజమైన నాయకుడని పొగిడేస్తూ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. వివిధ సందర్భాల్లో పవన్ తన దయాగుణం చాటుకున్న ఫొటోలన్నీ మిక్స్ చేసి పెట్టి బర్త్ డే విష్ చెప్పాడు. మరోవైపు సమంత.. పవన్ చాలా తక్కువ మాట్లాడతాడని.. కానీ ఆ మాటలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని చెబుతూ విషెస్ చెప్పింది. ‘‘తెలుగు సినిమా పవర్ హౌస్ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు’’ అని వరుణ్ తేజ్ అన్నాడు. తాను తెలుగు పరిశ్రమలో తొలి పారితోషకం అందుకున్నది పవన్ నుంచే అని.. జానీ లోగోను డిజైన్ చేసింది తనేనని అంటూ మారుతి విషెస్ పెట్టాడు. ఇంకా చాలామంది ప్రముఖులు పవన్ ను విష్ చేశారు.

source:tupaki.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Many More Happy Returns of the Day to our POWERSTAR PAWAN KALYAN
« Reply #7 on: September 07, 2016, 06:11:29 PM »
Power Star Pawan Kalyan's showed his amazing stamina in social media and mega fans were found responsible Pawan Kalyan achieving this feat. Going by the reports, mega fans trended the hashtag #HBDPawanKalyan on the eve of the star's birthday, yesterday. Within no time the hashtag trended in top ten.

And what is more surprising and stuns everyone is that Pawan Kalyan's fans have posted as many as 565K  tweets on the said hashtag in just 24 hours. This is said to be the new South Indian record for any film star.Earlier, the record was on the name of Ajith wth 430K tweets.

Pawan Kalyan's new movei 'Katamarayudu's shoot is underway. The movie has Shruti Haasan in female lead role. Anup Rubens scores the tunes of this movie. The movie is likely to be an action and family entertainer with a village backdrop in it. Dolly directs the film on Northstar Entertainment.

source:cinejosh.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
244 Replies 35290 Views Last post October 07, 2016, 03:31:11 PM
by Pa1Kalyan
14 Replies 1366 Views Last post May 22, 2012, 11:22:44 PM
by lokesh
2 Replies 614 Views Last post January 03, 2013, 09:30:55 AM
by lokesh
0 Replies 665 Views Last post July 22, 2013, 07:09:39 PM
by sarathchandra
0 Replies 372 Views Last post April 08, 2015, 10:41:09 AM
by yugandhar